డిపాజిట్ల రేట్లపై కోత పెట్టిన ఎస్‌బీఐ
ముంబై: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేటును మరోసారి తగ్గించింది. కోటి రూపాయల లోపు వార్షిక డిపాజిట్లపై వడ్డీరేటును 15 బేసిస్ పాయింట్లను తగ్గించి 6.75 శాతంగా నిర్ణయించింది. తాజా తగ్గింపుతో ప్రస్తుత వడ్డీరేటు ఏడు సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరింది.
2010 సంవత్సరంలో ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇదే రేటును ఎస్‌బీఐ అందించింది. కాగా ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ కోటిరూపాయల లోపు ఒక సంవత్సరం నికర డిపాజిట్లపై 6.9 శాతం వడ్డీని అందిస్తున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడాదాదాపు ఇదే రేటును కొనసాగిస్తున్నాయి.