Wipro employees
-
పెరిగిపోతున్న కోవిడ్ కేసులు, ఐటీ ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?!
దేశంలో పెరిగిపోతున్న కోవిడ్-19 కేసులతో దిగ్గజ ఐటీ సంస్థలు అప్రమత్తమయ్యాయి. కేసులు పెరిగితే పరిస్థితి చేయిదాటి పోతుందనే ఉద్దేశ్యంతో ముందస్తు చర్యలకు ఉపక్రమించాయి. ఉద్యోగులకు జాగ్రత్తలు చెబుతున్నాయి. కేసుల నమోదు తీవ్రతరమైతే మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పిస్తే బాగుంటుందని ఉద్యోగులు అభిప్రాయ పడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హైబ్రిడ్ వర్క్ చేస్తున్న ఉద్యోగుల్ని విప్రో అప్రమత్తం చేసింది. దేశంలో కోవిడ్-19 కేసులు పెరిగిపోతున్న దృష్ట్యా సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా, ఓ వైపు సంస్థ వృద్ది కోసం పాటుపడుతూనే ఉద్యోగులు శ్రేయస్సుకే ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది. ‘‘నవంబర్ నుండి పూర్తిగా టీకాలు వేసుకున్న ఉద్యోగులు వారానికి మూడు రోజులు తిరిగి కార్యాలయాలకు వస్తున్నారు. మేం ఇచ్చిన ఆదేశాలకు ఖచ్చితంగా కట్టుబడి ఉంటాం. ఉద్యోగులకు జాగ్రత్త కోసం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాం.”అని విప్రో ఈ సందర్భంగా వెల్లడించింది. వారానికి మూడు రోజులు ఆఫీస్‌లోనే ప్రముఖ టెక్ దిగ్గజం విప్రో కరోనా కారణంగా ఆ సంస్థ ఉద్యోగులు ఇంటి వద్ద నుంచి పనిచేయాలని ఆదేశించింది. అయితే, గత నెల నవంబర్ 15 నుంచి సిబ్బందికి హైబ్రిడ్ వర్క్‌ను అందుబాటులోకి తెచ్చింది. నిర్ధేశించిన సమయం నుంచి ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీస్‌కు రావాల్సిందేనని పట్టుబట్టింది. వారికి కేటాయించిన ప్రాంతాల్లో పని చేయాల్సిందేనని ఆదేశించింది. ప్రస్తుతం ఈ హైబ్రిడ్ విధానంలో విప్రో ఉద్యోగులు వారానికి 3 రోజులు ఆఫీస్‌కు వస్తే..మరో రెండు రోజులు ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్నారు. మళ్లీ ఇప్పుడు కోవిడ్-19 కేసులతో తిరిగి ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. విస్తరిస్తోన్న కరోనా కనుమరుగైందనుకున్న మహమ్మారి మళ్లీ విస్తరిస్తోంది. కోవిడ్-19 వైరస్ రెండేళ్లపాటు బతుకుపై భయం పుట్టించింది. దేశీయంగా టీకాలు అందుబాటులోకి రావడంతో వైరస్ పీడ విరగడైందని భావించినా కొన్నాళ్లకు రూపు మార్చుకుంది. కోవిడ్-19, డెల్టా వేరియంట్, ఒమిక్రాన్.. ప్రస్తుతం జేఎన్1 వైరస్‌గా మన ముందుకొస్తోంది. డిసెంబర్ 26, మంగళవారం నాటికి దేశంలో 4,100 దాటాయి. గడిచిన 24 గంటల్లో 412 మందికి వ్యాపించింది. -
హైదరాబాద్, బెంగళూరులో ఆస్తులు అమ్మేయనున్న విప్రో..?
టాప్ టెక్ కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతున్న విప్రో.. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితుల నేపథ్యంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. సాధారణంగా కాస్ట్‌కటింగ్ పేరిట టెక్ సంస్థలు ఉద్యోగాల్లో కోత విధిస్తూ ఖర్చు తగ్గించుకుంటున్న సంగతి తెలిసిందే. దాంతోపాటు విప్రో ఆస్తులను సైతం విక్రయించాలని యోచిస్తోంది. కొన్ని మీడియా కథనాల ప్రకారం.. హైదరాబాద్, బెంగళూరులోని తన ఆస్తులను విక్రయించాలని విప్రో నిర్ణయించింది. ఈ క్రమంలో కంపెనీ కలిగి ఉన్న నాన్ కోర్ రియల్ ఎస్టేట్ ఆస్తులను విక్రయించి సొమ్ము చేసుకోవాలని చూస్తోంది. కంపెనీ విక్రయించాలనుకుంటున్న ప్రాపర్టీల్లో హైదరాబాద్ గచ్చిబౌలిలోని క్యాంపస్, బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలోని క్యాంపస్‌లు ఉన్నట్లు వెల్లడైంది. గచ్చిబౌలి విప్రో క్యాంపస్ దాదాపు 14 ఎకరాలమేర విస్తరించి ఉంది. ఇక బెంగళూరులో 25 ఎకరాల భూమిని కలిగి ఉంది. అయితే కంపెనీ ఆ భూమిని పూర్తిగా లేదా కొంతమేరకే విక్రయిస్తుందా తెలియాల్సి ఉంది. బెంగళూరు క్యాంపస్‌ను దశల వారీగా అమ్మనున్నట్లు సమాచారం. మొదటి దశలో ఐదు ఎకరాలు విక్రయిస్తుందని తెలిసింది. టెక్ కంపెనీలు మారుతున్న వర్క్‌కల్చర్‌కు అనుగుణంగా హైబ్రిడ్‌వర్క్ మోడల్‌ను అనుసరిస్తున్నాయి. వివిధ నగరాల్లోని కార్యకలాపాలను ఏకీకృతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే విప్రో ఈ చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. అయితే కంపెనీ మాత్రం ఈ వార్తలపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇదీ చదవండి: సినిమా కోసం రూ.91 కోట్లు ఇస్తే రూ.50 కోట్లు పోగొట్టిన దర్శకుడు హైదరాబాదులో విప్రోకు మొత్తం మూడు ప్రాపర్టీలు ఉన్నాయి. వీటిలో రెండు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉండగా.. ఒకటి మణికొండలో ఉంది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 20 ఏళ్ల క్రితం కంపెనీకి భూమి కేటాయించింది. సెప్టెంబర్ త్రైమాసికం వరకు విప్రోలో 2,44,707 మంది ఉద్యోగులు ఉన్నారు. -
‘విప్రో ఉద్యోగులకు బంపరాఫర్’
ఉద్యోగులకు ప్రముఖ టెక్ దిగ్గజం విప్రో శుభవార్త చెప్పింది. మూన్‌లైటింగ్ పాల్పడిన ఉద్యోగుల పట్ల ఎంత కఠినంగా వ్యవహరించిందో విధులు నిర్వహించే సిబ్బందికి చెల్లించే ప్రోత్సాహకాల విషయంలో అంతే ఉదారంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. విప్రోలో పనిచేస్తున్న బ్యాండ్స్ A TO B3 కేటగిరిలోని 85 శాతం మంది ఉద్యోగులకు 100 శాతం ప్రోత్సాహకాల్ని ఉద్యోగులకు ఇంటర్నల్ మెయిల్స్ పంపింది. ఏప్రిల్ -జూన్ (క్యూ2)వరకు ఉద్యోగులకు అందించే ఈ బెన్ఫిట్స్ నవంబర్ పేరోల్ లో జత చేస్తామని పేర్కొంది. ఫ్రెషర్స్ నుంచి టీమ్ లీడర్ స్థాయి ఉద్యోగులకు వేరియబుల్ పేకు అర్హులని తెలిపింది. మిగిలిన ఉద్యోగులకు మాత్రం సంస్థ నిర్ధేశించిన టార్గెట్స్ కంప్లీట్ పూర్తి చేసిన విధంగా చెల్లింపులు ఉంటాయని విప్రో తన ఉద్యోగులకు పంపిన అంతర్గత మెయిల్స్‌లో వెల్లడించింది. కంపెనీ పాలసీ ప్రకారం..ఉద్యోగి పనితీరుపై వేరియబుల్ పే 93.5% వస్తుంది. అయినప్పటికీ, మన కార్యకలాపాల్ని మెరుగుపరచడానికి, మనం సాధించిన పురోగతిని ప్రతిబింబించేందుకు ఇదొక మంచి సమయం . అందుకే..ఉద్యోగులకు 1.07శాతం అదనంగా వేరియబుల్ పే ఇవ్వాలని నిర్ణయించుకున్నాం’ అని విప్రో ఆ మెయిల్స్‌లో హైలెట్ చేసింది. వేరియబుల్ పే చెల్లింపు ఎప్పుడంటే విప్రో తన ఉద్యోగులు నవంబర్ పేరోల్‌లో వేరియబుల్ పేను జతచేస్తామని తెలిపింది. వేరియబుల్ పే ప్రకటించడంతో పాటు అట్రిషన్ రేటును తగ్గించే ప్రయత్నం చేసింది. విప్రో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 16వేల మంది ఉద్యోగుల్ని ఇంటర్నల్‌గా ప్రమోట్ చేసింది. వేరియబుల్ పే అంటే ఓ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు చెల్లించే నెలవారీ జీతాలతో సంబంధం లేకుండా ఈ వేరియబుల్ పేని అందిస్తుంటాయి. లాభాల్ని గడించేలా ఉద్యోగుల్ని ప్రోత్సహించేందుకు వారికి సంస్థలు అందించే తాయిలాల్ని వేరియబుల్ పే అని అంటారు. ఉదాహరణకు సంస్థ విధించిన పని గంటల కంటే ఉద్యోగి ఎక్కువ సేపు పనిచేయడం, ప్రొడక్ట్ సేల్స్‌ను బట్టి కమిషన్, పర్ఫార్మెన్స్ ఆధారంగా బోనస్‌లు అందిస్తుంటాయి ఆయా కంపెనీలు. చదవండి👉 పాక్ అభిమాని గూబ గుయ్‌మనేలా..సుందర్ పిచాయ్ రిప్లయ్ అదిరింది -
'రండి బాబు రండి', పిలిచి మరి ఉద్యోగం ఇస్తున్న దిగ్గజ సాఫ్ట్వేర్ కంపెనీలు!
మంచి తరుణం మించిన దొరకదు..ఆలోచించిన ఆశాభంగం...రండి బాబు రండి..మా ఆఫీస్ లో జాయిన్ అవ్వండి. మీ టాలెంట్‌కు తగ్గట్లు ప్యాకేజీ ఇస్తాం. కాదూ కూడదూ అంటే అంతకు మించి ఇస్తాం' అంటూ దిగ్గజ సంస్థలు పిలిచి మరి ఉద్యోగాలిస్తున్నాయి. ►కోవిడ్ కారణంగా ఆయా టెక్ దిగ్గజాల్లో అట్రిషన్ రేటు (ఒక సంస్థలో పనిచేసే ఉద్యోగికి అంతే కంటే ఎక్కువ ప్యాకేజీ ఇస్తూ మరో సంస్థ ఆహ్వానించడం) విపరీతంగా కొనసాగుతుంది. గతేడాది డిసెంబర్ నెల క్యూ4 ముగిసే సమయానికి టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో' కంపెనీల్లో అట్రిషన్ రేటు గడిచిన 3ఏళ్ల కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఒక్క డిసెంబర్ నెలలో ఈ మూడు కంపెనీలు మొత్తం 51వేల మందిని నియమించుకున్నాయి. ►మిగిలిన టెక్ కంపెనీలతో పోలిస్తే ఇన్ఫోసిస్‌లో అట్రిషన్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇటీవల ముగిసిన త్రైమాసిక ఫలితాల్లో ఒక్క ఇన్ఫోసిస్‌లో అట్రిషన్ రేటు 25.5శాతం ఎక్కువగా ఉన్నట్లు కొన్ని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. విప్రోలో అట్రిషన్ రేటు 22.7శాతం, టీసీఎస్‌లో అతితక్కువగా 15.3శాతం ఉన్నట్లు రిపోర్ట్‌లులో పేర్కొన్నాయి. కోవిడ్‌తో పాటు ఇతర పరిస్థితులు కారణంగా ఉద్యోగస్తులు శాలరీ, డిజిగ్నేషన్, ఫ్యామిలీ సెక్యూరిటీ కారణంగా ఉద్యోగంలో అభివృద్ది కోరుకుంటున్నారని, కాబట్టే సంస్థల్లో అట్రిషన్ రేటు పెరిగిపోతున్నట్లు తేలింది. ►టీసీఎస్ ఈ ఆర్థిక సంవత్సరం (2021 ఏప్రిల్ 1 నుంచి 2022 మార్చి 31) డిసెంబర్ నెల వరకు..ఈ మధ్య కాలంలో మొత్తం 43 వేల మంది ఫ్రెషర్లను నియమించుకుంది. క్యూ2 కంటే క్యూ3లో ఎక్కువగా 34వేల మందిని ఫ్రెషర్లను నియమించుకోగా..మిగిలిన క్వార్టర్లకంటే క్యూ4లో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగుల్ని ఎంపిక చేసింది. దీంతో ఆ సంస్థలో ఉద్యోగుల మొత్తం సంఖ్య 556,986కి చేరింది. కాగా ఉద్యోగుల నియమక xpheno ప్రకారం..టీసీఎస్ చివరి క్యూ4లో మొత్తం 28వేల మంది ఉద్యోగుల్ని నియమించుకున్నట్లు తెలుస్తోంది. ►ఈ త్రైమాసికంలో విప్రో 10,306 మంది ఉద్యోగులను నియమించుంది. దీంతో ఆ సంస్థ మొత్తం ఉద్యోగుల సంఖ్య 231,671కి చేరుకుంది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఉద్యోగుల సంఖ్య 41,363 పెరిగింది. ►ఇన్ఫోసిస్ త్రైమాసికంలో 15,125 మందిని చేర్చుకుంది. ఆ సంస్థ మొత్తం ఉద్యోగుల సంఖ్య 292,067కి చేరుకుంది. ►ఈ మూడు టెక్ దిగ్గజ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 134,000 మంది ఉద్యోగుల్ని నియమించుకున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ నియమాక దాదాపు నాలుగు రెట్లు ఎక్కువగా ఉందని xpheno తెలిపింది. మూడవ త్రైమాసికంలో నికర పెరుగుదల 19శాతం ఎక్కువగా ఉంది. అట్రిషన్‌కు కారణం ప్రస్తుతం మార్కెట్లో డిజిటల్ టాలెంట్ కు డిమాండ్ ఎక్కువగా ఉందని, అందులో అనుభవజ్ఞులైన ఉద్యోగులు సంస్థలు మారడం వల్ల ఆయా సంస్థల్లో అట్రిషన్ రేటు పెరిగినట్లు xpheno కోఫౌండర్ కమల్ కారంత్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న 15-25% అట్రిషన్ రాబోయే కనీసం 2-3 త్రైమాసికాల వరకు కొనసాగవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. చదవండి: కేంద్రం సంచలన నిర్ణయం, దేశంలో ఉద్యోగులకు కొత్త వర్క్ మోడల్ -
ప్రైవేట్ జాబ్స్, ఒక్క పోస్ట్ కోసం ఐదుగురు పోటీ పడుతున్నారు
వచ్చే ఏడాది ప్రారంభం నుంచి లక్షల ఉద్యోగాలకు నియామకాలు చేపట్టేందుకు ఆయా దిగ్గజ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. దీంతో ఈ నియామకాల్లో జాబ్ కొట్టేందుకు అభ్యర్ధులు ప్రయత్నిస్తున్నారు. ఇలా ఒక్క జాబ్‌కే 5 మంది పోటీ పడుతున్నట్లు టెక్ గిగ్ సంస్థ నిర్వహించిన ఆన్లైన్ సర్వేలో తేలింది. వచ్చే ఏడాది దిగ్గజ ఐటీ కంపెనీల్లో కొలువుల జాతర ప్రారంభం కానుంది. అందుకోసం ఆయా కంపెనీలు ఇప్పటి నుంచి ఉద్యోగుల ఎంపికపై కసరత్తు చేస్తున్నట్లు మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ అన్ఎర్త్ ఇన్సైట్ తెలిపింది. అంతేకాదు కోవిడ్ తగ్గి వచ్చే ఏడాది మార్చి నాటికి ఐటీ కంపెనీలు సుమారు 4.5 లక్షల నియామకాలు చేపట్టే అవకాశం ఉందని విడుదల చేసిన ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. అయినా సరే ఒక్క జాబ్ కోసం ఐదుగురు పోటీపడడం ఆసక్తికరంగా మారింది. టెక్ గిగ్ సంస్థ అభ్యర్ధులు ఏఏ కంపెనీల్లో జాబ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు? ఒక్క జాబ్ కోసం ఎంతమంది పోటీ పడుతున్నారనే అంశంపై సర్వే నిర్వహించింది.ఈ సర్వేలో పాల్గొన్న 43శాతం మంది టీసీఎస్‌లో జాబ్ సంపాదించాలనే లక్ష్యంతో ఉండగా, ఇన్ఫోసిస్ 24%, విప్రో, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా 4% కంటే ఎక్కువ మంది అభ్యర్ధులు జాబ్ దక్కించుకునేందుకు పోటీ పుడుతునట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. 21% మంది ఇతర కంపెనీల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నట్లు తేలింది. ఎక్స్ పర్ట్స్ ఏం చెబుతున్నారు ప్రస్తుతం మార్కెట్లో జాబ్స్ డిమాండ్ ఎక్కువగా ఉందని, అదే సమయంలో అభ్యర్ధులు కూడా ఐటీ ఉద్యోగం దక్కించుకునేందుకు పోటీపడుతున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దేశీయ టెక్ కంపెనీలైన టీసీఎస్,ఇన్ఫోసిస్,విప్రో కంపెనీల్లో ఒక్క జాబ్ కోసం 5మంది పోటీపడుతున్నారని, వారిని షార్ట్ లిస్ట్ చేయడం కత్తిమీద సాములాగా మారిందని అంటున్నారు. ఐటీ రంగంలో టాలెంట్ వార్ డిమాండ్‌కు అనుగుణంగా ఐటీ రంగంలో టాలెంట్ వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఐటీ కంపెనీల్లో అట్రిషన్ రేటు స్థిరంగా పెరుగుతుండగా.. సంస్థలు మాత్రం నైపుణ్యమైన అభ్యర్ధుల్ని ఎంపిక చేసేందుకు మొగ్గు చూపుతున్నాయి. దీంతో ఐటీ రంగంలో టాలెంట్ వార్ నడుస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. చదవండి: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..! ఐటీ కంపెనీల్లో కొలువుల జాతర..! -
డెలాపోర్ట్ లీడర్షిప్- విప్రో గెలాప్
బెంగళూరు, సాక్షి: కంపెనీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన డెలాపోర్ట్ ఐదు నెలల్లోనే సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం విప్రోను 100 మీటర్ల విభాగం (స్ప్రింట్)లో చేర్చారు. వెరసి ఐటీ బ్లూచిప్ కంపెనీ విప్రో అత్యంత వేగంగా పరుగు తీస్తోంది. నిజానికి డెలాపోర్ట్‌కు లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ అంటే మక్కువకావడం ప్రస్తావించదగ్గ అంశం! ఫ్రాన్స్‌కు చెందిన ఐటీ దిగ్గజం క్యాప్‌జెమినీ ఎస్ఈ నుంచి విప్రోకు సీఈవోగా బాధ్యతలు చేపట్టిన 53ఏళ్ల థియరీ డెలాపోర్ట్ కేవలం ఐదు నెలల్లోనే కంపెనీని టర్న్అరౌండ్ బాటపట్టించినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ కాలంలో విప్రో షేరు సైతం ఏకంగా 70 శాతం ర్యాలీ చేయడం విశేషం! వెరసి దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన ఇతర నాలుగు ఐటీ దిగ్గజాల షేర్లకంటే అత్యధికంగా లాభపడింది! ఇతర వివరాలు చూద్దాం.. నాయకులను తగ్గిస్తూ కోవిడ్-19 నేపథ్యంలో విప్రో సీఈవోగా డెలాపోర్ట్ ప్యారిస్నుంచే కార్యకలాపాలను చక్కబెడుతున్నారు. వర్చువల్ సమావేశాల ద్వారా కస్టమర్లతోపాటు మేనేజర్లు, సిబ్బందితో చర్చలు నిర్వహిస్తూ వస్తున్నారు. విప్రోలో లీడర్షిప్ పొజిషన్ల సంఖ్యను 25 నుంచి 4కు తగ్గించారు. ఇతర కంపెనీల కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. క్లయింట్లతో 130కుపైగా సమావేశాల ద్వారా యూరోప్, యూఎస్ నుంచి మల్టీఇయర్ కాంట్రాక్టులను సాధించారు. కాగా.. ఐటీ పరిశ్రమలో ప్రస్తుతం కీలక పరిస్థితులు నెలకొన్నాయని ఒక ఇంటర్వ్యూలో డెలాపోర్ట్ ఇటీవల పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విప్రోకు పట్టున్న విభాగాలలో వేగంగా వృద్ధి సాధించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇదీ తీరు అజీం ప్రేమ్‌జీ ఐటీ దిగ్గజం విప్రో.. కొన్నేళ్లుగా సాఫ్ట్వేర్ సేవల రంగంలో ఇతర దేశీ బ్లూచిప్ కంపెనీలతో వెనుకబడుతూ వచ్చిన సంగతి తెలిసిందే. గతేడాది(2019-20)లో స్థిరకరెన్సీ ప్రాతిపదికన ఆదాయం 3.9 శాతమే వృద్ధి చూపింది. ఇదేకాలంలో ఇన్ఫోసిస్ 9.8 శాతం, టీసీఎస్ 7.1 శాతం చొప్పున ఆదాయాన్ని పెంచుకున్నాయి. రెండేళ్ల క్రితం మూడో పెద్ద కంపెనీగా విప్రోను వెనక్కినెట్టిన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సైతం గతేడాది 17 శాతం ప్రగతిని కనబరిచింది. నీముచ్వాలా నుంచి 2016లో విప్రో పగ్గాలు అందుకున్న అబిదలీ నీముచ్వాలా సైతం విప్రోను ఉన్నపళాన పట్టాలెక్కించే ప్రయత్నాలు చేశారు. అయితే నాలుగేళ్లపాటు ఆశించిన స్థాయిలో కంపెనీ పురోగతిని సాధించలేకపోయింది. 2020కల్లా విప్రోను 15 బిలియన్ డాలర్ల దిగ్గజంగా నిలిపే ప్రయత్నం ఫలించలేదు. మార్చితో ముగిసిన గతేడాదిలో విప్రో 8.1 బిలియన్ డాలర్లకు మాత్రమే చేరగలిగింది. ఈ నేపథ్యంలో నీముచ్వాలా నుంచి సీఈవో బాధ్యతలను డెలాపోర్ట్ స్వీకరించారు. విప్రోకు యూఎస్ అతిపెద్ద మార్కెట్‌కాగా.. యూరోప్, ఆసియా మార్కెట్లపై ప్రత్యేక దృష్టిసారించారు. ఇందుకు అనుగుణంగా చీఫ్ గ్రోత్ ఆఫీసర్ అధ్యక్షతన కొత్త డీల్స్ కోసం టీమ్‌ను ఏర్పాటు చేశారు. తద్వారా యూరోపియన్ పర్యావరణహిత ఇంధన రంగ కంపెనీల నుంచి ఇటీవల భారీ డీల్స్ సాధించగలిగారు. -
విప్రో ఉద్యోగులకు రూ.కోటి షేర్లు
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో.. అర్హులైన తమ ఉద్యోగులకు దాదాపు రూ.కోటికి పైగా విలువైన షేర్లను కేటాయించనున్నట్లు ప్రకటించింది. రెస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్ ప్లాన్-2005, 2007 కింద స్టాక్ ఆప్షన్స్ రూపంలో రూ.2 ముఖ విలువగల 18,819 షేర్లను ప్రస్తుత మార్కెట్ ధరకు జారీ చేయనుంది. తాజాగా జరిగిన డెరైక్టర్ల బోర్డు సమావేశంలో యాజమాన్య కమిటీ ఈ ప్రతిపాదనను ఆమోదించినట్లు బీఎస్ఈకి వెల్లడించిన సమాచారంలో కంపెనీ తెలిపింది.