resutls
-
టీసీఎస్ ఆదాయం అదుర్స్..కానీ ఉద్యోగుల్లో..!
సాక్షి, ముంబై: దేశీయ దిగ్గజ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) త్రైమాసిక ఫలితాల లాభాల్లో అంచనాలను మిస్ చేసింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం నాలుగు శాతం వృద్ధితో రూ.10,846 కోట్లకు పరిమితమైంది. లాభాలుపెరిగినప్పటికీ రూ.11,200 కోట్ల మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయింది. అయితే ఆదాయం విషయంలో మాత్రం దూసుకుపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కన్సాలిడేటెడ్ ఆదాయం 5.3 శాతం పెరిగి రూ.58,229 కోట్లకు చేరింది. జనవరి 9న క్యూ3ఎఫ్వై23 ఫలితాలను ప్రకటించిన కంపెనీ, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి కొనసాగుతున్నా, లాంగ్‌టర్మ్ గ్రోత్ ఔట్‌లుక్‌లో ధృడమైన వృద్ధి సాధిస్తామని ప్రకటించింది. అలాగే స్పెషల్ డివిడెండ్ రూ.67తోపాటు, 8 రూపాయల మధ్యంతర డివిడెండ్‌ను టీసీఎస్ సీఎండీ రాజేశ్ గోపినాథన్ ప్రకటించారు. 10 త్రైమాసికాల్లో ఇదే తొలిసారి మరోవైపు క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన సంస్థ హెడ్‌కౌంట్ భారీగా క్షీణించింది. 2,197 మంది ఉద్యోగులను తగ్గించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో టీసీఎస్ 28,238 మంది ఉద్యోగులను చేర్చుకుంది. ప్రస్తుతం తమ ఉద్యోగుల సంఖ్య 6,16,171 నుంచి 613,974 మందికి తగ్గిందని పేర్కొంది. 10 త్రైమాసికాల్లో ఈ స్థాయిల్లో తగ్గడం ఇదే తొలిసారి. ఐటీ పరిశ్రమలో ఆందోళన కలిగించే ఎలివేటెడ్ అట్రిషన్ స్వల్పంగా క్షీణించింది. అట్రిషన్ 21.3 శాతంగా ఉంది, వార్షిక ప్రాతిపదికన గత ఏడాది 21.5 శాతం నుండి స్వల్పంగా క్షీణించింది. రానున్న త్రైమాసికాల్లో ఇది మరింత తగ్గుతుందని చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ వెల్లడించారు. అయితే డిమాండ్ క్షీణించినట్టు కాదనీ, భారీ డిమాండ్‌తో ప్రస్తుతం చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నామన్నారు. కస్టమర్ సంతృప్తే ప్రధాన లక్క్ష్యంగా గత కొన్ని త్రైమాసికాలుగా ఫ్రెష్ టాలెంట్, నైపుణ్య శిక్షణమీద ఎక్కువ దృష్టి పెట్టామని లక్కాడ్ ఒక ప్రకటనలో తెలిపారు. -
ప్రజలు సంక్షేమానికే పట్టం కట్టారు : పెద్దిరెడ్డి
-
రేపే పరిషత్ ఫలితాలు : మాక్ కౌంటింగ్ నిర్వహిస్తున్న అధికారులు
-
భారీగా నష్టపోయిన సన్‌ఫార్మా
ముంబై: దేశీయ పార్మా దిగ్గజం ఫలితాల్లో భారీగా కుదేలైంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో సన్‌ఫార్మా మార్కెట్ అంచనాలను మించి భారీ నష్టాలను మూటగట్టుకుంది. క్యూ1 లో రూ. 425కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. జూన్ 30 తో ముగిసిన త్రైమాసికానికి రూ .424.92 కోట్లు నష్టపోయినట్లు సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ బీఎస్ఈ ఫైలింగ్ లో తెలిపింది. దాదాపు వెయ్యి కోట్ల లాభాలను ఆర్జించనుందని ఎనలిస్టులు అంచనావేశారు. ఆదాయం 25శాతం క్షీణించింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో రూ. 8,256 కోట్లతో పోలిస్తే ఈ త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ .6,208.79 కోట్లుగా నిలిచింది. ఎబిటామార్జిన్లు 17. 6 శాతంగా నిలిచాయి. మరోవైపు వన్ టైం లాస్‌గా రూ. 950.5 కోట్లను నష్టపోయినట్టు సన్ ఫార్మా ప్రకటించింది. జులై 2017 నెలలో మోడఫినిల్కు సంబంధించి యాంటీట్రస్ట్ వ్యాజ్యానికి సంబంధించి మొత్తం 147 మిలియన్ డాలర్లు చెల్లించాలని కంపెనీ అంగీకరించిందని తెలిపింది. ఈ ఫలితాల నేపథ్యంలో సన్‌పార్మా కౌంటర్ 3శాతం నష్టపోయింది. -
ఇన్ఫీ ఫలితాలతో కుదేలైన మార్కెట్లు
ముంబై: శుక్రవారం నాటి దేశీయ మార్కెట్లు నష్టాలతో ముగిసాయి. సెన్సెక్స్ 106పాయింట్ల నష్టంతో 27,836 దగ్గర , నిఫ్టీ 24 పాయింట్ల నష్టంతో 8,541 దగ్గర క్లోజయ్యాయి. దీంతో ఈ వారంలో వరుస లాభాలకు బ్రేక్ పడింది. ఈ ఆర్థిక సంవత్సరానికి ఇన్ఫోసిస్ శుక్రవారం విడుదల చేసిన మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మార్కెట్ ను నష్టాల్లోకి నెట్టాయి. మరోవైపు వారాంతం కావడంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారని ఎనలిస్టుల అంచనా. ప్రధానంగా ఐటీ రంగం నష్టాలు మార్కెట్ ను ప్రభావితం చేశాయి. మెటల్ , టెలికాం రంగంలో కొనుగోళ్లపై ఆసక్తి నెలకొంది. వెల్ స్పన్ ఇండియా, టాటా స్టీల్ టాప్ గెయినర్స్ గా నిలవగా, ఇన్ఫోసిస్ టాప్ లూజర్ గా నిలిచింది. ఐడియా, భారతి ఎయిర్ టెల్ లాభాలను ఆర్జించాయి. అంచనాలకు మించని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాలు మార్కెట్ ను నిరాశ పర్చాయి. దీంతో ఇన్ఫోసిస్ షేర్లు కుప్పకూలాయి. ఒకదశలో దాదాపు10 శాతం నష్టాలను మూటగట్టుకుంది. దీంతో ఏడునెలల కనిష్టానికి షేరు ధర చేరింది. 2013 తర్వాత ఇంత భారీ పతనం ఇదేనని లెక్కలు చెబుతున్నాయి. దీంతోపాటు మరో ఐటి కంపెనీ టీసీఎస్ ఫలితాలు కూడా మదుపర్లను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో టీసీఎస్ షేర్ కూడా భారీగా నష్టపోయింది.