
విశాఖపట్నం, సాక్షి: శాంతిభద్రతలు క్షీణించడంపై చర్చ నడుస్తున్న వేళ.. నగరంలో మరోవైపు సంచలనం వెలుగు చూసింది. విశాఖలో గంజాయి కలకలం రేగింది. హోం మంత్రి అనిత నివాసానికి సమీపంలోనే ఉండడం గమనార్హం.
లేడీస్ హాస్టల్ వెనుక ఉన్న కేజీహెచ్ కొండ ప్రాంతంలో గంజాయి ముఠా గుట్టు రట్టైంది.. ఏజెన్సీ నుంచి తీసుకొచ్చి మరీ ఇక్కడ పండిస్తోంది ఓ ముఠా. తాము సేవించడమే కాకుండా.. మిగతాది నగరంలోని విద్యార్థులకు విక్రయిస్తోంది. ఈ గ్యాంగ్ గురించి పక్కా సమాచారం అందుకున్న వన్ టౌన్ పోలీసులు.. దాడులు జరిపారు. ఐదుగురు ముఠా సభ్యుల గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే..
అందులో ఇద్దరు పారిపోగా.. ముగ్గురు మాత్రం దొరికారు. వీళ్లలో ఒక మైనర్ ఉండడం గమనార్హం. ఈ ప్రాంతం హోం మంత్రి అనిత నివాసానికి కేవలం 3 కి.మీ. లోపే ఉంది. నావికా దళం(నేవీ) ఆధీనంలో ఉండడం, పైగా హోం మంత్రి నివాస సమీపంలోనే గంజాయి సాగు జరగడం ఒక్కసారిగా విశాఖను ఉలిక్కి పడేలా చేసింది. ఈ ముఠా ఎవరెవరకి సప్లయ్ చేసిందనే దానిపై నిందితుల్ని పోలీసులు ఆరా తీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment