
కరోనా కారణంగా పుట్టుకొచ్చిన కొత్త కొత్త టెక్నాలజీతో ఉద్యోగులు అవకాశాల్ని అందిపుచ్చుకుంటున్నారు. దీంతో ప్రపంచ దేశాలకు చెందిన ఇతర సంస్థలతో పాటు టెక్ కంపెనీల్లో సైతం అట్రిషన్ రేటు తీవ్రంగా వేధిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌కు చెందిన ఓ ఐటీ సంస్థ ఉద్యోగులకు కళ్లు చెదిరే ఆఫర్లు ప్రకటించింది. ఇంతకీ ఆ ఆఫర్లేంటని అనుకుంటున్నారా?
ప్రపంచ వ్యాప్తంగా అన్నీ సంస్థల్లో కంటే ఐటీ కంపెనీల్లో అట్రిషన్ రేటు రోజురోజుకీ పెరిగిపోతుంది. ఈ అట్రిషన్ రేటును తగ్గించేందుకు మదురైలోని సాఫ్ట్ వేర్ సంస్థ శ్రీ మూకాంబిక ఇన్ఫోసొల్యూషన్స్ (ఎస్‌ఎంఐ) అందులో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రతి ఆరు నెలలకోసారి ఫ్రీగా పెళ్లి సంబంధాలు చూడడమే కాదు,ఇంక్రిమెంట్లను అందిస్తుంది. కంపెనీ ఉద్యోగులందరికీ ప్రతి ఆరు నెలలకు 6 నుంచి 8 శాతం ఇంక్రిమెంట్లు, ఉద్యోగుల పర్ఫామెన్స్‌ను బట్టి టాప్ 40 లేదా టాప్ 80 ఉద్యోగులకు అదనపు బెన్ఫిట్స్ అందిస‍్తుంది.
100కోట్లకు చేరువలో
2006లో శివకాశిలో ఎస్‌ఎంఐ సంస్థను ప్రారంభించి..ఆ తర్వాత 2010 మధురైకి మార్చారు.ఎస్‌ఎంఐతో దాని అసోసియేట్ కంపెనీలో కలిపి మొత్తం 750 మంది పనిచేస్తున్నారు. వీరిలో 40 శాతం మంది 5ఏళ్లకు పైగా అక్కడే పనిచేస్తున్నారు. ప్రస్తుతం కంపెనీ వార్షిక ఆదాయం రూ.100 కోట్లకు చేరువలో ఉంది. కాగా,ఆ కంపెనీలో అట్రిషన్ రేటును తగ్గించేందుకు ఎస్‌ఎంఐ సంస్థ ప్రతినిధులు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
చదవండి👉యాపిల్ ఉద్యోగుల సంచలన నిర్ణయం, సీఈఓ టిమ్‌కుక్‌కు భారీ షాక్!
Comments
Please login to add a commentAdd a comment