సాక్షి,పశ్చిమ గోదావరి : డ్రగ్స్ తీసుకుంటేనే, స్మగ్లింగ్ చేస్తేనే హీరోలా చూస్తున్నారని హోం మంత్రి వంగలపూడి అనిత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జిల్లా పాలకొల్లు మండలంలో ఇవాళ (డిసెంబర్15) ఉదయం పాలకొల్లులో ‘సేవ్ గర్ల్ చైల్ఢ్’ అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వంగలపూడి అనిత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీలో యువత గంజాయి మత్తుకు అలవాటుపడుతోంది. సినిమాలు చూసి ప్రభావితమవుతున్నారు. గంజాయి,డ్రగ్స్,మందు తాగేవాళ్లను హీరోలుగా చూస్తున్నారు. చిన్నారులపై అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. పిల్లలను పెంచడంలో తల్లిదండ్రులే బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం,రాష్ట్రంలో శాంతి భద్రతలు సంరక్షించే హోంమంత్రి హోదాలో అనిత ఈ తరహా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై వివాదం రాజుకుంది
ఇలా హోమంత్రిగా హోదాలో ఉన్న వంగలపూడి అనిత ఈ నవంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో నోరు పారేసుకున్నారు.
అసెంబ్లీలో అనిత ఏం మాట్లాడారంటే?
ఐదు సంవత్సరాల వైఎస్సార్‌సీపీ పాలనలో కంటే.. తమ హయాంలోని గత ఐదు నెలల కాలంలోనే క్రైమ్ రేటు విపరీతంగా తగ్గిందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. శాంతి భద్రతల అంశంపై చర్చ సందర్భంగా.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల ప్రశ్నలకు ఆమె వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై వైఎస్సార్‌సీపీ ఆందోళనకుదిగగా.. మరోవైపు చైర్మన్ సైతం ఆమె తీరును తప్పుబట్టారు.
ఏపీ శాసన మండలిలో శాంతి భద్రతలపై వాడీ వేడి చర్చ నడిచింది. తొలుత.. రాష్ట్రంలో అత్యాచార ఘటనలు పెరిగిపోవడంపై వరదు కళ్యాణి మాట్లాడారు. దిశ యాప్, చట్టాన్ని నిర్వీర్యం చేయడంపై ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రభుత్వం నుంచి వివరణ కోరారు. దీనిపై అనిత మాట్లాడుతూ.. అత్యాచార ఘటనను రాజకీయం చేయొద్దన్నారు. అలాగే.. మహిళల భద్రత పేరిట వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దిశ చట్టం తెచ్చిందని, దిశ పోలీస్ స్టేషన్లు గతంలో ఏర్పాటు చేశారని.. తాము అధికారంలోకి వచ్చాక వాటిని తొలగించామని ఆమె అన్నారామె. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఘోరంగా విఫలం అయ్యిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పిన వ్యాఖ్యలను మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు.
అసహనానికి లోనైన ఆమె.. దమ్ము, ధైర్యం అంటూ ఆమె తీవ్ర పదజాలంతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. అదే సమయంలో కొయ్యే మోషేన్‌రాజు, మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టారు.
బాధ్యత గల మంత్రిగా ఉండి.. దమ్ము ధైర్యం గురించి మాట్లాడం సరైనది కాదు అని అన్నారాయన. దీంతో ఆమె క్షమాపణలు చెప్పి కూర్చున్నారు. అయితే అనిత వ్యాఖ్యలపై నిరసనగా.. శాంతి భద్రతల పరిరక్షణలో కూటమి ప్రభుత్వం విఫలమైనందున మండలి నుంచి వైఎస్సార్‌సీపీ వాకౌట్ చేసింది. అంతకు ముందు..
‘‘ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల పై నేరాలు, వేధింపులు పెరిగాయి. రాష్ట్రంలో రోజుకు 59 నేరాలు మహిళల పై జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి గంట కి ఇద్దరు, ముగ్గురు మహిళలు పై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసులు వైఫల్యం వలన మహిళలు, చిన్నారుల పై నేరాలు జరుగుతున్నాయి. ముచుమర్రి లో 9 ఏళ్ల బాలిక పై అత్యాచారం చేసి చంపేస్తే ఈరోజు కి మృతదేహం దొరకలేదు. హిందూపురం లో అత్తా కోడళ్ల పై గ్యాంగ్ రేప్ చేశారు. ఏ ఆర్ పురంలో చిన్నారిని అత్యాచారం చేసి చంపేశారు. దిశ యాప్ ని కొనసాగిస్తున్నారా..? లేదా..?. దిశ పోలీసు స్టేషన్ల ను కొనసాగిస్తున్నారా లేదా?. మహిళల పై నేరాల పై నియంత్రణ కు ఏదైనా కొత్త వ్యవస్థ తెచ్చారా..? అని మండలిలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కూటమి ప్రభుత్వానికి ప్రశ్నలు గుప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment