సాక్షి, ముంబై: దేశీయ దిగ్గజ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) త్రైమాసిక ఫలితాల లాభాల్లో అంచనాలను మిస్ చేసింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం నాలుగు శాతం వృద్ధితో రూ.10,846 కోట్లకు పరిమితమైంది. లాభాలుపెరిగినప్పటికీ రూ.11,200 కోట్ల మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయింది.
అయితే ఆదాయం విషయంలో మాత్రం దూసుకుపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కన్సాలిడేటెడ్ ఆదాయం 5.3 శాతం పెరిగి రూ.58,229 కోట్లకు చేరింది. జనవరి 9న క్యూ3ఎఫ్‌వై23 ఫలితాలను ప్రకటించిన కంపెనీ, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి కొనసాగుతున్నా, లాంగ్‌టర్మ్ గ్రోత్ ఔట్‌లుక్‌లో ధృడమైన వృద్ధి సాధిస్తామని ప్రకటించింది. అలాగే స్పెషల్ డివిడెండ్ రూ.67తోపాటు, 8 రూపాయల మధ్యంతర డివిడెండ్‌ను టీసీఎస్ సీఎండీ రాజేశ్ గోపినాథన్ ప్రకటించారు.
10 త్రైమాసికాల్లో ఇదే తొలిసారి
మరోవైపు క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన సంస్థ హెడ్‌కౌంట్ భారీగా క్షీణించింది. 2,197 మంది ఉద్యోగులను తగ్గించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో టీసీఎస్ 28,238 మంది ఉద్యోగులను చేర్చుకుంది. ప్రస్తుతం తమ ఉద్యోగుల సంఖ్య 6,16,171 నుంచి 613,974 మందికి తగ్గిందని పేర్కొంది. 10 త్రైమాసికాల్లో ఈ స్థాయిల్లో తగ్గడం ఇదే తొలిసారి.
ఐటీ పరిశ్రమలో ఆందోళన కలిగించే ఎలివేటెడ్ అట్రిషన్ స్వల్పంగా క్షీణించింది. అట్రిషన్ 21.3 శాతంగా ఉంది, వార్షిక ప్రాతిపదికన గత ఏడాది 21.5 శాతం నుండి స్వల్పంగా క్షీణించింది. రానున్న త్రైమాసికాల్లో ఇది మరింత తగ్గుతుందని చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ వెల్లడించారు. అయితే డిమాండ్ క్షీణించినట్టు కాదనీ, భారీ డిమాండ్‌తో ప్రస్తుతం చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నామన్నారు. కస్టమర్ సంతృప్తే ప్రధాన లక్క్ష్యంగా గత కొన్ని త్రైమాసికాలుగా ఫ్రెష్ టాలెంట్, నైపుణ్య శిక్షణమీద ఎక్కువ దృష్టి పెట్టామని లక్కాడ్ ఒక ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment