మల్టీప్లెక్స్‌లో సినిమాలు వీక్షించేవారికి ఊరట కలిగించే విషయం ఇది. సాధారణంగా మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరల కంటే అక్కడ అమ్మే తినుబండారాలు, పానీయాల రేట్లే అధికంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో మల్టీప్లెక్స్‌లలో విపరీతమైన వాటి ధరలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వక్తమవుతుండటం తెలిసిందే.
సోషల్ మీడియాలో విమర్శల దెబ్బకు ప్రముఖ మల్టీప్లెక్స్ చెయిన్ పీవీఆర్ ఐనాక్స్ దిగొచ్చింది. తమ వద్ద విక్రయించే తినుబండారాలు, పానీయాల ధరలను 40 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే సోమవారం నుంచి గురువారం వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఫుడ్ కాంబోల ధరలు రూ.99 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. అయితే ‘బెస్ట్ సెల్లర్@99’ అనేది స్పషల్ షోలకు, గ్రూప్ బుకింగ్స్‌కి వర్తించదని, ఆఫ్‌లైన్‌లోనే కొనుక్కోవాలని ప్రకటించింది.
ఈ మల్టీప్లెక్స్‌లో ఒక టబ్ చీస్ పాప్‌కార్న్ రూ.450, సాఫ్ట్ డ్రింక్ 600 ఎంఎల్ రూ.360 ఉండేది. దీనిపై ట్విటర్‌లో పది రోజుల క్రితం ఓ యూజర్ పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. దానికి స్పందిస్తూ సదరు మల్టీప్లెక్స్ యాజమాన్యం తినుబండారాలు, పానీయాల రేట్లు తగ్గించింది. దీనికితోడు థియేటర్లలో తినుబండారాలు, పానీయాల ధరలపై జీఎస్టీని ప్రభుత్వం ఇటీవల 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడం కూడా కలిసివచ్చింది.
ఇదీ చదవండి: FAME 3: ఎలక్ట్రిక్ వాహనాలకు కొత్త సబ్సిడీ విధానం.. కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం!
Comments
Please login to add a commentAdd a comment