సాక్షి,ముంబై: రెసిషన్ లేదా ఆర్థిక మాంద్యం వచ్చిందంటే చాలు..ముందుగా ప్రభావితమయ్యేది ఐటీ రంగం. ఇప్పటికే పెరుగుతున్న ద్రవ్యోల్బణం, స్థూల ఆర్థిక మందగమనంనేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగాపలు దిగ్గజ టెక్ కంపెనీలు వేలాది ఉద్యోగులను నిరుద్యోగం లోకి నెట్టేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ ఐటీరంగం, వాటి ఆదాయాలపై కూడా నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. (IPL 2023: షారుక్ రైట్ హ్యాండ్, కేకేఆర్ సీఈవో గురించి ఇంట్రస్టింగ్ విషయాలు)
ప్రధానంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్ వంటి భారతీయ ఐటీ కంపెనీలకు రానున్న ఆదాయాల సీజన్ అగ్నిపరీక్షగా మార నుంది. ప్రస్తుత ప్లేస్‌మెంట్ సెషన్‌లో తమ క్యాంపస్ హైరింగ్ డ్రైవ్‌లో అంత యాక్టివ్‌గా లేవు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే, ఈ ఏడాది నియామకాలు మందగించాయి. ఫ్రెషర్ ఆన్‌బోర్డింగ్ , వేరియబుల్ చెల్లింపులలో కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. రానున్న (కనీసం స్వల్పకాలమైనా) ఇదే ట్రెండ్ కొనసాగుతుందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా వేరియబుల్ పే చెల్లింపుల్లో ఉద్యోగులకు నిరాశే ఎదురుకానుందని అంనా వేస్తున్నారు.
2023 ఆర్థిక సంవత్సరంలో వేరియబుల్ చెల్లింపులు దాదాపు లేనట్టేనని HR సంస్థ అసోసియేట్ శ్రీరామ్ వెంకట్ వ్యాఖ్యలనుబిజినెస్ టుడే రిపోర్ట్ చేసింది. దిగువ-బ్యాండ్ ఉద్యోగులు కోతల పరిమిత ప్రభావాన్ని ఎదుర్కొంటారని, అయితే వ్యాపార యూనిట్ పనితీరును బట్టి మధ్య నుండి ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్‌లకు చెల్లించే అవకాశం ఉందని తెలిపారు. లార్జ్ క్యాప్ ఐటి కంపెనీలలో ఇది 85-100 శాతం వరకు ఉండవచ్చు. ఇది వ్యాపార యూనిట్ పనితీరుపై ఆధారపడి ఉంటుందన్నారు. టీసీఎస్ లాంటి ప్రధాన కంపెనీల్లోతొలి క్యూ3లో హెడ్‌కౌంట్ తగ్గిందని ఇది పరిస్థితి సూచిస్తోంది. (సర్కార్ కొలువుకు గుడ్‌బై..9 లక్షల కోట్ల కంపెనీకి జై: ఎవరీ ప్రసూన్ సింగ్?)
అలాగే ఉద్యోగ నియామకాల మందగింపు వచ్చే ఏడాది కూడా కొనసాగుతుందని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుత మందగమనం నియామకాలు, విస్తరణపై ఖచ్చితమైన ప్రభావం చూపింది. ఈ ఆర్థిక అనిశ్చితి కారణంగా, కంపెనీలు నియామకాల్లో జాగ్రత్తగా వ్యవహరించడంతో హెడ్‌కౌంట్ వృద్ధి మందగించిందని ఫోర్‌కైట్స్ (APAC) హెచ్‌ఆర్ డైరెక్టర్, కళ్యాణ్ దురైరాజ్ తెలిపారు. పరిశ్రమ విస్తృత తొలగింపుల కారణంగా అవకాశాలు లేకపోవడం వల్ల స్వచ్ఛంద అట్రిషన్ మధ్యస్తంగా ఉండవచ్చని నిపుణులు తెలిపారు. (ఫోర్బ్స్ బిలియనీర్ కేషుబ్ మహీంద్రా గురించి తెలుసా? ఆనంద్ మహీంద్రకి ఏమవుతారు?)
కోవిడ్ తర్వాత ఎంట్రీ-లెవల్ టాలెంట్‌లను నియమించుకున్న కంపెనీలు, ఎంట్రీ లెవల్ టాలెంట్ హైరింగ్స్ పెరిగాయి, కానీ ఖచ్చితంగా ఫ్రెషర్ హైరింగ్, క్యాంపస్ హైరింగ్‌లో తగ్గుదల, ఒత్తిడిని చూస్తామన్నారు క్వెస్ ఐటి స్టాఫింగ్ సీఈవో విజయ్ శివరామ్. కానీ ఇంతకుముందు సంవత్సరాల్లో ఈ పరిస్థితి లేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment