కష్టం పోయింది..నష్టం మిగిలింది | Farmers Loss in Palakollu | Sakshi
Sakshi News home page

కష్టం పోయింది..నష్టం మిగిలింది

Published Thu, Nov 20 2014 12:51 AM | Last Updated on Mon, Oct 1 2018 2:11 PM

కష్టం పోయింది..నష్టం మిగిలింది - Sakshi

కష్టం పోయింది..నష్టం మిగిలింది

పాలకొల్లు :జిల్లాలో వరి మాసూళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే 25 శాతం వ్యవసాయ క్షేత్రాల్లో కోతలు పూర్తయ్యాయి. అయితే, దిగుబడి మాత్రం రైతుల్ని కుదేలు చేస్తోంది. ఎకరాకు 35నుంచి 40 బస్తాల దిగుబడి రావాల్సి ఉండగా.. 20నుంచి 24 బస్తాల ధాన్యం మాత్రమే వస్తోంది. సాధారణంగా దాళ్వా పంట లాభాలు కురిపిస్తే.. సార్వా పంట ఖర్చులకు సరిపోతుందని రైతులు చెబుతుంటారు. ఈ సార్వాలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. దిగుబడిపై వచ్చే ఆదాయం ఖర్చులకు సరిపోవడం మాట దేవుడెరుగు.. ఎకరానికి రూ.6 వేల నుంచి రూ.8వేల వరకూ నష్టం వస్తోంది.
 
 డెల్టాలో మరీ దారుణం
 మెట్ట ప్రాంతంతో పోలిస్తే డెల్టా ప్రాంతంలో దిగుబడులు గణనీయంగా పడిపోతున్నాయి. సార్వా సీజన్ ఆలస్యంగా ప్రారంభం కావడంతో నాట్లు ఆలస్యమయ్యాయి. ఈ దృష్ట్యా తక్కువ రోజు ల్లో కోతకు వచ్చే ఎంటీయూ-1010 వంటి తేలికపాటి రకాలనే నాట్లు వేయాలని వ్యవసాయ శాఖ విస్తృతంగా ప్రచారం చే.సింది. వ్యవసాయ శాఖ సూచనలకు భిన్నంగా స్వర్ణ రకం నాట్లు వేసిన రైతులు తక్కువ నష్టాలతో బయటపడుతునన్నారు. ఎంటీయూ-1010, ఎంటీయూ-1121 రకాలను సాగుచేసిన రైతులకు భారీ నష్టాలు తప్పడం లేదు. జిల్లాలో సుమారు 2.19 లక్షల హెక్టార్లలో సార్వా నాట్లు వేశారు. మెట్ట ప్రాంతంలో దాదాపు మాసూళ్లు పూర్తి కావస్తుండగా, డెల్టాలో వారం రోజుల క్రితమే కోతలు ప్రారంభమయ్యా యి. డెల్టా రైతులు సీజన్ ప్రారంభం నుంచి సాగునీటి కొరత, ఎలుకలు, తెగుళ్ల బెడదతో ఇబ్బందులు పడ్డారు. దీనివల్ల పెట్టుబడులు భారీగా పెరిగాయి. చివరకు దిగుబడులు పడిపోవడంతో నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు.
 
 చి‘వరి’కి మిగిలింది అప్పులే
 అధిక శాతం మంది రైతులు యంత్రాలతో వరి కోతలు కోరుుస్తున్నారు. ఆ ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉండటంతో బస్తాను రూ.830కి మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఈ లెక్కన చూస్తే ఎకరానికి 24 బస్తాలు దిగుబడి వస్తే.. రైతుకు రూ.19,920 ఆదాయం వస్తోంది. 24 బస్తాల దిగుబడి సాధించిన రైతుల సంఖ్య 10 శాతం కూడా లేదు. ఎకరానికి పెట్టుబడి ఖర్చులు రూ.18,300 వరకూ అయ్యూరుు. ఈ లెక్కన చూస్తే పొలం యజమాని స్వయంగా వరి సాగు చేస్తే.. 24 బస్తాల దిగుబడి వస్తే ఎకరానికి లభించే ఆదాయం రూ.1,620 మాత్రమే. అదే కౌలు రైతులైతే పండిన 24 బస్తాల్లో 12 బస్తాలను రైతుకు కౌలు రూపంలో చెల్లించాల్సి ఉంది. కౌలు చెల్లించగా మిగిలిన 12 బస్తాలకు రూ.9,960 మాత్రమే ఆదా యం వస్తుండగా, ఖర్చు మాత్రం రూ.18,300 వరకూ అరుు్యంది. అంటే కౌలు రైతు ఎకరానికి రూ.8,340 చొప్పున నష్టపోతున్నాడు. 24 బస్తాల కంటే తక్కువ దిగుబడి వచ్చిన రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆరుదల ధాన్యాన్ని బస్తా రూ.1,100కు కొంటామని చెబుతున్నా.. ఎక్కడా ఆరుదల ధాన్యం లేదు.
 
 25 బస్తాలైనా వచ్చేలా లేదు
 ఐదెకరాల్లో వరి సాగు చేస్తున్నాను. ఎప్పుడూ లేనివిధంగా ఎండుతెగులు వచ్చింది. దోమపోటు విజృంభించింది. దీనివల్ల చేనంతా దెబ్బతింది. పెట్టుబడి లక్ష రూపాయలు దాటింది. ఎకరానికి 35 బస్తాల ధాన్యం వస్తుందని ఆశించాను. 25 బస్తాలు కూడా వచ్చేలా లేదు. ఏం చేయూలో దిక్కుతోచడం లేదు
 - పడాల సత్యనారాయణరెడ్డి, కవిటం
 
 ప్రభుత్వమే ఆదుకోవాలి
 ఈ సార్వాలో దోమపోటు, తెగుళ్లతో రైతులు దారుణంగా నష్టపోయారు. తెగుళ్ల బారినుంచి పంటను రక్షించుకునే విధంగా రైతులకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. అందువల్లే రైతులు నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. నష్టపోయిన రైతులు, కౌలు రైతులందరికీ ప్రభుత్వం పరిహారం అందజేసి ఆదుకోవాలి.
 - విద్యంశెట్టి సత్యనారాయణ, రైతు నాయకుడు, పోడూరు  
 
 ఎకరానికి పెట్టుబడి ఖర్చులు ఇలా...
 విత్తనాలు, నారుమడి దుక్కు,కూలీలు,
 ఎరువు, పురుగు మందులకు    :    రూ.1,500
 నాట్ల దుక్కుకు    :    రూ.1,000
 గట్లు, తోరాలు, నారుతీత,
 నాట్లు వేయడానికి    :    రూ.4,000
 ఎరువుల ఖర్చు    :    రూ.2,800
 పురుగు మందులు    :    రూ.1,200
 కలుపుతీత    :    రూ.1,800
 ఎలుకల నివారణ    :    రూ.1,000
 కోత, నూర్పిడి    :    రూ.5,000
 మొత్తం    :    రూ.18,300
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement