ప్రాణం తీసిన గూటీ బిళ్ల | The bullet that took his life | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన గూటీ బిళ్ల

Jan 28 2025 9:26 AM | Updated on Jan 28 2025 9:26 AM

The bullet that took his life

పాలకొల్లు అర్బన్‌: గూటీ బిళ్ల ఆట యువకుడి ప్రాణం తీసింది. పాలకొల్లు పట్టణంలో సోమవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఎస్సై జి.పృథ్వీ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని బంగారు వారి చెరుగట్టు ప్రాంతానికి చెందిన మాతకాని హరికృష్ణ పదో తరగతి వరకు చదివాడు. పెయింటింగ్‌ పనిచేసుకుని తల్లిదండ్రులకు ఆసరా ఉంటున్నాడు. 

స్నేహితులతో కలిసి సోమవారం మధ్యాహ్నం కొత్త కుళాయి చెరువుగట్టు మీద గూటీ బిళ్ల ఆడుకుంటున్నారు. గూటి బిళ్ల కుళాయి చెరువులో పడిపోయింది. దీంతో హరికృష్ణ దాని కోసం చెరువులోకి దిగి గల్లంతయ్యాడు. తహసీల్దార్‌ దుర్గాకిషోర్‌ ఫైర్‌ సిబ్బందితో కుళాయి చెరువులో వెతికించారు. రాత్రి 7 గంటల సమయంలో మృతదేహం లభించింది. 

తల్లిదండ్రులు లక్ష్మీ, అప్పన్న కూలి పనిచేసుకుని జీవిస్తున్నారు. వీరికి హరికృష్ణ ఒక్కడే మగ సంతానం. హరికృష్ణ మృతితో వృద్ధాప్యంలో తమకు దిక్కెవరు అంటూ కన్నీరు పెడుతున్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement