Food and Beverages
-
కంపెనీలకు ధర దడ.. రేట్లు పెంపు?
ముడిసరుకులపై మరింతగా వెచ్చించాల్సి రావడం, ఆహార ద్రవ్యోల్బణం గణనీయంగా పెరగడం ఎఫ్ఎంసీజీ కంపెనీలకు సమస్యగా మారాయి. ఈ అంశాల కారణంగా సెప్టెంబర్ త్రైమాసికంలో దిగ్గజ సంస్థల మార్జిన్లు గణనీయంగా తగ్గాయి. పట్టణ ప్రాంతాల్లో వినియోగం నెమ్మదించడం.. హెచ్‌యూఎల్, గోద్రెజ్ కన్జూమర్ ప్రోడక్ట్స్ (జీసీపీఎల్), మారికో, ఐటీసీ, టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ (టీసీపీఎల్) తదితర దిగ్గజాలకు ఆందోళన కలిగిస్తోంది.సాధారణంగా ఎఫ్ఎంసీజీ మొత్తం అమ్మకాల్లో పట్టణ ప్రాంతాల్లో వినియోగం వాటా 65–68 శాతం స్థాయిలో ఉంటుంది. పామాయిల్ ధరలు పెరగడం, వినియోగదారుల నుంచి డిమాండ్ అంతంతమాత్రంగానే ఉండటం వంటి కారణాలతో జీఎస్పీఎల్కి సెప్టెంబర్ క్వార్టర్ ఒక మోస్తరుగానే గడిచింది. సింథాల్, గోద్రెజ్ నంబర్ 1, హిట్ వంటి ఉత్పత్తులను తయారు చేసే జీఎస్పీఎల్ స్టాండెలోన్ ఎబిటా మార్జిన్లు తగ్గాయి.డాబర్ ఇండియా‘అధిక ఆహార ద్రవ్యోల్బణం, పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ తగ్గడం’ వల్ల సెప్టెంబర్ క్వార్టర్లో డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడినట్లు డాబర్ ఇండియా పేర్కొంది. చ్యవన్‌ప్రాశ్, పుదీన్హరా వంటి ఉత్పత్తులను తయారు చేసే డాబర్ ఇండియా నికర లాభం (కన్సాలిడేటెడ్) 18 శాతం క్షీణించి రూ.418 కోట్లకు, ఆదాయం 5 శాతం క్షీణించి రూ. 3,029 కోట్లకు తగ్గాయి. ఫుడ్ అండ్ బెవరేజెస్డిమాండ్ పడిపోతుండటంపై నెస్లే ఇండియా సీఎండీ సురేశ్ నారాయణన్ కూడా ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని త్రైమాసికాల క్రితం వరకు ఎఫ్అండ్బీ (ఫుడ్ అండ్ బెవరేజెస్) విభాగంలో డిమాండ్ రెండంకెల స్థాయిలో ఉన్నప్పటికీ ప్రస్తుతం 1.5–2 శాతానికి పడిపోయిందని పేర్కొన్నారు. మ్యాగీ, కిట్‌క్యాట్, నెస్కెఫే మొదలైన బ్రాండ్స్‌ను ఉత్పత్తి చేసే నెస్లే ఇండియా అమ్మకాలు దేశీయంగా కేవలం 1.2 శాతం వృద్ధికి పరిమితమయ్యాయి. ప్రథమ శ్రేణి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ కాస్త స్థిరంగానే ఉన్నప్పటికీ మెగా సిటీలు, మెట్రోల్లోనే సమస్యాత్మకంగా ఉన్నట్లు నారాయణన్ తెలిపారు.ఊహించిదానికన్నా ఎక్కువ ప్రభావం..పట్టణ ప్రాంతాల్లో ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులపై చేసే ఖర్చులపై ఆహార ద్రవ్యోల్బణం ప్రభావం ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉందని టీసీపీఎల్ ఎండీ సునీల్ డిసౌజా తెలిపారు. పరిమాణంపరంగా చూస్తే తమ ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల అమ్మకాల వృద్ధి .. ఇటీవల కొద్ది నెలలుగా నెమ్మదించినట్లు హెచ్‌యూఎల్ సీఈవో రోహిత్ జావా తెలిపారు. గ్రామీణ మార్కెట్లు క్రమంగా పట్టణ ప్రాంతాలను అధిగమిస్తున్నాయని వివరించారు. సర్ఫ్, రిన్, లక్స్, లిప్టన్, హార్లిక్స్ తదితర ఉత్పత్తులను తయారు చేసే హెచ్‌యూఎల్ నికర లాభం సెప్టెంబర్ త్రైమాసికంలో 2.33 శాతం తగ్గింది. ఆశీర్వాద్, సన్‌ఫీస్ట్ తదితర ఉత్పత్తుల సంస్థ ఐటీసీ మార్జిన్లు 35 బేసిస్ పాయింట్ల మేర తగ్గాయి. దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో అసాధారణ వర్షపాతం, అధిక స్థాయి ఆహార ద్రవ్యోల్బణం, నిర్దిష్ట ముడివస్తువుల ధరలు పెరిగిపోవడం వంటి కారణాలతో డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం కనిపించినట్లు సంస్థ తెలిపింది. ఇదీ చదవండి: ఎగుమతుల్లో దూసుకుపోతున్న భారత్!రేట్లు పెంచే యోచనపామాయిల్, కాఫీ, కోకో, వంటి ముడిసరుకుల ధరలు పెరగడంతో మార్జిన్లను కాపాడుకోవడానికి తాము కూడా ఉత్పత్తుల రేట్లను పెంచాలని కొన్ని ఎఫ్ఎంసీజీ కంపెనీలు యోచిస్తున్నాయి. సహేతుక స్థాయిలో రేట్లను పెంచి, ఖర్చులను నియంత్రించుకోవడం ద్వారా మార్జిన్లను మెరుగుపర్చుకోవాలని భావిస్తున్నట్లు జీఎస్పీఎల్ ఎండీ సీతాపతి తెలిపారు. పండ్లు, కూరగాయలు, నూనెలు వంటి ముడిసరుకుల ధరలు భరించలేనంత స్థాయిలో పెరిగిపోతే ఉత్పత్తుల రేట్ల పెంపునకు దారి తీసే అవకాశం ఉందని నెస్లే ఇండియా సీఎండీ సురేశ్ నారాయణన్ పేర్కొన్నారు. -
సినీ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్! సోషల్ మీడియా దెబ్బకు దిగొచ్చిన మల్టీప్లెక్స్!
మల్టీప్లెక్స్‌లో సినిమాలు వీక్షించేవారికి ఊరట కలిగించే విషయం ఇది. సాధారణంగా మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరల కంటే అక్కడ అమ్మే తినుబండారాలు, పానీయాల రేట్లే అధికంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో మల్టీప్లెక్స్‌లలో విపరీతమైన వాటి ధరలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వక్తమవుతుండటం తెలిసిందే. సోషల్ మీడియాలో విమర్శల దెబ్బకు ప్రముఖ మల్టీప్లెక్స్ చెయిన్ పీవీఆర్ ఐనాక్స్ దిగొచ్చింది. తమ వద్ద విక్రయించే తినుబండారాలు, పానీయాల ధరలను 40 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే సోమవారం నుంచి గురువారం వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఫుడ్ కాంబోల ధరలు రూ.99 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. అయితే ‘బెస్ట్ సెల్లర్@99’ అనేది స్పషల్ షోలకు, గ్రూప్ బుకింగ్స్‌కి వర్తించదని, ఆఫ్‌లైన్‌లోనే కొనుక్కోవాలని ప్రకటించింది. ఈ మల్టీప్లెక్స్‌లో ఒక టబ్ చీస్ పాప్‌కార్న్ రూ.450, సాఫ్ట్ డ్రింక్ 600 ఎంఎల్ రూ.360 ఉండేది. దీనిపై ట్విటర్లో పది రోజుల క్రితం ఓ యూజర్ పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. దానికి స్పందిస్తూ సదరు మల్టీప్లెక్స్ యాజమాన్యం తినుబండారాలు, పానీయాల రేట్లు తగ్గించింది. దీనికితోడు థియేటర్లలో తినుబండారాలు, పానీయాల ధరలపై జీఎస్టీని ప్రభుత్వం ఇటీవల 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడం కూడా కలిసివచ్చింది. ఇదీ చదవండి: FAME 3: ఎలక్ట్రిక్ వాహనాలకు కొత్త సబ్సిడీ విధానం.. కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం! -
సినిమా హాళ్లకు బయటి ఫుడ్ తీసుకెళ్లడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: సినిమా హాళ్లకు ప్రేక్షకులు బయటి నుంచి ఆహారం, పానీయాలు తీసుకెళ్లవచ్చా లేదా అనే అంశంపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసిహతో కూడిన ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. థియేటర్లు యజమానుల ప్రవేటు ఆస్తులు కాబట్టి ప్రేక్షకులు బయటి నుంచి తెచ్చుకున్న ఆహారం, పానీయాలు లోపలికి తీసుకెళ్లకుండా నియంత్రించే హక్కు సినిమా హాళ్లు, మల్టిప్లెక్స్‌లకు ఉంటుందని సుప్రీంకోర్టు వెల్లడించింది. కాగా 2018 జూలై 18న సినిమా హాళ్లలోకి బయట ఆహారాన్ని తీసుకురాకుండా విధించిన నిషేధాన్ని జమ్మూ కశ్మీర్ హైకోర్టు తొలగించింది. నిషేధం కారణంగా థియేటర్లలో ఏది విక్రయిస్తే అది తినాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే కారణంతో హైకోర్టు ఈ తీర్పునిచ్చింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ థియేటర్ల యజమానులు, మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సినిమా హాళ్లలో బయటి నుంచి తీసుకొచ్చే ఆహారాన్ని నిషేధించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో తాజాగా హైకోర్టు ఆదేశాలను అత్యున్నత న్యాయస్థానం పక్కన పెట్టింది. ఆరోగ్యకరమైన ఆహారం అందించడానికి సినిమా హాళ్లు ఏం జిమ్‌లు కాదని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రేక్షకులు వినోదం కోసం థియేటర్లకు వస్తారని తెలిపింది. ఇది ప్రైవేట్ యాజమాన్యంలో ఉంటుంది. కాబట్టి బయటి ఆహారాన్ని అనుమతించాలా.. వద్దా అనే దానిపై హక్కు వారికి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే పిల్లలకు ఉచిత ఆహారం, మంచి నీరు అందించాలని ఇప్పటికే సినిమా హాళ్లను ఆదేశించామని ధర్మాసనం ఈ సందర్బంగా గుర్తు చేసింది. సినిమా చూసేందుకు ఏ థియేటర్‌ను ఎంపిక చేసుకోవాలనేది ప్రేక్షకుడి హక్కు.. అలాగే నిబంధనలను విధించే హక్కు సినిమా హాల్ యాజమాన్యానికి కూడా ఉంది. అక్కడ ఉన్నవాటిని వినియోగించాలా వద్దా అనేది పూర్తిగా సినిమా ప్రేక్షకుడి ఎంపికపై ఆధారపడి ఉంటుంది. అయితే ఆ షరతులు ప్రజా ప్రయోజనాలకు, భద్రతకు విరుద్ధం కానంత వరకు యజమాని నిబంధనలను పెట్టడానికి పూర్తి అర్హత ఉంది’ అని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది. ఈ సందర్భంగా పలు ఉదాహరణలు చెబుతూ న్యాయమూర్తులు సరదా వ్యాఖ్యలు కూడా చేశారు. ‘సినిమా హాల్లోకి ఎవరైనా జిలేబీలు తీసుకెళితే అప్పుడు పరిస్థితి ఏంటి?. ఒకవేళ జిలేబీలు తిని ప్రేక్షకుడు తన చేతి వేళ్లను సీట్‌పై తుడిస్తే క్లీనింగ్‌కు ఎవరు డబ్బు ఇస్తారు. ఇక ప్రజలు సినిమా హాల్లోకి తందూరీ చికెన్ కూడా తీసుకెళ్తారు. మరి అప్పుడు హాల్లో తినేసిన ఎముకలు పడేశారని కంప్లైట్ రావొచ్చు. ఇది కూడా ప్రజలను ఇబ్బంది పెట్టవచ్చు’’ అని సరదాగా వ్యాఖ్యానించారు. చదవండి: కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన.. యువతి కుటుంబానికి రూ.10 లక్షలు.. -
రైలు ప్రయాణికులకు శుభవార్త
