Working days
-
అక్టోబర్‌లో బ్యాంకులు పనిచేసేది సగం రోజులే!.. ఎందుకంటే?
సెప్టెంబర్ నెల ముగుస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అక్టోబర్ నెలలో బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. ఆర్బీఐ హాలిడే క్యాలెండర్ ప్రకారం.. ఈ నెలలో మొత్తం 15 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ సెలవుదినాల్లో పబ్లిక్ హాలిడేస్, ప్రాంతీయ సెలవులు, రెండవ & నాల్గవ శనివారాలు.. అన్ని ఆదివారాల సాధారణ సెలవులు ఉన్నాయి.సెలవుల పూర్తి జాబితా➤అక్టోబర్ 1: రాష్ట్ర శాసనసభకు సాధారణ ఎన్నికలు 2024 (జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంకులకు సెలవు)➤అక్టోబర్ 2: మహాత్మా గాంధీ జయంతి (జాతీయ సెలవుదినం)➤అక్టోబర్ 3: నవరాత్రి (జైపూర్)➤అక్టోబర్ 5: ఆదివారం➤అక్టోబర్ 10: దుర్గాపూజ - మహా సప్తమి (అగర్తల, గౌహతి, కోహిమా, కోల్‌కతాలోని బ్యాంకులకు సెలవు)➤అక్టోబర్ 11: దసరా - దుర్గా అష్టమి (అగర్తల, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గాంగ్టక్, గౌహతి, ఇంఫాల్, ఇటానగర్, కోహిమా, కోల్‌కతా, పాట్నా, రాంచీ, షిల్లాంగ్‌లలోని బ్యాంకులకు సెలవు)➤అక్టోబర్ 12: రెండవ శనివారం / విజయదశమి (తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు)➤అక్టోబర్ 13: ఆదివారం➤అక్టోబర్ 14: దుర్గా పూజ (గ్యాంగ్‌టక్‌లోని బ్యాంకులకు సెలవు)➤అక్టోబర్ 16: లక్ష్మీ పూజ (అగర్తల, కోల్‌కతాలోని బ్యాంకులకు సెలవు)➤అక్టోబర్ 17: మహర్షి వాల్మీకి జయంతి (బెంగళూరు, గౌహతి, సిమ్లాలోని బ్యాంకులకు సెలవు)➤అక్టోబర్ 20: ఆదివారం➤అక్టోబర్ 26: నాల్గవ శనివారం➤అక్టోబర్ 27: ఆదివారం➤అక్టోబర్ 31: దీపావళి (దేశంలోని దాదాపు అన్ని బ్యాంకులకు సెలవు)ఇదీ చదవండి: అక్టోబర్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం!బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటాయి.(బ్యాంకింగ్ సెలవుల షెడ్యూల్ మారవచ్చు.. కాబట్టి హాలిడే క్యాలెండర్లో ఏవైనా అప్డేట్లు లేదా రివిజన్ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. లేదా మీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ప్రకటనలను గమనించాల్సి ఉంటుంది.) -
బ్యాంక్ ఉద్యోగులకు ఇకపై వారానికి 5 రోజులే పని! ఎప్పటినుంచంటే
వారానికి 5 రోజుల పని కల్పించాలన్న బ్యాంకు ఉద్యోగుల చిరకాల డిమాండ్‌ను ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ఆమోదించే అవకాశం ఉంది. జూన్ 2024లో బ్యాంకు ఉద్యోగులకు జీతం పెంపుతో పాటు వారానికి 5 పని దినాలు కల్పించేలా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం ఇవ్వనుందని సమాచారం. ఎకనమిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం..యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్, బ్యాంక్ ఉద్యోగుల సంఘాల కూటమి కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశాయి. బ్యాంకింగ్ రంగానికి 5 రోజుల పనివారాన్ని అనుమతించాలని కోరాయి. అదే సమయంలో ఖాతాదారుల కోసం బ్యాంకింగ్ పనిగంటల్లో కానీ, ఉద్యోగులు, అధికారుల పనివేళల్లో పని గంటలలో గానీ ఎలాంటి తగ్గింపు ఉండదని బ్యాంకు ఉద్యోగుల సంఘం హామీ ఇచ్చింది. ఈ అంశంపై సానుకూలంగా సమీక్ష జరిపి, తదనుగుణంగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA)ని ఆదేశించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కోరినట్లు ఈటీ నివేదిక హైలెట్ చేసింది. ప్రస్తుతం, బ్యాంకు శాఖలు రెండవ, నాల్గవ శనివారాలు సెలవు దినాలు. అయితే, 2015 నుంచి అన్ని శని, ఆదివారాల్లో ఆఫ్‌లు ఇవ్వాలని బ్యాంకు యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. 2015లో సంతకం చేసిన 10వ ద్వైపాక్షిక సెటిల్మెంట్ ప్రకారం,ఆర్బీఐ, ప్రభుత్వం ఐబీఏతో ఏకీభవించాయి. రెండవ, నాల్గవ శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించాయి. జీతంపై, ఐబీఏ, బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు గత సంవత్సరం భారతదేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ)లో 17శాతం జీతాల పెంపునకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈటీ నివేదిక ప్రకారం.. కేంద్రం త్వరలో బ్యాంక్ ఉద్యోగులకు ఐదు రోజుల పనిదినాల్ని కల్పించడంతో పాటు జీతాల పెంపు జరిగే అవకాశం ఉందని ఆర్ధిక నిపుణుల అంచనా. జీతాల పెంపును కేంద్రం ఆమోదించినట్లయితే, అన్ని పీఎస్‌బీఐ, ఎంపిక చేసిన పలు ప్రైవేట్ బ్యాంకుల్లోని 3.8 లక్షల మంది అధికారులతో సహా దాదాపు 9 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. -
బ్యాంకులకు శని, ఆదివారాలు సెలవు.. కేంద్ర ప్రభుత్వం దీనిని ఆమోదిస్తుందా?
బ్యాంకు ఉద్యోగుల ఐదురోజుల పనిదినాల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. పనిదినాల్ని తగ్గించి బ్యాంకు ఉద్యోగుల రోజూవారి పనిగంటలు పెంచమని ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం ఈ విషయాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో బ్యాంకులు వారానికి ఐదు రోజులు పనిచేయనున్నాయా? ఇదే అంశంపై తాజా పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ స్పందించారు. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ (ఐబీఏ) బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదురోజుల పనిదినాల్ని అమలు చేసేలా ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. అయితే దీనిని కేంద్రం అంగీకరిస్తుందా? లేదా? అని అంశంపై స్పందించలేదు. ప్రస్తుతం, బ్యాంకులకు ప్రతి రెండవ శనివారం, నాలుగవ శనివారం రోజు మాత్రమే సెలవు దినాలు. ఒకవేళ కేంద్రం ఐబీఏ ప్రతిపాదనల్ని అంగీకరిస్తే ఉద్యోగులకు వారానికి ఐదురోజులు పనిదినాలు కాగా.. రోజూవారి పనిగంటలు పెరిగే అవకాశం ఉందంటూ బ్యాంకింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
గుడ్‌న్యూస్! ఇక వారానికి నాలుగు రోజులే ఆఫీస్.. ఉద్యోగులు ఫుల్ ఖుష్.!
లండన్: ఉద్యోగులు వారానికి నాలుగు రోజులే పని చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయని బ్రిటన్ చేపట్టిన అతిపెద్ద ట్రయల్‌లో ఆశాజనక ఫలితాలు వచ్చాయి. వివిధ రంగాలకు చెందిన 61 కంపెనీలు 6 నెలల పాటు నిర్వహించిన ఈ పైలట్ స్కీమ్‌లో పాల్గొన్నాయి. గతేడాది జూన్ నుంచి డిసెంబర్ వరకు ఈ ట్రయల్ జరిగింది. ఇందులో మొత్తం 3,000 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. వారానికి ఐదు రోజులు పనిచేసినప్పుడు ఎంత జీతం ఇచ్చారో.. నాలుగు రోజులు పనిచేసినా అంతే మొత్తాన్ని చెల్లించారు. చిన్న పెద్ద కంపెనీలు అనే తేడా లేకుండా అన్ని సంస్థలు ఈ ప్రయోగంలో ఆశాజనక ఫలితాలు సాధించినట్లు చెప్పాయి. ట్రయల్‌లో పాల్గొన్న 91 శాతం కంపెనీలు ఈ విధానాన్నే తాము కొనసాగిస్తామని చెప్పాయి. 4 శాతం సంస్థలు కాస్త సందిగ్ధత వ్యక్తం చేయగా.. మరో 4 శాతం కంపెనీలు తాము పాత పద్ధతినే(ఐదు రోజుల పనిదినాలు) కొనసాగిస్తామని స్పష్టం చేశాయి. 35 శాతం పెరిగిన రెవెన్యూ.. వారానికి నాలుగు రోజుల పనిదినాల అనుభవంపై కంపెనీలు 10 పాయింట్లకు సగటున 8.5 రేటింగ్ ఇచ్చాయి. బిజినెస్ ప్రొడక్టివిటీ, బిజెనెస్ పర్ఫామెన్స్‌కు 7.5 రేటింగ్ ఇచ్చాయి. ఈ విధానం వల్ల గతేడాదితో పాల్చితే రెవెన్యూ 35 శాతం పెరిగిందని సంస్థలు వెల్లడించాయి. కొత్త నియామకాలు పెరిగాయని, ఆఫీసులకు గైర్హాజరు శాతం తగ్గిందని పేర్కొన్నాయి. ఉద్యోగులకు సంతృప్తి.. నాలుగు రోజుల పనిదినాల వల్ల ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడిందని ట్రయల్‌లో తేలింది. చాలా మంది వ్యాయామానికి ఎక్కువ సమయం కేటాయించారని, ఉద్యోగ సంతృప్తిలో గణనీయమైన పెరుగుదల కన్పించిందని వెల్లడైంది. అలాగే ఉద్యోగులకు ఒత్తిడి, అలసట, నిద్ర సమస్యలు కూడా తగ్గాయి. పర్యావరణ ఫలితాలు కూడా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. నాలుగు రోజులే పనిదినాలు కాడవంతో ఆపీస్‌కు వెళ్లే సమయంతో పాటు వాహనాల వినియోగం కూడా తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతోంది. మహిళలకే ఎక్కువ బెనిఫిట్.. ఈ కొత్త విధానం వల్ల పురుషుల కంటే మహిళలే ఎక్కువగా మేలు జరుగుతున్నట్లు ట్రయల్‌లో తేలింది. ఇంటి పనులు, పిల్లలను చూసుకునేందుకు పురుషులు సమయం కేటాయించడంతో మహిళలకు ఆ భారం తగ్గినట్లు వెల్లడైంది. వారానికే నాలుగు రోజుల పనిదినాలు విధానాన్ని భవిష్యత్తులో తాము ప్రపంచవ్యాప్తంగా అమలు చేయాలనుకుంటున్నట్లు '4 డే వీక్ గ్లోబల్' స్వచ్ఛంద సంస్థ సహవ్యవస్థాపకులు, ఎండీ, చార్లోటె లాక్హార్ట్ చెప్పారు. చదవండి: 'రెచ్చిపోతున్న కిమ్.. మౌనంగా ఉంటే ప్రపంచానికే ప్రమాదం..' -
ఉపాధి హామీ పని దినాలు పెంపు
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ఉపాధి హామీ పథకం లేబర్ బడ్జెట్ కేటాయింపులను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటగా 14 కోట్ల పని దినాల కల్పనకు ఆమోదం తెలిపిన కేంద్రం.. ప్రస్తుతం ఆ కేటాయింపులను 19 కోట్ల పని దినాలకు పెంచింది. ఈ పథకం ద్వారా ప్రస్తుత ఆర్థిక ఏడాదికి రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత పేదలకు పనుల కల్పనలో అదనపు పని దినాల కేటాయింపుపై గురువారం ఢిల్లీలో కేంద్ర, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో పని దినానికి రూ.428 చొప్పున కేటాయింపు ఒక్కొక్క పని దినానికి గరిష్టంగా రూ.428 చొప్పున గ్రామీణాభివృద్ధి శాఖకు అందుతాయి. పేదలకు వారు చేసే రోజు వారీ పని ఆధారంగా కూలీ రూపంలో గరిష్టంగా రూ.257 చొప్పున అందజేస్తారు. కూలీల వేతనాల ఆధారంగా మిగిలిన రూ.171 మెటీరియల్ కేటగిరీ నిధులుగా పేర్కొంటారు. మెటీరియల్ కేటగిరీ నిధులను 75–25 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక ఏడాదికి సంబంధించి ఇప్పటికే 17.30 కోట్ల పని దినాల పాటు పేదలకు పనులు కల్పన పూర్తయిందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కేంద్రం దృష్టికి తీసుకెళ్లగా.. 19 కోట్ల పని దినాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కేటాయించింది. వీటిని పూర్తి చేసిన వెంటనే అదనపు పని దినాలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖ రాయగా.. అదనపు కేటాయింపులు కూడా చేస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు హామీ ఇచ్చారు. -
బ్యాంక్ ఉద్యోగ సంఘాల సమ్మె,వారానికి 5 రోజులే పనిచేస్తాం!
