
వంట కోసం సన్‌ఫ్లవర్ ఆయిల్ వాడుతున్న వారికి శుభవార్త. టారిఫ్ రేట్ కోటా (TRQ) విధానం కింద ముడి సోయా బీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ సీడ్ ఆయిల్ దిగుమతులపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం, వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి సెస్‌ను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఈ మినహాయింపు మే 11 నుంచి జూన్ 30 వరకు అమలులో ఉంటుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి టారిఫ్ రేట్ కోటా లైసెన్స్ ఉన్న దిగుమతిదారులకు మాత్రమే ఇది వర్తిస్తుంది.
ఇదీ చదవండి: జీఎస్టీ నిబంధనల్లో మార్పులు.. ఆగస్టు 1 నుంచి కొత్త రూల్!
టారిఫ్ రేట్ కోటా అనేది కోటా చేరుకున్న తర్వాత అదనపు దిగుమతులపై సాధారణ సుంకాలు వర్తింపజేయడంతో పాటు, తగ్గింపు లేదా జీరో-డ్యూటీ రేటుతో భారతదేశంలోకి నిర్దిష్ట పరిమాణంలో దిగుమతులను అనుమతించే వ్యవస్థ. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాలకు 2 మిలియన్ టన్నుల టారిఫ్ రేట్ కోటా కేటాయింపు కోసం 2022 మేలో ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. అయితే సన్‌ఫ్లవర్ ఆయిల్, సోయా బీన్ ఆయిల్ ఉత్పత్తిలో పెరుగుదల కారణంగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి టారిఫ్ రేట్ కోటా కేటాయింపును ఉపసంహరించింది.
ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి టారిఫ్ రేట్ కోటా కింద ముడి పొద్దు తిరుగుడు విత్తన నూనె దిగుమతులను నిలిపివేయాలని ప్రభుత్వం మార్చిలో నిర్ణయించింది. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో ముడి పొద్దుతిరుగుడు విత్తన నూనెను దిగుమతి చేసుకోవడానికి టారిఫ్ రేట్ కోటా కేటాయింపులు ఉండవని తెలిపింది. క్రూడ్ సోయాబీన్ ఆయిల్ విషయంలో కూడా ఈ ఏడాది జనవరిలో ఇదే విధమైన నిర్ణయం తీసుకుంది. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో ముడి సన్‌ఫ్లవర్ సీడ్ ఆయిల్, ముడి సోయాబీన్ ఆయిల్‌కు సంవత్సరానికి 2 మిలియన్ టన్నుల సుంకం రహిత దిగుమతి వర్తిస్తుంది. ఇక ముడి పొద్దుతిరుగుడు నూనె కోసం టారిఫ్ రేట్ కోటా ఈ సంవత్సరం జూన్ 30 వరకు అమలులో ఉంటుంది.
ఇదీ చదవండి: Paytm New Features: పేటీఎంలో సరికొత్త ఫీచర్లు.. యూపీఐ బిల్లును పంచుకోవచ్చు!
Comments
Please login to add a commentAdd a comment