
భారతదేశంలో ప్రముఖ టూ-వీలర్ తయారీ సంస్థ అయిన.. హోండా మోటార్‌సైకిల్ (Honda Motorcycle) తన సీబీ200ఎక్స్ స్థానంలో 'ఎన్ఎక్స్200'ను లాంచ్ చేసింది. కంపెనీ దీనిని అడ్వెంచర్ టూరర్ అని పిలిచింది. ఈ బైక్ టూరింగ్ కోసం ఎక్కువమంది కొనుగోలు చేస్తున్నప్పటికీ.. ఇది హీరో ఎక్స్‌పల్స్ 200 4Vకి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ రెండు బైకుల మధ్య వ్యత్యాసం ఏంటో ఇక్కడ చూద్దాం.
ధర: హోండా ఎన్ఎక్స్200 ఒక వేరియంట్‌లో మాత్రమే రూ. 1.68 లక్షలకు అందుబాటులో ఉంది. కాగా హీరో ఎక్స్‌పల్స్ 200 4వీ స్టాండర్డ్, ప్రో, ప్రో డాకర్ ఎడిషన్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు రూ. 1.51 లక్షల నుంచి రూ. 1.67 లక్షల (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.
ఫీచర్స్: హోండా ఎన్ఎక్స్200.. హీరో ఎక్స్‌పల్స్ 200 4వీ రెండూ కూడా బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, ఎల్ఈడీ హెడ్‌లైట్, టెయిల్‌లైట్, టర్న్ ఇండికేటర్లు, USB ఛార్జింగ్ పోర్ట్ వంటి వాటిని పొందుతాయి. ఎక్స్‌పల్స్ 200 4వీ టర్న్-బై-టర్న్ నావిగేషన్ పొందుతుంది, ఎన్ఎక్స్200 ట్రాక్షన్ కంట్రోల్ పొందుతుంది.
ఇదీ చదవండి: బీవైడీ సీలియన్ 7 వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?
హీరో ఎక్స్‌పల్స్ 200 4వీ, హోండా ఎన్ఎక్స్200 కంటే ఎత్తుగా, పొడవుగా, వెడల్పుగా ఉంటుంది. డిజైన్ కూడా భిన్నంగా ఉంటుంది. హోండా ముందు భాగంలో అప్‌సైడ్‌డౌన్ ఫోర్కే పొందుతుంది. కానీ హీరో దాని సస్పెన్షన్ సెటప్ కోసం ఫుల్లీ అడ్జస్టబుల్ పొందుతుంది.
పవర్‌ట్రెయిన్: హీరో ఎక్స్‌పల్స్ 200 4వీ.. 199.6 సీసీ సింగిల్ సిలిండర్, ఆయిల్ - కూల్డ్ ఇంజిన్ కలిగి 8,500 rpm వద్ద 18.9 Bhp & 6,500 rpm వద్ద 17.35 Nm టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఇక హోండా ఎన్ఎక్స్200 బైక్ 184.4 సీసీ సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ద్వారా 17.03 bhp పవర్, 15.9 Nm టార్క్ అందిస్తుంది. ఇందులో కూడా 5-స్పీడ్ గేర్బాక్స్ ఉంటుంది. రెండూ కూడా ఉత్తమ పనితీరును అందిస్తాయి.