న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన సిబ్బందికి స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (వీఆర్‌ఎస్) ప్రకటించింది. సామ ర్థ్యం మెరుగుదల, వ్యయ నియంత్రణ, పటిష్ట ఉత్పాదక సంస్థగా రూపుదిద్దుకోవడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. వీఆర్‌ఎస్ ఉద్యోగులందరికీ ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. ఒకేసారి తగిన స్థాయిలో డబ్బు అందజేత, వేరియబుల్ పే (పనితీరు ఆధారంగా అదనపు ప్రయోజనం), బహుమతులు, వైద్య కవరేజీ, కంపెనీ కారు వినియోగం, పునరా వాస సహాయం, కెరీర్ మద్దతు వంటి ఎన్నో ప్రయోజనాలను ప్యాకేజీలో భాగంగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది.
2022–23 ఆర్థిక సంవత్సరంలో ద్విచక్ర వాహన విభాగంలో రిటైల్ అమ్మకాలు ఏడేళ్ల కనిష్ట స్థాయిలో 1.59 కోట్ల యూనిట్లకు పడిపోయినట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్‌ఏడీఏ) తాజా డేటా నేపథ్యంలో హీరో మోటోకార్ప్ తాజా ప్రకటన చేసింది. అయితే మార్చిలో మంచి అమ్మకాలు జరగడం ఒక వినియోగ సెంటిమెంట్‌కు సంబంధించి ఒక సానుకూల పరిణామమని కంపెనీ పేర్కొంది. ప్రభుత్వ నిర్మాణాత్మక విధానాలు, సామాజిక రంగ సంస్కరణలు డిమాండ్‌ను ప్రోత్సహిస్తాయని, ఈ ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధికి ఈ అంశాలు దోహదం చేస్తాయని ద్విచక్ర వాహన పరిశ్రమ అంచనా వేస్తున్నట్లు హీరో మోటోకార్ప్ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment