cuts
-
వరుణ్‌కు మొండిచెయ్యి.. జితిన్‌కు పట్టం!
రంగుల పండుగ హోలీకి ముందుగానే అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన బీజేపీ ఎన్నికల వేడిని మరింత పెంచింది. యూపీలోని పిలిభిత్ స్థానం ఎవరికి కేటాయిస్తారన్న చర్చలకు ఫుల్స్టాప్ పెట్టింది. ఇక్కడి నుంచి జితిన్ ప్రసాద్‌ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. పిలిభిత్ స్థానం వరుణ్ గాంధీకి కేటాయిస్తారా లేదా అనే దానిపై ఇన్నాళ్లూ పలు ఊహాగానాలు కొనసాగాయి. వాటికి ఇప్పుడు తెరపడింది. వరుణ్‌కు ఈసారి బీజేపీ టికెట్ ఇవ్వలేదు. పిలిభిత్ లోక్‌సభ స్థానం గత నాలుగు ఎన్నికల్లో బీజేపీ ఖాతాలోనే ఉంది. ప్రస్తుతం ఈ స్థానంలో వరుణ్ గాంధీ ఎంపీగా ఉన్నారు. అయితే వరుణ్ గాంధీ చాలా కాలంగా పార్టీ విధానాలను వ్యతిరేకిస్తూ తన గళం విప్పారు. అయితే ఇటీవల ఆయన పార్టీ విషయంలో కాస్త మెత్తబడ్డారు. దీంతో వరుణ్‌కు టికెట్ ఇస్తారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. బీజేపీ తొలి జాబితా విడుదలైన తర్వాత పిలిభిత్ నుంచి పోటీ చేసేది వీరేనంటూ పలువురు పోటీదారుల పేర్లు చర్చకు వచ్చాయి. వారిలో ఒకరే జితిన్ ప్రసాద్. ఆదివారం రాత్రి వెలువడిన బీజేపీ జాబితాలో జితిన్ ప్రసాద్ పేరు కనిపించింది. దీంతో జిల్లాలో ఎన్నికల కార్యకలాపాలు ఊపందుకున్నాయి. జితిన్ ప్రసాద్ ప్రస్తుతం పబ్లిక్ వర్క్స్ మంత్రిగా ఉన్నారు. ఆయన పిలిభిత్, లఖింపూర్, సీతాపూర్ తదితర జిల్లాల్లో పలు అభివృద్ధి పనులు చేశారు. జితిన్ ప్రసాద్ 2004 లోక్‌సభ ఎన్నికల్లో షాజహాన్‌పూర్ నుంచి గెలుపొందారు. 2009 ఎన్నికల్లో ధౌరహర స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ సమయంలో జితిన్ కేంద్ర రోడ్డు రవాణా , రహదారుల మంత్రిత్వ శాఖ, పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ మంత్రిగా ఉన్నారు. రెండు సంవత్సరాల క్రితం జితిన్ బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. -
కాంగ్రెస్ అంటే కోత, అవినీతి, కమీషన్: మంత్రి అమిత్ షా
కర్నాల్(హరియాణా): కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాంగ్రెస్‌పై తీవ్రంగా మండిపడ్డారు. ఆ పార్టీని ఆయన కోత, కమీషన్, అవినీతి(కట్, కమీషన్, కరప్షన్) పార్టీగా పేర్కొన్నారు. ప్రతిపక్ష ఇండియా కూటమిలోని 27 పార్టీల నేతలు స్వలాభం కోసమే చేతులు కలిపారని ఆరోపించారు. తమ బీజేపీ మాత్రం ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తోందని చెప్పారు. గురువారం హరియాణా ప్రభుత్వం నిర్వహించిన అంత్యోదయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో దేశంలో శాంతి భద్రతలను మెరుగుపర్చిందని, అవినీతిని, బంధుప్రీతిని నిర్మూలించిందని చెప్పారు. -
అనైతిక డిస్కౌంట్లను ప్రభుత్వం కట్టడి చేయాలి
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ రంగంలో రేట్లను పెంచేసి ఆపైన భారీగా డిస్కౌంట్లు ప్రకటించడం లాంటి అనైతిక ధోరణులను కట్టడి చేసేందుకు ప్రభుత్వం, సంబంధిత నియంత్రణ సంస్థలు తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీయూటీఎస్ ఇంటర్నేషనల్ సంస్థ ఒక నివేదికలో అభిప్రాయపడింది. అసలు రేటు ఎక్కువే ఉన్నప్పటికీ తాము తక్కువకే కొంటున్నామనే తప్పుడు భావనను వినియోగదారుల్లో కలిగించే ఇలాంటి పద్ధతులు .. మోసం కిందకే వస్తాయని పేర్కొంది. ఫ్లాష్ అమ్మకాలపై ఎకాయెకిన నిషేధం విధించడం కాకుండా వినియోగదారుల హక్కుల పరిరక్షణను పటిష్టం చేయడంపైనా, మార్కెట్లో విక్రేతలందరికీ సమాన అవకాశాలు లభించేలా చూడటంపైనా ప్రభుత్వం మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సీయూటీఎస్ వివరించింది. భారీగా డిస్కౌంటునివ్వడం, పోటీ సంస్థలను దెబ్బతీసే ఉద్దేశంతో అత్యంత చౌకగా అమ్మడం అనే రెండు విధానాలకు సంబంధించి స్పష్టమైన నిర్వచనాలను నిర్దేశించాలని పేర్కొంది. ప్రస్తుతం ఈ రెండింటినీ ఒకదానికొకటి పర్యాయపదాలుగా ఉపయోగిస్తుండటం వల్ల గందరగోళం నెలకొందని తెలిపింది. -
భారత కాంప్లియన్స్ రేటింగ్‌కు కోత
న్యూఢిల్లీ: విమానాల లీజుకు సంబంధించి అంతర్జాతీయ చట్టం నింధనల అమలులో భారత్ రేటింగ్‌కు ‘ది ఏవియేషన్ వర్కింగ్ గ్రూప్ (ఏడబ్ల్యూజీ)’ కోత పెట్టింది. భారత్‌కు నెగెటివ్ అవుట్‌లుక్ ఇచి్చంది. సీటీసీ కాంప్లియెన్స్ ఇండెక్స్‌లో భారత్ స్కోరును 3.5 నుంచి 2కు తగ్గించింది. సంక్షోభంలో పడిన గోఫస్ట్ ఎయిర్‌లైన్ నుంచి లీజుదారులు విమానాలను వెనక్కి తీసుకునే విషయంలో న్యాయ సమస్యలు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఏడబ్ల్యూజీ అనేది లాభాపేక్ష రహిత చట్టబద్ధ సంస్థ. ఇందులో విమానాల తయారీదారులు, లీజింగ్ కంపెనీలు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ సభ్యులుగా ఉన్నాయి. కేప్‌టౌన్ కన్వెన్షన్ కింద విమానయాన సంస్థలకు లీజుకు ఇచి్చన విమానాలను అద్దెదారులు వెనక్కి తీసుకోవచ్చు. కానీ, గోఫస్ట్ విషయంలో లీజుదారులు విమానాలను వెనక్కి తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. దివాల పరిష్కార ప్రక్రియ కిందకు వెళ్లడంతో మారటోరియం అమలవుతోంది. లీజుదారులకు సీటీసీ పరిష్కారాలు అందుబాటులో లేవని లేదా లీజుకు ఇచి్చన ఎయిర్‌క్రాఫ్ట్‌లను వెనక్కి తీసుకోలేని పరిస్థితి ఉన్నట్టు ఏడబ్ల్యూజీ పేర్కొంది. ‘‘గోఫస్ట్ దివాలా పరిష్కార చర్యలు ఆరంభించి 130 రోజులు అవుతోంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం భారత్ అమలు చేయాల్సిన గడువు కంటే ఇది రెట్టింపు’’అని ఏడబ్ల్యూజీ తన ప్రకటనలో పేర్కొంది. భారత్ సీటీసీపై సంతకం చేసినప్పటికీ ఇంకా అమలు చేయకపోవడం గమనార్హం. -
సినీ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్! సోషల్ మీడియా దెబ్బకు దిగొచ్చిన మల్టీప్లెక్స్!
మల్టీప్లెక్స్‌లో సినిమాలు వీక్షించేవారికి ఊరట కలిగించే విషయం ఇది. సాధారణంగా మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరల కంటే అక్కడ అమ్మే తినుబండారాలు, పానీయాల రేట్లే అధికంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో మల్టీప్లెక్స్‌లలో విపరీతమైన వాటి ధరలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వక్తమవుతుండటం తెలిసిందే. సోషల్ మీడియాలో విమర్శల దెబ్బకు ప్రముఖ మల్టీప్లెక్స్ చెయిన్ పీవీఆర్ ఐనాక్స్ దిగొచ్చింది. తమ వద్ద విక్రయించే తినుబండారాలు, పానీయాల ధరలను 40 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే సోమవారం నుంచి గురువారం వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఫుడ్ కాంబోల ధరలు రూ.99 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. అయితే ‘బెస్ట్ సెల్లర్@99’ అనేది స్పషల్ షోలకు, గ్రూప్ బుకింగ్స్‌కి వర్తించదని, ఆఫ్‌లైన్‌లోనే కొనుక్కోవాలని ప్రకటించింది. ఈ మల్టీప్లెక్స్‌లో ఒక టబ్ చీస్ పాప్‌కార్న్ రూ.450, సాఫ్ట్ డ్రింక్ 600 ఎంఎల్ రూ.360 ఉండేది. దీనిపై ట్విటర్లో పది రోజుల క్రితం ఓ యూజర్ పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. దానికి స్పందిస్తూ సదరు మల్టీప్లెక్స్ యాజమాన్యం తినుబండారాలు, పానీయాల రేట్లు తగ్గించింది. దీనికితోడు థియేటర్లలో తినుబండారాలు, పానీయాల ధరలపై జీఎస్టీని ప్రభుత్వం ఇటీవల 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడం కూడా కలిసివచ్చింది. ఇదీ చదవండి: FAME 3: ఎలక్ట్రిక్ వాహనాలకు కొత్త సబ్సిడీ విధానం.. కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం! -
గుడ్ న్యూస్.. తగ్గనున్న సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరలు..
వంట కోసం సన్‌ఫ్లవర్ ఆయిల్ వాడుతున్న వారికి శుభవార్త. టారిఫ్ రేట్ కోటా (TRQ) విధానం కింద ముడి సోయా బీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ సీడ్ ఆయిల్ దిగుమతులపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం, వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి సెస్‌ను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఈ మినహాయింపు మే 11 నుంచి జూన్ 30 వరకు అమలులో ఉంటుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి టారిఫ్ రేట్ కోటా లైసెన్స్ ఉన్న దిగుమతిదారులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇదీ చదవండి: జీఎస్టీ నిబంధనల్లో మార్పులు.. ఆగస్టు 1 నుంచి కొత్త రూల్! టారిఫ్ రేట్ కోటా అనేది కోటా చేరుకున్న తర్వాత అదనపు దిగుమతులపై సాధారణ సుంకాలు వర్తింపజేయడంతో పాటు, తగ్గింపు లేదా జీరో-డ్యూటీ రేటుతో భారతదేశంలోకి నిర్దిష్ట పరిమాణంలో దిగుమతులను అనుమతించే వ్యవస్థ. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాలకు 2 మిలియన్ టన్నుల టారిఫ్ రేట్ కోటా కేటాయింపు కోసం 2022 మేలో ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. అయితే సన్‌ఫ్లవర్ ఆయిల్, సోయా బీన్ ఆయిల్ ఉత్పత్తిలో పెరుగుదల కారణంగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి టారిఫ్ రేట్ కోటా కేటాయింపును ఉపసంహరించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి టారిఫ్ రేట్ కోటా కింద ముడి పొద్దు తిరుగుడు విత్తన నూనె దిగుమతులను నిలిపివేయాలని ప్రభుత్వం మార్చిలో నిర్ణయించింది. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో ముడి పొద్దుతిరుగుడు విత్తన నూనెను దిగుమతి చేసుకోవడానికి టారిఫ్ రేట్ కోటా కేటాయింపులు ఉండవని తెలిపింది. క్రూడ్ సోయాబీన్ ఆయిల్ విషయంలో కూడా ఈ ఏడాది జనవరిలో ఇదే విధమైన నిర్ణయం తీసుకుంది. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో ముడి సన్‌ఫ్లవర్ సీడ్ ఆయిల్, ముడి సోయాబీన్ ఆయిల్‌కు సంవత్సరానికి 2 మిలియన్ టన్నుల సుంకం రహిత దిగుమతి వర్తిస్తుంది. ఇక ముడి పొద్దుతిరుగుడు నూనె కోసం టారిఫ్ రేట్ కోటా ఈ సంవత్సరం జూన్ 30 వరకు అమలులో ఉంటుంది. ఇదీ చదవండి: Paytm New Features: పేటీఎంలో సరికొత్త ఫీచర్లు.. యూపీఐ బిల్లును పంచుకోవచ్చు! -
ఐటీ ఉద్యోగులకు చేదువార్త: వేరియబుల్ పే కట్స్, హైరింగ్‌పై నిపుణుల వ్యాఖ్యలు
సాక్షి,ముంబై: రెసిషన్ లేదా ఆర్థిక మాంద్యం వచ్చిందంటే చాలు..ముందుగా ప్రభావితమయ్యేది ఐటీ రంగం. ఇప్పటికే పెరుగుతున్న ద్రవ్యోల్బణం, స్థూల ఆర్థిక మందగమనంనేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగాపలు దిగ్గజ టెక్ కంపెనీలు వేలాది ఉద్యోగులను నిరుద్యోగం లోకి నెట్టేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ ఐటీరంగం, వాటి ఆదాయాలపై కూడా నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. (IPL 2023: షారుక్ రైట్ హ్యాండ్, కేకేఆర్ సీఈవో గురించి ఇంట్రస్టింగ్ విషయాలు) ప్రధానంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్ వంటి భారతీయ ఐటీ కంపెనీలకు రానున్న ఆదాయాల సీజన్ అగ్నిపరీక్షగా మార నుంది. ప్రస్తుత ప్లేస్మెంట్ సెషన్లో తమ క్యాంపస్ హైరింగ్ డ్రైవ్‌లో అంత యాక్టివ్‌గా లేవు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే, ఈ ఏడాది నియామకాలు మందగించాయి. ఫ్రెషర్ ఆన్‌బోర్డింగ్ , వేరియబుల్ చెల్లింపులలో కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. రానున్న (కనీసం స్వల్పకాలమైనా) ఇదే ట్రెండ్ కొనసాగుతుందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా వేరియబుల్ పే చెల్లింపుల్లో ఉద్యోగులకు నిరాశే ఎదురుకానుందని అంనా వేస్తున్నారు. 2023 ఆర్థిక సంవత్సరంలో వేరియబుల్ చెల్లింపులు దాదాపు లేనట్టేనని HR సంస్థ అసోసియేట్ శ్రీరామ్ వెంకట్ వ్యాఖ్యలనుబిజినెస్ టుడే రిపోర్ట్ చేసింది. దిగువ-బ్యాండ్ ఉద్యోగులు కోతల పరిమిత ప్రభావాన్ని ఎదుర్కొంటారని, అయితే వ్యాపార యూనిట్ పనితీరును బట్టి మధ్య నుండి ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్‌లకు చెల్లించే అవకాశం ఉందని తెలిపారు. లార్జ్ క్యాప్ ఐటి కంపెనీలలో ఇది 85-100 శాతం వరకు ఉండవచ్చు. ఇది వ్యాపార యూనిట్ పనితీరుపై ఆధారపడి ఉంటుందన్నారు. టీసీఎస్ లాంటి ప్రధాన కంపెనీల్లోతొలి క్యూ3లో హెడ్‌కౌంట్ తగ్గిందని ఇది పరిస్థితి సూచిస్తోంది. (సర్కార్ కొలువుకు గుడ్‌బై..9 లక్షల కోట్ల కంపెనీకి జై: ఎవరీ ప్రసూన్ సింగ్?) అలాగే ఉద్యోగ నియామకాల మందగింపు వచ్చే ఏడాది కూడా కొనసాగుతుందని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుత మందగమనం నియామకాలు, విస్తరణపై ఖచ్చితమైన ప్రభావం చూపింది. ఈ ఆర్థిక అనిశ్చితి కారణంగా, కంపెనీలు నియామకాల్లో జాగ్రత్తగా వ్యవహరించడంతో హెడ్‌కౌంట్ వృద్ధి మందగించిందని ఫోర్కైట్స్ (APAC) హెచ్ఆర్ డైరెక్టర్, కళ్యాణ్ దురైరాజ్ తెలిపారు. పరిశ్రమ విస్తృత తొలగింపుల కారణంగా అవకాశాలు లేకపోవడం వల్ల స్వచ్ఛంద అట్రిషన్ మధ్యస్తంగా ఉండవచ్చని నిపుణులు తెలిపారు. (ఫోర్బ్స్ బిలియనీర్ కేషుబ్ మహీంద్రా గురించి తెలుసా? ఆనంద్ మహీంద్రకి ఏమవుతారు?) కోవిడ్ తర్వాత ఎంట్రీ-లెవల్ టాలెంట్లను నియమించుకున్న కంపెనీలు, ఎంట్రీ లెవల్ టాలెంట్ హైరింగ్స్ పెరిగాయి, కానీ ఖచ్చితంగా ఫ్రెషర్ హైరింగ్, క్యాంపస్ హైరింగ్‌లో తగ్గుదల, ఒత్తిడిని చూస్తామన్నారు క్వెస్ ఐటి స్టాఫింగ్ సీఈవో విజయ్ శివరామ్. కానీ ఇంతకుముందు సంవత్సరాల్లో ఈ పరిస్థితి లేదని చెప్పారు. -
గూగుల్‌లో సౌకర్యాలు కట్..!
న్యూఢిల్లీ: గూగుల్‌లో ఉద్యోగమంటే ఎవరైనా ఎగిరి గెంతేస్తారు. అక్కడిచ్చే జీతం కంటే ఇతర సౌకర్యాల కోసం ఉద్యోగులు ఎగబడతారు. ఒక్కసారి ఆఫీసులోకి అడుగుపెడితే అన్నీ ఫ్రీయే. టీ, కాఫీ, కూల్‌డ్రింక్స్‌తో పాటు స్నాక్స్, లాండ్రీ సర్వీసు, మసాజ్ పార్లర్లే కాదు, తరచుగా కంపెనీ లంచ్‌లు కూడా ఉంటాయి. ఇప్పుడు ఆ సౌకర్యాలకి గూగుల్ కోత విధించింది. ఇక నుంచి స్నాక్స్, లంచ్‌లు, లాండ్రీ, మసాజ్ సర్వీసులు ఆఫీసులో ఉండవని ప్రకటించింది. ఇలా ఆదా చేసిన డబ్బుల్ని మరిన్ని కీలకమైన పరిశోధనలకు ఖర్చు పెడతామని గూగుల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రూత్ పోరట్ చెప్పారు. ఇప్పటికే ఈ ఏడాది 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తామన్న గూగుల్ ఇప్పుడు ఇలా సౌకర్యాలు కూడా కట్ చేస్తూ ఉండడంతో ఉద్యోగుల్లో నిరాశ నెలకొంది. -
ఐకియా గుడ్‌న్యూస్: ధరలు తగ్గాయోచ్!
ముంబై: ఫర్నీచర్ రంగంలో ఉన్న యూరప్ దిగ్గజం ఐకియా కస్టమర్లకు శుభవార్త అందించింది. భారత్‌లో ధరలను తగ్గించింది. లివింగ్ రూమ్ ప్రొడక్ట్స్, స్టోరేజ్, కిచెన్, పరుపులు, బెడ్రూమ్ ఫర్నీచర్ వంటి విభాగాల్లో 9,000 పైచిలుకు ఎంపిక చేసిన ఉత్పత్తులపై 16-39 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. హైదరాబాద్, ముంబై, బెంగళూరులో ఐకియా స్టోర్లు ఉన్నాయి. ఆన్‌లైన్‌లోనూ కంపెనీ తన ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఇవీ చదవండి: విప్రో బాటలో ఇన్ఫీ: 600 మంది ఫ్రెషర్లు ఔట్! టాటా మోటార్స్ గుడ్ న్యూస్, టాప్ మోడల్స్‌పై అదిరిపోయే ఆఫర్లు Zoom layoffs: అరగంటలో 1300 ఉద్యోగాలు ఊస్టింగ్ -
బీఓబీ ఖాతాదారులకు గుడ్‌న్యూస్
ముంబై: గృహ రుణ రేటును పరిమిత కాలానికి పావుశాతం తగ్గిస్తున్నట్లు ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) ప్రకటించింది. దీనితో ఈ రేటు 8.25 శాతానికి తగ్గింది. తాజా రేటు 2022 డిసెంబర్ 31 వరకూ అమల్లో ఉంటుందని కూడా పేర్కొంది. అయితే ఈ ప్రత్యేక రేటు రుణ గ్రహీతల క్రెడిట్ ప్రొఫైల్‌కు అనుసంధానం చేయడం జరుగుతుందని ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రాసెసింగ్ చార్జీలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. తగ్గించిన రుణ రేటు బ్యాంకింగ్ రంగంలో అతి తక్కువ గృహ రుణ రేటులో ఒకటని, అత్యంత పోటీ పూర్వకమైనదని బ్యాంక్ పేర్కొంది. తాజా రేటు తగ్గింపు తాజా గృహ రుణాలతో పాటు, బ్యాలెన్స్ బదలాయింపులకూ వర్తిస్తుందని తెలిపింది. ‘‘ఈ ఏడాది మేము గృహ రుణ విభాగంలో మంచి వృద్ధి రేటును చూశాం. అన్ని పట్టణాల్లో పటిష్ట డిమాండ్ ఉంది. మా తాజా నిర్ణయం రుణ వృద్ధి మరింత పెరగడానికి దోహదపడుతుంది’’ అని బ్యాంక్ జనరల్ మేనేజర్ (తనఖాలు, ఇతర రిటైల్ రుణాలు) హెచ్‌టీ సోలంకీ తెలిపారు. -
ఇన్ఫోసిస్ వేరియబుల్ పే కోత
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవలకు దేశంలోనే రెండో ర్యాంకులో నిలుస్తున్న ఇన్ఫోసిస్ ఉద్యోగులకు పనితీరు ఆధారంగా చేపట్టే చెల్లింపుల(వేరియబుల్ పే)లో తాజాగా కోత పెట్టింది. సగటు చెల్లింపులను 70 శాతానికి పరిమితం చేసేందుకు నిర్ణయించింది. మార్జిన్లు మందగించడం, ఉపాధి వ్యయాలు పెరగడం వంటి అంశాల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో కంపెనీ వేరియబుల్ పేను కుదించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ అంశాన్ని ఉద్యోగులకు సైతం తెలియజేసినట్లు వెల్లడించాయి. వేరియబుల్ పే విషయంలో ఐటీ సేవల దేశీ దిగ్గజం విప్రో సైతం ఇటీవల వెనకడుగు వేసిన విషయం విదితమే. ప్రధానంగా టెక్నాలజీపై పెరిగిన పెట్టుబడులు, మార్జిన్లపై ఒత్తిడి, నైపుణ్య సరఫరా చైన్ బలహీనపడటం వంటి అంశాలు ప్రభావం చూపాయి. కాగా.. ఐటీ సేవలకు నంబర్‌వన్‌గా కొనసాగుతున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) కొంతమంది ఉద్యోగులకు త్రైమాసిక వేరియబుల్ పే చెల్లింపుల విషయంలో నెల రోజులపాటు ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితాలు డీలా ఈ ఏడాది ఏప్రిల్–జూన్(క్యూ1) ఫలితాలలో ఇన్ఫోసిస్ నికర లాభం అంచనాలకంటే తక్కువ వృద్ధిని సాధించింది. పెరిగిన వ్యయాల కారణంగా 3.2 శాతానికి పరిమితమైంది. అయితే పూర్తి ఏడాది ఆదాయ అంచనాలను మాత్రం కంపెనీ 14–16 శాతానికి పెంచింది. ఇందుకు పటిష్ట డీల్ పైప్‌లైన్ సహకరించింది. ఇక 21–23 శాతం మార్జిన్లను ఆశిస్తోంది. క్యూ1లో 20 శాతం మార్జిన్లను అందుకుంది. ఉద్యోగలబ్ది, ప్రయాణ ఖర్చులు, సబ్‌కాంట్రాక్టు వ్యయాలు వంటివి ప్రభావం చూపాయి. దీనికితోడు భారీగా పెరిగిన ఉద్యోగ వలస(అట్రిషన్) దేశీ ఐటీ రంగ లాభదాయకతను దెబ్బతీస్తోంది. అయితే నిపుణులను ఆకట్టుకోవడం, పోటీస్థాయిలో వేతనాల పెంపు వంటివి చేపట్టడం ద్వారా వృద్ధిని కొనసాగించనున్నట్లు ఇన్ఫోసిస్ సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్ ఇటీవల పేర్కొనడం గమనార్హం! ఇది స్వల్ప కాలంలో మార్జిన్లను బలహీనపరచినప్పటికీ అట్రిషన్‌ను తగ్గిస్తుందని, భవిష్యత్ వృద్ధికి మద్దతుగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. -
డబ్ల్యూహెచ్ఓతో సంబంధాలు రద్దు : ట్రంప్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)తో సంబంధాలను తెగదెంపులు చేసుకుంటున్నట్టు శుక్రవారం ప్రకటించారు. కరోనా వైరస్ గురించి ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించిందని మరోసారి తీవ్రంగా ఆరోపించిన ఆయన అమెరికా ఈ రోజు డబ్ల్యూహెచ్ఓతో సంబంధాలను రద్దు చేయబోతోందన్నారు. తాము కోరిన విధంగా ఎంతో అవసరమైన సంస్కరణలు చేయడంలో విఫలమైనందున సంస్థ నుంచి వైదొలగుతున్నామన్నారు. వైట్ హౌస్ రోజ్ గార్డెన్లో ట్రంప్ మాట్లాడుతూ డబ్ల్యూహెచ్ఓను బీజింగ్ సమర్థవంతంగా నియంత్రిస్తోందని, చైనా ప్రభుత్వ కోరిక మేరకే కరోనా వైరస్ గురించి ప్రపంచాన్ని తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. చైనాలో వైరస్ పుట్టుక, దాని వ్యాప్తి విషయాలను డబ్ల్యూహెచ్ఓ కప్పిపుచ్చిందని, సరిగ్గా వ్యవహరించలేదని ఆయన ఆరోపించారు. దీనికి ఆ సంస్థ బాధ్యత వహించేలా తప్పకుండా చేయాలని అన్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 400 మిలియన్ల డాలర్లు (మూడు వేల కోట్ల రూపాయలకు పైగా) వార్షిక సహకారాన్ని ఇతర ఆరోగ్య సంస్థలకు మళ్ళించనున్నామని తెలిపారు. అమెరికాతో పోల్చితే సంవత్సరానికి కేవలం 40 మిలియన్ డాలర్లు మాత్రమే చెల్లించే చైనా డబ్ల్యూహెచ్ఓను పూర్తిగా నియంత్రిస్తోందని మండిపడ్డారు.(సోషల్ మీడియాకు షాక్ : కత్తి దూసిన ట్రంప్) కాగా కరోనా వైరస్ వ్యాప్తిపై స్పందించే విషయంలో డబ్ల్యూహెచ్ఓ తన కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో విఫలమైందంటూ ఆరోపించడంతో పాటు డబ్ల్యూహెచ్ఓకు నిధులు నిలిపివేస్తామంటూ గతంలోనే హెచ్చరించారు. తాత్కాలికంగా నిధులను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్విటర్ జోక్యం చేసుకుంటోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు సామాజిక మాధ్యమాలపై కొరడా ఝళిపించిన సంగతి తెలిసిందే. (‘థర్డ్ పార్టీ’ ప్రమేయం వద్దు) -
వరుసగా ఎనిమిదో నెలలోనూ మారుతికి షాక్
సాక్షి, ముంబై : డిమాండ్ క్షీణత దేశీయ అతిపెద్ద వాహన తయారీదారు మారుతి సుజుకిని పట్టి పీడిస్తోంది. తాజాగా దేశీయంగా పాసింజర్ వాహనాలకు డిమాండ్ లేకపోవడం వల్ల మారుతి తన ఉత్పత్తిని వరుసగా 8 వ నెలలో తగ్గించుకోవలసి వచ్చింది. ఇటీవల వాహనాల అమ్మకాలు గణనీయంగా పడిపోవడంతో ఆటో కంపెనీలన్నీ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో మారుతి, అశోక్ లేలాండ్ లాంటి కంపెనీలు ఉత్పత్తిలో కోత పెడుతున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే తాజాగా వరుసగా ఎనిమిదవ నెలలో కూడా మారుతి ఉత్పత్తి కోతను ప్రకటించింది. గత నెలలో కంపెనీ మొత్తం వాహనాల ఉత్పత్తి 1,19,337 యూనిట్లు కాగా, గత ఏడాది అక్టోబర్‌లో 1,50,497 గా ఉంది. గత ఏడాది అక్టోబర్‌లో ప్రయాణీకుల వాహనాల ఉత్పత్తి 148,318 నుండి 117,383 యూనిట్లు తగ్గాయని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో శుక్రవారం తెలిపింది. వాన్ల ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే సగానికి పడిపోయింది. 2018 అక్టోబర్‌లో 13,817 య నిట్లను ఉత్పత్తి చేయగా, గత నెలలో 7,661గా ఉంది. మినీ-సెగ్మెంట్లో ఆల్టో, ఎస్-ప్రెస్సో, ఓల్డ్ వాగన్ఆర్ లాంటి వాహనాల తయారీ గత ఏడాది ఇదే నెలలో 34,295 నుండి 20,985 కి పడిపోయింది. కాంపాక్ట్ విభాగంలో న్యూ వాగన్ఆర్, సెలెరియో, ఇగ్నిస్, స్విఫ్ట్, బాలెనో, డిజైర్ వంటి మోడళ్ల ఉత్పత్తి చేసిన యూనిట్ల సంఖ్య గత ఏడాది ఇదే నెలలో 74,167 తో పోలిస్తే అక్టోబర్‌లో 64,079 గా ఉంది. అయితే జిప్సీ, విటారా బ్రెజ్జా, ఎర్టిగా, ఎక్స్ఎల్ -6, ఎస్-క్రాస్ వంటి యుటిలిటీ వాహనాలు మాత్రమే అక్టోబర్‌లో 22,526 నుండి 22,736 వద్ద స్వల్ప వృద్ధిని సాధించాయి. ఏదేమైనా, అమ్మకాల పరంగా పండుగ సీజన్ డిమాండ్ కారణంగా స్వల్ప రికవరీ సంకేతాలను చూపించింది. దేశీయ మార్కెట్లో 2019 అక్టోబర్‌లో మొత్తం 1,44,277 యూనిట్లు విక్రయించింది. ఏడాది క్రితం ఇదే నెలతో పోలిస్తే 4.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆల్టో, ఎస్-ప్రెస్సో వంటి మినీ కార్ల అమ్మకాలు క్షీణించగా, న్యూ వాగన్ఆర్, సెలెరియో, ఇగ్నిస్, స్విఫ్ట్, బాలెనో, డిజైర్లతో సహా కాంపాక్ట్ విభాగం సంవత్సరానికి 16 శాతం వృద్ధిని నమోదు చేసింది. -
ఆర్బీఐ కీలక నిర్ణయం : రెపో రేటు కోత
సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య విధాన పరపతి కమిటీ మరోసారి రేట్ కట్కే మొగ్గు చూపింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన సమావేశమైన ఆరుగురు సభ్యుల ఎంపీసీ సమావేశం తరువాత 2019-20 సంవత్సరానికి నాలుగవ ద్వి-నెలవారీ ద్రవ్య విధానాన్ని నేడు (శుక్రవారం, అక్టోబర్ 4 ) తన సమీక్షను వెల్లడించింది. విశ్లేషకులు అంచనా వేసినట్టుగానే కీలక వడ్డీరేటు 25 బీపీఎస్ పాయింట్ల మేర తగ్గించింది. ఏకగ్రీవంగా కమిటీ ఈ రేట్ కట్కు నిర్ణయించింది. కాగా ఈ ఏడాదిలో ఇది ఐదవ రేటు కట్. దీనితో ఈ రేటు 5.15 శాతానికి దిగివచ్చింది. దీంతో రెపోరేట్ 2010 నాటికి చేరింది. ఇక రివర్స్ రెపో రేటును 4.9శాతంగా ఉంచింది. జీడీపీ వృద్ధిరేటును 6.9 నుంచి 6.1 నుంచి తగ్గించింది. అలాగే 2020-21 నాటికి జీడీపీ అంచనాను కోత పెట్టి 7.2 శాతంగా ఆర్బీఐ నిర్ణయించింది. సెంట్రల్ బ్యాంక్ ఇప్పటికే రెపో రేటును వరుసగా నాలుగుసార్లు తగ్గించింది, ఈ ఏడాది మొత్తం 110 బేసిస్ పాయింట్లు. ఆగస్టులో జరిగిన చివరి సమావేశంలో, ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) బెంచ్‌మార్క్ రుణ రేటును అసాధారణమైన 35 బేసిస్ పాయింట్ల ద్వారా 5.40 శాతానికి తగ్గించింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటే రెపో. జనవరి నుంచీ వరుసగా నాలుగు ద్వైమాసిక సమీక్షల్లో రెపో రేటును ఆర్బీఐ 1.1 శాతం(0.25+0.25+0.25+0.35) తగ్గించిన సంగతి తెలిసిందే. రిటైల్ ద్రవ్యోల్బణం, ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఆర్బీఐ వరుస రెపో రేట్ల కోతకు ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలో చాలామంది ఎనలిస్టులు 40 పాయింట్ల రేట్ కట్‌ను ఊహించారు. తాజా రివ్యూలో ఎంపీసీ లో ఒక సభ్యుడుకూడా 40శాతం కోతకు ఓటు వేయడం గమనార్హం. -
ఎస్బీఐ ఏటీఎం విత్‌డ్రాయల్స్: బ్యాడ్ న్యూస్
సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వినియోగదారులకు మరో చేదువార్త చెప్పింది. రోజువారీ క్యాష్ విత్‌డ్రాయల్ పరిమితిని మరింత కుదించింది. ఏటీఎం ద్వారా రోజువారీ నగదు ఉపసంహరణపై కస్టమర్లకు షాకిచ్చింది. క్లాసిక్, మ్యాస్ట్రో డెబిట్ కార్డులు వినియోగిస్తున్న ఎస్బీఐ ఖాతాదారులు ఏటీఎంల ద్వారా వినియోగదారులు పొందే నగదును సగానికి కోత పెట్టి కేవలం రూ.20వేలుగా నిర్ణయించింది. ఇంతకుముందు ఈ పరిమితి 40వేల రూపాయలుగా ఉంది. అయితే అక్రమ లావాదేవీలు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. అలాగే డిజిటల్, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఎస్బీఐ తెలిపింది. అక్టోబర్ 31 నుంచి ఇది అమల్లోకి రానున్నట్టు ప్రకటించింది. డిజిటల్ లావాదేవీలలో పెరుగుదల ఉన్నప్పటికీ, నగదు డిమాండ్ ఎక్కువగా ఉందని ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ పికె గుప్తా చెప్పారు. తాజా అంచనాల ప్రకారం, నోట్ల రద్దు ముందు కంటే నగదు డిమాండ్ భారీగా ఉందని తెలిపారు. తాజానిర్ణయం వినియోగదారుల అసౌకర్యానికి దారితీస్తుందా అని ప్రశ్నించినపుడు అంతర్గత విశ్లేషణ అనంతరం 20వేల రూపాయల మొత్తం చాలామంది వినియోగదారులకు సరిపోతుందని భావిస్తున్నామన్నారు. అలాగే స్వల్ప ఉపసంహరణలు ద్వారా మోసాలను తగ్గించేందుకు వీలవుతుందా లేదా అనేది పరిశీలించనున్నట్టు చెప్పారు. మరోవైపు దీనిపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో, ముఖ్యంగా వైద్య అవసరాల నిమిత్తం ఇప్పటికే పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, తాజా నిర్ణయంతో మరిన్ని కష్టాలు తప్పవని వాపోతున్నారు. -
విస్తారా సేల్: 75శాతం తగ్గింపు
సాక్షి, ముంబై: విమానయాన సంస్థలు వరసపెట్టి మరీ డిస్కౌంట్ ధరల్లో విమాన టికెట్లను ఆఫర్ చేస్తున్నాయి. బడ్జెట్ క్యారియర్ గో ఎయిర్ స్పెషల్ మాన్సూన్ ఆఫర్, జెట్ ఎయిర్వేస్ బిగ్ సేవింగ్స్ తరహాలోనే విస్తారా ఎయిర్‌లైన్స్ కూడా తాజా ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దేశీయ మార్గాల్లో విమాన టికెట్లపై 75 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. పరిమిత కాలం ఆఫర్‌గా ఇది ఈ రోజు(మంగళవారం) అర్ధరాత్రి నుండి 24 గంటలపాటు అందేబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. తన మొత్తంలో నెట్‌వర్క్‌లో ఈ సేల్ పథకంలో భాగంగా టికెట్ ధరలపై 75శాతం తగ్గింపును అందించనుంది. ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా జూన్ 21నుంచి సెప్టెంబర్ 27 దాకా ప్రయాణానికి అనుమతి. ఢిల్లీ - లక్నో లాంటి చిన్నమార్గాల్లో రూ.1599 టికెట్ లభిస్తుండగా, ఢిల్లీ-హైదరాబాద్, ఢిల్లీ-రాంచీ మధ్య విమాన టికెట్లను రూ.2199కే ఆఫర్ చేస్తోంది.అలాగే ఢిల్లీ-కోలకతా, ఢిల్లీ-ముంబై టికెట్ ధర రూ.2,299 గా ఉండనుంది. కోలకతా- పోర్ట్ బ్లెయిర్ విమాన టిక్కెట్ల ధరలు 2,499 రూపాయలు, ఢిల్లీ-గోవా మధ్య రూ.2,799 ప్రారంభ ధరలుగా ఉంటాయని విస్తారా తెలిపింది. అన్ని చార్జీలను కలిపిన తరువాతే ఈ ధరలని ప్రకటించింది. కాగా దేశీయంగా 22 మార్గాల్లో 20 ఎయిర్‌బస్‌లు, ఎ320 విమానాలతో వారానికి 800 విమాన సర్వీసులను నిర్వహిస్తోంది విస్తారా. -
పీఎన్బీ పండుగ శుభవార్త!
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త అందించింది. రానున్న దసరా దీపావళి సందర్భంగా కస్టర్లకు రుణాలపై తక్కువ వడ్డీరేట్ల ఆఫర్‌ను ప్రకటించింది. రుణాల వడ్డీరేటులో (ఎంసీఎల్ఆర్) కోత పెట్టింది. 20-25 బేసిస్‌పాయింట్లను తగ్గిస్తున్నట్టు గురువారం వెల్లడించింది. ఈ తగ్గింపురేట్లు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్టు తెలిపింది. తాజా నిర్ణయం ప్రకారం పీఎన్బీ ప్రస్తుత బేస్ వడ్డీరేటు 9.15శాతంగా ఉండనుంది. ఇప్పటివరకు ఇది 9.35 శాతం. వార్షిక ఎంసీఎల్ఆర్ 8.15 శాతంగాను, మూడు నెలల కాలానికి 8 శాతంగా ఉంది. -
యాక్సిస్ బ్యాంకు కూడా తగ్గించేసింది
ముంబై: ప్రముఖ ప్రయివేటు యాక్సిస్ బ్యాంకు కూడా వడ్డీరేటులో కోత పెట్టింది. అంచనాలకనుగుణంగానే యాక్సిస్ కూడా వడ్డీరేటును తగ్గిస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. సేవింగ్ ఖాతాలపై చెల్లించే వడ్డీరేటును 50 బీపీఎస్ పాయింట్లను తగ్గించింది. దీంతో ప్రస్తుత వడ్డీరేటు 3.5శాతంగా ఉండనుంది. పొదుపు ఖాతాల్లోని నిధులపై ఇచ్చే వడ్డీ రేటును యాక్సిస్ బ్యాంక్ అర శాతం తగ్గించింది. 3.5 శాతానికి కుదించింది. రూ. 50లక్షల వరకు వరకు నిల్వ (బ్యాలెన్స్) ఉన్న ఖాతాలకు ఈ రేట్ల కోత వర్తిస్తుంది. రూ.50లక్షలకుపైన 4శాతంవడ్డీ చెల్లించనుంది. కాగా రిజర్వ్ బ్యాంక్ తాజా రివ్యూ లో కీలక వడ్డీరేటులో పావు శాతం కోత విధించడంతో ప్రభుత్వ రంగబ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ఇండియా కూడా సేవింగ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటును 3.5శాతంగా నిర్ణయించింది. మరో పెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇటీవలే పొదుపు ఖాతాల (రూ.50లక్షలలోపు) వడ్డీరేటును 3.5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. -
జీవితం అభద్రత!
హోంగార్డుల వెట్టి సక్రమంగా అందని వేతనాలు కేటాయింపులకు మించి ఉద్యోగులు ప్రతి నెలా జీతంలో తప్పని కోతలు త్రిశంకు స్వర్గంలో 75 మంది హోంగార్డులు అధికారులకు పట్టని సంక్షేమం జిల్లాలో మొత్తం హోంగార్డులు : 800 కేటాయిస్తున్న బడ్జెట్ : 725 మందికే జీతాలు అందని వారి సంఖ్య : 75 ఒక్కొక్కరి జీతాల్లో కోత : రూ.800 ప్రతి నెలా నష్టపోతున్న మొత్తం : 5.80 లక్షలు నగరానికి చెంది ఓ హోంగార్డు పదేళ్ల క్రితం ఉద్యోగంలో చేరాడు. అప్పటి నుంచి ఆయన జీవితం ఎదుగూబొదుగూ లేకుండాపోయింది. నెలకు రూ.12వేల జీతంతో జీవితాన్ని భారంగా నెట్టుకొస్తున్నాడు. కొద్ది రోజులుగా అందులోనూ కోత విధిస్తుండటంతో ఇతని వేదన వర్ణనాతీతం. మరో హోంగార్డు విధుల్లో చేరిన తర్వాత దేవుని సేవలో తరిద్దామనే ఉద్దేశంతో దేవాదాయ శాఖకు డిప్యూటేషన్‌పై వెళ్లారు. ఓ ప్రముఖ దేవస్థానంలో కొన్నేళ్ల పాటు సేవలందించారు. ఆ తర్వాత ఆయనను సొంత శాఖకు సరెండర్ చేశారు. ప్రస్తుతం ఆయన ఉద్యోగం గాలిలో దీపంగా మారింది. ప్రభుత్వ శాఖలో పనిచేసే ఉద్యోగులకు ఏడాదికేడాది ఇంక్రిమెంట్ ఉంటుంది. అలాగని అందరి పరిస్థితి ఇలాగే ఉంటుందనుకుంటే పొరపాటు. హోంగార్డు ఉద్యోగం ఇందుకు భిన్నం. పేరుకు పోలీసు శాఖలో పని చేస్తున్నామని చెప్పుకోవాల్సిందే కానీ.. పూట గడవని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వీరి సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అధికారులూ వివక్ష చూపడం విమర్శలకు తావిస్తోంది. అనంతపురం సెంట్రల్: హోంగార్డుల జీవనం దుర్భరంగా మారింది. అసలే అరకొర జీతం.. అది కూడా నెల నెలా అందని పరిస్థితి. పోలీసులతో సమానంగా సేవలు అందిస్తున్నా.. ఇప్పటికీ అప్పు చేయనిదే కుటుంబం గడవని దీనావస్థ. జిల్లాలో 800 పైచిలుకు హోంగార్డులు పని చేస్తున్నారు. వీరిలో 725 మంది పోలీసు శాఖలో ఉన్నారు. మిగిలిన వారు రోడ్డు రవాణా శాఖ, సివిల్ సప్లయ్, బీఎస్ఎన్ఎల్, సబ్‌జైలు తదితర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో డిప్యూటేషన్‌పై కొనసాగుతున్నారు. దాదాపు 20 సంవత్సరాలుగా పని చేస్తున్నా ఇప్పటికీ వీరి జీతం రూ.12వేలే. ఈ మొత్తం కూడా ఎప్పుడు వస్తుందో.. ఎంత కోత పడుతుందోననే బెంగ ఉంటోంది. ప్రతి నెలా 5లోగా జీతాలు చెల్లించాలని గత ప్రభుత్వాలు జీఓలు విడుదల చేసినా.. అమలుకు నోచుకోకపోవడం గమనార్హం. గాలిలో దీపంలా బతుకులు పోలీసుశాఖ ద్వారా రిక్రూట్ అయి ఇతర ప్రభుత్వశాఖలకు డెప్యూటేషన్లపై వెళ్లిన హోంగార్డుల పరిస్థితి గాల్లో దీపంలా తయారైంది. పోలీసుశాఖకు ప్రతి నెలా 725 మంది హోంగార్డులకు సంబంధించిన జీతాలకు మాత్రమే బడ్జెట్ విడుదలవుతోంది. ఇతర ప్రభుత్వ శాఖల నుంచి సరైండరైన ఉద్యోగులకు జీతాలు రావట్లేదు. ఇలాంటి వారి సంఖ్య దాదాపు 40 మందికి పైగా ఉన్నారు. మరికొందరు ఆయా శాఖల్లోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి గాల్లో దీపంలా తయారైంది. పోలీసు అధికారులు వారికి పోస్టింగ్‌లు చూపించడం లేదు. దీంతో ఒక నెల కొంతమందికి, మరో నెల ఇంకొందరికి విధులకు పంపేవారు. ఖాళీగా ఉన్న సమయంలో వారికి జీతాలు అందే పరిస్థితి లేదు. ఈ నెల నుంచి బడ్జెట్ వస్తున్న 725 మంది నుంచి కొంత మంది కట్ చేసుకొని వీరికి పంపిణీ చేయాలని నిర్ణయించారు. దీంతో ఈ నెల ఒక్కో హోంగార్డు నుంచి రూ. 800 వరకు వసూలు చేశారు. ‘‘చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తున్నాం. ఇందులోనూ కోతలు పెడితే ఎలా’’ అంటూ చాలామంది హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుశాఖలో ఎవరికీ తలెత్తని బడ్జెట్ సమస్య హోంగార్డులకే ఎందుకు వస్తోందని వాపోతున్నారు. పోలీసుశాఖలో హోంగార్డులు అంతర్భాగమని, వారు లేని శాఖను ఊహించుకోలేమని కొందరు అధికారులు ఉపన్యాసాల్లో చెబుతుంటారు. అలాంటి హోంగార్డుల సంక్షేమాన్ని మాత్రం అధికారులు పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పిల్లలకు స్కాలర్షిప్లు, వైద్య చికిత్సలు, కల్యాణ మంటపాల్లో రాయితీలు ఏవీ హోంగార్డులకు లేకపోవడం శోచనీయం. కానీ విధులు మాత్రం పోలీసులతో సమానంగా చేయిస్తుండడం గమనార్హం. 725 మందికే బడ్జెట్ జిల్లాలో కేటాయించిన పోస్టుల కన్నా ఎక్కువ మంది హోంగార్డులు ఉన్నారు. 725 మందికి మాత్రమే జీతాలకు సంబందించి బడ్జెట్ రిలీజ్ అవుతోంది. ఇందులో కొంతమందికి జీతాలు రావట్లేదు. వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని నెలలో రెండు రోజులు మిగిలిన వారికి సెలవులు ఇస్తున్నాం. వారి జీతంలో ఆ మొత్తం కట్ చేసి జీతాలు రాని వారికి అందిస్తున్నాం. మరో 200 హోంగార్డు పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశాం. అనుమతి వస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. - చిన్నికృష్ణ, డీఎస్పీ, ఏఆర్ -
ఆ చార్జీలను తగ్గించిన ఎస్బీఐ
న్యూడిల్లీ: దేశంలో అతిపెద్ద వాణిజ్య బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనీ ట్రాన్స్ఫర్ చార్జీలను భారీగా తగ్గించింది. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్సఫర్ (ఎన్ఈఎఫ్టీ), రియల్ టైమ్ గ్రోస్ డెట్లెమెంట్ (ఆర్టిజిఎస్) ఛార్జీలు 75శాతం వరకు తగ్గించినట్టు గురువాం ప్రకటించింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ , బ్యాంకు అందించే మొబైల్ బ్యాంకింగ్ సేవలు ద్వారా జరిగే లావాదేవీలలో తగ్గిన ఛార్జీలు వర్తిస్తాయని బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ తగ్గింపు ధరలు జూలై 15 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ డిజిటల్ ఎకానమీ సాధనలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ మరియు మొబైల్ బ్యాంకింగ్ సేవలను ప్రోత్సహించడానికే ఈ చర్య అని ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ రాజ్నీష్ కుమార్ చెప్పారు. ఎన్ఈఎఫ్టీ సవరించిన రేట్ల ప్రకారం నెఫ్ట్ లావాదేవీలకు రూ.10 వేలకు వరకు రూ. 2 బదులుగా ఇకపై ఒక రూపాయి వసూలు చేయనున్నారు. రూ.10వేల నుంచి లక్షరూపాయల వరకు ట్రాన్సఫర్‌పై ప్రస్తుత రూ. 4 కు బదులుగా 2 రూపాయలు వసూలు చేస్తారు. ఒక లక్ష నుంచి రెండులక్షలరూపాయల మధ్య రూ .12బదులుగా ఇకపై రూ. 3 చార్జ్ పడుతుంది. ఆర్టీజీఎస్ రూ. 2 లక్షల నుంచి రూ.5 లక్షల లావాదేవీపై రూ .20 స్థానంలో ఇకపై 5 రూపాయలు వసూలు చేయనున్నట్లు ఎస్బీ తెలిపింది. రు. 5 లక్షల పైన ట్రాన్సఫర్‌పై రూ. 40 చెల్లించాల్సి ఉంటుంది. కాగా మార్చి 31, 2017 నాటికి ఎస్బీఐ 3.27 కోట్ల ఇంటర్నెట్ బ్యాంకింగ్ వినియోగదారులుండగా దాదాపు 2 కోట్ల మొబైల్ బ్యాంకింగ్ వినియోగదారులు నమోదయ్యారు. చిన్న లావాదేవీలకు ప్రోత్సాహించడంతోపాటు, జీఎస్టీ నేపథ్యంలో ఐఎంపీఎస్ (ఇమ్మిడియేట్ పేమెంట్ సర్వీస్) మనీ ట్రాన్సఫర్లపై కొత్త చార్జీలను ప్రకటించింది. రూ.1000 కి ఎలాంటి చార్జీలు లేకుండా, రూ.1000 నుంచి రూ.1 లక్ష కు రూ.5+జీఎస్టీ , రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల ట్రాన్సఫర్లకు రూ.15+జీఎస్టీ చార్జీలను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. -
భారీగా ధర తగ్గిన సూపర్ బైక్స్
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రీమియం లగ్జరీ బైకుల ఇండియన్ మోటార్ సైకిల్ భారత్‌లో తన సూపర్ బైక్‌లను భారీగా తగ్గించింది. ఇండియాలో జీఎస్టీ అమలు నేపథ్యంలో అమెరికా కల్ట్ బైక్ బ్రాండ్ ఇండియన్ మోటార్ సైకిల్ మూడు మోడళ్ల ధరలపై భారీ తగ్గింపును శుక్రవారం ప్రకటించింది. ఇండియన్ స్కౌట్, ఇండియన్ డార్క్ హార్స్, ఇండియన్ చీఫ్ క్లాసిక్ మూడు మోడళ్ల ధరల తగ్గింపు 9 నుంచి12 శాతం తగ్గించిందని ఇండియన్ మోటార్‌సైకిల్ బైక్‌ల విక్రయ సంస్థ పోలారిస్ ఇండియా వెల్లడించింది. ఇండియన్ స్కౌట్ మోడల్ ధర 12 శాతానికి తగ్గుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రకారం రూ. 14.75 లక్షల నుంచి రూ. 12.99లక్షల కు లభ్యంకానుంది. అదేవిధంగా ఇండియన్ డార్క్ హార్స్ మోడల్ 9 శాతం తగ్గింపు అనంతరం ఇప్పుడు రూ .21.25 లక్షకే అందుబాటులోఉండనుంది. అసలు ధర రూ. 23.4 లక్షలు. జిఎస్టి కాలంలో భారతీయ చీఫ్ క్లాసిక్ మోడల్ ధర రూ .21.99 లక్షలుగా ఉంది. రూ .24.2 లక్షల నుంచి 9.2 శాతం తగ్గించింది. భారతీయ మోటార్ సైకిల్ భారతదేశంలో మొత్తం తొమ్మిది మోడల్స్‌ను వి విక్రయిస్తుంది. కాగా జూలై 1 నుంచి దేశంలో జీఎస్టీ పన్నుల రేటు అమల్లోకిరావడంతో వివిధ కంపెనీలు ఇప్పటికే వినియోగదారులకు జిఎస్టీ ప్రయోజనాలను అందించే లక్ష్యంతో ధరలను తగ్గించాయి. టాటా మోటార్స్, రెనాల్ట్, మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా కార్స్ ఇండియా, ఫోర్డ్, మారుతి సుజుకి, టొయోటా జాగ్వార్ ల్యాండ్ రోవర్, బిఎమ్డి, మెర్సిడెస్ బెంజ్, ఆడి కూడా తమ కార్ల ధరలను తగ్గించాయి. అలాగే హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా, హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, రాయల్ ఎన్ఫీల్డ్, యమహా, సుజుకి మోటార్‌సైకిల్స్ లాంటి ఇతర ద్విచక్ర వాహన తయారీదారులు తగ్గింపు ధరలను ప్రకటించిన సంగతి తెలిసిందే. -
డిపాజిట్ల రేట్లపై కోత పెట్టిన ఎస్బీఐ
ముంబై: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటును మరోసారి తగ్గించింది. కోటి రూపాయల లోపు వార్షిక డిపాజిట్లపై వడ్డీరేటును 15 బేసిస్ పాయింట్లను తగ్గించి 6.75 శాతంగా నిర్ణయించింది. తాజా తగ్గింపుతో ప్రస్తుత వడ్డీరేటు ఏడు సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరింది. 2010 సంవత్సరంలో ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇదే రేటును ఎస్బీఐ అందించింది. కాగా ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ కోటిరూపాయల లోపు ఒక సంవత్సరం నికర డిపాజిట్లపై 6.9 శాతం వడ్డీని అందిస్తున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడాదాదాపు ఇదే రేటును కొనసాగిస్తున్నాయి. -
ఈ వాహనాలపై రూ.2.17లక్షల తగ్గింపు
ముంబై: జూలై1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చిన అనంతరం వాహన తయారీ సంస్థల డిస్కౌంట్ ఆఫర్లు కొనసాగుతున్నాయి. ఈ కోవలో తాజాగా టాటా మోటార్స్ జత చేరింది. జీఎస్టీ ప్రయోజనాలను తమ వినియోగదారులకు చేరవేయాలని భావిస్తున్నట్టు టాటామోటార్స్ ప్రకటించింది. ప్యాసింజర్ వాహనాల ధరలపై రూ. 3,300-2.17 లక్షల మేర తగ్గించింది. వాహన దిగ్గజం టాటా మోటార్స్ భారీగా తగ్గింపు ధరలను ప్రకటించింది. పాసెంజర్ వెహికల్స్‌పై రూ.3వేలనుంచి 2.17 లక్షల వరకు డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. జీఎస్టీతో దేశవ్యాప్తంగా ఏకీకృత పన్నువిధానం అమల్లోకి తేనున్న నేపథ్యంలో మోడల్ , వేరియంట్ పై ఆధారపడి 12 శాతం వరకు తగ్గింపు ధరలను ఆఫర్ చేస్తున్నట్టు టాటా మోటర్స్ ప్రెసిడెంట్, (ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్) మయాంక్ పార్ఖ్ ఒక ప్రకటనలో తెలిపారు. రూ. 3,300 ల నుంచి రూ .2,17,000 వరకు ధర తగ్గింపు ఉండనుందని తెలిపారు. జిఎస్టీని ప్రవేశపెట్టి, దేశవ్యాప్తంగా ఏకీకృత పన్నును అమలు చేయనున్న కేంద్ర ప్రభుత్వం చర్యను తాము హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుందని, ప్రత్యేకించి ఆటోమోటివ్ పరిశ్రమలో ఒక కొత్త శకాన్నిసృష్టింసుందని పేర్కొన్నారు కాగా మహీంద్రా అండ్ మహీంద్రా వినియోగ వాహనాలు, ఎస్‌యూవీల ధరలను సగటున 6.9 శాతం తగ్గించింది. అదేవిధంగా, కంపెనీ చిన్న వాణిజ్య వాహనాల ధరలను కూడా తగ్గించింది. జీఎస్టీ అనంతరం హోండా కార్స్ ఇండియా, ఫోర్డ్ ఇండియా ప్రెవేట్ లిమిటెడ్, ద్విచక్ర వాహనాల తయారీదారులైన టివిఎస్ మోటార్ కంపెనీ లిమిటెడ్, హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎమ్ఎస్ఐ), సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కంపెనీలు తగ్గింపుధరలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. -
ఉద్యోగుల కోత: ఏడేళ్లలో మొదటిసారి
సియోల్: దక్షిణ కొరియా కు చెందిన అతిపెద్ద స్మార్ట్‌ఫోన్, మెమరీ చిప్ తయారీదారు శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కూడా తమ ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గించింది. ఏడు సంవత్సరాలలో మొట్టమొదటిసారిగా ఉద్యోగుల నియామకాల్లో కోత పెట్టింది. ముఖ్యంగా చైనాలో పునర్నిర్మాణం లాంటి చర్యల కారణంగా ఈ పరిణామం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆదివారం వెల్లడైన సంస్థ డేటా ప్రకారం నియామకాలు 5.2 శాతం క్షీణించింది. 2016 నాటికి ప్రపంచంలో శాంసంగ్ ఉద్యోగుల సంఖ్య 325,677 గా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో 325,677 మంది ఉద్యోగులున్నారు. అయితే మహిళా ఉద్యోగ నియామకాల్లో పెరుగుదలను నమోదు చేయం విశేషం. కంపెని అధికారిక యంత్రాంగాన్ని దాని ప్రింటింగ్ బిజినెస్‌ను హెచ్పీకు విక్రయించడంతో పాక్షికంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించింది. చైనా మరియు ఇతర ఆసియా దేశాలలో శాంసంగ్ కర్మాగారాలలో కార్పొరేట్ పునర్నిర్మాణము కూడా విదేశీ ఉద్యోగాల కోతకు దారితీసింది. సంస్థకు దేశీయంగా ఉద్యోగుల సంఖ్య 3.8 శాతం తగ్గి 93,204 కు చేరుకుంది. విదేశాల్లో 5.8 శాతం పతనమై 2,15,541 కు చేరింది. గత ఏడాది చివరి నాటికి, శాంసంగ్ కంపెనీల విదేశీ ఉద్యోగుల సంఖ్య 0.4 శాతం తగ్గి 69.8 శాతంగా ఉంది. అదే చైనాలో అయితే శాంసంగ్ ఉద్యోగుల సంఖ్య 17.5శాతం తగ్గి 44,948 నుంచి 37,070కు పడిపోయింది. ఉత్తర, దక్షిణ అమెరికాలలో 8.5 శాతం పెరిగి 25,988 కు చేరింది. మహిళా ఉద్యోగుల నిష్పత్తి య2 శాతం క్షీణతను నమోదు చేసి 44 శాతంగా ఉంది. మరోవైపు మహిళా మేనేజర్లు మరియు కార్యనిర్వాహకుల నిష్పత్తి గత ఏడాది వరుసగా12.7 శాతం , 6.3 శాతం పెరిగింది. గత ఏడాదితో 12.4 శాతం మరియు 4.5 శాతం తోపోలిస్తే ఈపెరుగుదలను నమోదు చేసింది. కాగా శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ 2016 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 2,468 సహకార వ్యాపార భాగస్వాములను కలిగి ఉంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా 238 ప్రధాన ఉత్పత్తి సౌకర్యాలు, 53 పంపిణీ కేంద్రాలు, 34 పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రాలు, ఏడు డిజైన్ కేంద్రాలు మరియు 73 సర్వీసు సెంటర్లు ఉన్నాయి. -
పీపీఎఫ్, కేవీపీ వడ్డీ రేట్ల కోత
న్యూఢిల్లీ: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), నేషనల్ సేవింగ్ స్కీం, కిసాన్ వికాస పత్ర (కేవీపీ) వడ్డీరేట్లను మరోసారి ప్రభుత్వం కోత పెట్టింది. పీపీఎఫ్, కేవీపీ, సీనియర్ సిటిజన్ డిపాజిట్లు, బాలికా పొదుపు పథకం- సుకన్యా సమృద్ధి యోజనసహా పలు చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీరేట్లపై10 బేసిస్ పాయింట్లను తగ్గించినట్టు కేంద్రం ప్రకటించింది. సీనియర్ సిటిజన్ సేవింగ్ పథకం, సుకన్యా సమృద్ధి యోజన సహా పలు చిన్న మొత్తాల పొదుపు పథకాలపై కూడా వడ్డీరేట్లు తగ్గుతున్నాయి తాజా నిర్ణయం ప్రకారం పీపీఎఫ్ , ఎన్ఎస్సీ పథకాలపై 7.8శాతం, కేవీపీపై 7.5శాతంగా ఉండనుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్ పథకం, సుకన్యా సమృద్ధి పథకాలపై 8.3 శాతం వడ్డీరేటు వర్తించనుంది. ఇప్పటివరకూ ఇది 8.4శాతంగా ఉంది. మూడు నెలలకోసారి మార్కెట్ రేటుకు అనుగుణంగా చిన్న పొదుపు రేట్లను సవరించాలన్న కేంద్ర నిర్ణయం నేపథ్యంలో ఆయా పొదుపు పథకాలపై వడ్డీరేటు10 బేసిస్ పాయింట్ల కోతపెట్టింది. ఈ వడ్డీ రేట్లకు ప్రాతిపదికగా అంతకు ముదు మూడు నెలల ప్రభుత్వ బాండ్ల రేటును తీసుకుంటారు. ఆర్థికాభివృద్ధికి దోహద పడేలా వ్యవస్థను తక్కువ స్థాయి వడ్డీరేటులోకి మార్చాలన్న కేంద్రం లక్ష్యంలో భాగంగా తాజా నిర్ణయం. గత మార్చి నెల సమీక్షలో కూడా 10 బేసిస్ పాయింట్లను తగ్గించింది. -
జీఎస్టీ ఎఫెక్ట్: బజాజ్ బైక్స్‌పై డిస్కౌంట్
న్యూఢిల్లీ: దేశీయ మూడవ అతిపెద్ద టూవీలర్ మేకర్ బజాజ్ ఆటో బైక్ లవర్స్‌కి తీపి కబురు అందించింది. జీఎస్టీ చట్టం అమలు ప్రతిపాదన నేపథ్యంలో బైక్‌ల ధరలను తగ్గించినట్టు ప్రకటించింది. కొనుగోలు చేసిన మోటార్‌సైకిల్ మోడల్ ఆధారంగా రూ. 4500 దాకా డిస్కౌంట్ అందిస్తున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాదు ఈ ఆదేశాలు వెంటనే (జూన్ 14) అమల్లో ఉంటాయని వెల్లడించింది. ఈ డిస్కౌంట్ ధరలు ప్రతి రాష్ట్రాలకు మారుతుంటాయని, మోటారుసైకిల్ మోడల్ ఆదారంగా విభిన్నంగా ఉంటాయని బజాజ్ ఆటో తెలిపింది. జూన్ 14 నుంచి జూన్ 2017 మధ్య బుకింగ్స్ , డిస్కౌంట్ల కోసం స్థానిక బజాజ్ ఆటో డీలర్లను సంప్రదించాలని కోరింది. జీఎస్టీ అమలుకు రంగం సిద్ధమైన తరుణంలో తమ వినియోగదారుకుల సరసమైన ధరల్లో బైక్ లనుఅందించాలని నిర్ణయించినట్టు బజాజ్ ఆటో అధ్యక్షుడు ఎరిక్ వాస్ చెప్పారు. ఈ డిస్కౌంట్ ద్వారా తమ కలల బైక్‌ను సొంతం చేసుకునేందుకు కస్టమర్లు జూలై 1 వరకు వేచి చూడాల్సిన అవసర లేదన్నారు. కస్లమర్లకు మెరుగైన సేవలు అందిస్తున్న మొట్టమొదటి దేశీయ సంస్థగా ఉండటం తమకు గర్వకారణమన్నారు. కాగా జీఎస్టీ పరిధిలో, ద్విచక్ర వాహనాలపై 28 శాతం పన్ను అమల్లోకి రానుంది. ప్రస్తుతం ఇది 30శాతం కంటే తక్కువగా ఉంటుంది. 3500 సిసి పైగా ఇంజిన్ సామర్థ్యం ఉన్న బైక్‌లు 3 శాతం అదనపు సెస్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. -
ఐసీఐసీఐ కూడా గుడ్ న్యూస్ చెప్పిందోచ్!
న్యూఢిల్లీ: ప్రయివేటుబ్యాంక్దిగ్గజం ఐసీఐసీఐ కూడా గృహకొనుగోలు దారులకు శుభవార్త అందించింది. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్టు ను తగ్గించిన అనంతరం తాజాగా ఐసీఐసీఐ హెం లోన్లపై తగ్గింపు వడ్డీరేటును ప్రకటించింది. గృహ రుణాల రేట్లపై 0.3 శాతం తగ్గించాలని నిర్ణయించినట్టు బ్యాంకు సోమవారం ప్రకటించింది. రూ. 30లక్షలలోపు రుణాలపై ఈ తగ్గింపును అమలు చేయనుంది. ఎఫర్డబుల్ హౌ సింగ్ పథకానికి ఊతమిచ్చే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త ప్రభుత్వ పథకం కింద, రూ.30 లక్షల రూపాయల కింద ఉన్న రుణాలు సరసమైన గృహాల రుణాలపై 0.3శాతం వడ్డీరేటును అమలు చేయనుంది. ఈ తగ్గింపుతో, పరిశ్రమలో అతి తక్కువ ధరల్లో గృహ రుణాలను జీతాలు తీసుకునేవారికి అందుబాటులో తెచ్చింది. సాలరీడ్ మహిళా ఉద్యోగులు 8.35 శాతం రేటులోనూ, ఇతరులు 8.40 శాతం గృహ రుణాలు పొందనున్నారని ఒక ప్రకటనలోతెలిపింది. కాగా ఇప్పటికే ప్రభుత్వ అతిపెద్ద బ్యాంకు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా 0.25 శాతం మేరకు సరసమైన గృహ రుణ రేనుఏ తగ్గించింది. దీని ప్రకారం 25 లక్షల రూపాయల లోపు రుణగ్రహీతలకు 8.40 శాతం, రు .1 కోట్ల వరకు వడ్డీ రేటును 8.50 శాతం వడ్డీ రేటు అమల్లోకి రానుంది. మహిళల రుణగ్రహీతలకు రు. 25 లక్షల వరకు రుణాలకు 8.35 శాతం ప్రత్యేక వడ్డీని అందిస్తోంది. అలాగే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఒక కొత్త పథకాన్ని లాంచ్ చేసింది. 'గ్రాహ సిద్ధి' పేరుతో లాంచ్ చేసిన ఈ పథకంలో నిర్మాణం, గృహ లేదా ఫ్లాట్, మరమ్మత్తు లేదా పునర్నిర్మాణాల కోసం రుణాలను మంజూరు చేయనున్నట్టుప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఎస్బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్
-
ఎస్బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు తీపి కబురు అందించింది. గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గిస్తూ ఎస్బీఐ నిర్ణయం తీసుకుంది. రూ.30లక్షలపైన ఉన్న లోన్లపై 10బేసిస్ పాయింట్లు, రూ.30లక్షలలోపు ఉన్న లోన్లపై 25బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్లు సోమవారం పక్రటించింది. మే 9వ తేదీనుంచి ఈ వడ్డీరేట్లు అమల్లోకి రానున్నాయని తెలిపింది. దీని ప్రకారం రూ.30లక్షల లోపు రుణాలపై ప్రస్తుతం ఉన్న వడ్డీరేటు 8.6 శాతం నుంచి 8.35శాతంగా ఉండనుంది. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్) పథకం కింద రుణం తీసుకునే ఖాతాదారులు కనీసం రూ. 2.67లక్షల దాకా సబ్బిడీ పొందవచ్చునని తెలిపింది. ఈ పథకం కింద మధ్య ఆదాయ వర్గాల వారు మొదటి సారి గృహ రుణ రుణగ్రహీతలు ఈ తగ్గింపును పొందవచ్చని తెలిపింది. తమ రేట్లు తగ్గింపుతో గృహ కొనుగోలుదారులకు సరసమైన ధరలో గృహాలు సొంతం చేసుకోవాలనుకునే మిలియన్ల మంది కల నెరవేరుతుందని నేషనల్ బ్యాంకింగ్ గ్రూపు మేనేజింగ్ డైరెక్టర్ రాజ్నీష్ కుమార్ చెప్పారు. మరోవైపు ఈప్రభావం మార్కెట్లో షేర్ ధరపై చూపించింది. ఇంట్రాడేలో రూ.300మార్క్ మరోసారి టచ్ చేసిన ఎస్బిఐ అనంతరం రూ.294కి పతనమైంది. మళ్లీ కోలుకొని దాదాపు 2 శాతం లాభాలతో కొనసాగుతోంది. -
సూరీడి వాత.. విద్యుత్ కోత
కొవ్వూరు : సూరీడు చిర్రెత్తిస్తున్నాడు. జిల్లాలో ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. జంగారెడ్డిగూడెంలో సోమవారం అత్యధిక ఉష్ణోగ్రత 44 డిగ్రీలు నమోదైంది. వేడి గాలులు, ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. దీనికి విద్యుత్ కోతలు తోడయ్యాయి. జిల్లా అవసరాల మేరకు విద్యుత్ సరఫరా కాకపోవడంతో లోటును భర్తీ చేసుకోవడానికి రోజుకో ప్రాంతంలో కోత విధిస్తున్నారు. రానున్న రోజుల్లో వినియోగం మరింత పెరగనుండగా.. విద్యుత్ కోతల సమస్య మరింత తీవ్రం కానుంది. జిల్లాలో ప్రస్తుతం రోజుకు 820 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతోంది. ట్రాన్స్‌కో నెట్వర్క్ సమస్య కారణంగా 30 నుంచి 40 మెగావాట్ల విద్యుత్ కొరత ఏర్పడుతోంది. దీంతో కొన్ని ప్రాంతాలకు సరఫరాలో కోత విధిస్తున్నారు. కామవరపుకోట మండలం ఆడమిల్లిలో 400 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణంలో ఉంది. ఇది పూర్తయితే జిల్లాకు 230 మెగావాట్ల విద్యుత్ అందే అవకాశం ఉంది. సూర్యాపేట నుంచి అందే ఒకలైన్కు మాత్రమే కనెక్షన్ ఇవ్వడంతో ఈ సబ్ స్టేషన్ నుంచి 70 నుంచి 80 మెగావాట్ల విద్యుత్ మాత్రమే అందుతోంది. విశాఖలోని హిందూజా ప్లాంట్‌నుంచి మరో లైన్ ఈ సబ్‌స్టేషన్‌కు రావాల్సి ఉంది. ఆ పనులు ఇంకా పూర్తి కాలేదు. సరఫరాలో నష్టాలతో కొన్ని ప్రాంతాల్లో లో ఓల్టేజీ సమస్య తలెత్తుతోంది. దీంతో అధికారులు కొన్ని ప్రాంతాల్లో కోతలు విధిస్తున్నారు. రానున్న రోజుల్లో విద్యుత్ కోతలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నారు. -
బేస్ రేటు కోత: ఎస్బీఐ బంపర్ బొనాంజా
