attrition
-
కంపెనీని వీడి తిరిగి సంస్థలో చేరిన 13 వేలమంది!
యూఎస్ ప్రధాన కేంద్రంగా ఉన్న ప్రముఖ సాఫ్ట్వేర్ సేవల సంస్థ కాగ్నిజెంట్‌లో ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. గతంలో వివిధ కారణాలతో కంపెనీని వీడిన ఉద్యోగుల్లో దాదాపు 13,000 మంది తిరిగి సంస్థలో చేరినట్లు కాగ్నిజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎస్ రవికుమార్ తెలిపారు. మూడో త్రైమాసికంలో మొత్తం 3,800 మంది ఉద్యోగులు కొత్తగా సంస్థలోకి వచ్చినట్లు చెప్పారు.ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవికుమార్ మాట్లాడుతూ..‘కంపెనీలో ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. గతంతో పోలిస్తే మూడో త్రైమాసికంలో అదనంగా 3,800 మంది కొత్తగా సంస్థలో చేరారు. అయితే ఏడాది ప్రాతిపదికన చూస్తే 6,500 ఉద్యోగులు తగ్గినట్లు కనిపిస్తుంది. ఆగస్టులో కంపెనీ తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణం. బెల్కన్ కంపెనీలో మేజర్ వాటాను కాగ్నిజెంట్ కొనుగోలు చేయడంతో ఆ సంస్థ ఉద్యోగులు కూడా సంస్థ పరిధిలోకి వచ్చారు. దాంతో ఈ సంఖ్య పడిపోయినట్లు కనిపిస్తుంది. కొంతకాలంగా వివిధ కారణాలతో కంపెనీని వీడిన దాదాపు 13,000 మంది తిరిగి సంస్థలో చేరారు. కంపెనీ ఉద్యోగుల అట్రిషన్ రేటు(ఉద్యోగులు సంస్థలు మారే నిష్పత్తి) కూడా 14.6 శాతానికి తగ్గిపోయింది’ అని చెప్పారు.ఇదీ చదవండి: అలెక్సా చెబితే టపాసు వింటోంది!అంతర్జాతీయ ఉద్రిక్తతలు, రాజకీయ భౌగోళిక పరిణామాలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా క్లయింట్ కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీలకు కాంట్రాక్ట్‌లు ఇవ్వడం ఆలస్యం చేశాయి. దాంతో చాలా సంస్థలు తమ ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించాయి. క్రమంగా యుద్ధ భయాలు, ద్రవ్యోల్బణం స్థిరంగా ఉండడంతో తిరిగి పరిస్థితులు గాడినపడుతున్నాయని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఈ తరుణంలో సాఫ్ట్వేర్ కంపెనీల్లో చేరుతున్న ఉద్యోగుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. -
బాబ్బాబు ఇక్కడే ఉండు..!
న్యూఢిల్లీ: బడా ప్రైవేటు బ్యాంక్‌లు అధిక ఉద్యోగ వలసలకు (అట్రిషన్) కొంత అడ్డుకట్ట వేయగలిగాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో అట్రిషన్ రేటు అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలి్చతే తగ్గినట్టు డేటా తెలియజేస్తోంది. ఉద్యోగులు సంస్థతోనే కొనసాగేందుకు వీలుగా బ్యాంక్‌ల యాజమాన్యాలు పలు చర్యలను ఆచరణలో పెట్టడం ఫలితాలనిస్తోంది. మేనేజర్లను జవాబుదారీ చేయడం, అధిక ప్రోత్సాహకాలు తదితర చర్యలు ఇందులో భాగంగా ఉన్నాయి. బీఎఫ్ఎస్ఐ రంగంలో ఇతర సంస్థల మాదిరే బ్యాంక్‌లు సైతం నైపుణ్య మానవ వనరుల పరంగా ఆటుపోట్లను చూస్తున్నట్టు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎండీ, సీఈవో శశిధర్ జగదీశన్ తెలిపారు. 2022–23లో ఉద్యోగుల వలసలు బ్యాంక్‌తోపాటు పరిశ్రమకు సైతం ఆందోళన కలిగించినట్టు చెప్పారు. 30 ఏళ్లలోపు వారే ఎక్కువ.. ‘‘2023–24లో వలసలను అడ్డుకునేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పలు చర్యలు తీసుకుంది. ఉద్యోగులు సంస్థను వీడేందుకు గల కారణాలను గుర్తించి, దిద్దుబాటు చర్యలు తీసుకునేందుకు వీలుగా ఉన్నత స్థాయిలో టాస్‌్కఫోర్స్‌ను సైతం ఏర్పాటు చేశాం’’అని జగదీశన్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో అట్రిషన్ రేటు 7 శాతం మేర తగ్గి, 27 శాతంగా ఉంది. అదే మహిళా ఉద్యోగుల వలసలు 28 శాతంగా ఉండడం గమనార్హం. ముఖ్యంగా ఇలా సంస్థను వీడి వెళ్లే వారిలో ఎక్కువ మంది 30 ఏళ్లలోపు వారుంటుంటే, ఆ తర్వాత 30–50 ఏళ్ల వయసులోని వారున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగుల అనుభవం మెరుగుపడేందుకు వీలుగా తాము ఇన్వెస్ట్ చేసినట్టు జగదీశన్ వెల్లడించారు. బ్యాంక్‌కు చెందిన లెరి్నంగ్ ప్లాట్‌ఫామ్ ‘ఎంపవర్’ ద్వారా వృత్తిపరమైన నైపుణ్యాలు నేర్చుకునే అవకాశం కల్పించినట్టు చెప్పారు. ఉద్యోగుల మనోగతం, వారి అభిప్రాయాలను తెలుసుకునే కార్యాచరణను అమలు చేసినట్టు తెలిపారు. 2 లక్షలకు పైగా ఉన్న ఉద్యోగులకు నైపుణ్యాలు పెంచేందుకు పెట్టుబడులు కొనసాగిస్తున్నట్టు వివరించారు. 2023–24లో 6 లక్షల గంటల అభ్యసనను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నమోదు చేసింది. ఇతర బ్యాంకుల్లోనూ.. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లోనూ అట్రిషన్ రేటు గత ఆర్థిక సంవత్సరంలో 6 శాతం మేర తగ్గింది. ఐసీఐసీఐ బ్యాంక్‌లో 25 శాతం, యాక్సిస్ బ్యాంక్‌లో 29 శాతం, కోటక్ బ్యాంక్‌లో 40 శాతం చొప్పున నమోదైంది. ఇక ఇండస్ ఇండ్ బ్యాంక్‌లో ఉద్యోగ వలసల రేటు 14 శాతం తగ్గి 37 శాతానికి, యస్ బ్యాంక్‌లో 5 శాతం తగ్గి 38 శాతానికి పరిమితమైంది. పెద్ద ప్రైవేటు బ్యాంకుల్లో కోటక్ మహీంద్రా బ్యాంక్‌లోనే ఉద్యోగుల వలసలు అధికంగా ఉన్నాయి. దీంతో ఈ సంస్థ ఉద్యోగులను కాపాడుకునేందుకు గత ఆర్థిక సంవత్సరంలో ఎన్నో చర్యలు చేపట్టింది. శాఖల వారీగా, రిలేషన్షిప్ మేనేజర్లు, అసిస్టెంట్ ఏరియా మేనేజర్లకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేసింది. కొన్ని విభాగాల్లో వేతనాలు, ప్రయోజనాల పరంగా ఆగు నెలల కాలానికి స్థిరమైన ప్రోత్సాహకాలను ప్రకటించింది. బ్రాంచ్ మేనేజర్లు, ఏరియా మేనేజర్లకు ప్రోత్సాహకాలు పెంచింది. పోటాపోటీగా వేతన, ప్రోత్సాహక ప్యాకేజీలతో ఉద్యోగులను కాపాడుకునేందుకు, ఆకర్షించేందుకు ప్రముఖ బ్యాంక్‌లు చర్యలు అమలు చేస్తున్నట్టు హంట్ పార్ట్నర్స్కు చెందిన వికమ్ర్ గుప్తా తెలిపారు. -
ప్రైవేట్ బ్యాంకుల్లో తగ్గుతున్న ‘అట్రిషన్’
దేశంలోని ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగుల అట్రిషన్(ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారడం)రేటు తగ్గింది. 2023 ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా 31-51 శాతం పెరిగిన ఈ రేటు 2024 ఆర్థిక సంవత్సరంలో తగ్గినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్‌లో ప్రధానంగా హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా బ్యాంకుల్లో నియామకాలు పెరగడం, తమ కెరియర్ కోసం యువత ఎక్కువగా బ్యాంకింగ్ రంగాన్ని ఎంచుకోవడం ఇందుకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.కొవిడ్ తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థ నెమ్మదిగా నష్టాల్లోకి జారుకుంది. లాక్డౌన్ కారణంగా లోన్లు ఇవ్వడం ఆగిపోయింది. ఆ సమయంలో నెలవారీ ఈఎంఐలు చెల్లించేందుకు ఆర్థికశాఖ గడువు ఇచ్చింది. ఫలితంగా బ్యాంకింగ్ నిర్వహణ భారంగా మారింది. దాంతో చాలామంది ఉద్యోగులు ఇతర సంస్థల్లో చేరడం, ఉద్యోగాలు మానడం వంటివి జరిగాయి. గత మూడు త్రైమాసికాల నుంచి బ్యాంకులు మెరుగైన పలితాలు విడుదల చేస్తున్నాయి. ప్రైవేట్ బ్యాంకుల్లో 2023 ఆర్థిక సంవత్సరంలో అట్రిషన్ రేటు 31-51 శాతంగా ఉంది. 2023లో ఎంప్లాయి టర్నోవర్ రేటు(ఉద్యోగుల ద్వారా వచ్చే ఆదాయం) 25-45%గా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ , ఐసీఐసీఐ బ్యాంక్ , కోటక్ మహీంద్రా బ్యాంక్ , యాక్సిస్ బ్యాంక్ , బంధన్ బ్యాంక్ , ఇండస్ఇండ్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్‌లు కలిసి మార్చి చివరి నాటికి సుమారు 7,30,000 మంది ఉద్యోగులను కలిగి ఉన్నాయి. 2024 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం వరకు ఉద్యోగుల అట్రిషన్ రేటు గతంలో కంటే 4.5-14 శాతం పడిపోయింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో 2023లో 34.2 శాతంగా ఉన్న అట్రిషన్ రేటు 2024లో 26.9%కి చేరింది. ఐసీఐసీఐ బ్యాంకులో 2023లో 30.9% నుంచి 2024లో 24.5%కు, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో 2023లో 45.9% నుంచి 2024లో 39.6%కి పడిపోయింది.ఇదీ చదవండి: సెప్టెంబర్ 1 నుంచి ఆ మెసేజ్‌లు, కాల్స్ నిలిపివేత!గత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో బ్యాంకులు తమ శాఖల విస్తరణకు పూనుకున్నాయి. దాంతో నియామకాలపై దృష్టి సారించాయి. లోన్ల జారీ క్రమంగా పెరుగుతోంది. యువత తమ కెరియర్ అభివృద్ధికి బ్యాంకింగ్‌వైపు మొగ్గు చూపుతున్నట్లు నిపుణులు తెలియజేస్తున్నారు. దాంతో టాప్ బ్యాంకుల్లో చేరుతున్న ఉద్యోగులు సంస్థలు మారడం లేదని, క్రమంగా అట్రిషన్రేటు తగ్గుతుందని చెబుతున్నారు. -
మళ్లీ ఉద్యోగుల సమరం.. మార్పు ఖాయం?
ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారు మెరుగైన అవకాశం కనిపిస్తే చాలు..మరో ఆలోచన లేకుండా పనిచేస్తున్న సంస్థకు రాజీనామా చేయాలనుకుంటారు. సరైన నైపుణ్యాలు లేనివారికి ఉద్యోగంపోతే మళ్లీ కొత్త కొలువు సంపాదించడం కొంత కష్టంగా ఉంటుంది. అయితే నైపుణ్యాలు ఉన్నవారికి మాత్రం ఉద్యోగం పోతుందేమోననే భయాలుండవు. 2024లో ఇలా మెరుగైన అవకాశాల కోసం ఉద్యోగాలు మారేవారి సంఖ్య పెరుగుతుందనే సంకేతాలు ఎక్కువయ్యాయి. ప్రస్తుత సంవత్సరం మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ఈ ఏడాదంతా ద్రవ్యోల్బణ భయాలు వెంటాడడంతో ఉద్యోగాలు మారాలనుకున్నవారు కొంత వెనకడుగేశారు. కానీ వచ్చే ఏడాదిలో ఇలాంటి పరిస్థితులుండవని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 28 శాతం మంది ఉద్యోగులు తమ ప్రస్తుత యజమాన్యంలోని ఉద్యోగాలను విడిచిపెట్టాలని, ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్నారు. వీరు కొత్త అవకాశాల కోసం వెతుకున్నట్లు తాజాగా బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) సర్వేలో వెల్లడైంది. దాంతో యాజమాన్యాలు తమ ఉద్యోగులు ఏం కోరుకుంటున్నారో దానికి ప్రాధాన్యం ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది. బీసీజీ ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, యూకే, అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీతో సహా మరో 8 దేశాల్లో 11,000 మంది నుంచి సేకరించిన సర్వే సమాచారం ప్రకారం ఈ వివరాలను వెల్లడించారు. వీరిలో సగం మంది పని గంటలు, వేతన చెల్లింపులు, ఇతర బెనిఫిట్స్ కోసం ఉద్యోగాలు మారుతున్నట్లు చెప్పారు. మరికొందరు తమకు ఇష్టమైన పనికోసం, సరైన సపోర్ట్ కోసం మారుతున్నట్లు పేర్కొన్నారు. అసలు ఉద్యోగం మారటానికి ప్రధానం కారణం ఏమిటని ప్రశ్నించగా ఎక్కువ మంది ఉద్యోగులు యాజమాన్య ఫంక్షనల్ విషయాలను ప్రస్థావించినట్లు వెల్లడైంది. ఇదీ చదవండి: ఈ ఏడాది ఈమె టాప్.. తర్వాతే అంబానీ, అదానీ.. కానీ.. ఉద్యోగులకు వారి మేనేజర్ కీలకంగా వ్యవహరిస్తారు. పనిపై అసంతృప్తిగా ఉన్న ఉద్యోగులతో పోలిస్తే సంతృప్తిగా ఉన్నవారు ఉద్యోగం మారడానికి ఎక్కువ ఆసక్తి చూపరని సర్వేలో తేలింది. అనుకూలంగా ఉన్న మేనేజర్ల వల్ల చాలావరకు అట్రిషన్(ఉద్యోగ మార్పు) తగ్గిందని సర్వేలో వెల్లడైంది. -
ప్రైవేటు బ్యాంకుల్లో ఎక్కువగా ఉద్యోగ వలసలు.. ఆర్బీఐ డేగకన్ను!
ముంబై: దేశంలోని కొన్ని ప్రైవేట్ రంగ బ్యాంకుల వద్ద అట్రిషన్ (ఉద్యోగ వలసలు) ఎక్కువగా కనిపిస్తోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ పేర్కొన్నారు. సెంట్రల్ బ్యాంక్ ఈ సమస్యను ‘నిశితంగా‘ గమనిస్తోందని తెలిపారు. బిజినెస్ స్టాండర్డ్ ఇక్కడ నిర్వహించిన వార్షిక బీఎఫ్ఎస్ఐ ఇన్సైట్ సదస్సులో దాస్ మాట్లాడుతూ, నియంత్రణ పర్యవేక్షణ విధానాల్లో భాగంగా ఆర్బీఐ ఈ సమస్యను పరిశీలిస్తోందని చెప్పారు. కొన్ని దిగ్గజ బ్యాంకుల్లో 30 శాతం కంటే ఎక్కువ అట్రిషన్ రేటు ఉందన్న వార్తల నేపథ్యంలో దాస్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ తరహా సమస్యల పరిష్కారానికి ప్రతి బ్యాంకు కోర్ టీమ్‌ను రూపొందించాలని అన్నారు. ‘‘ఉద్యోగ మార్పిడిపై యువత దృక్పథం మారింది. ఈ అంశంపై భిన్నంగా ఆలోచిస్తున్నారు’’ అని ఈ సందర్భంగా అన్నారు. అంతర్జాతీయ అనిశ్చితిలోనూ భారత్ ఎకానమీ పటిష్ట బాటన పయనిస్తున్నట్లు వెల్లడించారు. -
బ్యాంకు ఉద్యోగాలు చేదయ్యాయా? అలా చేరుతున్నారు.. ఇలా మానేస్తున్నారు!
అంతటా డిజిటలీకరణ ధోరణి పెరుగుతున్న తరుణంలో బ్యాంకుల ఉద్యోగుల సంఖ్య క్రమంగా క్షీణిస్తోంది. ముఖ్యంగా ఫ్రంట్లైన్లో పనిచేసే జూనియర్ స్థాయి సిబ్బందిలో ఈ క్షీణత పెరుగుతోంది. జాబ్ మార్కెట్లో పోటీతత్వం పెరగడంతో నైపుణ్యం కలిగిన ప్రతిభకు డిమాండ్ సరఫరాను మించిపోయింది. టాప్ బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లను పరిశీలిస్తే గత రెండేళ్లుగా అట్రిషన్ రేట్లు (ఉద్యోగుల సంఖ్య క్షీణత) క్రమంగా పెరుగుతున్నట్లు వెల్లడైంది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో ఈ ధోరణికి ఎంట్రీ-లెవల్ ఉద్యోగుల దృక్పథంలో వచ్చిన మార్పు ఓ కారణమైతే.. ప్రతిభను నిలుపుకోవడంలో వైఫల్యం కూడా మరో కారణంగా నిలుస్తోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 34.2 శాతం కోవిడ్ పరిస్థితుల అనంతరం సేల్స్ సిబ్బందితో సహా కింది స్థాయి ఉద్యోగుల లక్ష్యాల్లో వచ్చిన మార్పు అట్రిషన్ పెరగడానికి ప్రధాన కారణమని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎండీ, సీఈవో శశిధర్ జగదీషన్ పేర్కొన్నారు. ఈ ధోరణి అన్ని రంగాలకు విస్తరించిందని, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో మరింత పెరిగిందని వివరించారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మొత్తం అట్రిషన్ రేటు 34.2 శాతం ఉండగా అత్యధికంగా జూనియర్ సిబ్బందిలో 39 శాతం ఉంది. అయాన్ కన్సల్టింగ్ ప్రకారం.. 2022 జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య బ్యాంకింగ్ రంగంలో మొత్తం అట్రిషన్ రేటు 24.7 శాతంగా ఉంది. యాక్సిస్ బ్యాంక్ 35 శాతం ఫ్రంట్‌లైన్ సిబ్బందిలో తాము 33 నుంచి 35 శాతం క్షీణతను చూస్తున్నట్లు యాక్సిస్ బ్యాంక్ ఎండీ, సీఈవో అమితాబ్ చౌదరి అన్నారు. అయితే, సీనియర్ స్థాయి సిబ్బందిలో, కార్పొరేట్ కార్యాలయ ఉద్యోగుల్లో అట్రిషన్ చాలా తక్కువగా ఉందని పేర్కొన్నారు. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని, ఈ స్థాయి అట్రిషన్ సాధారణమే ఆయన వివరించారు. యస్ బ్యాంక్ 43 శాతం ఇక యస్ బ్యాంక్ సిబ్బందిలో అట్రిషన్ దాదాపు 43 శాతం ఉంది. ఇది ఎక్కువగా సేల్స్ విభాగంలోనే ఉందని, దీన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుని అట్రిషన్ రేట్లను 25 నుంచి 30 శాతానికి తగ్గించేలా కార్యాచరణ చేపడతామని యస్ బ్యాంక్ ఎండీ, సీఈవో ప్రశాంత్ కుమార్ అన్నారు. బ్యాంకింగ్ రంగంలో ఫ్రంట్‌లైన్ సిబ్బందిలో అధిక అట్రిషన్ రేట్లు పెరగడానికి ముఖ్యమైన కారణాలలో ఆటోమేషన్ ఒకటి అని ప్రముఖ మానవ వనరుల సంస్థ రాండ్‌స్టాడ్ ఇండియా ప్రొఫెషనల్ సెర్చ్,సెలక్షన్ డైరెక్టర్ సంజయ్ శెట్టి చెబుతున్నారు. 2022 మొదటి త్రైమాసికంతో పోలిస్తే బ్యాంకుల్లో ఖాళీలు 40 నుంచి 45 శాతం పెరిగాయని, అలాగే నియామకాలు కూడా గత సంవత్సరంతో పోలిస్తే 10 నుంచి 12 శాతం పెరిగాయని ఆయన పేర్కొన్నారు. ఇదీ చదవండి ➤ Myntra LayOffs 2023: మింత్రాలో ఉద్యోగుల తొలగింపు.. ఫ్లిప్‌కార్ట్ కరుణిస్తేనే.. -
టీసీఎస్‌లో పెరిగిన మహిళా ఉద్యోగుల వలసలు
ముంబై: టెక్నాలజీ దిగ్గజ కంపెనీ టీసీఎస్‌లో మహిళల అట్రిషన్ రేటు (వలసలు/కంపెనీని వీడడం) పురుషులతో సమాన స్థాయికి పెరిగింది. ఈ విషయాన్ని కంపెనీ మానవ వనరుల ముఖ్య అధికారి మిలింద్ లక్కడ్ వెల్లడించారు. చారిత్రకంగా చూస్తే పురుషుల కంటే మహిళా ఉద్యోగుల అట్రిషన్ రేటు తక్కువగా ఉండేదంటూ, ప్రస్తుత పరిస్థితిని అసాధారణంగా పేర్కొన్నారు. ఇంటి నుంచి పనిచేసే విధానానికి ముగింపు పలకడం ఇందుకు కారణం కావొచ్చన్నారు. టీసీఎస్ మొత్తం ఉద్యోగుల్లో 35 శాతం (6 లక్షల మందికి పైగా) మహిళలే కావడం గమనార్హం. ‘‘కరోనా సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం కారణంగా కొంత మంది మహిళలకు ఇంటి ఏర్పాట్ల విషయంలో మార్పులకు దారితీసి ఉండొచ్చు. ఇదే వారిని తిరిగి కార్యాలయాలకు రానీయకుండా చేయవచ్చు’’అని మిలింద్ లక్కడ్ కంపెనీ వార్షిక నివేదికలో అభిప్రాయపడ్డారు. లింగ వైవిధ్యం కోసం కృషి చేస్తున్న కంపెనీకి పెరిగిన మహిళల అట్రిషన్ రేటు ప్రతికూలమన్నారు. దీన్ని తగ్గించడంపై కంపెనీ దృష్టి పెడుతుందన్నారు. మార్చి నాటికి టీసీఎస్‌లో మొత్తం మీద అట్రిషన్ రేటు 20 శాతం స్థాయిలో ఉండడం గమనార్హం. రాజేజ్ గోపీనాథన్‌కు రూ.29 కోట్లు టీసీఎస్ సంస్థ 2022–23 సంవత్సరానికి గాను సీఈవో స్థానంలో ఉన్న రాజేష్ గోపీనాథన్‌కు రూ.29.16 కోట్ల పారితోషికాన్ని చెల్లించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 13.17 శాతం ఎక్కువ. ఆరేళ్లుగా టీసీఎస్‌ను నడిపించిన గోపీనాథన్ ఇటీవలే సీఈవోగా వైదొలగగా కే.కృతివాసన్ ఈ బాధ్యతల్లోకి రావడం తెలిసిందే. కొత్త సీఈవో కృతివాసన్‌కు ప్రతి నెలా రూ.10 లక్షలు బేసిక్ వేతనంగా కంపెనీ చెల్లించనుంది. ఇది రూ.16 లక్షల వరకు పెరుగుతూ వెళుతుంది. బోర్డు నిర్ణయించిన మేరకు కమీషన్, అద్దెలేని నివాస వసతి తదితర సదుపాయాలు కల్పించనున్నారు. ఇక కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్జీ సుబ్రమణియమ్ గత ఆర్థిక సంవత్సరానికి రూ.23.60 కోట్ల పారితోషికాన్ని (13.58 శాతం అధికం) పొందారు. -
టీసీఎస్ ఆదాయం అదుర్స్..కానీ ఉద్యోగుల్లో..!
సాక్షి, ముంబై: దేశీయ దిగ్గజ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) త్రైమాసిక ఫలితాల లాభాల్లో అంచనాలను మిస్ చేసింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం నాలుగు శాతం వృద్ధితో రూ.10,846 కోట్లకు పరిమితమైంది. లాభాలుపెరిగినప్పటికీ రూ.11,200 కోట్ల మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయింది. అయితే ఆదాయం విషయంలో మాత్రం దూసుకుపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కన్సాలిడేటెడ్ ఆదాయం 5.3 శాతం పెరిగి రూ.58,229 కోట్లకు చేరింది. జనవరి 9న క్యూ3ఎఫ్వై23 ఫలితాలను ప్రకటించిన కంపెనీ, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి కొనసాగుతున్నా, లాంగ్‌టర్మ్ గ్రోత్ ఔట్‌లుక్‌లో ధృడమైన వృద్ధి సాధిస్తామని ప్రకటించింది. అలాగే స్పెషల్ డివిడెండ్ రూ.67తోపాటు, 8 రూపాయల మధ్యంతర డివిడెండ్‌ను టీసీఎస్ సీఎండీ రాజేశ్ గోపినాథన్ ప్రకటించారు. 10 త్రైమాసికాల్లో ఇదే తొలిసారి మరోవైపు క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన సంస్థ హెడ్‌కౌంట్ భారీగా క్షీణించింది. 2,197 మంది ఉద్యోగులను తగ్గించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో టీసీఎస్ 28,238 మంది ఉద్యోగులను చేర్చుకుంది. ప్రస్తుతం తమ ఉద్యోగుల సంఖ్య 6,16,171 నుంచి 613,974 మందికి తగ్గిందని పేర్కొంది. 10 త్రైమాసికాల్లో ఈ స్థాయిల్లో తగ్గడం ఇదే తొలిసారి. ఐటీ పరిశ్రమలో ఆందోళన కలిగించే ఎలివేటెడ్ అట్రిషన్ స్వల్పంగా క్షీణించింది. అట్రిషన్ 21.3 శాతంగా ఉంది, వార్షిక ప్రాతిపదికన గత ఏడాది 21.5 శాతం నుండి స్వల్పంగా క్షీణించింది. రానున్న త్రైమాసికాల్లో ఇది మరింత తగ్గుతుందని చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ వెల్లడించారు. అయితే డిమాండ్ క్షీణించినట్టు కాదనీ, భారీ డిమాండ్‌తో ప్రస్తుతం చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నామన్నారు. కస్టమర్ సంతృప్తే ప్రధాన లక్క్ష్యంగా గత కొన్ని త్రైమాసికాలుగా ఫ్రెష్ టాలెంట్, నైపుణ్య శిక్షణమీద ఎక్కువ దృష్టి పెట్టామని లక్కాడ్ ఒక ప్రకటనలో తెలిపారు. -
‘సాఫ్ట్వేర్ ఉద్యోగమా..వద్దు బాబోయ్’, కంపెనీలకు షాకిస్తున్న ఐటీ ఉద్యోగులు!
ఐటీ - బీపీఎం ఇండస్ట్రీలో అట్రిషన్ రేటు రోజురోజుకి భారీ స్థాయిలో పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. 2025 నాటికి 22 లక్షల మంది ప్రొఫెషనల్స్ ఐటీ రంగానికి స్వస్తి చెప్పనున్నట్లు ఓ నివేదిక వెలుగులోకి వచ్చింది. ఐటీ ఉద్యోగులు ఒక సంస్థ నుంచి మరో కంపెనీకి మారడం సాధారణమే. అయితే కోవిడ్ పరిణామాల నేపథ్యంలో ఐటీ ఉద్యోగులకు డిమాండ్ పెరగడంతో ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి అడుగు పెట్టే వారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. వారిని నిలుపుకునేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నా, వేరే సంస్థలు ఇస్తున్న ఆఫర్లు నచ్చడంతో ఉద్యోగులు వెళ్లిపోతున్నారు. దీంతో కంపెనీలకు జీతభత్యాల పెరిగిపోవటం, ఇప్పటికే ఖాళీగా ఉన్న స్థానాల్ని భర్తి చేసేందుకు భారీ ఎత్తున శాలరీలు అందించడం తలనొప్పిగా మారింది. అయినా అట్రిషన్ రేటు ఐటీ సంస్థల్ని తీవ్రంగా వేధిస్తోంది. ఈ తరుణంలో టీమ్ లీజ్ డిజిటల్ సంస్థ రానున్న సంవత్సరాల్లో ఐటీ ప్రొఫెషనల్స్ టెక్నాలజీ రంగాన్ని వదిలేస్తున్నారంటూ ఓ షాకింగ్ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం..57 శాతం మంది నిపుణులు భవిష్యత్‌లో తిరిగి ఐటీ రంగంలో తిరిగి వచ్చే ఉద్దేశం తమకు లేదనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సంప్రదాయ ఐటీ సంస్థల్ని వదిలేసే ఇతర రంగాల వైపు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆ నివేదికలో తెలిపింది. ఐటీ ఉద్యోగానికి సెలవు దాదాపు 50 శాతం మంది ఉద్యోగులకు తమ పనికి తగిన ప్రతి ఫలం లేదనే అసంతృప్తిలో ఉన్నారని, 25 శాతం మంది కెరీర్ వృద్ధి లేకపోవడమే కారణమని అభిప్రాయపడ్డారు అట్రిషన్ రేటు 55 శాతం ఫైనాన్షియల్ ఇయర్ 2022లో ఐటీ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల అట్రిషన్ రేటు 49శాతం ఉండగా, ఆర్ధిక సంవత్సరం 2023 నాటికి 55 శాతం పెరుగుతుందని టీమ్ లీజ్ విడుదల చేసిన ‘టాలెంట్ ఎక్సోడస్ రిపోర్ట్’లో హైలెట్ చేసింది. అంతేకాదు జీతం పెంపు పనితీరును మెరుగుపరుస్తుందని, ఉద్యోగ సంతృప్తిని పెంచుతుందని, 2025 నాటికి 20 లక్షల-22 లక్షల మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను వదిలివేస్తారని వెల్లడించింది. చదవండి👉 ఉద్యోగులకు బంపరాఫర్.. రండి బాబు రండి మీకు భారీ ప్యాకేజీలిస్తాం! -
లక్ అంటే టెకీలదే: అట్లుంటది ఐటీ కొలువంటే!
ముంబై: భారతీయ ఐటీ నిపుణులకు ఈ ఏడాది బాగా కలిసి వస్తోంది. టాప్ ఐటీ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీలు తమ ఉద్యోగుల జీతాలను భారీగా పెంచనున్నాయిట. గత కొన్ని త్రైమాసికాల్లో అట్రిషన్ రేటు భారీగా ఉండటంతో, ఉద్యోగులను, ముఖ్యంగా ఐటీ నిపుణులను నిలుపుకునేందుకు తంటాలు పడుతున్నాయి. ఏకంగా 70 నుంచి 120 శాతం దాకా తమ ఉద్యోగులను జీతాలను పెంచేందుకు నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో అనేక ఐటీ కంపెనీలు వేతనాల పెంపు, బోనస్ చెల్లింపుల లాంటి బంపర్ ఆఫర్లు ఇస్తున్నాయి. ఇప్పటికేచ చాలా కంపెనీల్లో జాయినింగ్ బోనస్ ను భారీ ఎత్తునే ఆఫర్ చేస్తున్నాయి. ఈ జాబితాలో విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ లాంటి దిగ్గజాలతో పాటు ఇతర టాప్ కంపెనీలున్నాయి. వ్యాపారాలు జీతాలు పెంచడం, బోనస్ సహా, ఇతర ప్రయోజనాలను అందించడం ద్వారా తమ ఉద్యోగులను నిలుపుకునేందుకు చూస్తున్నాయని మింట్ రిపోర్ట్ చేసింది. ఈ సమస్యలకు తోడు, సంస్థలో జీతాల పెంపు ఉండదనే వదంతుల నేపథ్యంలో ఈ సెప్టెంబరులోనే జీతాల పెంపు యథాతథంగా ఉంటుందని విప్రో స్పష్టం చేసింది. అంతేకాదు బెస్ట్ ఉద్యోగులకు మిడ్-మేనేజ్మెంట్ స్థాయిలో ప్రమోషన్లను కూడా ఇవ్వనుంది. ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్‌లో కూడా అట్రిషన్ రేటు ఎక్కువగానే ఉంది. ఇది కంపెనీ స్వల్పకాలిక లాభదాయకతపై ప్రభావంచూపుతుంది. జూన్ 2022తో ముగిసిన త్రైమాసికంలో అట్రిషన్ రేటు 27.7శాతం నుండి 28.4 శాతానికి పెరిగింది. దీన్నిగణనీయంగా తగ్గించాలని కంపెనీ యోచిస్తోంది. హైరింగ్ అండ్ కాంపిటేటివ్ కాంపెన్సేటివ్ రివిజన్ల ద్వారా టాలెంట్‌లో వ్యూహాత్మక పెట్టుబడులతో బలమైన వృద్ధిని సాధించ నున్నామని ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ నీలాంజన్ రాయ్ వెల్లడించారు. ఇది తక్షణమే మార్జిన్లపై ప్రభావం చూపినప్పటికీ, ఇది అట్రిషన్ స్థాయిలను తగ్గించి, భవిష్యత్తు వృద్ధికి మంచి స్థానాన్ని ఇస్తుందన్నారు. టీసీఎస్ దేశీయ అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ అధిక అట్రిషన్ రేటు 19.7గా ఉంది. దీన్ని తగ్గించుకునేందుకు 5 నుంచి 8 శాతం వేతనాల పెంపు అఫర్ చేస్తున్నామని టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ ప్రకటించారు. మంచి నైపుణ్యం కనబర్చిన వారికి వేతనం వృద్ధి మరింత ఉంటుందని ప్రకటించడం విశేషం. మిగిలిన టాప్ ఐటీ కంపెనీల్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తోందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
హైబ్రిడ్ వర్క్: ఐటీ దిగ్గజాలకు ఆ తలనొప్పి బాగా తగ్గిందట!
కాలిఫోర్నియా: వర్క్ ఫ్రం హోం పని విధానం అటు ఐటీ ఉద్యోగులకు, ఇటు ఐటీ సంస్థలకు బాగా ఉపయోగపడింది అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే హైబ్రిడ్ వర్క్ కంపెనీలకు ఇతర ఉపయోగాలతోపాటు మరో ప్రయోజనం కలిగిందని తాజా అధ్యయనంలో తేలింది. పని విధానం రేటింగ్, ప్రమోషన్ ప్రక్రియపై ఎలాంటి ప్రతికూల ప్రభావం లేకపోవడమేకాదు, ఐటీ దిగ్గజాలకు అట్రిషన్ (కంపెనీనుంచి మరో కంపెనికి తరలిపోవడం) అనే పెద్ద తలనొప్పినుంచి మూడోవంతు ఊరట లభించిందట. హైబ్రిడ్ పనివిధానంతో ప్రముఖ ఐటీ కంపెనీల్లో అట్రిషన్ రేటు 35 శాతం తగ్గిందని తాజా అధ్యయనంలో తేలింది. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన నికోలస్ బ్లూమ్ ఆధ్వర్యంలోని కొత్త అధ్యయనం ఈ విషయాలను వెల్లడించింది. మొత్తంగా హైబ్రిడ్, లేదా వర్క్ ఫ్రం హోం ఉద్యోగులు, సంస్థలకు ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో హైలైట్ చేసింది. కరోనా మహమ్మారి సమయంలో లాక్డౌన్లు, ప్రయాణ ఆంక్షలతో చాలా కంపెనీలు తమ ఉద్యోగుల కోసం వర్క్ ఫ్రం హోం విధానాన్ని అవలబించాయి. ఆ తరువాత సడలింపులతో హైబ్రిడ్ వర్క్ పద్దతిని ఫాలో అవుతున్నాయి. సాధారణంగా ప్రతి వారం కార్యాలయంలో రెండు నుండి మూడు రోజులు పని చేయడం , మిగిలిన రోజుల్లో ఇంట్లోనుంచే పని చేయడం అన్నమాట. నిరుద్యోగం రేటు ఐదు దశాబ్దాలలో కనిష్ట స్థాయికి చేరుకోవడంతో, ఇంటి నుండి పని చేసే విధానాన్ని తీవ్రంగా విమర్శించిన కొందరు కూడా ఉద్యోగులను ఆకర్షించడానికి వర్క్ ఫ్రం హోంను ఎంచు కున్నారుని స్టడీ వ్యాఖ్యానించింది. గ్లోబల్ ట్రావెల్ ఏజెంట్ Trip.comలో 2021, 2022లో 1,612 ఇంజనీర్లు, మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్ ఉద్యోగులపై ట్రయల్ స్టడీ చేసింది. ఇందులో భాగంగా బేసి డేట్స్‌లో జన్మించిన వారు బుధ, శుక్రవారాల్లో ఇంటి నుండి పని చేసేందుకు నిర్ణయించుకోగా, మరికొందరు పూర్తి సమయం కార్యాలయంలో పని చేశారు. ఈ అధ్యయనం సానుకూల ఫలితాలతో Trip.com మొత్తం కంపెనీకి హైబ్రిడ్ పనిని అందించిందని ఈ స్టడీ నివేదించింది. బ్లూమ్, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన రూబింగ్ హాన్ , జేమ్స్ లియాంగ్ సహ రచయితలుగా ఒక పేపర్‌ను పబ్లిష్ చేశారు. అట్రిషన్‌లో మెరుగుదలతో పాటు, నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ పేపర్ హైబ్రిడ్ ఏర్పాట్లు పని షెడ్యూల్లు ,అలవాట్లను ఎలా మారుస్తుందో కూడా హైలైట్ చేసింది. రిమోట్ రోజులలో తక్కువ గంటలు పని చేసినా కానీ వారాంతంతో సహా ఇతర రోజులలో పని గంటల సంఖ్యను పెంచారు. మొత్తంగా, ఉద్యోగులు ఇంటి రోజులలో దాదాపు 80 నిమిషాలు తక్కువ పనిచేశారు కానీ ఇతర పని దినాల్లో వారాంతంలో దాదాపు 30 నిమిషాలు ఎక్కువ పనిచేశారు. ఈ పనివిధానంతో వర్క్ రివ్యూ, ప్రమోషన్స్‌లో ఎలాంటి ప్రభావం లేదని తెలిపింది. మొత్తంగా ఇంటి నుండి పని చేసే అవకాశం ఉన్నవారు కొంచెం ఎక్కువ ఉత్పాదకతను నివేదించారు. ఆఫీసుల్లో పనిచేసినవారితో పోలిస్తే కోడ్ లైన్లలో 8 శాతం పెరుగుదల నమోదైందట. -
సారీ బాస్.. ఇలా అయితే కష్టం! కంపెనీలకు గుడ్ బై అంటున్న ఉద్యోగులు!!
ఇటీవల కాలంలో ఉద్యోగులు ఒక సంస్థను వీడి మరో సంస్థలో చేరడం (ఆట్రిషన్ రేట్) విపరీతంగా పెరిగిపోయింది. ఓవైపు నిరుద్యోగ సమస్య పీడిస్తున్నా.. ఉద్యోగాల్లో ఉన్న వారు మేనేజ్మెంట్ పట్ల సౌకర్యంగా ఫీలవకపోతే సంస్థలను వీడేందుకు వెనుకడాటం లేదు. ఇన్ఫోసిస్ లాంటి సంస్థలైతే దీన్ని అడ్డుకునేందుకు ప్రత్యేక నిబంధనలు అమలు చేయాల్సి వస్తోంది. దీనికి వ్యతిరేకంగా లేబర్ ఆఫీసుల చుట్టు తిరగాల్సి వస్తోంది. సోషల్ మీడియా వేదికగా సామాజిక అంశాలపై స్పందించే ఆర్పీజీ గ్రూపు చైర్మన్ హార్ష్ గోయెంకా కార్పొరేట్ సెక్టార్ ఎదుర్కొంటున్న సీరియస్ సమస్యను ఈసారి లేవనెత్తారు. సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్న వీడియో ద్వారా ఈ సమస్యకు ఓ పరిష్కారం చూపించే ప్రయత్నం చేశారు. వర్క్‌ఫోర్స్‌కి సంబంధించి ఇండియాలో మూడు రెవల్యూషన్స్ వచ్చాయని. ఒక్కో రెవల్యూషన్ అప్పుడు వర్క్‌ఫోర్స్ పనితీరు ఎలా ఉందో, వాళ్లు ఏం ఆశిస్తున్నారనే అంశాలను ఈ వీడియోలో సవివరంగా చర్చించారు. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్వాతంత్రం వచ్చిన తర్వాత పారిశ్రామిక విప్లవంతో కొత్త ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. ఆ సమయంలో ఎన్ని గంటలైనా పని చేసేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉండేవారు. యజమానులు కొట్టినా తిట్టినా పడేవారు. అవకాశాలు తక్కువగా ఉండటంతో ఎన్నో ఇబ్బందుల నడుమ ఆరోజుల్లో ఉద్యోగులు పని చేయాల్సి వచ్చేది. వేరే జాబ్ దొరికే అవకాశం లేకపోవడంతో అక్కడే ఉండేవారు తప్పితే సంస్థలను వీడాలనే ఆలోచనే వచ్చేది కాద ఆ తరం వారికి. ఉపాధి కల్పించే సంస్థ పట్ల ప్రేమాభిమానాల కంటే భయమే ఎక్కువగా ఉండేది. ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ 90వ దశకం తర్వాత క్రమంగా ఐటీ రంగం పుంజుకోవడం మొదలైంది. ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ వచ్చాక ఐటీ కంపెనీలు వచ్చాయి. ఈ తరుణంలో వచ్చిన వర్క్‌ఫోర్స్ కనీస అవసరాల కోసం కాకుండా మెరుగైన జీవితం (స్టాండర్డ్ లైఫ్‌స్టైల్) లక్ష్యంగా పని చేయడం మొదలైంది. వీళ్లకు కార్ ఈఎంఐ, హౌజ్ ఈఎంఐ, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అనేవి ప్రధాన సమస్యలు. అవకాశం ఉంటే వేరే చోటుకి వెళ్లేందుకు ఆలోచించేవారు. ఎక్కువ శాతం సంస్థను వీడేందుకు ఇష్టపడేవారు కాదు. కానీ సంస్థ పట్ల భయం అనేది పోయింది. అయితే పని చేసే సంస్థ పట్ల నమ్మకం ఉండేది. సోషల్ రెవల్యూషన్ 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం అనంతరం సోషల్ రెవల్యూషన్ వచ్చింది. ఇప్పుడు పని చేస్తున్న ఉద్యోగులు ఉద్యోగ భద్రత , స్టాండర్డ్ లైఫ్ వంటి బెంచ్‌మార్క్‌లను దాటి పోయారు. ఇప్పటి వర్క్‌ఫోర్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్‌ని కోరుకుంటున్నారు. ఈ క్వాలిటీ అనేది పని, పని ప్రదేశం, యాజమాన్యం ప్రవర్తన వంటివి కోరుకుంటున్నారు. క్వాలిటీలో ఏ మాత్రం తేడా వచ్చిన కంపెనీ వదిలి వెళ్లేందుకు వెనుకాడటం లేదు. ఉద్యోగాలిచ్చే సంస్థల పట్ల భయం, నమ్మకం వంటివాటికి ఇక్కడ చోటు లేదు. పరస్పర గౌరవం, ఆదరణ ఇక్కడ ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. చిన్న చూపు తగదు ఏ సంస్థ అయినే సరే ఉద్యోగం ఇచ్చామనో, మంచి జీతం ఇస్తున్నామనే భావనలో ఉంటే ఆ కంపెనీలు ఉద్యోగుల వలస అనే సమస్యను ఎదర్కోక తప్పదని హార్ష్ గోయెంకా షేర్ చేసిన వీడియో ద్వారా తెలుస్తోంది. ఈ తరం వర్క్‌ఫోర్స్ ఉద్యోగ భద్రత, మంచి జీతంతో పాటు క్వాలిటీ ఆఫ్ వర్క్‌ను కూడా కోరుకుంటున్నారు. పనితీరును గమనించి ప్రోత్సహకాలు అందివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సరైన సమయంలో వేతనాల పెంపు ఉండాలంటున్నారు. అవి లేకుంటే అదే కంపెనీలో ఉండేందుకు రెడీగా ఉండటం లేదు. కాబట్టి ఉద్యోగ, భద్రత జీతం ఇస్తున్నామని ఇంకే కావాలని ఆలోచించే కంపెనీలను వదిలి వెళ్లేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఉద్యోగుల విషయంలో జాగ్రత్త మెసలుకోవాలంటే యాజమాన్యాలకు సూచన చేశారు. An interesting explanation as to why people are resigning from their jobs and what it takes to retain employees pic.twitter.com/3mQmwGL8hX — Harsh Goenka (@hvgoenka) June 22, 2022 చదవండి: మహ్మద్ రఫీ పాటనే స్ఫూర్తిగా.. వేల కోట్లకు అధిపతిగా.. -
వారానికి 4 రోజుల పని, సై..సై..అంటున్న ఉద్యోగులు!
ప్రపంచ దేశాల్ని కలవరానికి గురి చేస్తున్న దిగ్రేట్ రిజిగ్నేషన్, అట్రిషన్ రేట్ నుంచి సురక్షితంగా ఉండేందుకు సంస్థలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా పదుల సంఖ్యలో కంపెనీలు వర్కింగ్ డేస్‌ను తగ్గించేస్తున్నాయి.వారానికి 5రోజులు కాకుండా 4రోజుల పాటు వర్క్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. రిజిగ్నేషన్ సమస్యను అధికమించడంతో పాటు వర్క్ ప్రొడక్టివిటీ పెరిగిపోతుందని సర్వేలు తేల్చడంతో సంస్థల యజమానులు వారానికి 4 రోజుల పని వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో యూకేకు చెందిన 60కంపెనీలకు పైగా జూన్ నుంచి వారానికి 4రోజుల పాటు వర్క్ చేసే వెసలుబాటు కల్పిస్తున్నాయి. ప్రారంభంలో ఈ కొత్త వర్క్ కల్చర్‌పై 3వేల మంది ఉద్యోగులపై ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఈ ట్రయల్స్‌లో ఉద్యోగులు ప్రొడక్టివిటీ, అట్రిషన్ రేట్, రిజిగ్నేషన్ తో పాటు ఇతర అంశాల్లో సత్ఫలితాలు రాబడితే శాస్వతంగా వర్కింగ్ డేస్‌ను కుదించనున్నారు. ఈ ప్లాన్ వర్కౌట్ అయితే స్పెయిన్, ఐస్‌ల్యాండ్,యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా,న్యూజిల్యాండ్ దేశాలకు చెందిన సంస్థలు సైతం యూకే బాటలో పయనించనున్నాయి. పైన పేర్కొన్న దేశాలు సైతం ఆగస్ట్ నుంచి ఉద్యోగులకు సైతం వర్క్ వర్కింగ్ డేస్‌ను కుదించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.కాగా,వీక్లీ వర్కింగ్ డేస్‌ను తగ్గించడం వల్ల సంస్థలకు అనేక లాభాలు ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా వర్క్ ప్రొడక్టివిటీ తగ్గడంతో పాటు ఉద్యోగులు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపే ఆఫీస్ పనిలో ఉత్సాహాం చూపిస్తారని సర్వేలు పేర్కొంటున్నాయి. ఉద్యోగుల్లో సంతోషం పనిదినాల్ని కుదించడంపై ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారానికి 4రోజులు పనిచేయడం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నా.కుటుంబసభ్యులతో గడపడమే కాదు. హయ్యర్ స్టడీస్‌తో పాటు నేను నేర్చుకోవాలని.. టైమ్ లేక కంప్లీట్ చేయలేకపోయిన టెక్నాలజీ కోర్స్ల్ని పూర్తి చేస్తా'నని లూయిస్ అనే ఉద్యోగి తెలిపాడు. -
ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్! బోనస్‌లు,ప్రమోషన్లు..అబ్బో ఇంకా ఎన్నెన్నో!
ప్రపంచ దేశాలకు చెందిన ఐటీ కంపెనీల్ని అట్రిషన్ రేటు విపరీతంగా వేధిస్తుంది. వచ్చిపడుతున్న ప్రాజెక్ట్‌లను పూర్తి చేయలేక..ఆఫర్లని, లేదంటే తమకు నచ్చిన రంగంలో అడుగుపెట్టేందుకు చేస్తున్న ఉద్యోగాల్ని ఉన్న ఫళంగా వదిలేస్తుంటే..ఆ ఉద్యోగుల్ని నిలుపుకోలేక ఐటీ సంస్థలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ టెక్ దిగ్గజాలు అట్రిషన్ రేట్ తగ్గించేందుకు మాస్టర్ ప్లాన్ వేశాయి. కోవిడ్-19 కారణంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఐటీ రంగానికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీనికి తోడు టెక్నాలజీ పరంగా అవకాశాలు విసృతంగా పెరిగిపోయాయి. అందుకే ఉద్యోగులు తమకు వస్తున్న అవకాశాల్ని వినియోగించుకుంటున్నారు. ఇతర సంస్థల నుంచి వస్తున్న ఆఫర్లను అందుకుంటున్నారు. దీంతో ఐటీ సెక్టార్‌ను ఉద్యోగుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో ప్రముఖ టెక్ దిగ్గజాలు డిజిటల్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫీయల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్ విభాగాల్లో అట్రిషన్ రేట్ తగ్గిస్తూ, స్కిల్స్ ఉన్న ఉద్యోగుల్ని ఎంపిక చేసే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా విప్రో, కాగ్నిజెంట్, మైండ్ ట్రీ, టెక్ మహీంద్రా, ఎంఫసిస్లాంటి సంస్థలు ఉద్యోగులకు స్పెషల్ బోనస్‌లు ప్రకటిస్తున్నాయి. కంపెనీ స్టాక్స్(ఈఎస్ఓపీఎస్) భాగస్వామ్యం ఇవ్వడం, ఉన్న జాబ్‌లో స్మార్ట్‌గా చేసేందుకు సిల్స్, లేదంటే మరో విభాగానికి చెందిన ప్రాజెక్ట్ చేసేలా ప్రత్యేకంగా క్లాసుల్ని నిర్వహించడం, ఉన్న సంస్థలో చేస్తున్న జాబ్ నచ్చక ఇబ్బంది పడుతుంటే..అదే సంస్థలో వారికి నచ్చిన విభాగంలో పనిచేసేలా ప్రోత్సహించడం, హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకునేలా అనుమతి ఇవ్వడం, వర్క్ ఫ్రమ్ లేదంటే ఎక్కడి నుండైనా పనిచేసేలా ఉద్యోగులకు అవకాశాల్ని కల్పిస్తున్నాయి. తద్వారా అట్రిషన్ రేట్‌ను పూర్తి స్థాయిలో తగ్గించుకోవచ్చని ఐటీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఉద్యోగులు సైతం ఈ ఆఫర్లకు అంగీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయని ఐటీ నిపుణులు భావిస్తున్నారు. చదవండి👉ఈ తరహా ఉద్యోగుల కోసం వేలకోట్ల ఖర్చు, పోటీపడుతున్న ఐటీ కంపెనీలు! -
ఐటీ కంపెనీ ఆఫర్:రండి బాబు రండి పెళ్లి సంబంధాలు చూస్తాం,శాలరీలు పెంచుతాం!
కరోనా కారణంగా పుట్టుకొచ్చిన కొత్త కొత్త టెక్నాలజీతో ఉద్యోగులు అవకాశాల్ని అందిపుచ్చుకుంటున్నారు. దీంతో ప్రపంచ దేశాలకు చెందిన ఇతర సంస్థలతో పాటు టెక్ కంపెనీల్లో సైతం అట్రిషన్ రేటు తీవ్రంగా వేధిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌కు చెందిన ఓ ఐటీ సంస్థ ఉద్యోగులకు కళ్లు చెదిరే ఆఫర్లు ప్రకటించింది. ఇంతకీ ఆ ఆఫర్లేంటని అనుకుంటున్నారా? ప్రపంచ వ్యాప్తంగా అన్నీ సంస్థల్లో కంటే ఐటీ కంపెనీల్లో అట్రిషన్ రేటు రోజురోజుకీ పెరిగిపోతుంది. ఈ అట్రిషన్ రేటును తగ్గించేందుకు మదురైలోని సాఫ్ట్ వేర్ సంస్థ శ్రీ మూకాంబిక ఇన్ఫోసొల్యూషన్స్ (ఎస్ఎంఐ) అందులో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రతి ఆరు నెలలకోసారి ఫ్రీగా పెళ్లి సంబంధాలు చూడడమే కాదు,ఇంక్రిమెంట్లను అందిస్తుంది. కంపెనీ ఉద్యోగులందరికీ ప్రతి ఆరు నెలలకు 6 నుంచి 8 శాతం ఇంక్రిమెంట్లు, ఉద్యోగుల పర్ఫామెన్స్‌ను బట్టి టాప్ 40 లేదా టాప్ 80 ఉద్యోగులకు అదనపు బెన్ఫిట్స్ అందిస్తుంది. 100కోట్లకు చేరువలో 2006లో శివకాశిలో ఎస్ఎంఐ సంస్థను ప్రారంభించి..ఆ తర్వాత 2010 మధురైకి మార్చారు.ఎస్‌ఎంఐతో దాని అసోసియేట్ కంపెనీలో కలిపి మొత్తం 750 మంది పనిచేస్తున్నారు. వీరిలో 40 శాతం మంది 5ఏళ్లకు పైగా అక్కడే పనిచేస్తున్నారు. ప్రస్తుతం కంపెనీ వార్షిక ఆదాయం రూ.100 కోట్లకు చేరువలో ఉంది. కాగా,ఆ కంపెనీలో అట్రిషన్ రేటును తగ్గించేందుకు ఎస్ఎంఐ సంస్థ ప్రతినిధులు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చదవండి👉యాపిల్ ఉద్యోగుల సంచలన నిర్ణయం, సీఈఓ టిమ్‌కుక్‌కు భారీ షాక్! -
'రండి బాబు రండి', పిలిచి మరి ఉద్యోగం ఇస్తున్న దిగ్గజ సాఫ్ట్వేర్ కంపెనీలు!
మంచి తరుణం మించిన దొరకదు..ఆలోచించిన ఆశాభంగం...రండి బాబు రండి..మా ఆఫీస్ లో జాయిన్ అవ్వండి. మీ టాలెంట్‌కు తగ్గట్లు ప్యాకేజీ ఇస్తాం. కాదూ కూడదూ అంటే అంతకు మించి ఇస్తాం' అంటూ దిగ్గజ సంస్థలు పిలిచి మరి ఉద్యోగాలిస్తున్నాయి. ►కోవిడ్ కారణంగా ఆయా టెక్ దిగ్గజాల్లో అట్రిషన్ రేటు (ఒక సంస్థలో పనిచేసే ఉద్యోగికి అంతే కంటే ఎక్కువ ప్యాకేజీ ఇస్తూ మరో సంస్థ ఆహ్వానించడం) విపరీతంగా కొనసాగుతుంది. గతేడాది డిసెంబర్ నెల క్యూ4 ముగిసే సమయానికి టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో' కంపెనీల్లో అట్రిషన్ రేటు గడిచిన 3ఏళ్ల కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఒక్క డిసెంబర్ నెలలో ఈ మూడు కంపెనీలు మొత్తం 51వేల మందిని నియమించుకున్నాయి. ►మిగిలిన టెక్ కంపెనీలతో పోలిస్తే ఇన్ఫోసిస్‌లో అట్రిషన్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇటీవల ముగిసిన త్రైమాసిక ఫలితాల్లో ఒక్క ఇన్ఫోసిస్‌లో అట్రిషన్ రేటు 25.5శాతం ఎక్కువగా ఉన్నట్లు కొన్ని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. విప్రోలో అట్రిషన్ రేటు 22.7శాతం, టీసీఎస్‌లో అతితక్కువగా 15.3శాతం ఉన్నట్లు రిపోర్ట్‌లులో పేర్కొన్నాయి. కోవిడ్‌తో పాటు ఇతర పరిస్థితులు కారణంగా ఉద్యోగస్తులు శాలరీ, డిజిగ్నేషన్, ఫ్యామిలీ సెక్యూరిటీ కారణంగా ఉద్యోగంలో అభివృద్ది కోరుకుంటున్నారని, కాబట్టే సంస్థల్లో అట్రిషన్ రేటు పెరిగిపోతున్నట్లు తేలింది. ►టీసీఎస్ ఈ ఆర్థిక సంవత్సరం (2021 ఏప్రిల్ 1 నుంచి 2022 మార్చి 31) డిసెంబర్ నెల వరకు..ఈ మధ్య కాలంలో మొత్తం 43 వేల మంది ఫ్రెషర్లను నియమించుకుంది. క్యూ2 కంటే క్యూ3లో ఎక్కువగా 34వేల మందిని ఫ్రెషర్లను నియమించుకోగా..మిగిలిన క్వార్టర్లకంటే క్యూ4లో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగుల్ని ఎంపిక చేసింది. దీంతో ఆ సంస్థలో ఉద్యోగుల మొత్తం సంఖ్య 556,986కి చేరింది. కాగా ఉద్యోగుల నియమక xpheno ప్రకారం..టీసీఎస్ చివరి క్యూ4లో మొత్తం 28వేల మంది ఉద్యోగుల్ని నియమించుకున్నట్లు తెలుస్తోంది. ►ఈ త్రైమాసికంలో విప్రో 10,306 మంది ఉద్యోగులను నియమించుంది. దీంతో ఆ సంస్థ మొత్తం ఉద్యోగుల సంఖ్య 231,671కి చేరుకుంది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఉద్యోగుల సంఖ్య 41,363 పెరిగింది. ►ఇన్ఫోసిస్ త్రైమాసికంలో 15,125 మందిని చేర్చుకుంది. ఆ సంస్థ మొత్తం ఉద్యోగుల సంఖ్య 292,067కి చేరుకుంది. ►ఈ మూడు టెక్ దిగ్గజ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 134,000 మంది ఉద్యోగుల్ని నియమించుకున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ నియమాక దాదాపు నాలుగు రెట్లు ఎక్కువగా ఉందని xpheno తెలిపింది. మూడవ త్రైమాసికంలో నికర పెరుగుదల 19శాతం ఎక్కువగా ఉంది. అట్రిషన్‌కు కారణం ప్రస్తుతం మార్కెట్లో డిజిటల్ టాలెంట్ కు డిమాండ్ ఎక్కువగా ఉందని, అందులో అనుభవజ్ఞులైన ఉద్యోగులు సంస్థలు మారడం వల్ల ఆయా సంస్థల్లో అట్రిషన్ రేటు పెరిగినట్లు xpheno కోఫౌండర్ కమల్ కారంత్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న 15-25% అట్రిషన్ రాబోయే కనీసం 2-3 త్రైమాసికాల వరకు కొనసాగవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. చదవండి: కేంద్రం సంచలన నిర్ణయం, దేశంలో ఉద్యోగులకు కొత్త వర్క్ మోడల్ -
ఫ్రెషర్లకు గుడ్‌న్యూస్ ! ఈ కార్పోరేట్ కంపెనీలో 45,000 ఉద్యోగాలు.. ఎప్పుడంటే?
న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ కంపెనీ, అమెరికా కేంద్రంగా పనిచేసే కాగ్నిజంట్ సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో మెరుగైన పనితీరు చూపించింది. సంస్థ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 56 శాతం పెరిగి 544 మిలియన్ డాలర్లు (రూ.4,080 కోట్లు)గా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో (2020 సెప్టెంబర్ త్రైమాసికం) నికర లాభం 348 మిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. కంపెనీ ఆదాయం 12 శాతం పెరిగి 4.7 బిలియన్ డాలర్లుగా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం 4.2 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. రూ.4.69–4.74 బిలియన్ డాలర్ల మధ్య ఆదాయం ఉండొచ్చన్న గత అంచనాలకు అనుగుణంగానే సంస్థ పనితీరు ఉంది. ఫ్రెషర్లకు గుడ్‌న్యూస్: అక్టోబర్–డిసెంబర్ కాలంలో భారత్‌లో కొత్తగా 45,000 మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు కాగ్నిజంట్ ప్రకటించింది. నిపుణులకు డిమాండ్– సరఫరా మధ్య అంతరం చాలా ఎక్కువగా ఉన్నట్టు పేర్కొంది. వార్షికంగా చూస్తే స్వచ్చంద అట్రిషన్ (ఉద్యోగి స్వయంగా సంస్థను వీడడం) రేటు 33 శాతానికి పెరిగినట్టు తెలిపింది. ఈ సంస్థ జనవరి–డిసెంబర్‌ను వార్షిక సంవత్సరంగా పరిగణిస్తుంటుంది. భారత్‌లో కాగ్నిజంట్‌కు 2 లక్షల మంది ఉద్యోగులున్నారు. సెప్టెంబర్ త్రైమాసికంలో డిజిటల్ విభాగం ఆదాయం 18 శాతం వృద్ధిని చూపించినట్టు సీఈవో హంఫైర్స్ తెలిపారు. క్యూ4లో 4.75 డాలర్ల స్థాయిలో.. నాలుగో త్రైమాసికంలో (2021 అక్టోబర్–డిసెంబర్) ఆదాయం 4.75–4.79 బిలియన్ డాలర్ల మేర ఉండొచ్చన్న అంచనాను కాగ్నిజంట్ ఫలితాల సందర్భంగా వ్యక్తం చేసింది. ఇది వార్షికంగా చూస్తే 13.5–14.5 శాతం వృద్ధికి సమానమని వివరించింది. 2021 పూర్తి సంవత్సరానికి ఆదాయం 11 శాతం మేర వృద్ధి చెంది 18.5 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని ప్రకటించింది. సంస్థ ఉద్యోగుల సంఖ్య 3,01,300 నుంచి 3,18,400కు పెరిగింది. -
హెచ్‌సీఎల్ ఉద్యోగులకు ఉచితంగా బెంజ్ కార్లు..!
పలు ఐటీ దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులకు ఉత్తమ ప్రతిభను కనబర్చినందుకుగాను ప్రోత్సాహాకాలను అందిస్తాయి. ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తన కంపెనీ ఉద్యోగుల కోసం బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. కంపెనీల్లో ప్రతిభ కనబర్చిన ఉద్యోగుల కోసం భారీ బహుమతులను అందిస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీలోని టాప్ పెర్పామర్లకు మెర్సిడెస్ బెంజ్ కార్లను ఇవ్వాలని హెచ్‌సీఎల్ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై బోర్డు ఆమోదం తెలపాల్సి ఉందని కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ అప్పారావు వీవీ పేర్కొన్నారు. అట్రిషన్ విధానాన్ని నివారించేందుకు పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులకు ప్రోత్సాహకాలను అందిస్తాయి. రీప్లేస్మెంట్ హైరింగ్ కాస్ట్ 15 నుంచి 20 శాతం ఎక్కువ ఉండడంతో తమ ఉద్యోగుల్లో నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని వీవీ అప్పారావు పేర్కొన్నారు. జావా డెవలపర్‌ను ప్రస్తుతం ఇచ్చే ప్యాకేజ్‌లో హైర్ చేసుకోవచ్చు, కానీ క్లౌడ్ ప్రోఫెషనల్స్‌ను సేమ్ ప్యాకేజ్‌లపై హైర్ చేసుకోలేమని తెలిపారు. హెచ్‌సీఎల్‌లో మంచి రిటెన్షన్ ప్యాకేజ్ ఉందని, ప్రతి సంవత్సరం ఉద్యోగుల జీతంలో 50 నుంచి 100 శాతం వరకు క్యాష్ ఇన్సెంటివ్ స్కీమ్‌ను అందిస్తున్నామని వెల్లడించారు. ఈ స్కీమ్‌తో సుమారు 10 శాతం మందికి కీలక నైపుణ్యాలు కల్గిన ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. అంతేకాకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను సుమారు 22 వేల మందిని కొత్తగా ఉద్యోగులను హైర్ చేసేందుకు కంపెనీ ప్రణాళికలు చేస్తోందని పేర్కొన్నారు ఇదిలా ఉండగా హెచ్‌సీఎల్ కంపెనీలో ఈ తైమాసికంలో ఉద్యోగుల అట్రిషన్ గత త్రైమాసికం కంటే 1.9 శాతం పెరిగి 11.8 శాతంగా నమోదైంది. -
విద్యార్థుల ఘర్షణపై పోలీసుల ఆరా
యాడికి: యాడికిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల మధ్య చెలరేగిన ఘర్షణలో ఒక విద్యార్థి గాయపడిన ఉదంతంపై ఏఎస్ఐ మల్లికార్జున తమ సిబ్బందితో కలసి మంగళవారం విచారణ చేశారు. వారు పాఠశాలకు చేరుకుని ప్రధానోపాధ్యాయుడు రాముడితో మాట్లాడారు. ఇటువంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఏదైనా సంఘటన జరిగితే వెంటనే -
హైస్కూల్లో విద్యార్థుల ఘర్షణ
యాడికి: యాడికిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ తలెత్తింది. పాఠశాలలో పదో తరగతి చదివే అనిల్ అనే వేములపాడుకు చెందిన విద్యార్థి, పిన్నేపల్లికి చెందిన రవి అనే విద్యార్థి ఘర్షణ పడ్డారని తోటి విద్యార్థులు తెలిపారు. ఘటనలో రవి అనే విద్యార్థి రాయితో దాడి చేయడంతో అనిల్ తీవ్రంగా గాయపడినట్లు వివరించారు. వెంటనే గాయపడ్డ అనిల్‌ను స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. మూడు కుట్లు పడ్డాయని చెప్పారు. విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. అయితే దీనిపై ఎస్ఐ కత్తి శ్రీనివాసులు స్పందిస్తూ... తమకు రాతమూలకంగా ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు. -
హైస్కూల్లో విద్యార్థుల ఘర్షణ
యాడికి: యాడికిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ తలెత్తింది. పాఠశాలలో పదో తరగతి చదివే అనిల్ అనే వేములపాడుకు చెందిన విద్యార్థి, పిన్నేపల్లికి చెందిన రవి అనే విద్యార్థి ఘర్షణ పడ్డారని తోటి విద్యార్థులు తెలిపారు. ఘటనలో రవి అనే విద్యార్థి రాయితో దాడి చేయడంతో అనిల్ తీవ్రంగా గాయపడినట్లు వివరించారు. వెంటనే గాయపడ్డ అనిల్‌ను స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. మూడు కుట్లు పడ్డాయని చెప్పారు. విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. అయితే దీనిపై ఎస్ఐ కత్తి శ్రీనివాసులు స్పందిస్తూ... తమకు రాతమూలకంగా ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు. -
ఇరు వర్గాల ఘర్షణ: 9 మందికి గాయాలు
తుని : తూర్పుగోదావరి జిల్లా తుని మండలం దొండవాకలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆస్తి విషయంలో జరిగిన గొడవలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తుని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఈ 'పార్టీ'ని అందరూ వదిలేస్తున్నారు
రాజకీయంగా ఇది పార్టీలు మారే సీజన్. కానీ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు బాగా పేరు మోసిన, మోస్ట్ స్టేబుల్ ఇన్ఫోసిస్ ను రాజకీయ పార్టీని వదిలేసినట్టు వదిలేస్తున్నారు. దేశంలోని టాప్ సాఫ్ట్ వేర్ కంపెనీకి ఇది క్రైసిస్ కాలం. గత ఏడాది కాలంలో ఇన్ఫీ నుంచి 36268 మంది బయటకు వెళ్లిపోయారు. అంతే 18.7 శాతం మంది సంస్థకు రాం రాం చెప్పారన్నమాట. ఈ విషయాన్ని ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ శిబులాల్ స్వయంగా అంగీకరించారు. తమాషా ఏమిటంటే ఆయన కూడా ఇన్ఫీకి గుడ్ బై చెప్పేందుకు తట్టా బుట్టా సర్దుకుంటున్నారు. సంస్థను వదిలిన వారిలో కేవలం 1.5 శాతం మందిని కంపెనీ తనంతట తానుగా తీసేసింది. మిగిలిన వారంతా తమకు తాముగా వదిలేసినవారే. బాలకృష్ణన్ వంటి సీనియర్ ఉద్యోగులు రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆయన దక్షిణ బెంగుళూరు నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున లోకసభకు పోటీ చేస్తున్నారు. దీంతో ఉద్యోగులు వదిలిపెట్టేసి పోకుండా ఉండేందుకు ఇన్ఫోసిస్ ప్రోత్సాహకాలు ప్రకటించింది. అయినా వలసలు ఆగడం లేదు.