Variable Pay
-
విప్రో ఈ ఏడాది వేరియబుల్ పే ఎంతంటే...??
ప్రముఖ దేశీయ టెక్ దిగ్గజం విప్రో ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.రెండు త్రైమాసికంలో (క్యూ1,క్యూ2) సిబ్బందికి 80 శాతం వేరియబుల్ పే చెల్లించగా.. మూడో త్రైమాసికంలో (క్యూ3) సమయానికి ఆ మొత్తాన్ని పెంచి 85 శాతం చెల్లించినట్లు తెలుస్తోంది. ఆర్ధిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికంలో విప్రో సంస్థ ఉద్యోగులకు వేరియబుల్పే 80 శాతం, 81 శాతం చెల్లించింది. అదే సంస్థకు చెందిన క్లౌడ్ విభాగం ‘విప్రో ఫుల్ స్ట్రైడ్ క్లౌడ్’ నివేదిక ఆధారంగా.. విప్రో క్యూ3లో గడించిన ఆదాయం ప్రాతిపదికన 80వేల మంది ఉద్యోగులకు సగటున ఒక్కొక్కరికి వేరియబుల్ పే 100శాతం అందిచగా..డిసెంబర్ క్యూ4లో 89.74శాతం చెల్లించినట్లు తెలుస్తోంది. ఉద్యోగులకు విప్రో మెయిల్ వేరియబుల్ పే చెల్లింపులు ఎలా ఉంటాయనే అంశంపై విప్రో సంస్థ ఉద్యోగులకు ఇంటర్నల్ మెయిల్ పంపింది. అందులో రెవెన్యూ (40శాతం), గ్రాస్ మార్జిన్ (30శాతం), మొత్తం కాంట్రాక్ట్ వ్యాల్యూ (30శాతం) ఆధారంగా ఉంటుందని స్పష్టం చేసింది. శాలరీ పెంచింది విప్రోలో కాస్ట్, ఖర్చులను తీసివేయగా వచ్చే ఆదాయం పరంగా ఉద్యోగులకు శాలరీ చెల్లింపులు ఉంటాయి.అయితే ఈ ఆదాయాలు క్యూ2, క్యూ3లో ఆశించిన మేర లేకపోవడంతో విప్రో యాజమాన్యం ఉద్యోగుల జీతాల పెంపును తాత్కాలికంగా నిలిపివేసింది. ఆ తర్వాత మార్కెట్లో డిమాండ్, పెరిగిన ఆదాయంతో కొద్ది నెలల తర్వాత విప్రో ఉద్యోగుల వేతనాన్ని ఏడాదికి 6-8 శాతం పెంచింది. ఈ పెరిగిన జీతం డిసెంబర్1,2023 నుంచి అమల్లోకి వచ్చింది. వేరియబుల్ పే అంటే ఏమిటి? అభివృద్ధి, సాధించిన విజయాలకు అనుగుణంగా ఆయా సంస్థలు ఉద్యోగులకు నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరానికి వేరియబుల్ పేని చెల్లిస్తుంటాయి. వేరియబుల్ పే ‘పెర్ఫార్మెన్స్-లింక్డ్ పే’గా ప్రసిద్ధి చెందింది. ఇది సాధారణంగా కాంట్రిబ్యూషన్, బోనస్ లేదా కమీషన్ రూపంలో చెల్లిస్తాయి సంస్థలు -
ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్ ఆ ఉద్యోగులకు బోనస్!
భారతీయ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ త్రైమాసిక పనితీరు ఆధారంగా బోనస్ చెల్లించ నుంది. ఈ మేరకు సంస్థ ఉద్యోగులకు ఇమెయిల్ పంపింది. ఈ ఇమెయిల్ ప్రకారం, అర్హులైన ఉద్యోగులకు మాత్రమే 80 శాతం వెరియబుల్ పే చెల్లిస్తుంది. జూలై-సెప్టెంబర్ కాలానికి పనితీరు బోనస్‌కు కొంతమంది ఉద్యోగులు అర్హులు కారని ప్రకటించడం ఉద్యోగుల్లో నిరాశ నింపింది. ఈ నెలలో గటున 80 శాతం చెల్లింపుతో అందజేస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి క్యూ2కి సంబంధించి 6వ (PL6-మేనేజర్) స్థాయి, అంతకంటే తక్కువ బ్యాండ్‌లో ఉన్న ఉద్యోగులు సగటున 80 శాతం వేరియబుల్ పేగా అందుకుంటారు. జులై-సెప్టెంబర్ మధ్య కాలంలో ఉద్యోగుల పనితీరు, నిర్వహించిన పాత్ర ఆధారంగా ఈ బోనస్ ఉంటుందని తెలిపింది. బోసన్ ఎంత అనేది యూనిట్ మేనేజర్లు నిర్ణయిస్తారని పేర్కొంది. కాగా గత త్రైమాసికంలో ఇన్ఫోసిస్ నికర లాభంఏడాది ప్రాతిపదికన 3.2 శాతం స్వల్పంగా పెరిగి రూ. 6,212 కోట్లకు చేరుకుంది ఆదాయం కూడా 7 శాతం వృద్ధితో రూ. 38,994 కోట్లకు చేరుకుంది. అయినప్పటికీ, కంపెనీ తన ఆదాయ వృద్ధి మార్గదర్శకాలను FY24కి 1 శాతం-2.5 శాతానికి సవరించింది. -
ఇన్ఫోసిస్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, ఆగస్టు జీతంతోనే!
Infosys 80% average variable payout: దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు తీపి కబురు అందించింది. జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో సగటున 80శాతం వేరియబుల్ పేను విడుదల చేయనుంది ఆగస్టు జీతంతో కలిపి ఈ వేరియబుల్పేను అందించనుంది. ఈ మేరకు కంపెనీ హెచ్ టీం ఉద్యోగులకు ఈమెయిల్ సమాచారాన్ని అందిచింది. 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 'మంచి పనితీరు' నేపథ్యంలో తన ఉద్యోగులు సగటున 80శాతం వేరియబుల్ వేతనం లభించనుంది. తాము క్యూ1లో మంచి పనితీరును కనబర్చామనీ, భవిష్యత్ విస్తరణకు బలమైన పునాదిని ఏర్పాటు చేసామని ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు ఇచ్చిన సమాచారంలో తెలిపింది. అయితే ఉద్యోగుల పనితీరు త్రైమాసికంలో సహకారం ఆధారంగా ఈ పే ఉంటుందని పేర్కొంది. అలాగే పెరఫామెన్స్ బోనస్ నిర్ణారణ నిమిత్తం తమ బడ్జెట్ సంబంధిత DUలకు, యూనిట్ డెలివరీ మేనేజర్లకు అందించినట్టు వెల్లడించింది. గత ఏడాది ఇన్ఫోసిస్ సగటు వేరియబుల్ పే 60 శాతంగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇన్ఫోసిస్ నికర లాభం సంవత్సరానికి (YoY) 11 శాతం పెరిగి రూ. 5,945 కోట్లకు చేరుకుంది. డాలర్ ఆదాయం 4,617 మిలియన్ డాలర్లు వచ్చింది. త్రైమాసికంలో ఆపరేటింగ్ మార్జిన్ 20.8 శాతంగా ఉంది, క్రితం సంవత్సరం త్రైమాసికంలో 20 శాతం కంటే 80 బేసిస్ పాయింట్లు పెరిగాయి, అయితే మార్చి త్రైమాసికంలో 21 శాతం నుండి 20 బేసిస్ పాయింట్లు QoQ తగ్గింది. అంతేకాకుండా, పెద్ద డీల్ విజయాలు 2.3 బిలియన్ల డాలర్లకు పరిమితం. అలాగే అంతకుముందు అంచనా 4-7 శాతంతో పోలిస్తే. రెవెన్యూ గైడెన్స్ 1-3.5 శాతానికి తగ్గించింది. -
విప్రో ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్: జీతాల పెంపు ఇప్పుడే కాదు..
Bad News for Wipro employees: జీతాల పెంపునకు సంబంధించి ఉద్యోగులకు నిరాశ కలిగించే వార్తను చెప్పింది ప్రముఖ ఐటీ సేవల సంస్థ విప్రో. గతేడాది సెప్టెంబర్‌లో వేతన పెంపును అమలు చేసిన విప్రో కంపెనీ ఈ ఏడాది వేతన పెంపును మూడో త్రైమాసికానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాజాగా మీడియా సమావేశంలో వెల్లడించింది. వేరియబుల్ పే 80 శాతం ఇంతకు ముందు వేతన పెంపును గత సంవత్సరం సెప్టెంబర్‌లో అమలు చేశామని, ఈ సంవత్సరం మూడో త్రైమాసికంలో వేతన పెంపును అమలు చేయనున్నట్లు విప్రో చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ జతిన్ దలాల్ తెలిపారు. విప్రో చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ మాట్లాడుతూ.. మొదటి త్రైమాసికంలో చేసిన విధంగానే క్యూ2 లోనూ కంపెనీ త్రైమాసిక ప్రమోషన్ సైకిల్స్‌ను కొనసాగిస్తుందని చెప్పారు. అయితే 2023 క్యూ1 కు సంబంధించి వేరియబుల్ పే అవుట్ 80 శాతం ఉంటుందని పేర్కొన్నారు. విప్రో గత సంవత్సరం రిక్రూట్ చేసిన ఫ్రెషర్లందరినీ ఇంకా ఆన్‌బోర్డ్ చేయకపోవడానికి వ్యాపార అవసరాలు కూడా కారణంగా తెలుస్తోంది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి క్యాంపస్ రిక్రూట్మెంట్లు చేపట్టలేదని, క్యూ1లో ఎవరినీ ఆన్‌బోర్డ్ చేయలేదని కంపెనీ తెలిపింది. మరోవైపు ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ కంపెనీలు కూడా వేతన పెంపులను వాయిదా వేశాయి. ఇన్ఫోసిస్ జూనియర్ ఉద్యోగులకు సాధారణ ఏప్రిల్ సైకిల్ ప్రకారం వేతనపెంపును చేపట్టకుండా వాయిదా వేసింది. జూనియర్, మిడ్ లెవెల్ ఉద్యోగులకు వేతన పెంపును మరో త్రైమాసికానికి వాయిదా వేసిన హెచ్‌సీఎల్ కంపెనీ మేనేజర్ స్థాయి ఉద్యోగుల వేతన సమీక్షను దాటవేసింది. ఇదీ చదవండి: లేఆఫ్స్ విధ్వంసం: ఆరు నెలల్లోనే 2.12 లక్షల మంది ఇంటికి.. మరి భారత్‌లో ఎంత మంది? -
Bad News: ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం, షాక్‌లో ఉద్యోగులు!
సాక్షి, ముంబై: భారతీయ రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ఉద్యోగులకు చేదువార్త. 2022-23 ఆర్థిక సంవత్సరం క్యూ4లో తన ఉద్యోగులకు సగటున 60 శాతం వేరియబుల్ వేతనాన్ని అంద జేయనుంది. (ఇదీ చదవండి: Massive layoffs: 55వేలమందిని తొలగించనున్న అతిపెద్ద టెలికాం సంస్థ) ఆర్థిక మాంద్యం, ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఐటీ మేజర్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. బిజినెస్ టుడే రిపోర్ట్ ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి- మార్చి)లో ఉద్యోగులకు 60 శాతం వేరియబుల్ పే మాత్రమే అందించనుంది. మాంద్యం ఆందోళనలు, ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు, బ్యాంకింగ్ సంక్షోభం ప్రభావంతోనే కంపెనీ ఈ మేరకు నిర్ణయించింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన బ్యాంకింగ్ సంక్షోభం నేపథ్యంలో ఐటీ పరిశ్రమపై పెరుగుతున్న ఒత్తిడికి ఇది సూచిక అని నిపుణుల అంచనా. ఇన్ఫోసిస్ గతంలో (2022-23 ఆర్థిక సంవత్సరం) మొదటి త్రైమాసికంలో 70 శాతం వేరియబుల్ పే ప్రకటించింది. రెండో త్రైమాసికంలో దీన్ని 65 శాతం శాతానికి తగ్గించింది. కాగా ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌ల ప్రకారం, డిసెంబర్లో 24.3 శాతంగా ఉన్న అట్రిషన్ రేటు మార్చి త్రైమాసికంలో 20.9 శాతానికి దిగి వచ్చింది. (ఈ పిక్స్ చూశారా? గుండెలు బాదుకుంటున్న కృతి సనన్ ఫ్యాన్స్) మరిన్ని బిజినెస్వార్తలు, అప్డేట్స్ కోసం చదవండి: సాక్షి బిజినెస్ -
ఫ్రెషర్లకు గుడ్ న్యూస్ చెప్పిన టీసీఎస్..
దేశీయ ఐటి సేవల దిగ్గజం టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) ఫ్రెషర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జాబ్ ఆఫర్ లెటర్లు పొందిన వారందరికీ ఉద్యోగాలు ఇస్తామని టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ తెలిపారు. టెక్ పరిశ్రమలో అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగించాల్సిన అవసరాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ, టీసీఎస్ మాత్రం ఫ్రెషర్లను నియమించుకోవడానికి, వేతన వ్యత్యాసాలను పరిష్కరించడానికి కట్టుబడి ఉందని మనీకంట్రోల్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్కడ్ చెప్పారు. ఇదీ చదవండి: పనిచేయడానికి ఇదే బెస్ట్ కంపెనీ.. కెరియర్ గ్రోత్ సూపర్! జూనియర్ ఉద్యోగుల జీతాలు డబుల్! ఉద్యోగుల వేతన వ్యత్యాసాలను పరిష్కరించడానికి టీసీఎస్ ప్రయత్నాలను ప్రకటించింది. జూనియర్ ఉద్యోగులు తమ నైపుణ్యం పెంచుకుని జీతాలను రెట్టింపు చేసుకునే అవకాశాలను కల్పించనున్నట్లు మిలింద్ లక్కడ్ వెల్లడించారు. ఉద్యోగులు నైపుణ్యాన్ని పెంపొందించుకుని తమ కెరీర్లో ముందుకు సాగేలా అంతర్గత శిక్షణ అందిస్తామన్నారు. ఈ శిక్షణలో వివిధ స్థాయిల నుంచి వీలైనంత ఎక్కువ మంది ఉద్యోగులకు అవకాశం కల్పించాలని కంపెనీ యోచిస్తోందన్నారు. ఈ శిక్షణలో ప్రతిభ చూపి అసెస్మెంట్లను క్లియర్ చేసిన ఉద్యోగులు తమ జీతాలను రెట్టింపు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అయితే ఈ అసెస్మెంట్లలో సంవత్సరానికి కేవలం 10 శాతం మంది ఉద్యోగులు మాత్రమే ఉత్తీర్ణత సాధిస్తున్నారు. 100 శాతం వేరియబుల్ పే టీసీఎస్ ఫ్రెషర్లకు వేతనాలను పెంచడంతోపాటు జూనియర్ స్థాయిల్లోని ఉద్యోగులకు 100 శాతం త్రైమాసిక వేరియబుల్ వేతనం అందించడాన్ని కూడా పరిశీలిస్తోందని లక్కడ్ పేర్కొన్నారు. అయితే ఈ జీతాల పెరుగుదల ఎప్పటి నుంచి ఉంటుందో ఆయన వెల్లడించలేదు. ఒకేసారి ఉద్యోగుల జీతాలు పెంచడం కన్నా శిక్షణ కార్యక్రమాలు అమలు చేసి ప్రతిభావంతులకు జీతాలు పెంచడం మెరుగైన వ్యూహమని పేర్కొన్నారు. 44,000 జాబ్ ఆఫర్లు 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెగ్యులేటరీ ఫైలింగ్‌ల ప్రకారం.. టీసీఎస్ 44,000 మంది ఫ్రెషర్లకు జాబ్ ఆఫర్లను అందించింది. ఈ జాబ్ ఆఫర్లను అన్నింటినీ తాము గౌరవిస్తామని, అందరికీ ఉద్యోగాలు ఇస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. తాము అన్ని జాబ్ ఆఫర్లను గౌరవిస్తున్నామని, 2023 ఆర్థిక సంవత్సరంలో నికర ప్రాతిపదికన 22,600 మంది ఉద్యోగులను చేర్చుకున్నామని లక్కడ్ చెప్పారు. ఇదీ చదవండి: Aunkita Nandi: రెండు అద్దె కంప్యూటర్లతో రూ.100 కోట్ల వ్యాపారం! ఈ బెంగాలీ అమ్మాయి సంకల్పం మామూలుది కాదు.. -
ఐటీ ఉద్యోగులకు చేదువార్త: వేరియబుల్ పే కట్స్, హైరింగ్‌పై నిపుణుల వ్యాఖ్యలు
సాక్షి,ముంబై: రెసిషన్ లేదా ఆర్థిక మాంద్యం వచ్చిందంటే చాలు..ముందుగా ప్రభావితమయ్యేది ఐటీ రంగం. ఇప్పటికే పెరుగుతున్న ద్రవ్యోల్బణం, స్థూల ఆర్థిక మందగమనంనేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగాపలు దిగ్గజ టెక్ కంపెనీలు వేలాది ఉద్యోగులను నిరుద్యోగం లోకి నెట్టేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ ఐటీరంగం, వాటి ఆదాయాలపై కూడా నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. (IPL 2023: షారుక్ రైట్ హ్యాండ్, కేకేఆర్ సీఈవో గురించి ఇంట్రస్టింగ్ విషయాలు) ప్రధానంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్ వంటి భారతీయ ఐటీ కంపెనీలకు రానున్న ఆదాయాల సీజన్ అగ్నిపరీక్షగా మార నుంది. ప్రస్తుత ప్లేస్మెంట్ సెషన్లో తమ క్యాంపస్ హైరింగ్ డ్రైవ్‌లో అంత యాక్టివ్‌గా లేవు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే, ఈ ఏడాది నియామకాలు మందగించాయి. ఫ్రెషర్ ఆన్‌బోర్డింగ్ , వేరియబుల్ చెల్లింపులలో కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. రానున్న (కనీసం స్వల్పకాలమైనా) ఇదే ట్రెండ్ కొనసాగుతుందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా వేరియబుల్ పే చెల్లింపుల్లో ఉద్యోగులకు నిరాశే ఎదురుకానుందని అంనా వేస్తున్నారు. 2023 ఆర్థిక సంవత్సరంలో వేరియబుల్ చెల్లింపులు దాదాపు లేనట్టేనని HR సంస్థ అసోసియేట్ శ్రీరామ్ వెంకట్ వ్యాఖ్యలనుబిజినెస్ టుడే రిపోర్ట్ చేసింది. దిగువ-బ్యాండ్ ఉద్యోగులు కోతల పరిమిత ప్రభావాన్ని ఎదుర్కొంటారని, అయితే వ్యాపార యూనిట్ పనితీరును బట్టి మధ్య నుండి ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్‌లకు చెల్లించే అవకాశం ఉందని తెలిపారు. లార్జ్ క్యాప్ ఐటి కంపెనీలలో ఇది 85-100 శాతం వరకు ఉండవచ్చు. ఇది వ్యాపార యూనిట్ పనితీరుపై ఆధారపడి ఉంటుందన్నారు. టీసీఎస్ లాంటి ప్రధాన కంపెనీల్లోతొలి క్యూ3లో హెడ్‌కౌంట్ తగ్గిందని ఇది పరిస్థితి సూచిస్తోంది. (సర్కార్ కొలువుకు గుడ్‌బై..9 లక్షల కోట్ల కంపెనీకి జై: ఎవరీ ప్రసూన్ సింగ్?) అలాగే ఉద్యోగ నియామకాల మందగింపు వచ్చే ఏడాది కూడా కొనసాగుతుందని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుత మందగమనం నియామకాలు, విస్తరణపై ఖచ్చితమైన ప్రభావం చూపింది. ఈ ఆర్థిక అనిశ్చితి కారణంగా, కంపెనీలు నియామకాల్లో జాగ్రత్తగా వ్యవహరించడంతో హెడ్‌కౌంట్ వృద్ధి మందగించిందని ఫోర్కైట్స్ (APAC) హెచ్ఆర్ డైరెక్టర్, కళ్యాణ్ దురైరాజ్ తెలిపారు. పరిశ్రమ విస్తృత తొలగింపుల కారణంగా అవకాశాలు లేకపోవడం వల్ల స్వచ్ఛంద అట్రిషన్ మధ్యస్తంగా ఉండవచ్చని నిపుణులు తెలిపారు. (ఫోర్బ్స్ బిలియనీర్ కేషుబ్ మహీంద్రా గురించి తెలుసా? ఆనంద్ మహీంద్రకి ఏమవుతారు?) కోవిడ్ తర్వాత ఎంట్రీ-లెవల్ టాలెంట్లను నియమించుకున్న కంపెనీలు, ఎంట్రీ లెవల్ టాలెంట్ హైరింగ్స్ పెరిగాయి, కానీ ఖచ్చితంగా ఫ్రెషర్ హైరింగ్, క్యాంపస్ హైరింగ్‌లో తగ్గుదల, ఒత్తిడిని చూస్తామన్నారు క్వెస్ ఐటి స్టాఫింగ్ సీఈవో విజయ్ శివరామ్. కానీ ఇంతకుముందు సంవత్సరాల్లో ఈ పరిస్థితి లేదని చెప్పారు. -
హీరో మోటోకార్ప్ సిబ్బందికి వీఆర్ఎస్
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన సిబ్బందికి స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (వీఆర్ఎస్) ప్రకటించింది. సామ ర్థ్యం మెరుగుదల, వ్యయ నియంత్రణ, పటిష్ట ఉత్పాదక సంస్థగా రూపుదిద్దుకోవడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. వీఆర్ఎస్ ఉద్యోగులందరికీ ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. ఒకేసారి తగిన స్థాయిలో డబ్బు అందజేత, వేరియబుల్ పే (పనితీరు ఆధారంగా అదనపు ప్రయోజనం), బహుమతులు, వైద్య కవరేజీ, కంపెనీ కారు వినియోగం, పునరా వాస సహాయం, కెరీర్ మద్దతు వంటి ఎన్నో ప్రయోజనాలను ప్యాకేజీలో భాగంగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ద్విచక్ర వాహన విభాగంలో రిటైల్ అమ్మకాలు ఏడేళ్ల కనిష్ట స్థాయిలో 1.59 కోట్ల యూనిట్లకు పడిపోయినట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తాజా డేటా నేపథ్యంలో హీరో మోటోకార్ప్ తాజా ప్రకటన చేసింది. అయితే మార్చిలో మంచి అమ్మకాలు జరగడం ఒక వినియోగ సెంటిమెంట్‌కు సంబంధించి ఒక సానుకూల పరిణామమని కంపెనీ పేర్కొంది. ప్రభుత్వ నిర్మాణాత్మక విధానాలు, సామాజిక రంగ సంస్కరణలు డిమాండ్‌ను ప్రోత్సహిస్తాయని, ఈ ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధికి ఈ అంశాలు దోహదం చేస్తాయని ద్విచక్ర వాహన పరిశ్రమ అంచనా వేస్తున్నట్లు హీరో మోటోకార్ప్ వివరించింది. -
విప్రో ఉద్యోగులకు గుడ్‌న్యూస్: ఫిబ్రవరి జీతాలతో పండగే!
సాక్షి,ముంబై: దేశీయ ఐటీ దిగ్గజం విప్రో తన ఉద్యోగులకు శుభవార్త అందించింది. ముఖ్యంగా గ్లోబల్‌గా దిగ్గజ కంపెనీల్లో సైతం ఉద్యోగాల కోత ప్రకంపనలు పుట్టిస్తున్న తరుణంలో విప్రో కీలక నిర్ణయం తీసుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి సంబంధించి వేరియబుల్ పే అందించనుంది. థర్డ్ క్వార్టర్లో 87 శాతం వేరియబుల్ పే విడుదల చేయనున్నామని అంతర్గత ఇమెయిల్‌లో ఉద్యోగులకు తెలిపింది. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికి వేరియబుల్ పే ఫిబ్రవరి నెల జీతంతో విడుదల చేయనుంది. విప్రో 2022-23 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో A నుండి B3 బ్యాండ్లలోని ఉద్యోగులకు 87 శాతం వేరియబుల్‌ను విడుదల చేయనున్నట్లు విప్రో చీఫ్ హ్యూమన్ రీసోర్సెస్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ ఉద్యోగులకు ఈ మెయిల్ సమాచారం అందించారు. A నుంచి B3 లెవెల్ ఉద్యోగులు, అన్ని సపోర్ట్ ఫంక్షన్స్‌లో పనిచేసే సిబ్బందికి ఐటీ కంపెనీ పెర్ఫామెన్స్ పనితీరు ఆధారంగా 87శాతం వేరియబుల్ పే చెల్లించనుండగా.. మేనేజర్ స్థాయి, అంతకుమించి లెవెల్ ఉద్యోగులకు.. బిజినెస్ యూనిట్ పెర్ఫామెన్స్ ఆధారిత వేరియబుల్ పే చెల్లించనుంది.అందరు ఉద్యోగులు అంటే ఇందులో ఫ్రెషర్స్ కూడా ఉంటారు. కాగా రెగ్యులేటరీ ఫైలింగ్‌ల ప్రకారం,ఇటీవలి త్రైమాసిక ఫలితాల్లో కంపెనీ ఏకీకృత ఆదాయం 14.3 శాతం పెరిగి రూ.23,229 కోట్లకు చేరుకుంది. ఆపరేటింగ్ మార్జిన్ 16.3 శాతం పెరుగుదల నమోదు చేసింది. అయితే గత త్రైమాసికంలో విప్రో 100 శాతం వేరియబుల్ పే ను ప్రకటించిన సంగతి తెలిసిందే. -
‘విప్రో ఉద్యోగులకు బంపరాఫర్’
ఉద్యోగులకు ప్రముఖ టెక్ దిగ్గజం విప్రో శుభవార్త చెప్పింది. మూన్‌లైటింగ్ పాల్పడిన ఉద్యోగుల పట్ల ఎంత కఠినంగా వ్యవహరించిందో విధులు నిర్వహించే సిబ్బందికి చెల్లించే ప్రోత్సాహకాల విషయంలో అంతే ఉదారంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. విప్రోలో పనిచేస్తున్న బ్యాండ్స్ A TO B3 కేటగిరిలోని 85 శాతం మంది ఉద్యోగులకు 100 శాతం ప్రోత్సాహకాల్ని ఉద్యోగులకు ఇంటర్నల్ మెయిల్స్ పంపింది. ఏప్రిల్ -జూన్ (క్యూ2)వరకు ఉద్యోగులకు అందించే ఈ బెన్ఫిట్స్ నవంబర్ పేరోల్ లో జత చేస్తామని పేర్కొంది. ఫ్రెషర్స్ నుంచి టీమ్ లీడర్ స్థాయి ఉద్యోగులకు వేరియబుల్ పేకు అర్హులని తెలిపింది. మిగిలిన ఉద్యోగులకు మాత్రం సంస్థ నిర్ధేశించిన టార్గెట్స్ కంప్లీట్ పూర్తి చేసిన విధంగా చెల్లింపులు ఉంటాయని విప్రో తన ఉద్యోగులకు పంపిన అంతర్గత మెయిల్స్‌లో వెల్లడించింది. కంపెనీ పాలసీ ప్రకారం..ఉద్యోగి పనితీరుపై వేరియబుల్ పే 93.5% వస్తుంది. అయినప్పటికీ, మన కార్యకలాపాల్ని మెరుగుపరచడానికి, మనం సాధించిన పురోగతిని ప్రతిబింబించేందుకు ఇదొక మంచి సమయం . అందుకే..ఉద్యోగులకు 1.07శాతం అదనంగా వేరియబుల్ పే ఇవ్వాలని నిర్ణయించుకున్నాం’ అని విప్రో ఆ మెయిల్స్‌లో హైలెట్ చేసింది. వేరియబుల్ పే చెల్లింపు ఎప్పుడంటే విప్రో తన ఉద్యోగులు నవంబర్ పేరోల్‌లో వేరియబుల్ పేను జతచేస్తామని తెలిపింది. వేరియబుల్ పే ప్రకటించడంతో పాటు అట్రిషన్ రేటును తగ్గించే ప్రయత్నం చేసింది. విప్రో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 16వేల మంది ఉద్యోగుల్ని ఇంటర్నల్‌గా ప్రమోట్ చేసింది. వేరియబుల్ పే అంటే ఓ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు చెల్లించే నెలవారీ జీతాలతో సంబంధం లేకుండా ఈ వేరియబుల్ పేని అందిస్తుంటాయి. లాభాల్ని గడించేలా ఉద్యోగుల్ని ప్రోత్సహించేందుకు వారికి సంస్థలు అందించే తాయిలాల్ని వేరియబుల్ పే అని అంటారు. ఉదాహరణకు సంస్థ విధించిన పని గంటల కంటే ఉద్యోగి ఎక్కువ సేపు పనిచేయడం, ప్రొడక్ట్ సేల్స్‌ను బట్టి కమిషన్, పర్ఫార్మెన్స్ ఆధారంగా బోనస్‌లు అందిస్తుంటాయి ఆయా కంపెనీలు. చదవండి👉 పాక్ అభిమాని గూబ గుయ్‌మనేలా..సుందర్ పిచాయ్ రిప్లయ్ అదిరింది