ప్రైవేట్ ఉద్యోగస్థుల తరహా పనివేళలు తమకు ఉండాలని జూన్ 27న 9 బ్యాంక్ ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఇదే విషయంపై గత కొన్నేళ్లుగా విన్నపాలు వినిపిస్తున్నా తమను ఎవరు పట్టించుకోవడం లేదని బ్యాంక్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ ఉద్యోగస్తులు సోమవారం నుంచి శుక్రవారం వరకు కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తారు. శనివారం, ఆదివారం కుటుంబ సభ్యులతో గడుపుతుంటుంటారు. ఇప్పుడీ ఈ పని విధానాన్ని బ్యాంక్ ఉద్యోగులకు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 7 ఏళ్లుగా వారానికి 5 రోజుల పనిదినాల్ని అమలు చేసేలా బ్యాంక్ స్టేక్ హోల్డర్స్‌తో చర్చలు జరుపుతున్నట్ల తెలిపారు. వర్కింగ్ డేస్‌ను కుదించడం వల్ల ఉద్యోగుల ఆరోగ్యంతోపాటు వారి వర్క్‌లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకోవచ్చన్నారు. అయితే ఆ చర్చలు విఫలమవుతున్నాయని, కానీ ఈనెల 27 జరిగే సమ్మెలో తమ డిమాండ్‌ను ఉధృతం చేస్తామని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ (ఏఐబీఈఏ) సీహెచ్ వెంకటా చలం తెలిపారు. ఈ సందర్భంగా వెంకటా చలం మాట్లాడుతూ జూన్ 27న సుమారు 9 లక్షల మంది బ్యాంక్ ఉద్యోగులు సమ్మె నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ప్రొటెస్ట్‌లో ఐదురోజుల పనిదినాల అమలుతో పాటు మరికొన్ని డిమాండ్లను కేంద్రం ముందుంచుతామని పేర్కొన్నారు. బ్యాంక్ ఉద్యోగ సంఘాలు 2015 నుంచి వారానికి 5 రోజుల పని దినాల్ని కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. శనివారం, ఆదివారం సెలవు కావాలని కోరుతున్నాయి. ఉద్యోగులు సెలవు దినాల్లో తప్ప శనివారం రోజు పనిచేస్తున్నారు. అరె ఇప్పటి వరకు మా విన్నపాన్ని ఎవరు పట్టించుకోలేని చెప్పారు. మేం ఏ పాపం చేశాం విదేశాల్లో బ్యాంక్ ఉద్యోగులు షిఫ్ట్‌లు వైజ్‌గా వారానికి నాలుగు రోజులు మాత్రమే పనిచేస్తున్నారు. కానీ మన దేశానికి చెందిన బ్యాంక్ ఉద్యోగులు వారానికి 6రోజులు పనిచేస్తున్నారని నేషనల్ కాన్ఫిడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయిస్ (ఎన్సీఈబీ) జనరల్ సెక్రటరీ బండ్లీష్ మేం ఏం పాపం చేశామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్బీఐ సైతం 5 వర్కింగ్ డేస్ బ్యాంక్‌లు మినిహాయిస్తే ప్రభుత్వ రంగ సంస్థలైన ఆర్బీఐ, ఎల్ఐసీ సంస్థ ఉద్యోగులు సైతం వారానికి 5 రోజులే పనిచేస్తున్నారు. కానీ మేం (బ్యాంక్ ఉద్యోగులు) మాత్రం 6 రోజులు పనిచేస్తున్నాం. భారత్‌ను బలమైన ఆర్ధిక వ్యవస్థగా మార్చేందుకు డిజిటల్ ఇండియా అందుబాటులోకి వచ్చింది. ఆ వ్యవస్థను ఆసరగా చేసుకొని వివిధ పద్దతుల్లో బ్యాంక్ కార్యకాలాపాల్ని అందించవచ్చు. అందుకే బ్యాంక్ ఉద్యోగులు వారానికి 5 రోజులకు పనిదినాల్ని కుదించాలని డిమాండ్ చేస్తున్నట్లు బండ్లీష్ తెలిపారు. -
వారానికి 4 రోజుల పని, సై..సై..అంటున్న ఉద్యోగులు!
ప్రపంచ దేశాల్ని కలవరానికి గురి చేస్తున్న దిగ్రేట్ రిజిగ్నేషన్, అట్రిషన్ రేట్ నుంచి సురక్షితంగా ఉండేందుకు సంస్థలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా పదుల సంఖ్యలో కంపెనీలు వర్కింగ్ డేస్‌ను తగ్గించేస్తున్నాయి.వారానికి 5రోజులు కాకుండా 4రోజుల పాటు వర్క్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. రిజిగ్నేషన్ సమస్యను అధికమించడంతో పాటు వర్క్ ప్రొడక్టివిటీ పెరిగిపోతుందని సర్వేలు తేల్చడంతో సంస్థల యజమానులు వారానికి 4 రోజుల పని వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో యూకేకు చెందిన 60కంపెనీలకు పైగా జూన్ నుంచి వారానికి 4రోజుల పాటు వర్క్ చేసే వెసలుబాటు కల్పిస్తున్నాయి. ప్రారంభంలో ఈ కొత్త వర్క్ కల్చర్‌పై 3వేల మంది ఉద్యోగులపై ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఈ ట్రయల్స్‌లో ఉద్యోగులు ప్రొడక్టివిటీ, అట్రిషన్ రేట్, రిజిగ్నేషన్ తో పాటు ఇతర అంశాల్లో సత్ఫలితాలు రాబడితే శాస్వతంగా వర్కింగ్ డేస్‌ను కుదించనున్నారు. ఈ ప్లాన్ వర్కౌట్ అయితే స్పెయిన్, ఐస్‌ల్యాండ్,యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా,న్యూజిల్యాండ్ దేశాలకు చెందిన సంస్థలు సైతం యూకే బాటలో పయనించనున్నాయి. పైన పేర్కొన్న దేశాలు సైతం ఆగస్ట్ నుంచి ఉద్యోగులకు సైతం వర్క్ వర్కింగ్ డేస్‌ను కుదించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.కాగా,వీక్లీ వర్కింగ్ డేస్‌ను తగ్గించడం వల్ల సంస్థలకు అనేక లాభాలు ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా వర్క్ ప్రొడక్టివిటీ తగ్గడంతో పాటు ఉద్యోగులు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపే ఆఫీస్ పనిలో ఉత్సాహాం చూపిస్తారని సర్వేలు పేర్కొంటున్నాయి. ఉద్యోగుల్లో సంతోషం పనిదినాల్ని కుదించడంపై ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారానికి 4రోజులు పనిచేయడం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నా.కుటుంబసభ్యులతో గడపడమే కాదు. హయ్యర్ స్టడీస్‌తో పాటు నేను నేర్చుకోవాలని.. టైమ్ లేక కంప్లీట్ చేయలేకపోయిన టెక్నాలజీ కోర్స్ల్ని పూర్తి చేస్తా'నని లూయిస్ అనే ఉద్యోగి తెలిపాడు. -
వారానికి నాలుగు రోజుల పని...! చేసేందుకు సిద్దమంటోన్న ఉద్యోగులు..! కంపెనీల నిర్ణయం ఇలా..!
ఉరుకుల పరుగుల జీవితంలో సంపాదన కోసం ఒక సగటు ఉద్యోగి తన జీవిత కాలాన్ని పూర్తిగా ఆఫీసుల్లోనే గడిపేస్తున్నాడు. వారంలో ఐదు/ఆరు రోజుల పాటు ఆఫీసుల్లో జాబ్ చేస్తూ వ్యక్తిగత జీవితానికి దూరమవుతున్న వారు ఎందరో. నేటి ప్రపంచంలో ముందుడాలంటే జాబ్‌పై మరింత సమయాన్ని వెచ్చించాల్సి వస్తోంది. దీంతో ఉద్యోగుల్లో ఒత్తిడి తీవ్రంగా పెరిగిపోతుంది. ఎలాంటి ఒత్తిడి లేకుండా, ఉద్యోగుల్లో మనోధైర్యాన్ని నింపేందుకుగాను కార్యాలయాల్లో వారానికి నాలుగు రోజుల పని విధానం ఎంతగానో ఉపయోగపడుతోందని ఒక సర్వేలో తేలింది. వారానికి నాలుగు రోజులు పనికి సిధ్దం..! ఇంట్లో, ఆఫీసుల్లో ఒత్తిడి లేని, ఆహ్లాదకరంగా గడిపేందుకుగాను పలు కంపెనీలు వారంలో నాలుగు రోజుల పనివిధానాన్ని అమలు చేసేందుకు సన్నాహాలను చేస్తున్నాయి. ఇక భారత్‌లోని ఉద్యోగులు వారానికి నాలుగు రోజుల పాటు డ్యూటీ చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు హెచ్ఆర్ సొల్యూషన్స్ సంస్థ జీనియస్ కన్సల్టెంట్స్ నిర్వహించిన ఓ సర్వే తేలింది. భారత్‌లోని 60 శాతం కంపెనీలు వారంలో 4 రోజుల పనికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పని విధానంతో ఉద్యోగుల మనోధైర్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుందని కంపెనీలు భావిస్తోన్నట్లు సమాచారం. ఈ సర్వేను ఫిబ్రవరి 1 నుంచి మార్చి 7 వరకు జీనియస్ కన్సల్టెంట్స్ నిర్వహించింది. దీనిలో 1,113 కంపెనీలు పాల్గొన్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, కన్స్ట్రక్షన్, ఇంజినీరింగ్, ఎడ్యుకేషన్, ఎఫ్ఎంసీజీ, హెచ్ఆర్ సొల్యూషన్స్, ఐటీ బీపీవో, లాజిస్టిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలకు చెందిన కంపెనీలు ఈ సర్వేలు పాల్గొన్నాయి. ప్రోడక్టివీటిలో మార్పులు..! వారానికి నాలుగు రోజుల పని విధానంతో... ఉత్పాదకతలో మార్పులు వచ్చే అవకాశం ఉన్నట్లుగా భావించాయి. 27 శాతం కంపెనీలు ఉత్పాదకత విషయంలో ఏం చెప్పలేకపోయాయి. మరో వైపు 11 శాతం కంపెనీలు నాలుగు రోజుల పనిదినాలతో ఉత్పాదకతో గణనీయమైన మార్పులు వస్తాయని భావించారు. ఇక నాలుగు రోజుల పని విధానంపై 100 శాతం మంది ఉద్యోగులు సిద్దంగా ఉన్నట్లు తెలిసింది. అంతేకాకుండా అదనంగా ఒక రోజు సెలవును పొందేందుకుగాను రోజుకు 12 గంటల వరకు పనిచేసేందుకు సిద్దమని ఉద్యోగులు తెలిపారు. ఇక సర్వేలో పాల్గొన్న 52 శాతం కంపెనీలు, ఉద్యోగులు శుక్రవారం రోజున మూడో సెలవు ఉంటే బాగుంటుందని తెలియజేశారు. అయితే 18 శాతం కంపెనీలు, ఉద్యోగులు సోమవారం లేదంటే బుధవారం సెలవు ఉంటే పని నుంచి కాస్త బ్రేక్ దొరికినట్లుగా ఉంటుందని పేర్కొన్నారు. చదవండి: వేతన జీవులకు అదిరిపోయే శుభవార్త..! -
Chhattisgarh: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం తీపికబురు.. ఇక నుంచి..
ఛత్తీస్‌ఘడ్: భారతదేశమంతట 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు అందించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్.. ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి ఐదురోజుల పని దినాలతో పాటు పలు విధానపర నిర్ణయాలను ప్రకటించారు. అదే విధంగా, పెన్షన్ పథకంలో రాష్ట్రప్రభుత్వం వాటాను 10 నుంచి 14 శాతానికి పెంచుతున్నట్లు ట్విటర్ వేదికగా వెల్లడించారు. ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులలో సామర్థ్యం, ఉత్పాదకతను పెంపొందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు భూపేష్ బఘెల్ తెలిపారు. ఆయా నివాస ప్రాంతంలో వ్యాపారాలు చేసే చిరువ్యాపారుల కోసం ప్రత్యేకంగా చట్టబద్ధత కల్పించే చట్టాన్ని ప్రవేశపెడుతన్నట్లు పేర్కొన్నారు. ఇది చిరువ్యాపారులకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ప్రజా భద్రతకు ఇబ్బందులు కల్గించే ఎలాంటి అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. బిల్డింగ్ కోడ్‌లోని నిబంధలను అందరు పాటించాలని సూచించారు. ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్లలో సెకండ్ బిల్డింగ్ పర్మిషన్ పథకానికి అనుగుణంగా ప్రణాళిక నిబంధనలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఉపాధి కల్పనతోపాటు రవాణా సౌకర్యాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. దీనికోసం ప్రత్యేకంగా రవాణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో పాటు లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ జారీ నిబంధలను సులభతరం చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. మహిళల భద్రత కోసం మహిళ సేఫ్టీ సెల్స్‌ను ఏర్పాటు చేస్తామని భూపేష్ బఘెల్ ప్రకటించారు. ఛత్తీస్‌ఘడ్ ప్రాంతంలో దట్టమైన అడవులతో కూడి ఉంటుంది. ఈ క్రమంలో గిరిజనులు ఎక్కువగా జీవనోపాధి కోసం అడవులపై ఆధారపడతారు. వీరి కోసం అటవీ వాసులకు సంబంధించిన నిబంధనలను సరళతరం చేయనున్నట్లు సీఎం తెలిపారు. పారిశ్రామిక విధానంలో మార్పులు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇండస్ట్రీయల్ పార్కుల్లోని ప్లాట్లలో 10 శాతం భూమిని ఓబీసీ వర్గానికి రిజర్వు చేయనున్నట్లు తెలిపారు. ప్రధానంగా రైతుల కోసం 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి పప్పుధాన్యాలకు కూడా కనీస మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని సీఎం తెలిపారు. అలాగే కార్మికులకు జన్మించిన మొదటి ఇద్దరు ఆడపిల్లలకు ఒక్కొక్కరికి 20,000 వేల చొప్పున బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు భూపేష్ బఘెల్ తెలిపారు. చదవండి: టెన్షన్.. టెన్షన్..! పశ్చిమ యూపీలో ఒక్కో ఓటుకై పార్టీల ఆరాటం -
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సర్కార్ సంచలన నిర్ణయం..!
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. యూఎఈలోని ఉద్యోగుల పనిదినాలను అక్కడి ప్రభుత్వం మార్చింది. ఉద్యోగులు ఇక వారానికి నాలుగున్నర రోజుల మాత్రమే పనిచేయవచ్చునని పేర్కొంది. ప్రపంచ మార్కెట్లలో పోటీతత్వాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో శని, ఆదివారాలను వారాంతపు సెలవు దినాలుగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ దేశ అధికారిక మీడియా డబ్ల్యూఏఎం వెల్లడించింది. వచ్చే ఏడాది నుంచి ఇది అమలులోకి రానుంది. యూఏఈలో శుక్రవారం, శనివారం సెలవు దినాలుగా ఉన్నాయి. ఇకపై ఆదివారం కూడా సెలవు దినంగా ప్రకటిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఆదివారం సెలవు కావడంతో ప్రపంచ మార్కెట్లకు అనుగుణంగా సెలవు ప్రకటించడానికి ముఖ్య కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే 2022జనవరి 1వ తేదీ నుంచి వారాంతపు సెలవులు శుక్రవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 12 గంటలకు మొదలై ఆదివారం ముగిసే వరకు కొనసాగుతాయి. యూఏఈ ఆర్థిక వ్యవస్థను సౌదీకి పోటీగా మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు విదేశీ పెట్టుబడులను, ప్రతిభావంతులను ఆకర్షించేందుకు ఇప్పటికే గతేడాది పలు నిర్ణయాలు తీసుకొంది. మొదటి దేశంగా యూఎఈ రికార్డు..! ప్రపంచంలో ఐదు రోజుల కంటే తక్కువ జాతీయ పని వారాన్ని ప్రవేశపెట్టిన మొదటి దేశం యూఎఈగా నిలుస్తోందని డబ్లూఏఎం తెలిపింది. మాజీ బ్రిటీష్ ప్రొటెక్టరేట్ 50వ వార్షికోత్సవాన్ని జరుపుకున్న వారంలోపే ప్రకటించడం విశేషం. 2006 వరకు గురువారం-శుక్రవారం సెలవులుగా ప్రకటించగా...అది శుక్ర, శనివారాలకు ప్రైవేట్ రంగానికి అనుమతినిచ్చింది. చదవండి: సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు భారతీయులు మృతి -
ఏపీ: వారానికి 5 రోజుల పని విధానం మరో ఏడాది పొడిగింపు
సాక్షి, అమరావతి: వారానికి 5 రోజుల పని విధానం మరో ఏడాదిపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొడిగించింది. ఆంధ్రప్రదేశ్ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలకు వారానికి ఐదు రోజుల పనిదినాలు విధానాన్ని మరి కొంతకాలం కొనసాగించాలని ఏపీ సచివాలయం సంఘం, ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చేసిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉద్యోగుల తరఫున ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్ పదవీకాలం పొడిగింపు ఏపీ: గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో ఇంటర్వ్యూలు రద్దు -
ఇక అక్కడ పనిదినాలు నాలుగు రోజులే!
కరోనా వైరస్ ఎన్నో మార్పులు తీసుకొస్తోంది. రిమోట్ నుంచి హైబ్రిడ్ వర్కింగ్ విధానానికి దారితీసింది. ఇందులో భాగంగా జపాన్ మరో అడుగు ముందుకు వేయబోతోంది. పని దినాలను ఐదు నుంచి నాలుగు రోజులకు తగ్గించాలని అనుకుంటోంది. ఈ మేరకు ఒక ప్రతిపాదనను వార్షిక ఆర్థిక విధానాల మార్గదర్శకాలలో కీలకంగా చేర్చింది. టోక్యో: జపాన్ గవర్నమెంట్ 2021 కొత్త ఆర్థిక విధానాలతో వార్షిక మార్గదర్శకాల్ని విడుదల చేసింది. అందులో ఐదురోజుల పనిదినాలకు బదులు.. నాలుగు రోజులే పనిరోజులు ఉండాలని ప్రతిపాదించింది. ఉద్యోగుల పని-జీవితం ఈ రెండు విషయాల్ని పరిగణనలోకి తీసుకుని.. వాటిని సమతుల్యం చేసే విధంగా ఈ విధానాల్ని రూపొందించినట్లు ప్రభుత్వం పేర్కొంది. జపాన్ అంటే హార్డ్వర్కింగ్కు కేరాఫ్ అనే ముద్ర ప్రపంచం మొత్తం ఉంది. అలాంటి దేశంలో తమ పని గంటల్ని తగ్గించాలని ఉద్యోగులు చాలా ఏళ్లుగా కోరుకుంటున్నారు.. ఉద్యమిస్తున్నారు. ఈ తరుణంలో నాలుగు రోజుల పనిరోజులు ఊరట కలిగించేదే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ వ్యవహారంలో రాజకీయ నేతలు సైతం జోక్యం చేసుకుంటున్నారు. కొందరు నేతలు కార్పొరేట్ ప్రతినిధులతో ఎంప్లాయిస్ పనిగంటల తగ్గింపు, వర్క్‌ఫ్రమ్ హోం లాంటి అంశాల గురించి చర్చిస్తున్నారు. ఇక తాజా మార్గదర్శకాలపై వాళ్లంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెలలోపే నాలుగు రోజుల పనిదినం పాలసీ అమలులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే మేధావులు మాత్రం రెండు వర్గాలుగా విడిపోయి చర్చించుకుంటున్నారు. నాలుగు రోజుల పనిదినాల వల్ల అవుట్‌పుట్ తగ్గిపోతుందని, ప్రొడక్టివిటీపెరగకపోయినా.. ఉత్తేజంగా పని చేస్తారని, అదే టైంలో జీతాల కోతల గురించి కూడా ఉద్యోగులు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. కరోషి మరణాలు వర్క్‌ప్లేస్ మరణాలకు జపాన్ ఉద్యోగులు పెట్టుకున్న పేరు. తీవ్ర పని ఒత్తిడితో గుండెపోటు తదితర అనారోగ్య సమస్యలతో చనిపోయినా, లేదంటే ఒత్తిడితో ఆత్మహత్యలుచేసుకున్నా వాటిని కరోషి మరణాలుగా పరిగణిస్తారు. 2015, క్రిస్మస్‌నాడు మట్సూరి టకహషి(24) అనే యువతి.. పని ఒత్తిడి తట్టులేక ఆత్మహత్య చేసుకోవడంతో జపాన్ పని వాతావరణం, పని గంటల గురించి వీర లెవల్లో చర్చ జరిగింది. చదవండి: బఫెట్ రాజీనామా! ఎం జరిగిందంటే.. -
వారికి పనికంటే సెలవులే ఎక్కువ ఎందుకంటే...
డెన్మార్క్: శారీరకంగా ఎక్కువ ఒత్తిడి ఉండే ఉద్యోగాలు ఎక్కువ ఒత్తిడి లేని ఉద్యోగాలతో పోలిస్తే తక్కువ పనిజీతాలతో, ఎక్కువ సిక్లీవ్లతో, ఎక్కువ నిరుద్యోగంతో ఉంటాయి అని పరిశోధకులు తెలియజేస్తున్నారు. ఈ విషయాలను ది బీఎమ్‌జే జర్నల్‌లో ప్రచురించారు. ఈ పరిశోధనల కోసం డెన్మార్క్‌లో 2013 నవంబర్ నాటికి ఉద్యోగం పొందిన 18 నుంచి 65 సంవత్సరాల మధ్య వయసున్న 1.6 మిలియన్ల మంది ప్రజల ఆయుర్దాయం గురించి అధ్యయనం చేశారు. (లాక్డౌన్ 4.0 మార్గదర్శకాలు ఇవేనా..!) ప్రతి వ్యక్తి ఉద్యోగానికి అవసరమైన భౌతిక డిమాండ్ స్థాయిని జాబ్ ఎక్స్పోజర్ మ్యాట్రిక్స్ ఉపయోగించి కొలిచారు. ఇలా 317 రకాల వృత్తులపై ఈ పరిశోధన చేశారు. తక్కువ భౌతిక డిమాండ్ల నుంచి ఎక్కుడ భౌతిక డిమాండ్ వారిగా ఈ జేఈయమ్ స్కోర్‌ను వర్గీకరించారు. తక్కువ శారీరక శ్రమచేసే వారు(16 కంటే తక్కువ), మితమైన శ్రమ (16-28) ,అధిక శ్రమ చేసేవారికి (28 ప్లస్) స్కోరు కేటాయించారు. దీనికి సంబంధించి డెన్మార్క్‌లోని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ది వర్కింగ్ ఎన్విరాన్మెంట్కు చెందిన అధ్యయన రచయితలు కింది విధంగా తెలిపారు. అధిక స్కోరింగ్ ఉద్యోగాలలో నిర్మాణ రంగంలో పనిచేసేవారిని చేర్చారు, అదేవిధంగా ఎక్కువ శారీరక శ్రమ చేసే వడ్రంగి, రాతి విగ్రహాలు చెక్కే వారిని, బిల్డింగ్‌లకు రంగులు వేసేవారిని, ప్లంబింగ్ వంటి పనులుచేసే వారిని చేశారు. తయారీ పరిశ్రమలో పనిచేసేవారిని, ఇళ్లు శుభ్రపరిచేవారిని కూడా ఇందులోనే చేర్చారు. వీరికి ఇచ్చే అనారోగ్య సెలవులు, వైకల్య పెన్షన్, నిరుద్యోగ సమస్యలు అన్ని 2017 వరకు నమోదు చేశారు. (అడ్వకేట్ల డ్రస్కోడ్ మారింది, ఇకపై వారు...) ఇక వీరు 30, 40, మరియు 50 సంవత్సరాల వయస్సు గల కార్మికులపై ఎక్కువ విశ్లేషణ చేశారు. దీని ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నారు. మహిళల కంటే ఎక్కువ మంది పురుషులు జేఈఎమ్ స్కోరు ప్రకారం శారీరకంగా డిమాండ్ ఉన్న ఉద్యోగాలలో పనిచేస్తున్నారు. ఈ గ్రూపులో పురుషులు శారీరకంగా డిమాండ్ చేయని ఉద్యోగాలలో పనిచేసే వారి తోటివారి కంటే సగటున దాదాపు మూడు సంవత్సరాలు చిన్నవారుగా ఉంటున్నారు. ఇక మహిళల విషయానికి వస్తే ఈ తేడా 10 నెలలుగా ఉంది. మహిళలు, పురుషులు ఇద్దరిలోకూడా శారీరక శ్రమ చేసే వారికి శారీరక శ్రమ చేయని వారికంటే తక్కువ జీతం, తక్కువ ఆయుర్ధాయం, ఎక్కువ నిరోద్యోగం, ఎక్కువ ఆరోగ్యసమస్యలు, ఎక్కువ అనారోగ్య సెలవులు తీసుకోవలసి వస్తోంది. -
‘ఉపాధి’కి ఊతం
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు కొంత ఊరట లభించింది. ఇప్పటివరకు చెల్లిస్తున్న రోజు వారీ కూలి రూ.205కు మరో రూ.6 పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ పనులు ముగిసిన ప్రస్తుత పరిస్థితుల్లో సర్కారు తీసుకున్న నిర్ణయంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 16,67,339 మంది కూలీలకు కొంతమేర ఆర్థికంగా ప్రయోజనం చేకూరనుంది. సాక్షి, వరంగల్ రూరల్ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు కొంత ఊరట లభించింది. ఇప్పటివరకు చెల్లిస్తున్న రోజు వారీ కూలి రూ.205కు మరో రూ.6 పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ పనులు ముగిసిన ప్రస్తుత పరిస్థితుల్లో సర్కారు తీసుకున్న నిర్ణయంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 16,67,339 మంది కూలీలకు కొంతమేర ఆర్థికంగా ప్రయోజనం చేకూరనుంది. వ్యవసాయ ఆధారమే అధికం.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నవారే ఎక్కువ. రెండో పంట లేకపోవడంతో కూలీలు ఇతర పనులు చేస్తూ ఏడాది పాటు కుటుంబాలను పోషించుకుంటారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు ముగియడంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులు ఊపందుకున్నాయి. రోజురోజుకూ పనులకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే చేపట్టాల్సిన పనులను గుర్తించిన అధికారులు అడిగిన వారికి ఉపాధి కల్పిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 7,31,280 జాబ్ కార్డులు ఉండగా 16,67,339 మంది కూలీలు ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తున్నారు. పేదలకు వరం.. పేదలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం జిల్లా వాసులకు వరంగా మారిందని చెప్పవచ్చు. పనిదినాలు సైతం ఎక్కువగా ఉండటంతో నిధులు అధిక మొత్తంలో వస్తున్నాయి. