నా మంచి స్నేహితుడు మోదీ రాక కోసం ఎదురు చూస్తున్నా: పుతిన్‌ | Ajit Doval, Reportedly Carrying Ukraine Peace Plan, Meets Vladimir Putin | Sakshi
Sakshi News home page

నా మంచి స్నేహితుడు మోదీ రాక కోసం ఎదురు చూస్తున్నా: పుతిన్‌

Published Fri, Sep 13 2024 9:23 AM | Last Updated on Fri, Sep 13 2024 10:11 AM

Ajit Doval, Reportedly Carrying Ukraine Peace Plan, Meets Vladimir Putin

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ నా స్నేహితుడి కోసం ఎదురు చూస్తున్నాం. ఆయనకు నా శుభాకాంక్షలు’అని రష్యా మీడియా సమావేశంలో పుతిన్ చెప్పినట్లు పేర్కొంది.

బ్రిక్స్‌ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గురువారం రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌ వర్గ్‌లో  పుతిన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పుతిన్‌తో దోవల్ కరచాలనం చేశారు. ఆ ఫొటోల్ని భారత్‌లోని రష్యన్ రాయబార కార్యాలయం ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేసింది.

 

గత నెలలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీతో ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన చర్చల సారాంశాన్ని అజిత్‌ దోవాల్‌ పుతిన్‌కు వివరించారు. మోదీ ఆదేశాల మేరకు రష్యా పర్యటనకు వచ్చినట్లు అజిత్‌ దోవాల్‌  పుతిన్‌కు వివరించారు. 

ఈ చర్చల్లో సెప్టెంబర్‌ 22 నుంచి 24 వరకు రష్యాలోని కజన్‌ వేదికగా బ్రిక్స్‌ దేశాల సదస్సు జరగనుంది. ఆ సదస్సుకు మోదీ వస్తే, ఆయనతో విడిగా భేటీ కావాలనుకుంటున్నట్లు దోవల్‌కు పుతిన్‌ చెప్పారు.ఇదే అంశాన్ని రష్యా మీడియా సైతం ప్రస్తావించింది.

ఇదీ చదవండి : బీజేపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే సీటుకు ఎసరు..రంగంలోకి సంపన్న మహిళ

రష్యన్‌ ఎంబసీ సైతం 
మోదీ రష్యా పర్యటన సందర్భంగా భారత్‌ - రష్యాల మధ్య కుదిరిన ఒప్పందాల అమలుకు సంబంధించి వచ్చిన ఫలితాలు,సమీప భవిష్యత్తుకు సంబంధించిన అవకాశాలను వివరించేందుకు బ్రిక్స్ సదస్సు సందర్భంగా అక్టోబర్ 22న ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించాలని పుతిన్ ప్రతిపాదించారు అని టెలిగ్రామ్‌లో విడుదల చేసిన ఒక ప్రకటనలో రష్యన్ ఎంబసీ తెలిపింది.

కాగా, ఉక్రెయిన్‌ పర్యటనలో ఆదేశ అధ్యక్షుడు వ్లాదమీర్‌ జెలెన్‌ స్కీతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. కొనసాగుతున్న ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని  యుద్ధాన్ని ముగించేలా ఉక్రెయిన్-రష్యాలు చర్చలు జరుపుకోవాలని, ఈ రెండు దేశాల్లో శాంతిని పునరుద్ధరించడానికి భారత్‌ క్రియాశీల పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉందని మోదీ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement