additional amounts
-
మూడు ప్రభుత్వ సాధారణ బీమా సంస్థలకు మూలధనం!
న్యూఢిల్లీ: నష్టాల్లో ఉన్న మూడు ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలకు వాటి ఆర్థిక పనితీరు ఆధారంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 3,000 కోట్ల మూలధన సమకూర్చే అంశాన్ని ఆర్థిక మంత్రిత్వశాఖ పరిశీలిస్తోందని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ఈ జాబితాలో నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఐసీఎల్), ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఓఐసీఎల్), యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలు (యూఐఐసీ) ఉన్నాయి. ఆదాయాలపైకాకుండా, లాభార్జనకు వ్యూహాలు రచించాలని గత ఏడాది ఆర్థిక మంత్రిత్వశాఖ ఈ మూడు సంస్థలకు విజ్ఞప్తి చేసింది. గత ఏడాది ఈ మూడు సంస్థలకు ఆర్థికశాఖ రూ.5,000 కోట్ల మూలధనాన్ని సమకూర్చింది. కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న ఎన్ఐసీఎల్కు రూ.3,700 కోట్లు కేటాయించగా, ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీకి రూ.1,200 కోట్లు లభించాయి. ఇక చెన్నై ఆధారిత యూఐఐసీకి కేటాయింపులు రూ.100 కోట్లు. మూడు సంస్థలూ రెగ్యులేటరీ నిబంధనలకు అనుగుణంగా తగిన సాల్వెన్సీ నిష్పత్తులను కలిగిలేవు. సాల్వెన్సీ రేషియో 150 శాతం ఉండాల్సి ఉండగా, ఎన్ఐసీ విషయంలో 63 శాతం, ఓఐసీ 15 శాతం, యూఐఐసీ 51 శాతం మాత్రమే కలిగి ఉన్నాయి. నాలుగు ప్రభుత్వ సాధారణ బీమా కంపెనీలలో కేవలం న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ మాత్రమే స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టెడ్ అయ్యింది. మిగిలిన మూడు పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉన్నాయి. ఇందులో ఒకదానిని ప్రైవేటీకరించనున్నట్లు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. ఇందుకు సంబంధించి పార్లమెంటు ఇప్పటికే జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ (నేషనలైజేషన్) యాక్ట్ సవరణకు ఆమోదముద్ర వేసింది. -
ప్రభుత్వ రంగ బీమా సంస్థలకు అదనపు మూలధనం
న్యూఢిల్లీ: నష్టాల్లో ఉన్న మూడు ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థలు గట్టెక్కేందుకు మరింత తోడ్పాటు అందించడంపై ప్రభుత్వం దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ 2023–24 ఆర్థిక సంవత్సరంలో మరో రూ. 3,000 కోట్లు అదనపు మూలధనం సమకూర్చే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో మూడు సంస్థలు – నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలకు కేంద్రం రూ. 5,000 కోట్లు సమకూర్చింది. ఇందులో నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీకి అత్యధికంగా రూ. 3,700 కోట్లు, ఓరియంటల్ ఇన్సూరెన్స్‌కు రూ. 1,200 కోట్లు, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్‌కు రూ. 100 కోట్లు దక్కాయి. ప్రభుత్వ రంగంలో మొత్తం నాలుగు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉండగా న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ మాత్రమే స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయ్యింది. -
హీరో మోటోకార్ప్ సిబ్బందికి వీఆర్ఎస్
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన సిబ్బందికి స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (వీఆర్ఎస్) ప్రకటించింది. సామ ర్థ్యం మెరుగుదల, వ్యయ నియంత్రణ, పటిష్ట ఉత్పాదక సంస్థగా రూపుదిద్దుకోవడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. వీఆర్ఎస్ ఉద్యోగులందరికీ ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. ఒకేసారి తగిన స్థాయిలో డబ్బు అందజేత, వేరియబుల్ పే (పనితీరు ఆధారంగా అదనపు ప్రయోజనం), బహుమతులు, వైద్య కవరేజీ, కంపెనీ కారు వినియోగం, పునరా వాస సహాయం, కెరీర్ మద్దతు వంటి ఎన్నో ప్రయోజనాలను ప్యాకేజీలో భాగంగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ద్విచక్ర వాహన విభాగంలో రిటైల్ అమ్మకాలు ఏడేళ్ల కనిష్ట స్థాయిలో 1.59 కోట్ల యూనిట్లకు పడిపోయినట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తాజా డేటా నేపథ్యంలో హీరో మోటోకార్ప్ తాజా ప్రకటన చేసింది. అయితే మార్చిలో మంచి అమ్మకాలు జరగడం ఒక వినియోగ సెంటిమెంట్‌కు సంబంధించి ఒక సానుకూల పరిణామమని కంపెనీ పేర్కొంది. ప్రభుత్వ నిర్మాణాత్మక విధానాలు, సామాజిక రంగ సంస్కరణలు డిమాండ్‌ను ప్రోత్సహిస్తాయని, ఈ ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధికి ఈ అంశాలు దోహదం చేస్తాయని ద్విచక్ర వాహన పరిశ్రమ అంచనా వేస్తున్నట్లు హీరో మోటోకార్ప్ వివరించింది. -
ఏపీకి రూ.280 కోట్లు: అమిత్‌షా
సాక్షి, న్యూఢిల్లీ: గత ఏడాది వరదలు, తుపానులు, తెగుళ్లతో పంటలు నష్టపోయిన 5 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్డీఆర్ఎఫ్) కింద రూ.3,113.05 కోట్ల మేర కేంద్ర అదనపు సాయం అందించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ (హెచ్ఎల్సీ) ఆమోదం తెలిపింది. ప్రకృతి వైపరీత్యాలను ధైర్యంగా ఎదుర్కొన్న ఏపీ, బిహార్, తమిళనాడు, పుదుచ్చేరి, మధ్యప్రదేశ్ ప్రజలకు సాయం అందించాలని ప్రధాని మోదీ నిర్ణయించారని అమిత్ షా శనివారం చెప్పారు. వరదలు, తుపానులు కారణంగా నష్టం వాటిల్లిన ఆంధ్రప్రదేశ్‌కు రూ.280.78 కోట్లను అదనపు సాయంగా కేటాయించినట్టు తెలిపారు. చదవండి: టీడీపీ కంచుకోటలు బద్దలు) టెక్కలిలో అచ్చెన్న దౌర్జన్యాలెన్నెన్నో.. -
అదనపు రుణ వినియోగంపై ఆంక్షలు లేవు
న్యూఢిల్లీ: రాష్ట్రాలు అదనంగా తీసుకునే 2 శాతం రుణాల వినియోగంపై ఆంక్షలు లేవని కేంద్రం తెలిపింది. అవసరాలకు తగినట్లుగా రాష్ట్రాలు వాడుకోవచ్చంది. ఎప్పటి మాదిరిగా 3శాతం రుణ వినియోగంపై ఆంక్షలు లేవని, అదనంగా ఉండే 2 శాతంలో ఒక శాతం పౌర కేంద్రక సంస్కరణల అమలుకు ఖర్చుపెట్టాల్సి ఉంటుందని ఆర్థికశాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ‘సాధారణ పరిమితి 3 శాతంపై ఎటువంటి ఆంక్షలు లేవు. స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తి(జీఎస్డీపీ)లో అదనంగా పొందే 2 శాతం రుణంలో 0.50 శాతానికి ఎటువంటి నిబంధనలు లేవు. 1 శాతంలో మాత్రం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే ఒక్కో సంస్కరణ(వన్ కార్డ్, వన్ నేషన్, స్థానిక సంస్థల బలోపేతం, విద్యుత్ రంగం వంటివి)కు 0.25 శాతం చొప్పున అదనంగా వినియోగించుకోవచ్చు. కేంద్రం సూచించిన ఏవైనా మూడు సంస్కరణలు అమలు చేస్తే మిగతా 0.50 శాతం రుణం అదనంగా వాడుకోవచ్చు’అని ఆ అధికారి వివరించారు. అదేవిధంగా, కేంద్ర పన్నుల్లో ఏప్రిల్, మే నెలలకు గాను రాష్ట్రాల వాటా కింద రూ.92,077 కోట్లు విడుదల చేసినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రాలకు ఆసరాగా ఉండేందుకు 2020–21 బడ్జెట్లో ప్రకటించిన మేరకు ఈ మొత్తం విడుదల చేశామని ట్విట్టర్లో పేర్కొన్నారు. -
కార్డు చెల్లింపులపై అదనపు వడ్డన!
నగదురహిత వ్యవస్థ దిశగా దేశాన్ని తీసుకెళ్లాలని పెద్దనోట్లు రద్దుచేసి, స్వైపింగ్ మిషన్ల సంఖ్య పెంచుతున్నా.. సామాన్యులకు మాత్రం దాని ఫలితాలు సరిగా అందడం లేదు. ఆన్లైన్ సర్వర్ల మీద భారం ఒక్కసారిగా పెరిగిపోవడంతో లావాదేవీలు అన్నీ నత్తనడకన సాగుతున్నాయి. కొన్నిసార్లు చివరివరకు వెళ్లి పేమెంట్ జరగకపోవడంతో వినియోగదారులకు చికాకు వస్తోంది. ఇదంతా ఒక ఎత్తయితే.. స్వైపింగ్ మిషన్ల సాయంతో కార్డు ద్వారా చెల్లింపులు చేయాలంటే పెద్ద తలనొప్పిగా ఉంది. కనీసం 250 రూపాయలకు కొనుగోలు చేస్తేనే కార్డు చెల్లింపులు తీసుకుంటామని చెప్పడమే కాక, వాటికి అదనంగా 2 శాతం సర్వీసు చార్జి వసూలు చేస్తున్నారు. డిసెంబర్ 31వ తేదీ వరకు ఈ చార్జీలను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించినా, చాలావరకు దుకాణాల వాళ్లు మాత్రం అదనంగా 2 శాతం ఇస్తేనే కార్డు చెల్లింపు తీసుకుంటామని తెగేసి చెబుతున్నారు. కార్డు ద్వారా లావాదేవీలు చేయాలంటే కార్డును రెండు లేదా మూడుసార్లు స్వైప్ చేయాల్సి వస్తోందని, నవంబర్ మధ్య నుంచే ఈ సమస్య వచ్చిందని ఢిల్లీ సదర్ బజార్‌లోని ఓ హోల్‌సేల్ దుకాణ యజమాని నవీన్ కుమార్ చెప్పారు. ఈయన వ్యాపారం ఎక్కువగా నగదు ఆధారంగానే జరుగుతుంది గానీ, ఇప్పుడు నగదు ఎక్కువ అందుబాటులో లేకపోవడంతో.. ఆయన రూ. 23వేలు ఖర్చుపెట్టి స్వైపింగ్ మిషన్ కొన్నాడు. కానీ అది తరచు మొరాయిస్తోందని, రెస్పాండ్ కావడానికి ఎక్కువ సమయం పడుతోందని వాపోతున్నాడు. ఈమధ్య కాలంలోనే ఎక్కువ మంది స్వైపింగ్ మిషన్లు కొనడంతో ఒక్కసారిగా వాటి సర్వర్ల మీద భారం పెరిగి ఇలా అవుతోందని, తాము ఇంతకుముందు కూడా కార్డులు తీసుకునేవాళ్లమని.. అప్పుడు అలా లేదని పెట్రోలుబంకులో పనిచేసే మనోజ్ యాదవ్ చెప్పారు. ఇప్పటివరకు ఎప్పుడూ తమ మిషన్లు హ్యాంగ్ అవడం గానీ, స్లో అవ్వడం గానీ లేదని.. కానీ ఇప్పుడు మాత్రం కార్డులను ఒకటికి మూడు నాలుగు సార్లు స్వైప్ చేస్తే తప్ప పని అవ్వడం లేదని చెప్పాడు. తాను దక్షిణ ఢిల్లీలోని ఒక సెలూన్లో కటింగ్ చేయించుకున్నానని, అక్కడ మామూలుగా అయితే 70 రూపాయలే తీసుకుంటారు గానీ, తాను కార్డుతో చెల్లిస్తానంటే 90 రూపాయలు ఇవ్వాలన్నారని సిద్దార్థ అరోరా అనే పిల్లల వైద్యుడు చెప్పారు. కేంద్రప్రభుత్వం ఈ చార్జీలు రద్దుచేసిందని చెప్పి, వాళ్లకు పూర్తిగా వివరించిన తర్వాత.. ఎట్టకేలకు 70 రూపాయలు తీసుకోడానికి అంగీకరించారన్నారు.