ఉక్రెయిన్‌పై రష్యా కొనసాగిస్తున్న భీకర పోరు 12వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్ పరిస్థితులపై 50 నిమిషాలపాటు ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌తో చర్చల వివరాలను పుతిన్ మోదీకి వివరించారు. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడి జెలెన్‌స్కీతో నేరుగా మాట్లాడాలని పుతిన్‌ను మోదీ కోరారు.
ఉక్రెయిన్‌లో నగరాలు, సుమీ ప్రాంతాల్లో కాల్పుల విరమణ చేసి మానవతా కారిడార్‌ను ఏర్పాటు చేయడంపై పునతిన్‌కు మోదీ అభినందనలు తెలిపారు. సుమీ నుంచి భారతీయులను క్షేమంగా తలించేందుకు సహరకరించాలని పుతిన్‌ను కోరారు. ఈ క్రమంలో భారతీయుల తరలింపుకు తమవంతు సహకారం అందిస్తామని పుతిన్.. ప్రధాని మోదీకి హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment