ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలన్నీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్ విధానాలకు పూర్తిగా స్వస్తి పలికాయి. ఈ జాబితాలో అమెజాన్ కూడా ఉంది. 2025 నుంచి వారానికి ఐదు రోజులు ఖచ్చితంగా ఆఫీసుకు రావాలని కంపెనీ ఆదేశించింది. అందరూ ఆఫీస్ నుంచి పనిచేస్తే కలిగే ప్రయోజనాలను గురించి కూడా అమెజాన్ సీఈఓ 'ఆండీ జాస్సీ' వెల్లడించారు.
ఇన్నిరోజులు ఇళ్లకు పరిమితమైన చాలా మంది ఉద్యోగులు.. ఆఫీసుకు రావాలనే వార్తతో కొంత నిరాశకు గురయ్యారు. ఈ నిర్ణయం గురించి మరోసారి ఆలోచించాలని అభ్యర్థించారు. మరికొందరు ఆఫీసు నుంచి పనిచేయడాన్ని తప్పించుకోవడానికి మూడు ట్రిక్స్ ఉపయోగిస్తున్నారు 'ఆండీ జాస్సీ' చెప్పుకొచ్చారు.
కాఫీ బ్యాడ్జింగ్
అమెజాన్ ఉద్యోగులు మాత్రమే కాకుండా.. చాలామంది ఉద్యోగులు కాఫీ బ్యాడ్జింగ్ చేస్తున్నారని తెలిసింది. అంటే సమయానికి ఆఫీసులకు వచ్చి పంచ్ వేయడం, అల్పాహారాని కొంత సమయం, కాఫీ తాగటానికి కొంత సమయం ఇలా కేటాయించుకుంటూ.. మళ్ళీ టైమ్ అవ్వగానే పంచ్ వేసి వెళ్ళిపోతారు. ఇదెలా ఉండేదంటే.. ఆఫీసులో కనిపించి, కాఫీ తాగి వెళ్లిపోవడం అన్నమాట. ఈ విధానం కొంత తగ్గుముఖం పట్టింది.
హోమ్ వై-ఫై పేరు మార్చేయడం
ఉద్యోగులు ఆఫీసులకు రాకుండా ఇంట్లోనే పనిచేస్తూ.. హోమ్ వై-ఫైకి ఆఫీస్ వై-ఫై పేరు ఇచ్చేవారు. ఇలా చేసి ఉద్యోగి లాగిన్ అయినప్పుడు రిపోర్టింగ్ సాఫ్ట్‌వేర్ ద్వారా వారు ఆఫీసులో ఉన్నట్లు తెలిసేది. ఇలా కూడా చేసేవారు ఎక్కువయ్యారు. ఆఖరికి రిపోర్టింగ్ సాఫ్ట్‌వేర్‌ను మరింత పటిష్టంగా చేయడంతో ఇది కొంత కనుమరుగైంది.
ఇదీ చదవండి: అక్టోబర్‌లో బ్యాంకులు పనిచేసేది సగం రోజులే!.. ఎందుకంటే?
ఆఫీసులో బ్యాడ్జ్ వదిలి వెళ్లడం
మూడో ట్రిక్ ఏమిటంటే.. కొంతమంది ఉద్యోగులు తమ బ్యాడ్జ్‌ని ఆఫీసులోనే వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఈ బ్యాడ్జ్‌తో సహోద్యోగి చెక్ ఇన్, చెక్ అవుట్ వంటివి చేస్తారు. ఇలా చేస్తే సదరు ఉద్యోగి ఆఫీసుకి వచ్చి వెళ్తున్నట్లు రిపోర్టులో చూపిస్తుంది. కానీ నిజానికి వారు ఆఫీసుకే రారని తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment