కర్నాల్(హరియాణా): కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాంగ్రెస్‌పై తీవ్రంగా మండిపడ్డారు. ఆ పార్టీని ఆయన కోత, కమీషన్, అవినీతి(కట్, కమీషన్, కరప్షన్) పార్టీగా పేర్కొన్నారు. ప్రతిపక్ష ఇండియా కూటమిలోని 27 పార్టీల నేతలు స్వలాభం కోసమే చేతులు కలిపారని ఆరోపించారు. తమ బీజేపీ మాత్రం ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తోందని చెప్పారు.
గురువారం హరియాణా ప్రభుత్వం నిర్వహించిన అంత్యోదయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో దేశంలో శాంతి భద్రతలను మెరుగుపర్చిందని, అవినీతిని, బంధుప్రీతిని నిర్మూలించిందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment