భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. అయితే మార్కెట్లోని ఉత్తమ ఈవీ స్కూటర్లు ఏవి? వాటి ధర, రేంజ్ వంటి వివరాలు ఎలా ఉన్నాయనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
బజాజ్ చేతక్ (Bajaj Chetak)
ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో.. ఎలక్ట్రిక్ టూ వీలర్ విభాగంలో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ విక్రయిస్తోంది. దీని అమ్మకాలు ప్రస్తుతం ఆశాజనకంగానే ఉన్నాయి. కాగా ఈనెల 20న మరో అప్డేటెడ్ మోడల్ లాంచ్ చేయడానికి కంపెనీ సిద్ధమైంది. కాగా ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బేస్ మోడల్ 2.88 కిలోవాట్ బ్యాటరీతో 123 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ ధర రూ. లక్ష కంటే ఎక్కువ.
టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube)
మార్కెట్లో ఎక్కువ అమ్మకాలు పొందుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాలో ఒకటి టీవీఎస్ ఐక్యూబ్. రూ. 89999 ప్రారంభ ధర వద్ద లభించే ఈ స్కూటర్ 2.2 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ద్వారా 75 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ 75 కిమీ/గం. ఇది 12.7 సెంమీ TFT డిస్‌ప్లే కలిగి, ఎల్ఈడీ హెడ్‌లైట్, 4.4 కిలోవాట్ BLDC మోటార్ వంటివి పొందుతుంది.
ఇదీ చదవండి: భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన కారు: 1.86 లక్షల మంది కొనేశారు
హీరో విడా (Hero Vida)
రూ. 96000 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద అందుబాటులో ఉన్న హీరో విడా మంచి అమ్మకాలు పొందుతున్న ఒక బెస్ట్ మోడల్. ఇందులో 2.2 కిలోవాట్ రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఒక సింగిల్ ఛార్జీతో 94 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ 69 కిమీ/గం. ఈ స్కూటర్ 7 ఇంచెస్ డిజిటల్ TFT టచ్‌స్క్రీన్ పొందుతుంది.
ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric)
ప్రారంభం నుంచి గొప్ప ఆదరణ పొందిన ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల నాలుగు ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింది. అవి ఓలా గిగ్, ఓలా గిగ్ ప్లస్, ఓలా ఎస్1 జెడ్, ఓలా ఎస్1 జెడ్ ప్లస్. కంపెనీ వీటి కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. కాబట్టి కేవలం 499 రూపాయలతో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు 2025లో ప్రారంభమవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment