మహిళలకు ఎస్బీఐ శుభవార్త!
దేశంలోనే అతి పెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పండుగల పథకంకింద మహిళా రుణగ్రహీతలకు చౌకగా రుణాలను అందించేందుకు నిర్ణయించినట్లు మీడియా రిపోర్టు చేసింది. ఈ వార్తల ప్రకారం ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ తగ్గింపు రుణ రేట్లను ప్రకటించింది. ముఖ్యంగా మహిళలకు వార్షిక హోం లోన్ వడ్డీ రేట్ల (ఎంసీఎల్ఆర్) ను 9.1 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇది గత ఆరేళ్లలోనే కనిష్టరేటని మార్కెట్ల ఎనలిస్టులు చెబుతున్నారు. అయితే ఫెస్టివ్ సీజన్ లో అమలు చేస్తున్న ఈ వడ్డీరేట్లు నవంబర్, డిసెంబర్‌లలో మంజూరు చేసే రుణాలకు వర్తించనున్నట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. అంతేకాదు బిజీ సెషన్ సందర్భంగా ఇతర రుణగ్రహీతలకు కూడా గృహ రుణాలను 9.15 శాతం వడ్డీ రేటుకే అందించనున్నట్లు ప్రకటించింది. దీంతో పాటుగా ప్రాసెసింగ్ ఫీజును రూడా మాఫీ చేస్తోంది.
కాగా ఆర్ బీఐ సూచనల మేరకు గత వారమే తగ్గింపు రేట్లను ప్రకటించిన బ్యాంకు మరోసారి రుణాలపై వడ్డీరేట్లు తగ్గింపును ప్రకటించింది. ఈ సవరించిన రేట్లు కింద గృహ రుణాల వార్షిక ఎంసీఎల్ఆర్ 8.90 శాతంగా ఉంది.