ప్రైవేటు బ్యాంకుల్లో ఎక్కువగా ఉద్యోగ వలసలు.. ఆర్బీఐ డేగకన్ను! | RBI closely watching high attrition at some private banks | Sakshi
Sakshi News home page

ప్రైవేటు బ్యాంకుల్లో ఎక్కువగా ఉద్యోగ వలసలు.. ఆర్బీఐ డేగకన్ను!

Published Wed, Nov 1 2023 1:15 PM | Last Updated on Wed, Nov 1 2023 1:30 PM

RBI closely watching high attrition at some private banks - Sakshi

ముంబై: దేశంలోని కొన్ని ప్రైవేట్‌ రంగ బ్యాంకుల వద్ద అట్రిషన్‌ (ఉద్యోగ వలసలు) ఎక్కువగా కనిపిస్తోందని రిజర్వ్‌  బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంతదాస్‌ పేర్కొన్నారు. సెంట్రల్‌ బ్యాంక్‌ ఈ సమస్యను ‘నిశితంగా‘ గమనిస్తోందని తెలిపారు. 

బిజినెస్‌ స్టాండర్డ్‌ ఇక్కడ నిర్వహించిన వార్షిక బీఎఫ్‌ఎస్‌ఐ ఇన్‌సైట్‌ సదస్సులో దాస్‌ మాట్లాడుతూ, నియంత్రణ పర్యవేక్షణ విధానాల్లో భాగంగా ఆర్‌బీఐ ఈ సమస్యను పరిశీలిస్తోందని చెప్పారు. కొన్ని దిగ్గజ బ్యాంకుల్లో 30 శాతం కంటే ఎక్కువ అట్రిషన్‌ రేటు ఉందన్న వార్తల నేపథ్యంలో దాస్‌ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

 

ఈ తరహా సమస్యల పరిష్కారానికి ప్రతి బ్యాంకు కోర్‌ టీమ్‌ను రూపొందించాలని అన్నారు. ‘‘ఉద్యోగ మార్పిడిపై యువత దృక్పథం మారింది. ఈ అంశంపై భిన్నంగా ఆలోచిస్తున్నారు’’ అని ఈ సందర్భంగా అన్నారు. అంతర్జాతీయ అనిశ్చితిలోనూ భారత్‌ ఎకానమీ పటిష్ట బాటన పయనిస్తున్నట్లు వెల్లడించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement