సెప్టెంబర్ నెల ముగుస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అక్టోబర్ నెలలో బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. ఆర్‌బీఐ హాలిడే క్యాలెండర్ ప్రకారం.. ఈ నెలలో మొత్తం 15 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ సెలవుదినాల్లో పబ్లిక్ హాలిడేస్, ప్రాంతీయ సెలవులు, రెండవ & నాల్గవ శనివారాలు.. అన్ని ఆదివారాల సాధారణ సెలవులు ఉన్నాయి.
సెలవుల పూర్తి జాబితా
➤అక్టోబర్ 1: రాష్ట్ర శాసనసభకు సాధారణ ఎన్నికలు 2024 (జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంకులకు సెలవు)
➤అక్టోబర్ 2: మహాత్మా గాంధీ జయంతి (జాతీయ సెలవుదినం)
➤అక్టోబర్ 3: నవరాత్రి (జైపూర్)
➤అక్టోబర్ 5: ఆదివారం
➤అక్టోబర్ 10: దుర్గాపూజ - మహా సప్తమి (అగర్తల, గౌహతి, కోహిమా, కోల్‌కతాలోని బ్యాంకులకు సెలవు)
➤అక్టోబర్ 11: దసరా - దుర్గా అష్టమి (అగర్తల, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గాంగ్‌టక్, గౌహతి, ఇంఫాల్, ఇటానగర్, కోహిమా, కోల్‌కతా, పాట్నా, రాంచీ, షిల్లాంగ్‌లలోని బ్యాంకులకు సెలవు)
➤అక్టోబర్ 12: రెండవ శనివారం / విజయదశమి (తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు)
➤అక్టోబర్ 13: ఆదివారం
➤అక్టోబర్ 14: దుర్గా పూజ (గ్యాంగ్‌టక్‌లోని బ్యాంకులకు సెలవు)
➤అక్టోబర్ 16: లక్ష్మీ పూజ (అగర్తల, కోల్‌కతాలోని బ్యాంకులకు సెలవు)
➤అక్టోబర్ 17: మహర్షి వాల్మీకి జయంతి (బెంగళూరు, గౌహతి, సిమ్లాలోని బ్యాంకులకు సెలవు)
➤అక్టోబర్ 20: ఆదివారం
➤అక్టోబర్ 26: నాల్గవ శనివారం
➤అక్టోబర్ 27: ఆదివారం
➤అక్టోబర్ 31: దీపావళి (దేశంలోని దాదాపు అన్ని బ్యాంకులకు సెలవు)
ఇదీ చదవండి: అక్టోబర్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం!
బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్‌లైన్ సేవలు అన్నీ సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటాయి.
(బ్యాంకింగ్ సెలవుల షెడ్యూల్ మారవచ్చు.. కాబట్టి హాలిడే క్యాలెండర్‌లో ఏవైనా అప్‌డేట్‌లు లేదా రివిజన్‌ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. లేదా మీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ప్రకటనలను గమనించాల్సి ఉంటుంది.)
Comments
Please login to add a commentAdd a comment