మంచి తరుణం మించిన దొరకదు..ఆలోచించిన ఆశాభంగం...రండి బాబు రండి..మా ఆఫీస్ లో జాయిన్ అవ్వండి. మీ టాలెంట్‌కు తగ్గట్లు ప్యాకేజీ ఇస్తాం. కాదూ కూడదూ అంటే అంతకు మించి ఇస్తాం' అంటూ దిగ్గజ సంస్థలు పిలిచి మరి ఉద్యోగాలిస్తున్నాయి.
►కోవిడ్ కారణంగా ఆయా టెక్ దిగ్గజాల్లో అట్రిషన్ రేటు (ఒక సంస్థలో పనిచేసే ఉద్యోగికి అంతే కంటే ఎక్కువ ప్యాకేజీ ఇస్తూ మరో సంస్థ ఆహ్వానించడం) విపరీతంగా కొనసాగుతుంది. గతేడాది డిసెంబర్ నెల క్యూ4 ముగిసే సమయానికి టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో' కంపెనీల్లో అట్రిషన్ రేటు గడిచిన 3ఏళ్ల కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఒక్క డిసెంబర్ నెలలో ఈ మూడు కంపెనీలు మొత్తం 51వేల మందిని నియమించుకున్నాయి.
►మిగిలిన టెక్ కంపెనీలతో పోలిస్తే ఇన్ఫోసిస్‌లో అట్రిషన్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇటీవల ముగిసిన త్రైమాసిక ఫలితాల్లో ఒక్క ఇన్ఫోసిస్‌లో అట్రిషన్ రేటు 25.5శాతం ఎక్కువగా ఉన్నట్లు కొన్ని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. విప్రోలో అట్రిషన్ రేటు 22.7శాతం, టీసీఎస్‌లో అతితక్కువగా 15.3శాతం ఉన్నట్లు రిపోర్ట్‌లులో పేర్కొన్నాయి. కోవిడ్‌తో పాటు ఇతర పరిస్థితులు కారణంగా ఉద్యోగస్తులు శాలరీ, డిజిగ్నేషన్, ఫ్యామిలీ సెక్యూరిటీ కారణంగా ఉద్యోగంలో అభివృద్ది కోరుకుంటున్నారని, కాబట్టే సంస్థల్లో అట్రిషన్ రేటు పెరిగిపోతున్నట్లు తేలింది.
►టీసీఎస్ ఈ ఆర్థిక సంవత్సరం (2021 ఏప్రిల్ 1 నుంచి 2022 మార్చి 31) డిసెంబర్ నెల వరకు..ఈ మధ్య కాలంలో మొత్తం 43 వేల మంది ఫ్రెషర్లను నియమించుకుంది. క్యూ2 కంటే క్యూ3లో ఎక్కువగా 34వేల మందిని ఫ్రెషర్లను నియమించుకోగా..మిగిలిన క్వార్టర్లకంటే క్యూ4లో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగుల్ని ఎంపిక చేసింది. దీంతో ఆ సంస్థలో ఉద్యోగుల మొత్తం సంఖ్య 556,986కి చేరింది. కాగా ఉద్యోగుల నియమక xpheno ప్రకారం..టీసీఎస్ చివరి క్యూ4లో మొత్తం 28వేల మంది ఉద్యోగుల్ని నియమించుకున్నట్లు తెలుస్తోంది.
►ఈ త్రైమాసికంలో విప్రో 10,306 మంది ఉద్యోగులను నియమించుంది. దీంతో ఆ సంస్థ మొత్తం ఉద్యోగుల సంఖ్య 231,671కి చేరుకుంది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఉద్యోగుల సంఖ్య 41,363 పెరిగింది.
►ఇన్ఫోసిస్ త్రైమాసికంలో 15,125 మందిని చేర్చుకుంది. ఆ సంస్థ మొత్తం ఉద్యోగుల సంఖ్య 292,067కి చేరుకుంది.
►ఈ మూడు టెక్ దిగ్గజ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 134,000 మంది ఉద్యోగుల్ని నియమించుకున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ నియమాక దాదాపు నాలుగు రెట్లు ఎక్కువగా ఉందని xpheno తెలిపింది. మూడవ త్రైమాసికంలో నికర పెరుగుదల 19శాతం ఎక్కువగా ఉంది.
అట్రిషన్‌కు కారణం
ప్రస్తుతం మార్కెట్‌లో డిజిటల్ టాలెంట్ కు డిమాండ్ ఎక్కువగా ఉందని, అందులో అనుభవజ్ఞులైన ఉద్యోగులు సంస్థలు మారడం వల్ల ఆయా సంస్థల్లో అట్రిషన్ రేటు పెరిగినట్లు xpheno కోఫౌండర్ కమల్ కారంత్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న 15-25% అట్రిషన్ రాబోయే కనీసం 2-3 త్రైమాసికాల వరకు కొనసాగవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
చదవండి: కేంద్రం సంచలన నిర్ణయం, దేశంలో ఉద్యోగులకు కొత్త వర్క్ మోడల్
Comments
Please login to add a commentAdd a comment