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సుస్థిర ఆస్తుల కల్పన, వనరుల ఉత్పాదకత అభివృద్ధికి తగిన పనులను ఎంపిక చేసి కూలీలకు పని కల్పించాల్సి ఉంటుంది. తద్వారా కూలీల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం ఉపాధి హామీ పథకం ప్రధాన లక్ష్యం. ఏటా కూలీల బడ్జెట్ తయారు చేసి వాటికి సరిపడా పనులు, జీవనోపాధుల బలోపేతానికి, గ్రామానికి అవసరమయ్యే మౌలిక వసతుల కల్పన, ఉమ్మడి వనరుల అభివృద్ధికి అంచనాలను తయారు చేసి ఉపాధి కల్పిస్తున్నారు. ఇందులో ప్రధానంగా బావులు, ఇంకుడుగుంతలు, మొక్కల పెంపకం, కందకాలు, ఊట కుంటలు, మరుగుదొడ్ల నిర్మాణం, నీటి తొట్లు, పండ్ల తోటల పెంపకం, నీటి నిల్వలకు సంబంధించిన పనులు, ప్రభుత్వ పాఠశాలలో వంటశాలల నిర్మాణాలు చేపడుతున్నారు. కనీసం 40 పనిదినాలు.. ఉపాధి పనుల్లో జాబ్ కార్డుపై నమోదైన ఒక కుటుంబానికి ఏడాదికి కనీసం వంద పనిదినాలు కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యం. కుటుంబంలో ముగ్గురు కంటే ఎక్కువ సభ్యులు ఉన్న వారికి కనీసం వంద పని దినాలు కల్పిస్తారు. ఒకరిద్దరు సభ్యులున్న కుటుంబాలే అధికంగా ఉన్నాయి వీరికి న్యాయం చేసేలా ఒక్కొక్కరికి కనీసం 40 రోజులు పని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హరితహారం కోసం గ్రామపంచాయతీకి ఒక నర్సరీ ఏర్పాటు చేశారు. వీటిలో పనులు చేయడం ద్వారా కూలీలకు అందించే సగటు వేతనం భారీగా పెరుగుతుందని, వారికి ఆర్థికంగా ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. కూలి రేట్లు పెరగడం సంతోషకరం.. ఉపాధి హామీ పథకంలో కూలి రేట్లు పెరగడం సంతోషంగా ఉంది. ఎండాకాలంలో వ్యవసాయ పనులు లేక ఇంటి వద్దనే ఉండే వారికి ఉపాధి హామీ పథకం చాలా దోహదపడుతోంది. ఉపాధి దొరక్క వలస వెళ్లే వారికి స్థానికంగానే కొంత మెరుగైన ఆదాయం సమకూరనుంది. కూలి పెంచడం వల్ల చాలా మందికి ఆర్థికంగా ఉపయోగపడుతుంది. – కొన్కటి మోహన్, ధర్మరావుపేట, ఖానాపురం ఏప్రిల్ 1 నుంచి అమలు ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు పెరిగిన కూలి డబ్బులతో కలిపి రోజుకు రూ.211 చొప్పున ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చింది. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీఓలో రూ.6 పెంచారు. గతంలో రూ.205 కూలీ అందేది. అడిగిన కూలీందరికి ఉపాధి పథకం ద్వారా పనులు చూపిస్తున్నాం. ఎండాకాలంలో 30శాతం అధికంగా కూలి కట్టిస్తున్నాం. – సంపత్‌రావు, డీఆర్డీఓ -
‘పని’ పెంచుడే..!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఉపాధిహామీ పనులు కల్పించేందుకు.. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఆర్థిక సంవత్సరం మరో రెండు నెలల్లో ముగుస్తుండడంతో ఆయా గ్రామాల్లో అడిగిన ప్రతి కూలీకి పని చూపించే విధంగా.. పనులను గుర్తించడంతోపాటు వివిధ కారణాలతో మిగిలిపోయిన పనులను వేగవంతం చేసేందుకు పూనుకున్నారు. ఖరీఫ్ సీజన్, వర్షాల కారణంతో జిల్లాలో ఉపాధిహామీ పనులు మూడు నెలల్లో కొంత మందగించాయి. చేయాల్సిన పనులు ఉన్నప్పటికీ కూలీలు కొన్ని ప్రాంతాల్లో ఆసక్తి చూపకపోవడం.. ఇతర పనుల ద్వారా ఉపాధి పొందడం వంటి కారణాలతో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు చేరుకోలేదు. దీంతో 2018–19లో జిల్లాలో కూలీలకు 58.12 లక్షల పని దినాలు కల్పించే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. అందుకు అనుగుణంగా అధికారులు జిల్లాలో పనులను గుర్తించారు. జిల్లాలో 2018–19లో 52.71 లక్షల పని దినాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఆర్డీఏ కూలీల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అన్ని జిల్లాల్లో పని దినాల సంఖ్యను పెంచాలని ప్రణాళికలు వేసింది. దీంతో జిల్లాలో 73.33 లక్షల పని దినాలను పూర్తి చేయా లని ఆదేశించింది. అయితే జనవరి 2019 వరకు 58.12 లక్షల పని దినాల లక్ష్యాన్ని అధికారులు నిర్ణయించారు. దీనిని చేరుకునేందుకు అధికారు లు పనులపై ప్రచారం కల్పించారు. జాబ్‌కార్డు ఉండి.. ఉపాధి పనికి అర్హుడైన ప్రతి కూలీ పథకాన్ని వినియోగించుకుని ఉపాధి పనికి వచ్చేలా చర్యలు చేపట్టారు. దీంతో జిల్లాలో ఇప్పటివరకు 86.74 శాతం పనులు కూలీలకు కల్పించినట్లైంది. 2018–19 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి సీఆర్డీఏ నిర్ణయించిన లక్ష్యాన్ని అందుకునేలా అధికారులు పనులను వేగవంతం చేశారు. ప్రస్తుతం జిల్లాలో వ్యవసాయ పనులు సాగుతుండడంతో ఉపాధిహామీ పథకం ద్వారా చేసే వ్యవ సాయ పనులు ఏమైనా ఉంటే వాటిని చేయించేం దుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కూలీలు ఉపాధి పనులు కోరితే వెంటనే వారికి పనులు చూపించాలని క్షేత్రస్థాయి సిబ్బందికి జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. రూ.93.58కోట్లు ఖర్చు.. 2018–19లో జిల్లాలో చేపట్టిన ఉపాధిహామీ పనులకు ప్రభుత్వం రూ.93.58కోట్లు ఖర్చు చేసింది. 2,16,713 మంది కూలీలు 50,41,044 పని దినాలను ఉపయోగించుకున్నారు. వీరికి వేతనంగా రూ.61.46కోట్లను ప్రభుత్వం చెల్లించింది. మెటీరియల్‌కు రూ.22.06కోట్లు, అధికారులు, సిబ్బంది జీతాల కు రూ.10.05కోట్లు ఖర్చు చేసింది. కూలి దొరకని ప్రతి పేదవాడికి పని కల్పించి.. పనికి సరిపడా వేతనం దక్కేలా ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా జిల్లాలో ఉపాధిహామీ పథకాన్ని అధికారులు నిర్వహిస్తున్నారు. పనికి దరఖాస్తు చేసుకున్న వారం పదిరోజుల్లో పని చూపించేలా గ్రామీ ణ ప్రాంతాల్లో పనులను సైతం సిబ్బంది గుర్తిస్తున్నారు. దీంతో ఉపాధిహామీ పథకం జిల్లాలో లక్ష్యానికి చేరువలో నిలిచింది. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 4,351 మంది కూలీలు ఉపాధిహామీ పథకం కింద వంద రోజుల పని పొందారు. సిద్ధమవుతున్న 2019–20 ప్రణాళిక.. 2019–20లో కూలీలకు ఉపాధిహామీ పథకంలో కల్పించే పనుల ప్రణాళిక రూపొందించేందుకు అధికారులు చర్యలను వేగవంతం చేశారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో పథకం కింద చేపట్టాల్సిన పనులను గుర్తించిన సిబ్బంది.. వాటికయ్యే ఖర్చులకు బడ్జెట్‌ను రూపొందిస్తున్నారు. జిల్లాలో ఉపాధిహామీ పథకం కింద కూలి అడిగిన ప్రతి ఒక్కరికి పనులు చూపించేందుకు వీలుగా పనులను నమోదు చేస్తున్నారు. ఇప్పటికే హరితహారం పథకం కింద కూలీలకు ఉపాధి చూపిస్తున్న సిబ్బంది.. వ్యవసాయ పనులు, కాల్వల మరమ్మత్తు వంటి పనులను పథకం కింద కూలీలకు చూపించేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. లక్ష్యాన్ని అధిగమిస్తాం.. జిల్లాలో ఉపాధిహామీ పథకం పనుల లక్ష్యాన్ని అధిగమిస్తాం. కూలి అడిగిన ప్రతి వ్యక్తికి ఉపాధి పథకంలో పని చూపించేలా చర్యలు చేపట్టాం. ఇప్పటివరకు 86.74 శాతం పని దినాలను పూర్తి చేశాం. మిగిలిన లక్ష్యాన్ని కూడా పూర్తి చేసేలా సిబ్బందికి ఆదేశాలిచ్చాం. గ్రామీణ ప్రాంత కూలీలు ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధిహామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా ప్రచారం చేస్తున్నాం. 2019–20 సంవత్సరానికి సంబంధించి పనుల ప్రణాళికలు పూర్తవుతున్నాయి. త్వరలో బడ్జెట్‌పై ప్రణాళిక కూడా సిద్ధమవుతుంది. – ఇందుమతి, డీఆర్డీఓ -
జిల్లాకు అదనపు ‘ఉపాధి’
∙50 పని దినాలు పెంచుతూ ఆదేశాలు ∙ఇప్పటికే వలసబాట పట్టిన గ్రామీణులు ∙సాఫ్ట్వేర్ వస్తేనే పనుల కల్పన అనంతపురం టౌన్ : కరువు జిల్లాలో వలసల నివారణకు ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద ప్రస్తుతం కల్పిస్తున్న పనులతో పా టు మరో 50 దినాలను అదనంగా కల్పిస్తోంది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖకు ఆదేశాలు జారీ చేసింది. అయితే అదనపు పనులకు సంబంధించి నూతన సాఫ్ట్వేర్ ఇంకా అందాల్సి ఉంది. వలస బాటలో గ్రామీణులు : జిల్లాలో ఈ ఏడాది కనీవినీ రీతిలో కరువు కారణంగా గ్రామీణులు వలసబాట పట్టారు. వర్షాభావం కారణంగా ఖరీఫ్‌లో 6 లక్షల హె క్టార్లకు పైగా వేరుశనగ దెబ్బతింది. రబీలోనూ 1.50 లక్షల హెక్టార్లలో సాగులోకి రావాల్సిన పంటలు కూడా పత్తాలేకుండాపోయాయి. ఫలితంగా వ్యవసాయ కూలీలు పనులులేక వలసబాట పడుతు న్నారు.కొందరు బెంగళూరు, చెన్నై ప్రాం తాలకు వలసవెళ్లిపోవడంతో కొన్ని గ్రా మాల్లో వెలవెలబోతున్నాయి. రాయదు ర్గ, కళ్యాణదుర్గం, కదిరి, మడకశిర, పెనుకొండ నియోజకవర్గాల్లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఇప్పటికే వంద రోజుల పనిదినాలు పూర్తి చేసుకున్న జాబ్‌కార్డు దారులు గ్రామాల్లోఖాళీగా ఉంటున్నారు. 63 మండలాల్లో అదనపు పనులు వర్షపాతాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 241 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. మన జిల్లా వరకు 63 మండలాలనూ కరువు మండలాలుగా పది రోజుల కిందట ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లోనూ అదనపు పనులు కల్పించనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ 5వ తేదీ వరకు 2,48, 428 కుటుంబాలకు గాను 4,31,677 మందికి ఉపాధి పనులు కల్పించారు. 22,802 కుటుంబాలు వంద రోజుల పని దినాలు పూర్తి చేసుకున్నారు. ప్రభుత్వ తాజా ఆదేశాలతో ఈ కుటుంబాలకు కూడా పనిదినాలు కల్పిస్తారు. సాఫ్ట్వేర్ వస్తేనే పనులు ఈ ఏడాది ఇప్పటికే కోటి 26 లక్షలకు పై గా పనిదినాలు క ల్పించాం. కరువు మండలాలుగా ప్రకటించడంతో 50 పని దినాలను అదనంగా ఇవ్వాలని సర్క్యులర్ వచ్చింది. సాఫ్ట్వేర్ రాగానే పనులు కల్పిస్తాం. ప నులు కావాల్సిన వారు అధికారులను సంప్రదించొచ్చు. – నాగభూషణం, డ్వామా పీడీ -
ఉపాధి కూలీలకు పనిదినాల పెంపు
లబ్ధిపొందనున్న 50 వేల కుటుంబాలు అదనంగా *45 కోట్ల కేటాయింపు చిత్తూరు (అగ్రికల్చర్) : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీల కు ప్రభుత్వం పనిదినాలను పెంచింది. ఇప్పటివరకు ఒక కుటుంబానికి వంద రోజుల పని దినాలు ఉండగా, వాటిని 150 రోజులకు పెంచినట్లు శుక్రవారం జిల్లా డ్వామా కార్యాలయానికి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయి. జిల్లాలో మొత్తం 3.94 లక్షల కుటుంబా లు ఉపాధి పథకం కింద పనిచేస్తున్నా యి. అందులో ఇప్పటి వరకు 35 వేల కుటుంబాలకు వంద రోజుల పనిదినాలను అధికారులు కల్పించారు. మరో 15 వే ల కుటుంబాలు వంద రోజుల పనిదినాలను పూర్తి చేసుకునే దిశలో ఉన్నాయి. 2014-15 సంవత్సరానికి జిల్లా వ్యాప్తంగా 50 వేల కుటుంబాలకు 150 రోజుల పనిదినాలను కల్పిస్తారు. అదనంగా కల్పించే 50 రోజుల పనిదినాలకు గాను ఈ ఏడాదికి రూ. 45 కోట్ల మేరకు నిధులను కూడా ప్రభుత్వం కేటాయించింది. ఇదిలావుండగా ఉపాధి పనులకు విచ్చేసే కూలీలకు ప్రస్తుతం వేసవి దృష్ట్యా చేపట్టే పనుల్లో కొంత మేరకు వెసులుబాటు కూడా కల్పించారు. కూలీలు రోజంతా చేయాల్సిన పనుల్లో కొంత మేరకు చేసినా పూర్తి స్థాయిలో (వంద శాతం) కూలి అందిస్తారని డ్వామా పీడీ రాజశేఖర్‌నాయడు తెలిపారు. ఫిబ్రవరి నెలలో 80 శాతం, మార్చిలో 75 శాతం, ఏప్రిల్,మే నెలల్లో 70 శాతం, జూన్‌లో 80 శాతం పనులను చేసినా కూలీలకు వంద శాతం పని కింద కూలి చెల్లిస్తారని ఆయన చెప్పారు.