ఖాతాదారులకు ఎస్‌బీఐ శుభవార్త చెప్పింది. ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ప్రత్యేకంగా నిర్వహించే క్యాంపెయిన్‌లో భాగంగా హొమ్‌లోన్ల వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. తద్వారా, వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండడం వల్ల ఎస్‌బీఐ బ్యాంకులో ఇంటి రుణం తీసుకోలేకపోయిన వారికి, లేదంటే కొత్తగా లోన్ తీసుకోవాలనుకునేవారికి తాజా నిర్ణయం భారీగా లబ్ధి చేకూరనుంది.
క్రిడెట్ కార్డు ఉండి సిబిల్ స్కోర్ (151- 200) తక్కువగా ఉన్న వారికి, లేదంటే అసలు క్రెడిట్ స్కోర్ లేని కస్టమర్లకు ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ హోం లోన్లు,టాప్-అప్ లోన్లపై గరిష్ఠంగా 65 బేసిస్ పాయింట్ల వరకు ప్రత్యేక రాయితీలు అందిస్తుంది.
సిబిల్ స్కోర్ 750కి పైగా ఉంటే
సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఎస్‌బీఐ బ్యాంకు నిర్వహించే ఈ క్యాంపెయిన్‌లో సిబిల్ స్కోర్ 750పైగా ఉన్న వారికి 55 బేసిస్ పాయింట్ల వరకు రాయితీ ఇస్తున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. అంటే వడ్డీ రేట్లు 8.60 శాతానికి పొందవచ్చు.
సిబిల్ స్కోర్ 700- 749 ఉంటే
ఇప్పటికే అమ్మేందుకు సిద్ధంగా ఉన్న ఇళ్లను కొనుగోలు చేయాలనుకున్న, లేదంటే ఉన్న ప్రాపర్టీని అమ్మాలనుకునే వారి సిబిల్ స్కోర్ 700 పైగా ఉంటే పైన పేర్కొన్న రాయితీల కంటే అదనంగా 20 బేసిస్ పాయింట్ల మేర రాయితీలు పొందవచ్చు. అంటే క్రెడిట్ స్కోర్ 750 కంటే ఎక్కువగా ఉంటే 8.40 శాతానికి, 700 - 749 మధ్య ఉంటే 8.50 శాతానికి హోం లోన్లను సొంతం చేసుకోవచ్చు.
సిబిల్ స్కోర్ 700-749, 151-200 (టాప్-అప్ లోన్స్)ఉంటే
టాప్-అప్ లోన్స్ పొందాలనుకునే కస్టమర్ల సిబిల్ స్కోర్ 750 కంటే ఎక్కువగా ఉంటే 45 బేసిస్ పాయింట్ల వరకు రాయితీ పొందవచ్చు. 9.10 శాతంతో టాప్-అప్ లోన్లు తీసుకోవచ్చు. క్రెడిట్ స్కోర్ 700-749, 151-200 ఉన్న ఖాతాదారులు 45 బేసిస్ పాయింట్ల వరకు కన్‌సెషన్ అందిస్తుంది. అంటే 9.30 శాతానికి ఈ టాప్-అప్‌లోన్ ఇస్తున్నట్లు ఎస్‌బీఐ పేర్కొంది.
ఎస్‌బీఐ బ్యాంకు వెబ్‌సైట్ ప్రకారం.. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, టేకోవర్ లోన్‌లతో అనుబంధించబడిన టాప్-అప్ లోన్‌లకు (క్రెడిట్ స్కోరు 700 అంతకంటే ఎక్కువ ఉంటే) పైన ప్రతిపాదించబడిన రేట్ల కంటే బ్యాంకు 20 బేసిస్ పాయింట్ల వరకు రాయితీని ఇస్తుంది.
టాప్-అప్ లోన్లు అంటే
ఇప్పటికే తీసుకున్న హోమ్ లోన్‌పైఅతి తక్కువ డాక్యుమెంటేషన్‌తో ఆర్థిక సంస్థలు అందించే అదనపు లోన్‌ను టాప్-అప్ లోన్ అంటారు. బ్యాంకులు లేదా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ఇతర ఆర్థిక సంస్థలు వీటిని అందిస్తాయి. అత్యవసర సమయాల్లో వీటిని కస్టమర్లు ఎంచుకోవచ్చు. ఖాతాదారులు తమ గృహ రుణం కంటే ఎక్కువ మొత్తాన్ని అప్పుగా తీసుకునే వీలు ఉంటుంది.
హోమ్‌లోన్లపై వడ్డీ రేట్లు
టాప్-అప్‌లోన్లపై వడ్డీ రేట్లు
Comments
Please login to add a commentAdd a comment