ప్రపంచ దేశాల్ని కలవరానికి గురి చేస్తున్న దిగ్రేట్ రిజిగ్నేషన్, అట్రిషన్ రేట్ నుంచి సురక్షితంగా ఉండేందుకు సంస్థలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా పదుల సంఖ్యలో కంపెనీలు వర‍్కింగ్ డేస్‌ను తగ్గించేస్తున్నాయి.వారానికి 5రోజులు కాకుండా 4రోజుల పాటు వర్క్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. రిజిగ్నేషన్ సమస్యను అధికమించడంతో పాటు వర్క్ ప్రొడక్టివిటీ పెరిగిపోతుందని సర్వేలు తేల్చడంతో సంస్థల యజమానులు వారానికి 4 రోజుల పని వైపు మొగ్గు చూపుతున్నారు.
ఈ నేపథ్యంలో యూకేకు చెందిన 60కంపెనీలకు పైగా జూన్ నుంచి వారానికి 4రోజుల పాటు వర్క్ చేసే వెసలుబాటు కల్పిస్తున్నాయి. ప్రారంభంలో ఈ కొత్త వర్క్ కల్చర్‌పై 3వేల మంది ఉద్యోగులపై ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఈ ట్రయల్స్‌లో ఉద్యోగులు ప్రొడక్టివిటీ, అట్రిషన్ రేట్, రిజిగ్నేషన్ తో పాటు ఇతర అంశాల్లో సత్ఫలితాలు రాబడితే శాస్వతంగా వర్కింగ్ డేస్‌ను కుదించనున్నారు.
ఈ ప్లాన్ వర్కౌట్ అయితే స్పెయిన్, ఐస్‌ల్యాండ్,యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా,న్యూజిల్యాండ్ దేశాలకు చెందిన సంస్థలు సైతం యూకే బాటలో పయనించనున్నాయి. పైన పేర్కొన్న దేశాలు సైతం ఆగస్ట్ నుంచి ఉద్యోగులకు సైతం వర్క్ వర్కింగ్ డేస్‌ను కుదించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.కాగా,వీక్లీ వర్కింగ్ డేస్‌ను తగ్గించడం వల్ల సంస్థలకు అనేక లాభాలు ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా వర్క్ ప్రొడక్టివిటీ తగ్గడంతో పాటు ఉద్యోగులు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపే ఆఫీస్ పనిలో ఉత్సాహాం చూపిస్తారని సర్వేలు పేర్కొంటున్నాయి.
ఉద్యోగుల్లో సంతోషం
పనిదినాల్ని కుదించడంపై ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారానికి 4రోజులు పనిచేయడం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నా.కుటుంబసభ్యులతో గడపడమే కాదు. హయ్యర్ స్టడీస్‌తో పాటు నేను నేర్చుకోవాలని.. టైమ్ లేక కంప్లీట్ చేయలేకపోయిన టెక్నాలజీ కోర్స్‌ల్ని పూర్తి చేస్తా'నని లూయిస్ అనే ఉద్యోగి తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment