ఉద్యోగులకు ప్రముఖ టెక్ దిగ్గజం విప్రో శుభవార్త చెప్పింది. మూన్‌లైటింగ్ పాల్పడిన ఉద్యోగుల పట్ల ఎంత కఠినంగా వ్యవహరించిందో విధులు నిర్వహించే సిబ్బందికి చెల్లించే ప్రోత్సాహకాల విషయంలో అంతే ఉదారంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
విప్రోలో పనిచేస్తున్న బ్యాండ్స్ A TO B3 కేటగిరిలోని 85 శాతం మంది ఉద్యోగులకు 100 శాతం ప్రోత్సాహకాల్ని ఉద్యోగులకు ఇంటర్నల్ మెయిల్స్ పంపింది. ఏప్రిల్ -జూన్ (క్యూ2)వరకు ఉద్యోగులకు అందించే ఈ బెన్ఫిట్స్ నవంబర్ పేరోల్ లో జత చేస్తామని పేర్కొంది. ఫ్రెషర్స్ నుంచి టీమ్ లీడర్ స్థాయి ఉద్యోగులకు వేరియబుల్ పేకు అర్హులని తెలిపింది.
మిగిలిన ఉద్యోగులకు మాత్రం సంస్థ నిర్ధేశించిన టార్గెట్స్ కంప్లీట్ పూర్తి చేసిన విధంగా చెల్లింపులు ఉంటాయని విప్రో తన ఉద్యోగులకు పంపిన అంతర్గత మెయిల్స్‌లో వెల్లడించింది. కంపెనీ పాలసీ ప్రకారం..ఉద్యోగి పనితీరుపై వేరియబుల్ పే 93.5% వస్తుంది. అయినప్పటికీ, మన కార్యకలాపాల్ని మెరుగుపరచడానికి, మనం సాధించిన పురోగతిని ప్రతిబింబించేందుకు ఇదొక మంచి సమయం . అందుకే..ఉద్యోగులకు 1.07శాతం అదనంగా వేరియబుల్ పే ఇవ్వాలని నిర్ణయించుకున్నాం’ అని విప్రో ఆ మెయిల్స్‌లో హైలెట్ చేసింది.
వేరియబుల్ పే చెల్లింపు ఎప్పుడంటే
విప్రో తన ఉద్యోగులు నవంబర్ పేరోల్‌లో వేరియబుల్ పేను జతచేస్తామని తెలిపింది. వేరియబుల్ పే ప్రకటించడంతో పాటు అట్రిషన్ రేటును తగ్గించే ప్రయత్నం చేసింది. విప్రో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 16వేల మంది ఉద్యోగుల్ని ఇంటర్నల్‌గా ప్రమోట్ చేసింది.
వేరియబుల్ పే అంటే
ఓ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు చెల్లించే నెలవారీ జీతాలతో సంబంధం లేకుండా ఈ వేరియబుల్ పేని అందిస్తుంటాయి. లాభాల్ని గడించేలా ఉద్యోగుల్ని ప్రోత్సహించేందుకు వారికి సంస్థలు అందించే తాయిలాల్ని వేరియబుల్ పే అని అంటారు. ఉదాహరణకు సంస్థ విధించిన పని గంటల కంటే ఉద్యోగి ఎక్కువ సేపు పనిచేయడం, ప్రొడక్ట్ సేల్స్‌ను బట్టి కమిషన్, పర్‌ఫార్మెన్స్ ఆధారంగా బోనస్‌లు అందిస్తుంటాయి ఆయా కంపెనీలు.
చదవండి👉 పాక్ అభిమాని గూబ గుయ్‌మనేలా..సుందర్ పిచాయ్ రిప్లయ్ అదిరింది
Comments
Please login to add a commentAdd a comment