కీవ్: రష్యా దురాక్రమణ నేపథ్యంలో ప్రపంచ దేశాలకు ఉక్రెయిన్ నుంచి నిలిచిపోయిన ఆహార సరకు నౌకల రవాణా ప్రక్రియ మళ్లీ మొదలైంది. 26,000 టన్నుల మొక్కజొన్నలతో నిండిన తొలి నౌక సోమవారం ఉక్రెయిన్‌లోని ఒడిశా నౌకాశ్రయం నుంచి లెబనాన్‌కు నల్ల సముద్రమార్గంలో బయల్దేరింది. పలు దఫాల చర్చల తర్వాత ఉక్రెయిన్ నుంచి ఆహార ధాన్యాల సరకు నౌకల రవాణాకు రష్యా అంగీకరించింది.
ఈ మేరకు గత నెలలో తుర్కియే, ఐక్యరాజ్యసమితిలతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో నౌకాశ్రయాల్లో నెలలుగా నిలిచిపోయిన 2.2 కోట్ల టన్నుల వ్యవసాయ ఉత్పత్తుల అంతర్జాతీయ రవాణాకు మార్గం సుగమమైంది. గోధుమలు, బార్లీ, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు నూనెల ఎగుమతుల్లో ఉక్రెయిన్, రష్యా అగ్రగాములుగా కొనసాగుతున్న విషయం విదితమే. యుద్ధం నేపథ్యంలో ఎగుమతులు స్తంభించిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత తలెత్తింది.
Comments
Please login to add a commentAdd a comment