న్యూఢిల్లీ: దేశీయ ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు బంపర్ బొనాంజా ప్రకటించింది. బేస్ రేటులో 15 బేసిస్ పాయింట్లను తగ్గిస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. అనుబంధ బ్యాంకుల విలీనంతో అతిపెద్ద బ్యాంకు గా అవతరించిన 48 గంటల లోపే పాత వినియోగదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. దీంతో ప్రస్తుత బేస్‌రేటు 9.1 శాతంగా ఉండనుంది. ఈ రేట్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నట్టు తెలిపింది. గృహ, వాహనాలపై పాత రుణాలపై (మార్చి 31, 2016కు ముందు తీసుకున్న రుణాలు) వడ్డీరేటులో కోత పెట్టింది. గృహ, వాహన రుణాలపై ప్రస్తుత రేటు 9.1 శాతంగా నిర్ణయించింది. అయితే ఎంసీఎల్ఆర్ ను యథతథంగా ఉంచుతున్నట్టు ప్రకటించింది. ఎస్బీఐ జనవరిలో ప్రకటించిన వార్షిక రుణ వడ్డీరేట్లను 8 శాతం వద్ద, రెండు సంవత్సరాల వడ్డీరేటును 8.1 శాతం వద్ద యథాతథంతా ఉంచింది. కాగా ఎంసీఎల్ఆర్కు బేస్‌రేటుకు మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉండటంతో పాత రుణాలపై అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తోదని ఖాతాదారులు అందోళనవ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఉదాహరణకు ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ ప్రస్తుతం 8శాతంగా ఉండగా బేస్ రేటు 9.25శాతం ఉంది. గత పదిహేను నెలల్లో ఎస్బీఐ తన ఎంసీఎల్ఆర్ను దాదాపు 1.20శాతంతగ్గించగా బేస్‌రేటును మాత్రం కేవలం 0.05శాతం తగ్గించింది. అయితే అంచనాల ప్రకారం మొత్తం ఫ్లోటింగ్ రేటు రుణాల్లో కేవలం 30-40శాతం ఎంసీఆల్ ఆర్ ఆధారిత లోన్లుకాగా మిగిలిన రుణాలు బేస్ రేట్ ఆధారితం. -
సెబీ ఛైర్మన్‌పై ప్రభుత్వ అనూహ్య నిర్ణయం
న్యూఢిల్లీ : క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటరీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ సెబీ ఛైర్మన్ పదవికాలంపై ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. తదుపరి సెబీ చీఫ్ అజయ్ త్యాగి (58)పదవీకాలంలో కోత పెట్టింది. సాదారణంగా అయిదేళ్లు ఉండే సెబీ ఛైర్మన్ పదవీకాలానికి భిన్నంగా త్యాగిపదవీకాలంలో రెండేళ్లను తగ్గించింది. ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారి ఒకరు శుక్రవారం ప్రకటించారు. అయితే ఈ నిర్ణయంవెనక కారణాలను మాత్రం వెల్లడించలేదు. సెబీ చీప్‌గా త్యాగి పేరును ప్రకించిన వారం తరువాత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. దీంతో సెబీ చీఫ్‌గా త్యాగి మూడేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన త్యాగి, అర్థశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ 1984 బ్యాచ్ ఐఎఎస్ కేడర్ కు చెందిన ఈయన ప్రస్తుతం ఆర్థిక వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి (పెట్టుబడి) గా పనిచేస్తున్నారు. అలాగే స్వల్పం కాలం పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డులో సభ్యుడుగా కూడా ఉన్నారు. త్వరలోనే ఆయన సెబీ చీఫ్‌గా బాధ్యతలను స్వీకరించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ ఫిబ్రవరి 10న త్యాగి నియామకానికి ఆమోదం తెలిపింది. యూపీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో 2011 ఫిబ్రవరి 18న నియమితుడైన ప్రస్తుత చీఫ్ యుకె సిన్హా పదవీకాలాన్ని రెండేళ్ల పాటు పొడిగించడంతో ఆరు సంవత్సరాలకు పైగాపదవిలో కొనసాగారు. అంతేకాదు డి.ఆర్. మెహతా (1995 -2002) తర్వాత ఎక్కువ కాలంలో సెబీ చీఫ్ పదివిలో వున్న రెండవ వ్యక్తిగా నమోదయ్యారు. యుకె సిన్హా పదవీకాలం మార్చి 1,2017 న ముగియనుంది. కాగా సెబీ, స్టాక్ ఎక్సేంజ్ లనునియంత్రించడంతోపాటు, వేల లిస్టెడ్ కంపెనీలు, బ్రోకర్లు సహా వివిధ మార్కెట్ సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్ఐఐలు ,రేటింగ్ ఏజెన్సీలు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లను సెబీ పర్యవేక్షిస్తుంది. -
ఆర్బీఐ కంటే ముందే శుభవార్త చెప్పిన ఐడీబీఐ
ముంబై: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఐడిబిఐ వడ్డీరేట్లను తగ్గించింది. గృహ రుణాలపై 0.60శాతంకోత పెట్టి 8.55శాతం వద్ద నిలిపింది. ఇప్పటివరకు ఈ ఎంసీఎల్ఆర్ రేటు 8.7శాతంగా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన రేట్ల కంటేముందుగానే తన తగ్గింపు నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ తగ్గింపు రేట్లు ఫిబ్రవరి 1నుంచి అమలు చేయనున్నట్టు బ్యాంక్ ప్రకటించింది. వర్గాల వారీగా రుణాలు వివిధ కాలపరిమితి రుణాలపై 0.30శాతం నుంచి 0.35శాతం వడ్డీతోచౌకగా రుణాలను అందించనున్నట్టు ఐడీబీఐ ఒకప్రకటనలో తెలిపింది. వార్షిక ఎంసీఎల్ఆర్ ను 8.60శాతం , రెండు సంవత్సరాల రేటు 8.85శాతంగా, వద్ద పెగ్గెడ్ ఉండగా, ఒక నెల రేటు 8.40శాతం, ఓవర్ నైట్ రేటును 8.20శాతంగా ఉండనున్నట్టు ప్రకటించింది. గృహరుణాలపైనే తాము ఎక్కువగా దృష్టిపెట్టినట్టు బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, మైథిలీ బాలసుబ్రమణ్యన్ తెలిపారు. త్వరలో కారు లోన్లపై కూడా వడ్డీరేటునుత గ్గించే యోచనలో ఉన్నట్టు చెప్పారు. -
ఐసీఐసీఐ కూడా...
ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకుల సరసన ప్రయివేట్ రంగ బ్యాంకు కూడా చేరిపోయింది. రుణాలపై వడ్డీరేటు కోతలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకు సహా అనేక ఇతర బ్యాంకుల బాటలో ఐసీఐసీఐ కూడా పయనించింది. గృహ, వాహన, ఇతర రుణాలను ఇక మరింత చౌకగా అందించనుంది. ఎంసీఎల్ ఆర్ లో 0.7శాతం కోత పెట్టింది. తమ బేస్ లెండింగ్ రేటు లో వార్షిక రేటును 8.20 శాతంగా నిర్ణయించినట్టు ఐసిఐసిఐ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. సవరించిన ఈ రేట్లు జనవరి 3 నుంచి అమల్లోకి రానున్నట్టు తెలిపింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా బ్యాంకులన్నీ రుణాలపై వడ్డీరేట్లలో కోతపెడుతున్నాయి. ముఖ్యంగా ఎస్ బీఐ, పీఎన్ బీ సహా కోటక్ మహీంద్రా బ్యాంక్, దేనా బ్యాంక్, బంధన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ , యూనియన్ బ్యాంక్ వంటి ఇతర రుణదాతలు కూడా ఎంసీఎల్ ఆర్ లో కోత పెట్టిన సంగతి తెలిసిందే. -
యాక్సిస్ బ్యాంక్ గుడ్‌న్యూస్
ముంబై: దేశంలో అతిపెద్ద ప్రయివేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంకు కూడా రుణ గ్రహీతలకు శుభవార్త అందించింది. వార్షిక హోం లోన్ వడ్డీ రేట్ల కోతను ప్రకటించింది. వార్షిక ఎంసీఎల్ఆర్ ను 15 బేసిస్ పాయింట్లను తగ్గిస్తున్నట్లు బుధవారం వెల్లడించింది. నవంబర్ 18 నుంచి ఈ తగ్గింపు రేట్లు అమల్లోకి వస్తాయని తెలిపింది. కాగా ఆర్బీఐ సూచనల మేరకు గత ఆగస్టులో 8.95 శాతం తగ్గింపు రేట్లను యాక్సిస్ బ్యాంకు ప్రకటించింది. తాజాగా మరోసారి రుణాలపై వడ్డీరేటును తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు ఫెస్టివ్ సీజన్ లో ప్రభుత్వరంగ దిగ్గజం ఎస్ బీఐ, మరో ప్రయివేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ ఇటీవల వడ్డీరేట్ల కోత పెట్టాయి. ముఖ్యంగా మహిళలకు వార్షిక హోం లోన్ వడ్డీ రేట్ల (ఎంసీఎల్ఆర్) ను 9.1 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
తీపి కబురందించిన ఐసీఐసీఐ
ముంబై: విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే ప్రయివేట్ బ్యాంకు దిగ్గజం ఐసీఐసీఐ కూడా తీపి కబురు అందించింది. నవంబరు 2 నుంచి హోం లోన్లపై వడ్డీరేట్లను స్వల్పంగా తగ్గించింది. వార్షిక ఎంసీఎల్ ఆర్ 15 బీపీఎస్ పాయింట్లను తగ్గిస్తున్నట్టు గురువారం ప్రకటించింది. ఐసిఐసిఐ బ్యాంక్ వెబ్ సైట్ ప్రకారం వడ్డీరేటును 9.30 శాతం నుంచి 9.15 శాతానికి తగ్గించింది. అదే సమయంలో వేతన వర్గాలకు 9.35శాతంగా ఉన్న వడ్డీరేటు సవరించిన కొత్త రేటు ప్రకారం ప్రస్తుతం 9.20 శాతంగా ఉండనుంది. ముఖ్యంగా మహిళా ఖాతాదారులకు 9.15శాతం వడ్డీరేటులో గరిష్టంగా రూ.75 లక్షల వరకు గృహరుణాలను అందుబాటులోకి తెచ్చింది. అలాగే తాజాగా బ్యాంక్ టర్మ్ లోన్, ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని కల్పించిన ఐసీఐసీఐ వేతన జీవులకు మరో వెసులుబాటు కల్పించింది. సాలరీడ్ ఎంప్లాయిస్ కి( వేతన జీవులకు) రుణ వడ్డీరేటును 9.20 శాతంగా ప్రకటించింది. కాగా స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఫెస్టివల్ ఆఫర్ పేరుతో గృహ రుణాలపై వడ్డీ రేట్లను తాజాగా తగ్గించింది. 20 బేసిస్ పాయింట్లు కోత పెట్టడంతో వడ్డీ రేటు 9.1 శాతానికి దిగి ఆరేళ్ల కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది. ఇతర రుణగ్రహీతలకు కూడా గృహ రుణాలను 9.15 శాతం వడ్డీ రేటుకే అందించనున్నట్లు ప్రకటించడంతో పాటుగా ప్రాసెసింగ్ ఫీజును రూడా మాఫీ చేసిన సంగతి తెలిసిందే. -
మహిళలకు ఎస్బీఐ శుభవార్త!
దేశంలోనే అతి పెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పండుగల పథకంకింద మహిళా రుణగ్రహీతలకు చౌకగా రుణాలను అందించేందుకు నిర్ణయించినట్లు మీడియా రిపోర్టు చేసింది. ఈ వార్తల ప్రకారం ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ తగ్గింపు రుణ రేట్లను ప్రకటించింది. ముఖ్యంగా మహిళలకు వార్షిక హోం లోన్ వడ్డీ రేట్ల (ఎంసీఎల్ఆర్) ను 9.1 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇది గత ఆరేళ్లలోనే కనిష్టరేటని మార్కెట్ల ఎనలిస్టులు చెబుతున్నారు. అయితే ఫెస్టివ్ సీజన్ లో అమలు చేస్తున్న ఈ వడ్డీరేట్లు నవంబర్, డిసెంబర్లలో మంజూరు చేసే రుణాలకు వర్తించనున్నట్లు ఎస్బీఐ వెల్లడించింది. అంతేకాదు బిజీ సెషన్ సందర్భంగా ఇతర రుణగ్రహీతలకు కూడా గృహ రుణాలను 9.15 శాతం వడ్డీ రేటుకే అందించనున్నట్లు ప్రకటించింది. దీంతో పాటుగా ప్రాసెసింగ్ ఫీజును రూడా మాఫీ చేస్తోంది. కాగా ఆర్ బీఐ సూచనల మేరకు గత వారమే తగ్గింపు రేట్లను ప్రకటించిన బ్యాంకు మరోసారి రుణాలపై వడ్డీరేట్లు తగ్గింపును ప్రకటించింది. ఈ సవరించిన రేట్లు కింద గృహ రుణాల వార్షిక ఎంసీఎల్ఆర్ 8.90 శాతంగా ఉంది. -
లాభాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబై: మంగళవారం నాటి స్టాక్ మార్కెట్లు రెపో రేట్ల తగ్గింపును అందిపుచ్చుకున్నాయి. ఆర్ బీఐ ప్రకటన కోసం వేచి చూసిన దలాల్ స్ట్రీట్ ఆరంభంనుంచీ అప్రతమత్త ధోరణిలో కొనసాగింది. ఆర్బీఐ ప్రకటన తర్వాత ఒకదశలో 100 పాయింట్లకు పైగా ఎగిసింది. చివరికి సెన్సెక్స్ 91పాయింట్ల లాభంతో 28,334 వద్ద,నిప్టీ 31పాయింట్ల లాభంతో 8, 769వద్ద ముగిశాయి. నిఫ్టీ కీలకమద్దతు8750 స్థాయికి పైన స్థిరంగా ముగిసింది. దాదాపు అన్ని సెక్టార్లు ముఖ్యంగా ఐటీ, మెటల్స్, ఫార్మా, బ్యాంకింగ్, రియల్టీ రంగాల్లో నెలకొన్న కొనుగోళ్ ధోరణితో లాభాలను ఆర్జించాయి. మిడ్ క్యాప్ షేర్లు రికార్డుస్థాయి లాభాలను గడించాయి. ఓఎన్జీసీ, గెయిల్ టాప్ గెయినర్ గా నిలువగా టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ఇన్ఫ్రాటెల్, బీపీసీఎల్, టాటా పవర్, హెచ్‌సీఎల్ టెక్ లాభపడగా, జీ ఎంటర్ టైన్ మెంట్, కోల్ ఇండియా, ఎంఅండ్ఎం, ఎల్అండ్టీ, ఇండస్ఇండ్, అంబుజా, యాక్సిస్, హెచ్‌యూఎల్, హిందాల్కో క్షీణించాయి. ద్రవ్య పరపతి సమీక్షలో కీలకమైన వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును రిజర్వ్ బ్యాంక్ 0.25 శాతంమేర తగ్గించడంతో దేశీ స్టాక్ మార్కెట్లకు జోష్వచ్చింది. అటు డాలర్ మారకపు విలువలో రూపాయి0.03 పైసల లాభంతో 66.55 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పుత్తడి పది గ్రా. రూ. 51 లాభంతో రూ.30,630 వద్ద ఉంది. -
అరుంధతి ఔట్!
న్యూఢిల్లీ: తదుపరి ఆర్బీఐ గవర్నర్ పదవికోసం అభ్యర్థి ఎంపికలో ఎస్బీఐ చైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్యకు ప్రభుత్వం షాక్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఈ అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో కేంద్ర బ్యాంకు గవర్నర్ రేసులో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రభుత్వం మరింత కుదించింది. ఈ షార్ట్ లిస్ట్ ను నాలుగు నుంచి రెండుకు కుదించిందని గురువారం నివేదికలు వెల్లడించాయి. అరుంధతి భట్టాచార్య, ఊర్జిత్ పటేల్ పక్కన పెట్టిన ప్రభుత్వం ఆర్ బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్లు రాకేష్ మోహన్, సుబీర్ గోకర్న్ పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. డోజౌన్స్ వైర్ అంచనాల ప్రకారం అరుణ్ జైట్లీతో చర్చించిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నియామకాన్ని ప్రకటించే అవకాశం ఉంది. జులై 15వ తేదీకల్లా ఈ నియామకం పూర్తి కావచ్చని చెబుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్ బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్లు రాకేష్ మోహన్, సుబీర్ గోకర్న్ గట్టి ప్రధాన పోటీదారులుగా నిలిచారు. ప్రధానంగా ముందు ఆరుగురుతోనూ, ఇద్దరి తొలగించి ఆ తరువాత నలుగురు అభ్యర్థులతో కూడిన జాబితాను ఎంపిక చేసిన ప్రభుత్వం మరో ఇద్దరిని కూడా ఈ జాబితా నుంచి తొలగించింది. ఎస్ బీఐ చైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్య, ప్రస్తుత ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ను పక్కన పెట్టడంతో.. మాజీ డిప్యూటీ గవర్నర్లు రాకేష్ మోహన్, సుబీర్ గోకర్న్ ఫైనల్ రేసులో మిగిలారు. మరి వీరిలో ఎవర్ని ఆ పదవి వరించనుది అనేది ప్రస్తుతానికి సస్పెన్సే. -
ఆ నలుగురిలో గెలిచేది ఎవరు?
న్యూఢిల్లీ : తదుపరి ఆర్బీఐ గవర్నర్‌గా ఎవరు బాధ్యతలు చేపడతారనే అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. అటు ప్రభుత్వం కూడా అభ్యర్థుల జాబితాను కుదించడంతో భారీ ఉత్కంఠ నెలకొంది. రఘురామ్ రాజన్ గవర్నర్‌గా కొనసాగరని స్పష్టం కావడంతో రాజన్ వారసుడి ఎంపికపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అటు ప్రభుత్వం కూడా ఈ ఎంపికలో తన అభ్యర్థుల జాబితాను కుదించినట్టు సీనియర్ అధికారి రాయిటర్స్ కి చెప్పారు. కొత్త ద్రవ్య విధాన కమిటీ (మానిటరీ పాలసీ కమిటీ)కూడా త్వరలో గవర్నర్ ను ఎంపిక చేస్తుందని తెలిపారు. ప్రధానంగా నలుగురు అభ్యర్థుతో కూడిన జాబితాను ఎంపిక చేశామన్నారు. వీరిలో ముగ్గురు కేంద్ర బ్యాంకు మాజీ, ప్రస్తుత ఉన్నతోద్యోగులు కాగా, మరొకరు స్టేట్ బ్యాంక్ చైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్య . ప్రస్తుత ఆర్బిఐ డిప్యూటీ గవర్నర్ ఉర్జిత్ పటేల్, మాజీ డిప్యూటీ గవర్నర్లు రాకేష్ మోహన్, సుబీర్ గోకర్న్ గవర్నర్ రేసులో ఉన్నారు. ఒకవైపు ఎస్ బీఐ అధిపతి అరుంధతి భట్టాచార్య ఈ పదవికి ఎంపిక కావడం ఖాయమనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. అలాగే ప్రభుత్వం షార్ట్ లిస్ట్ చేసిన జాబితాలో కూడా ఈమె పేరు ప్రముఖంగా ఉండడంతో ఇవి మరింత ఊపందుకున్నాయి. మరోవైపు దేశ ఉన్నత బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధిపతిగా అరుంధతి ఎంపిక పై వస్తున్న ఊహాగానాలపై నెటిజన్లు దాదాపు నెగిటివ్ గా స్పందిస్తున్నారు. ఆమెకు అంత అర్హత లేదనీ, ప్రస్తుత అనిశ్చిత ఆర్థిక పరిస్థితులలో ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టే దక్షత, నైపుణ్యంలేవని వాదిస్తున్నారు. ఒకవేళ ఆర్ బీఐ అత్యున్నత పదివికి అరుంధతి భట్టాచార్య ఎంపిక అయితే ..అరవింద సుబ్రమణియన్, శక్తికాంత్ దాస్లపై విమర్శలు గుప్పించిన బీజేపీ ఎంపీ, సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ఎలా స్పందిస్తారు? ఈ నేపథ్యంలో గవర్నర్ రేసు పై అంతకంతకూ సస్పెన్స్ పెరుగుతోంది. మరి దీనికి తెరపడాలంటే తుది నిర్ణయం కోసం వేచి చూడాల్సిందే.. కాగా ప్రస్తుత గవర్నర్ రఘురామ రాజన్ పదవీకాలం ఈ సెప్టెంబర్ లో ముగియనుండటం,అటాగే బ్రెగ్జిట్ పరిణామాల నేపథ్యంలో మార్కెట్లను బలమైన సంకేతాలను అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రక్రియ వేగవంతమైంది. అటు తను రెండవసారి ఆర్ బీఐ గవర్నర్ గా కొనసాగనని రాజన్ స్పష్టం చేయడంతో కేంద్ర బ్యాంకు ఉన్నత పదవిని అధిరోహించే అభ్యర్థుల రేస్ మొదలైంది. వీరిలో బలంగా వినిపించిన ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ పేర్లను తొలగించడం విశేషంగా మారింది. -
అసదుద్దీన్ మెడపై కత్తిపెట్టి...
ముంబైః మహరాష్ట్ర నవ నిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ థాకరే 48వ పుట్టిన రోజు కార్యక్రమంలో తనదైన తీరును ప్రదర్శించారు. అభిమానుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ఆయన..ఆయన మద్దతుదారులు తెచ్చిన ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ చిత్రంతోకూడిన కేక్ ను ముందుగా పీకదగ్గర కట్ చేసి, తన శైలిని చాటుకున్నారు. మహరాష్ట్రకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని సైతం ఇలా కేక్ ముక్కల్లా కట్ చేస్తామని కూడ రాజ్ థాకరే అన్నట్లు తెలుస్తోంది. ముంబై దాదర్ లోని తన నివాసం కృష్ణ కుంజ్ లో పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్న రాజ్ థాకరే... అసదుద్దీన్ ఫొటోతో కూడిన కేక్ ను కట్ చేసి తనదైన శైలిలో మరోసారి వివాదానికి తెరతీశారు. తాను కట్ చేసిన కేక్ ను అభిమానులందరికీ పంచిన ఆయన... మహరాష్ట్రను వ్యతిరేకించేవారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన మెడమీద కత్తి పెట్టినా భారత్ మాతాకీ జై అనేది లేదని చెప్పిన ఒవైసీ పై గతంలో మండిపడ్డ థాకరే.. పార్టీ నిర్వహిస్తున్న మొదటి గుడిపడ్వా ర్యాలీ సందర్భంగా చిత్రంలోని ఒవైసీ మెడపై కత్తిపెట్టి కేక్ కట్ చేశారు. ఇదిలా ఉంటే అసదుద్దీన్ కేక్ ను కట్ చేసిన ఘటనను ఏఐఎంఐఎం ఎమ్మెల్యే వారిస్ పఠాన్ ఖండించారు. కేక్ కట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
వెయ్యిమంది ఉద్యోగులపై వేటు
ఫిన్ లాండ్ : 'నీకు నాకు నోకియా' అన్నట్టుగా ఒకప్పుడు టాప్ లెవల్లో దూసుకుపోయిన నోకియా బ్రాండ్ ఫోన్లకు క్రమేపీ ఆదరణ తగ్గిపోయింది. స్మార్ట్‌ఫోన్ హవా పెరిగిపోవడంతో పోటీని తట్టుకోలేక నోకియా చతికిలబడింది. ఈ నేపథ్యంలో తన సొంత గడ్డ పైనే ఉద్యోగుల్లో భారీ కోత పెడుతోంది. భారీ నష్టాల కారణంగా సంస్థ ఆదాయం కుదేలవ్వడంతో ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. కాస్ట్ కటింగ్ పేరుతో గత దశాబ్ద కాలంగా ఉద్యోగుల సంఖ్యకు కోతవేస్తూ వచ్చిన నోకియా తాజాగా ఫిన్లాండ్లో 1,032 ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతోపాటు భవిష్యత్తులోనూ మరిన్ని ఉద్యోగాలకు కోత విధించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. నోకియా ఇటీవలే అల్కాటెల్ ల్యూసెంట్ అనే కంపెనీని విలీనం చేసుకుంది. ఈ నేపథ్యంలో బిలియన్ డాలర్ ఆదాయాన్ని మిగిల్చుకునే వ్యూహంలో భాగంగా ఈ చర్యకు దిగింది. అయితే ఎంతమందిని తీసేస్తుందన్న విషయంపై కచ్చితమైన వివరాలు ఇచ్చేందుకు సంస్థ నిరాకరించింది. ఆయా దేశాల్లో తమ ప్రతినిధులతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించింది. దాదాపు 30 దేశాల ఉద్యోగ ప్రతినిధులతో చర్చలు జరపనున్నట్టు వెల్లడించింది. కాగా ప్రపంచ వ్యాప్తంగా నోకియాకు సుమారు ఒక లక్షా నాలుగువేల మంది ఉద్యోగులు ఉండగా, ఫిన్ లాండ్ లో 6,850, జర్మనీలో 4800, ఫాన్స్ లో 4,200 మంది ఉన్నారు. మరోవైపు నోకియా ఫోన్లు మళ్లీ మార్కెట్లో హల్ చల్ చేయనున్నాయనే వార్తల నేపథ్యంలో.. ఉద్యోగులపై వేటు వేయడం సంచలనంగా మారింది. -
ఒవైసీ నాలుక కోస్తే రివార్డ్
లక్నో: గొంతు మీద కత్తి పెట్టినా భారతమాతాకి జై అననన్న ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. తాజాగా ఈ వివాదానికి ఉత్తరప్రదేశ్ వేదికైంది. ఒవైసీ నాలుక కట్ చేసినవారికి రూ. 21 వేల రివార్డు ఇస్తానని మీరట్ కాలేజీ ఏబీవీపీ విద్యార్థి నేత ఒకరు ప్రకటించి అగ్గి రాజేశారు. ఒవైసీ వ్యాఖ్యలకు నిరసనగా ఏబీవీపీ మంగళవారం ఆయన దిష్టిబొమ్మను దహనం చేసింది. ఈ సందర్భంగా కాలేజీ విద్యార్థి సంఘం మాజీనేత దుష్యంత్ తోమర్ విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. భరతమాతను గౌరవించడానికి నిరాకరించిన ఒవైసీ నాలుక తెగ్గోస్తే రూ. 21వేల బహుమతి ఇస్తానని ప్రకటించారు. ఒవైసీ దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించడమే కాకుండా.. తాను దేశభక్తుడు కాదని నిరూపించుకున్నారంటూ విద్యార్థి నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒవైసీ లోక్‌సభ సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తన పీకమీద కత్తి పెట్టినా భారత్ మాతాకీ జై అనను అన్న ఒవైసీ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రాజేశాయి. కొత్తతరానికి భారతమాతను కీర్తిస్తూ నినాదాలు చేయడం నేర్పాలని ఆర్ఎస్ఎస్ నాయకుడు మోహన్ భగవత్ సూచించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఒవైసీపై మండిపడ్డారు. దీంతోపాటు ఒవైసీ దేశం విడిచిపోవాలనే విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. -
పరిశ్రమలకు ప్రోత్సాహమేదీ?
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమల శాఖకు జరిగిన కేటాయింపులను గత ఏడాదితో పోలిస్తే 2016-17 ఆర్థిక బడ్జెట్లో రూ.6.64 కోట్ల మేర కోతలు విధిస్తూ ఆర్థిక మంత్రి ప్రతిపాదనలు సమర్పించారు. గత ఏడాది పరిశ్రమల శాఖకు రూ.973.73 కోట్లను ప్రణాళిక, ప్రణాళికేతర పద్దుల క్రింద ప్రతిపాదించగా.. ఈ ఏడాది రూ.967.09 కోట్లకు పరిమితం చేశారు. ఇందులో రూ.859.63 కోట్లను ప్రణాళికా వ్యయం కింద ప్రతిపాదించారు. గతేడాది ప్రతిపాదించిన బడ్జెట్లో ఇప్పటి వరకు రూ.689.26 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు సవరణ ప్రతిపాదించారు. ప్రస్తుత బడ్జెట్లో పరిశ్రమల విభాగానికి మినహా.. ఇతర అనుబంధ శాఖల కోటాలో భారీగా కోత విధించారు. విదేశీ వాణిజ్యం, ఎగుమతులు, చక్కెర పరిశ్రమ శాఖ కు నయాపైసా విదల్చలేదు. చక్కెర శాఖను వ్యవసాయ శాఖలో.. విదేశీ వాణిజ్య విభాగాన్ని టీఎస్ఐఐసీలో విలీనం చేస్తారనే వార్తల నేపథ్యంలో నయాపైసా కేటాయించక పోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిజాం దక్కన్ షుగర్స్ పునరుద్ధరణకు ప్రభుత్వం చొరవ చూపుతుందని ఆశించినా.. బడ్జెట్లో ప్రస్తావనకు రాలేదు. ఆహార నిల్వ, గిడ్డంగులకు గత ఏడాది రూ.101.56 కోట్లు ప్రతిపాదించి, రూ.60.26 కోట్లు ఖర్చు చేయగా.. ఈ ఏడాది ప్రతిపాదన ల్లో కేవలం రూ.10 కోట్లకు పరిమి తం చేశారు. చేనేత, జౌళి శాఖకు సంబంధించి కేటాయింపుల్లోనూ భారీగా కోతలు విధించారు. గనులు, భూగర్భ వనరుల శాఖకు గత ఏడాది మాదిరిగానే ప్రణాళికా వ్యయం కింద రూ.కోటి కేటాయించారు. గ్రామీణ పరిశ్రమలు, ఇతర పరిశ్రమలకు గతంలో రూ.562.88 కోట్లు ప్రతిపాదించగా.. ప్రస్తుత బడ్జెట్లో రూ.778.63 కోట్లు ప్రతిపాదించారు. -
14వ ఆర్థిక సంఘం నిధుల్లో కోత!
57 పురపాలికలకు 158 కోట్లు విడుదల సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికలు జరగని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వ నిధుల్లో మళ్లీ కోత పడింది. జీహెచ్ఎంసీ, కంటోన్మెంట్ బోర్డులతో కలిపి రాష్ట్రంలో 69 పురపాలికలు ఉండగా... ఎన్నికలు జరిగిన 57 పురపాలికలకు మాత్రమే తాజాగా 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.158.03 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి ఆరు నెలలకు గాను ఇవే పురపాలికలకు రూ.133 కోట్లను విడుదల చేయగా.. తాజాగా తర్వాతి ఆరు నెలల నిధులుగా రూ. 158 కోట్లను విడుదల విడుదల చేసిందని అధికార వర్గాలు తెలిపాయి. గడువులోగా ఎన్నికలు జరగని గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లు, మహబూబ్‌నగర్, బాదేపల్లి, సిద్దిపేట, చేగుంట, కొల్లాపూర్, అచ్చంపేట, మందమర్రి, మణుగూరు, పాల్వంచ మున్సిపాలిటీలకు నిధులు ఆగిపోయాయి. ఎన్నికలు నిర్వహించిన తర్వాతే వాటికి నిధులు విడుదలయ్యే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
కష్టం పోయింది..నష్టం మిగిలింది
పాలకొల్లు :జిల్లాలో వరి మాసూళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే 25 శాతం వ్యవసాయ క్షేత్రాల్లో కోతలు పూర్తయ్యాయి. అయితే, దిగుబడి మాత్రం రైతుల్ని కుదేలు చేస్తోంది. ఎకరాకు 35నుంచి 40 బస్తాల దిగుబడి రావాల్సి ఉండగా.. 20నుంచి 24 బస్తాల ధాన్యం మాత్రమే వస్తోంది. సాధారణంగా దాళ్వా పంట లాభాలు కురిపిస్తే.. సార్వా పంట ఖర్చులకు సరిపోతుందని రైతులు చెబుతుంటారు. ఈ సార్వాలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. దిగుబడిపై వచ్చే ఆదాయం ఖర్చులకు సరిపోవడం మాట దేవుడెరుగు.. ఎకరానికి రూ.6 వేల నుంచి రూ.8వేల వరకూ నష్టం వస్తోంది. డెల్టాలో మరీ దారుణం మెట్ట ప్రాంతంతో పోలిస్తే డెల్టా ప్రాంతంలో దిగుబడులు గణనీయంగా పడిపోతున్నాయి. సార్వా సీజన్ ఆలస్యంగా ప్రారంభం కావడంతో నాట్లు ఆలస్యమయ్యాయి. ఈ దృష్ట్యా తక్కువ రోజు ల్లో కోతకు వచ్చే ఎంటీయూ-1010 వంటి తేలికపాటి రకాలనే నాట్లు వేయాలని వ్యవసాయ శాఖ విస్తృతంగా ప్రచారం చే.సింది. వ్యవసాయ శాఖ సూచనలకు భిన్నంగా స్వర్ణ రకం నాట్లు వేసిన రైతులు తక్కువ నష్టాలతో బయటపడుతునన్నారు. ఎంటీయూ-1010, ఎంటీయూ-1121 రకాలను సాగుచేసిన రైతులకు భారీ నష్టాలు తప్పడం లేదు. జిల్లాలో సుమారు 2.19 లక్షల హెక్టార్లలో సార్వా నాట్లు వేశారు. మెట్ట ప్రాంతంలో దాదాపు మాసూళ్లు పూర్తి కావస్తుండగా, డెల్టాలో వారం రోజుల క్రితమే కోతలు ప్రారంభమయ్యా యి. డెల్టా రైతులు సీజన్ ప్రారంభం నుంచి సాగునీటి కొరత, ఎలుకలు, తెగుళ్ల బెడదతో ఇబ్బందులు పడ్డారు. దీనివల్ల పెట్టుబడులు భారీగా పెరిగాయి. చివరకు దిగుబడులు పడిపోవడంతో నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. చి‘వరి’కి మిగిలింది అప్పులే అధిక శాతం మంది రైతులు యంత్రాలతో వరి కోతలు కోరుుస్తున్నారు. ఆ ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉండటంతో బస్తాను రూ.830కి మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఈ లెక్కన చూస్తే ఎకరానికి 24 బస్తాలు దిగుబడి వస్తే.. రైతుకు రూ.19,920 ఆదాయం వస్తోంది. 24 బస్తాల దిగుబడి సాధించిన రైతుల సంఖ్య 10 శాతం కూడా లేదు. ఎకరానికి పెట్టుబడి ఖర్చులు రూ.18,300 వరకూ అయ్యూరుు. ఈ లెక్కన చూస్తే పొలం యజమాని స్వయంగా వరి సాగు చేస్తే.. 24 బస్తాల దిగుబడి వస్తే ఎకరానికి లభించే ఆదాయం రూ.1,620 మాత్రమే. అదే కౌలు రైతులైతే పండిన 24 బస్తాల్లో 12 బస్తాలను రైతుకు కౌలు రూపంలో చెల్లించాల్సి ఉంది. కౌలు చెల్లించగా మిగిలిన 12 బస్తాలకు రూ.9,960 మాత్రమే ఆదా యం వస్తుండగా, ఖర్చు మాత్రం రూ.18,300 వరకూ అరుు్యంది. అంటే కౌలు రైతు ఎకరానికి రూ.8,340 చొప్పున నష్టపోతున్నాడు. 24 బస్తాల కంటే తక్కువ దిగుబడి వచ్చిన రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆరుదల ధాన్యాన్ని బస్తా రూ.1,100కు కొంటామని చెబుతున్నా.. ఎక్కడా ఆరుదల ధాన్యం లేదు. 25 బస్తాలైనా వచ్చేలా లేదు ఐదెకరాల్లో వరి సాగు చేస్తున్నాను. ఎప్పుడూ లేనివిధంగా ఎండుతెగులు వచ్చింది. దోమపోటు విజృంభించింది. దీనివల్ల చేనంతా దెబ్బతింది. పెట్టుబడి లక్ష రూపాయలు దాటింది. ఎకరానికి 35 బస్తాల ధాన్యం వస్తుందని ఆశించాను. 25 బస్తాలు కూడా వచ్చేలా లేదు. ఏం చేయూలో దిక్కుతోచడం లేదు - పడాల సత్యనారాయణరెడ్డి, కవిటం ప్రభుత్వమే ఆదుకోవాలి ఈ సార్వాలో దోమపోటు, తెగుళ్లతో రైతులు దారుణంగా నష్టపోయారు. తెగుళ్ల బారినుంచి పంటను రక్షించుకునే విధంగా రైతులకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. అందువల్లే రైతులు నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. నష్టపోయిన రైతులు, కౌలు రైతులందరికీ ప్రభుత్వం పరిహారం అందజేసి ఆదుకోవాలి. - విద్యంశెట్టి సత్యనారాయణ, రైతు నాయకుడు, పోడూరు ఎకరానికి పెట్టుబడి ఖర్చులు ఇలా... విత్తనాలు, నారుమడి దుక్కు,కూలీలు, ఎరువు, పురుగు మందులకు : రూ.1,500 నాట్ల దుక్కుకు : రూ.1,000 గట్లు, తోరాలు, నారుతీత, నాట్లు వేయడానికి : రూ.4,000 ఎరువుల ఖర్చు : రూ.2,800 పురుగు మందులు : రూ.1,200 కలుపుతీత : రూ.1,800 ఎలుకల నివారణ : రూ.1,000 కోత, నూర్పిడి : రూ.5,000 మొత్తం : రూ.18,300 -
రైతన్నకు గుండె ‘కోత’!
విజయనగరం మున్సిపాలిటీ : ఖరీఫ్ పనుల్లో నిమగ్నమవుతున్న రైతులు... వర్షాల జాడలేకపోవడంతో పంపుసెట్లపై ఆధారపడవలసిన పరిస్థితి. అయితే ఇందు కు విద్యుత్ తప్పనిసరి. కానీ కోతలు వారి పాలిట శాపాలుగా మారాయి. వ్యవసాయానికి ఏడు గంటలు సరఫరా చేయవలసి ఉండగా జిల్లాలో ఎక్కడా అమలు కావడం లేదు. కేవలం మూడు గంటలు మాత్రమే సరఫరా చేస్తున్నారు. అది కూడా ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి. విద్యుత్ శాఖ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో మొత్తం 26,786 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించి అధికారులు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఇందులో ఎ-గ్రూప్ కనెక్షన్లకు రాత్రి 11 గంటల నుంచి 2 గంటల వరకు, మళ్లీ ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, బి-గ్రూప్ కనెక్షన్లకు రాత్రి ఒంటి గంట నుంచి వేకువజామున 4 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సరఫరా ఇవ్వాల్సి ఉంటుంది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఏడు గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలి. ఇదికాకుం డా ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబా బు ఇందుకు అదనంగా మరో రెండు గంటలు కలిపి మొత్తం 9 గంటల పాటు సరఫరా చేస్తామని ప్రకటించారు. అయితే కనీసం మూడు గంటల పాటు కూడా సరఫరా జరగడం లేదు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 160 ఫీడర్ల ద్వారా వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ సరఫరా చేస్తుండగా అందులో కేవలం 19 ఫీడర్ల పరిధిలో గల కనెక్షన్లకు మాత్రమే ఏడు గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని, మిగిలిన 141 ఫీడర్ల పరిధిలో గల కనెక్షన్లకు నాలుగు నుంచి ఐదు గంటల పాటు సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే అధికారులు చెబుతున్న సరఫరా వేళల సమయానికి, క్షేత్రస్థాయి లో అమలు జరుగుతున్న తీరుకు వ్యత్యాసం ఉంటోందని రైతన్నల వాదన. కనీసం మూడు గంటలు కూడా సరఫరా ఉండడం లేదని, ఇచ్చే సరఫరా కూడా ఏ సమయంలో వస్తున్నది తెలియడం లేదని చెబుతున్నారు. వరుణుడి ముఖం చాటేసినప్పటికీ కనీసం కరెంట్ ద్వారానైనా మోటార్ల ద్వారా పొలాలు తడిపి తినటానికి నాలుగు గింజలు పండించుకుందామన్న రైతన్న ఆశలు అడియాశలుగా మారుతున్నా యి. విద్యుత్‌కోతల కారణంగారైతన్నలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. విద్యుత్ అధికారులు తమపై కరుణ చూపి కోతలు లేకుండా సరఫర్యా చేయాలని కోరుతున్నారు. మెరుగైన సరఫరాకు కృషి ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందు కు కృషి చేస్తున్నాం. విద్యుత్ సంక్షోభం నేపథ్యంలో కోత లు విధించవలసి వస్తోంది. నాలుగు నుంచి ఐదు గంటల పాటు సరఫరా చేస్తున్నాం. సరఫరాను మరింత మెరుగుపరచడంలో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పరిశ్రమలకు రాత్రి వేళల్లో నిబంధనలు విధించి ఆ విద్యుత్‌ను వ్యవసాయ కనెక్షన్లకు ఇచ్చేలా చర్యలు చేపడుతున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలుకు సంస్థ నిర్ణయించింది. ఆ ప్రక్రియ పూర్తయితే ఆశించిన మేర సరఫరా ఇవ్వగలం. - సి.శ్రీనివాసమూర్తి, ఎస్ఈ -
వేసవికి ముందే కోతలు..
సాక్షి, గుంటూరు: వేసవి రాక ముందే విద్యుత్ కోతలు మొదలయ్యాయి. వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ సరఫరా కోసమని గృహవినియోగ దారులకు కోతలు విధిస్తున్నారు. గురువారం నుంచే కోతలు అమలు చేసేందుకు ఆ శాఖ అధికారులు సిద్ధమయ్యారు. కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, మండల కేంద్రాల్లో అమలు పరిచే విద్యుత్ కోతల వివరాలు, సమయాలను బుధవారం సాయంత్రం ప్రకటించారు. నేటి నుంచి అమలయ్యే కోత వేళలు ఇలా.... = గుంటూరు నగరంలో ఉదయం 6 గంటల నుంచి 7.30 వరకు కరెంటు సరఫరా ఉండదు. = మున్సిపల్ పట్టణాల్లో ఉదయం 8 నుంచి 10 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు కోతలు అమలు. =మండల కేంద్రాల్లో ఉదయం 7 నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 6 గంటల వరకు సరఫరా ఉండదు. = గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని ఫీడర్ల కింద సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు లైటింగ్ కోసం సరఫరా ఉంటుంది. నిత్యం రెండు దశల్లో వ్యవసాయానికి విద్యుత్ జిల్లాలోని వ్యవసాయ కనెక్షన్లను 4 గ్రూపులుగా విభజించిన విద్యుత్ శాఖ అధికారులు ఇక మీదట నిత్యం రెండు దశల్లో ఆయా కనెక్షన్లకు విద్యుత్ సరఫరా చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయానికి డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రైతాంగానికి ఇబ్బందులు తలెత్తకూడదన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. = గుంటూరు సర్కిల్లోని ‘ఏ’ గ్రూపు కింద ఉన్న వ్యవసాయ కనెక్షన్లకు రాత్రి 10.45 గంటల నుంచి ఉదయం 3.45 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 1.45 గంటల నుంచి 3.45 గంటల విద్యుత్ సరఫరా చేయనున్నారు. = గ్రూప్ ‘బి’ కింద కనెక్షన్లకు ఉదయం 3.45 గంటల నుంచి 8.45 గంటల వరకు, రాత్రి 10.45 నుంచి 12.45 వరకు సరఫరా జరుగుతుందని పేర్కొన్నారు. = ‘సి’ గ్రూప్ కనెక్షన్లకు ఉదయం 8.45-1.45, రాత్రి 12.45-2.45 గంటల వరకు సరఫరా ఇస్తారు. = ‘డి’ గ్రూపులోని కనెక్షన్లకు మధ్యాహ్నం 1.45-6.45, తెల్లవారు జామున 2.45-4.45 గంటల వరకు విద్యుత్ సరఫరా జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ కోతలేంటి.. వేసవి రాక ముందే కరెంటు కోతలేంటని వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ అసమర్థత వల్లే ఈ పరిస్థితి దాపురించిందంటూ ప్రతిపక్షాలు, వామపక్షపార్టీలు ప్రత్యక్ష ఆందోళనా కార్యక్రమాలకు సమాయత్తమవుతున్నాయి. ఈ ఏడాది రబీ సీజను ప్రారంభమైనప్పటి నుంచి జిల్లాలో వ్యవసాయానికి విద్యుత్ డిమాండ్ పెరిగింది. ఎత్తిపోతల పథకాలు, వ్యవసాయ మోటార్లు కారణంగా పెద్ద ఎత్తున విద్యుత్ వినియోగం జరుగుతోంది. దీంతో జిల్లాకు కేటాయించిన విద్యుత్‌ను వివిధ రంగాలకు నిర్ధేశిత ప్రమాణాల మేరకు సరఫరా చేయడం అధికారులకు ఇబ్బందిగా మారింది. డిమాండ్, సరఫరాల మధ్య వ్యత్యాసం గణనీయంగా వుండడంతో విద్యుత్ కోతలు అనివార్యమయ్యాయని అధికారులు చెపుతున్నారు. ఈ నేపథ్యంలో గృహ వినియోగానికి కోత విధించి, వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ సరఫరా చేయాలని అధికారులు నిర్ణయించారు.