రైలు ప్రయాణంలో తమకు కావాల్సిన ఫుడ్ విషయంలో చాలా మంది అసంతృప్తి చెందుతుంటారు. ప్రాంతాలు మారుతున్న క్రమంలో సరైన ఆహారం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాగా, ఇలాంటి విషయాలపై భారత రైల్వే బోర్డు.. ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైళ్లలో ప్రయాణికులకు స్థానిక ఆహార పదార్థాలు అందించేలా బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇండియన్ రైల్వే కేటరింగ్, టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ)కి రైల్వే బోర్డు అనుమతి మంజూరు చేసింది. ఇందులో భాగంగానే.. రైళ్లలో ప్రయాణికులకు ఇకపై స్థానిక, ప్రాంతీయ ఆహారం కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపింది. అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తులకు, చిన్నారులకు, ఆరోగ్యపరంగా ప్రత్యేక అవసరాలు ఉన్నవారికి తగిన ఆహారం అందజేయాలని సూచించింది. తృణధాన్యాలతో తయారు చేసిన ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. రైళ్లలో కేటరింగ్ సేవలను మరింత మెరుగుపర్చడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వేబోర్డు తెలియజేసింది. అలాగే.. శిశువులు, ఫుడ్ విషయాల్లో కేర్ తీసుకునే వారి కోసం ప్రత్యేక ఆహారాన్ని అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు మెనూలో మార్పులు చేయాలని ఐఆర్సీటీసీకి రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది. కాగా, రైళ్లలో ప్రయాణించే వారికి ప్రాంతీయ వంటకాలను అందించాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. కాగా, పండుగల వేళల్లో సైతం ప్రత్యేక వంటకాలను సైతం విక్రయించుకోవచ్చని ఐఆర్సీటీసీకి బోర్డు తెలిపింది. శిశువులకు ఉపయోగపడే ఆహారంతో పాటు వివిధ వయస్సుల వారికి వారు మెచ్చే విధంగా ఫుడ్‌ను తయారు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, ముందుగా నోటిఫై చేసిన ధరల ప్రకారమే ప్రీపెయిడ్ రైళ్లలో మెనూను ఐఆర్సీటీసీ నిర్ణయిస్తుందని రైల్వే బోర్డు వివరణ ఇచ్చింది. భోజనంలో కాకుండా.. ప్రత్యేకంగా ఆర్డర్ చేసే ఆహారాలు ఎంఆర్పీ ధరకు విక్రయించేందుకు అనుమితిస్తున్నట్టు తెలిపింది. ఎక్స్‌ప్రెస్, ఇతర రైళ్లలో మెనూలో ఉండే బడ్జెట్ ఆహార పదార్థాల ధరలను సైతం ఐఆర్సీటీసీ నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది. In a major relief to diabetics, parents and health enthusiasts, Railway Board has allowed IRCTC to customise its menu to include local and regional cuisines as well as food suitable for diabetics, infants and health aficionados https://t.co/MF3kqiGJkE https://t.co/I6d5oS3yWo — Economic Times (@EconomicTimes) November 15, 2022 -
Russia-Ukraine War: ఎట్టకేలకు ఉక్రెయిన్ నుంచి బయల్దేరిన ఆహార నౌక
కీవ్: రష్యా దురాక్రమణ నేపథ్యంలో ప్రపంచ దేశాలకు ఉక్రెయిన్ నుంచి నిలిచిపోయిన ఆహార సరకు నౌకల రవాణా ప్రక్రియ మళ్లీ మొదలైంది. 26,000 టన్నుల మొక్కజొన్నలతో నిండిన తొలి నౌక సోమవారం ఉక్రెయిన్‌లోని ఒడిశా నౌకాశ్రయం నుంచి లెబనాన్‌కు నల్ల సముద్రమార్గంలో బయల్దేరింది. పలు దఫాల చర్చల తర్వాత ఉక్రెయిన్ నుంచి ఆహార ధాన్యాల సరకు నౌకల రవాణాకు రష్యా అంగీకరించింది. ఈ మేరకు గత నెలలో తుర్కియే, ఐక్యరాజ్యసమితిలతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో నౌకాశ్రయాల్లో నెలలుగా నిలిచిపోయిన 2.2 కోట్ల టన్నుల వ్యవసాయ ఉత్పత్తుల అంతర్జాతీయ రవాణాకు మార్గం సుగమమైంది. గోధుమలు, బార్లీ, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు నూనెల ఎగుమతుల్లో ఉక్రెయిన్, రష్యా అగ్రగాములుగా కొనసాగుతున్న విషయం విదితమే. యుద్ధం నేపథ్యంలో ఎగుమతులు స్తంభించిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత తలెత్తింది. -
హోల్‌సేల్ మార్కెట్ కుదేలు
న్యూఢిల్లీ: దేశం మొత్తం లాక్డౌన్లో ఉండడం, కొన్ని ఆహార ఉత్పత్తులు మినహా దాదాపు అన్ని విభాగాల్లో అసలు వినియోగ డిమాండ్ లేకపోవడం వంటి అంశాలతో మేలో హోల్‌సేల్ మార్కెట్ క్షీణతలోకి జారింది. ఇందుకు సంబంధించిన టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మైనస్ 3.21% క్షీణించింది (2019 మే నెలలో ఈ బాస్కెట్ ధర మొత్తంతో పోల్చి). దీన్ని ప్రతి ద్రవ్యోల్బణం అంటారు. వ్యవస్థలో అసలు వినియోగ డిమాండ్‌లేని పరిస్థితికి ఇది అద్దం పడుతుంది. నాలుగున్నర సంవత్సరాల్లో ఇలాంటి స్థితి ఆర్థిక వ్యవస్థలో ఎన్నడూ నెలకొనలేదు. సూచీలోని మూడు ప్రధాన విభాగాలకు సంబంధించి వాణిజ్య, పరిశ్రమల శాఖ సోమవారం వెల్లడించిన గణాంకాలను చూస్తే.. ► ప్రైమరీ ఆర్టికల్స్: ఆహార, ఆహారేతర విభాగాలతో కూడిన ఈ సెక్టార్లో –2.92 శాతం ప్రతి ద్రవ్యోల్బణం నమోదయ్యింది. అయితే ఇందులో 1.13% ఆహార ద్రవ్యోల్బణం నమోదయ్యింది. ఆహారేతర విభాగం విషయంలో మా త్రం మైనస్ 3.53% ప్రతి ద్రవ్యోల్బణం ఉంది. ► ఫ్యూయెల్ అండ్ పవర్: ఈ విభాగంలో ఏకంగా ప్రతి ద్రవ్యోల్బణం మైనస్ 19.83%గా ఉంది. ► తయారీ: మొత్తం సూచీలో దాదాపు 60 శాతం వాటా ఉన్న ఈ తయారీ రంగంలో మైనస్ 0.42 శాతం ప్రతి ద్రవ్యోల్బణం నమోదయ్యింది. ఒక్క ఆహార ఉత్పత్తులను చూస్తే... మొత్తం సూచీలో 1.13% ద్రవ్యోల్బణం నమోదయితే, పప్పు దినుసుల ధరలు 11.91% (2019 మేతో పోల్చి) ఎగశాయి. ఆలూ ధరలు 52.25 శాతం ఎగశాయి. అయితే కూరగాయలు మొత్తంగా ధరల రేటు మైనస్12.48% తగ్గింది. -
బ్రోస్టర్ చికెన్ ఔట్లెట్ల విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫుడ్ అండ్ బేవరేజెస్ ఫ్రాంచైజీ నిర్వహణ సంస్థ ‘ఎల్లో టై యాస్పిటాలిటీ’... అమెరికాకు చెందిన హెరిటేజ్ బ్రాండ్ జెన్యూన్ బ్రోస్టర్ చికెన్ (జీబీసీ)ను హైదరాబాద్‌కు తీసుకొచ్చింది. మంగళవారమిక్కడ ఫ్రాంచైజీ విధానంలో ఔట్‌లెట్‌ను ప్రారంభించిన సందర్భంగా సంస్థ ఫౌండర్ కరన్ టన్నా విలేకరులతో మాట్లాడారు. ఇప్పటివరకు దేశంలో బ్రోస్టర్ చికెన్ ఔట్లెట్లు ముంబై, రాయ్‌పూర్, సూరత్, కోల్‌కతా, పాట్నా నగరాల్లో ఐదు మాత్రమే ఉన్నాయి. 2017 ముగిసే నాటికి 50 ఔట్లెట్లను ప్రారంభించాలని లక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఒక్కో ఔట్‌లెట్‌కు రూ.60–70 లక్షల పెట్టుబడి అవసరమవుతుందని.. ఆగస్టులోగా హిమాయత్‌నగర్, హైటెక్సిటీలతో పాటు విజయవాడలోనూ ఔట్‌లెట్‌ను ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఔట్లెట్ యజమాని వందన షెటే, కరన్ షెటే కూడా పాల్గొన్నారు.