న్యూఢిల్లీ: గూగుల్‌లో ఉద్యోగమంటే ఎవరైనా ఎగిరి గెంతేస్తారు. అక్కడిచ్చే జీతం కంటే ఇతర సౌకర్యాల కోసం ఉద్యోగులు ఎగబడతారు. ఒక్కసారి ఆఫీసులోకి అడుగుపెడితే అన్నీ ఫ్రీయే. టీ, కాఫీ, కూల్‌డ్రింక్స్‌తో పాటు స్నాక్స్, లాండ్రీ సర్వీసు, మసాజ్ పార్లర్‌లే కాదు, తరచుగా కంపెనీ లంచ్‌లు కూడా ఉంటాయి. ఇప్పుడు ఆ సౌకర్యాలకి గూగుల్ కోత విధించింది.
ఇక నుంచి స్నాక్స్, లంచ్‌లు, లాండ్రీ, మసాజ్ సర్వీసులు ఆఫీసులో ఉండవని ప్రకటించింది. ఇలా ఆదా చేసిన డబ్బుల్ని మరిన్ని కీలకమైన పరిశోధనలకు ఖర్చు పెడతామని గూగుల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రూత్ పోరట్ చెప్పారు. ఇప్పటికే ఈ ఏడాది 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తామన్న గూగుల్ ఇప్పుడు ఇలా సౌకర్యాలు కూడా కట్ చేస్తూ ఉండడంతో ఉద్యోగుల్లో నిరాశ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment