మాస్కో: మూడో ఏడాదిలోకి అడుగుపెట్టక ముందే.. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగియనుందా? శాంతి స్థాపనలో భారత్ పెద్దన్న పాత్ర వహించబోతోందా?.. తాజా పరిణామాలు అందుకు అవుననే సంకేతాలు ఇస్తున్నాయి. ఉక్రెయిన్ సంక్షోభం ముగించేందుకు ముందుకు రావాలంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీకి.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం అందించారు.
భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్నారు. బుధవారం ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌తో క్రెమ్లిన్‌లో జైశంకర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. ఉక్రెయిన్ సంక్షోభం సహా పలు అంశాలపై వీళ్లు చర్చించారు. ఈ సందర్భంగా భారత ప్రధాని మోదీని రష్యా పర్యటనకు పుతిన్ ఆహ్వానించారు. ‘‘మా చిరకాల మిత్రుడు, భారత ప్రధాని నరేంద్ర మోదీని చూసేందుకు మేం ఆత్రుతతో ఉన్నాం. ఆయన్ని మా దేశానికి ఆహ్వానిస్తున్నాం. ఉక్రెయిన్ పరిణామాల్ని నేను ఆయనకు( భారత ప్రధాని మోదీ) ఎప్పటికప్పుడు వివరిస్తుంటాను. కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. సమస్యను శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించబడటానికి ఆయన తన శాయశక్తులా కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాడని నేను నమ్ముతున్నా’’ అని జైశంకర్ వద్ద పుతిన్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
ఉక్రెయిన్ సంక్షోభానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒక చక్కని పరిష్కారం చూపగలరని తొలి నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్ భావిస్తూ వస్తున్నారు. ఈ విషయంపై తరచూ ఇరు దేశాల నేతలు చర్చించుకుంటున్నారనే విషయాన్ని జైశంకర్ మీడియాకు తెలిపారు. ఈ తరుణంలో మోదీకి పుతిన్ ఆహ్వానం ఆసక్తికర చర్చకు దారి తీసింది. పుతిన్ ఆహ్వానం మేరకు వచ్చే ఏడాది వేసవి లోపు.. వీలైతే ఫిబ్రవరిలోపే మోదీ రష్యాలో పర్యటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదే విజయాన్నిరష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ కూడా ప్రెస్‌మీట్‌లో ధృవీకరించారు కూడా.
Honoured to call on President Vladimir Putin this evening. Conveyed the warm greetings of PM @narendramodi and handed over a personal message.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) December 27, 2023
Apprised President Putin of my discussions with Ministers Manturov and Lavrov. Appreciated his guidance on the further developments of… pic.twitter.com/iuC944fYHq
External Affairs Minister Dr S Jaishankar met Russian President Vladimir Putin in Moscow pic.twitter.com/aD7LCyjzDD
— ANI (@ANI) December 28, 2023
ఇక.. భారత్-రష్యాల ద్వైపాక్షిక ఒప్పందాలు.. ఇతర సంబంధాల బలోపేతం కోసం జైశంకర్ రష్యాలో పర్యటిస్తున్నారు. పుతిన్‌తో భేటీకి ముందు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌తో జైశంకర్ విడిగా భేటీ అయ్యారు. అంతకు ముందు.. ఇరుదేశాల ఆర్థిక సంబంధిత ఒప్పందాలకు సంబంధించి రష్యా ఉప ప్రధాని డెనిస్‌తో సమావేశం అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment