
న్యూఢిల్లీ: పండుగ సీజన్ సందర్భంగా క్రెడిట్ కార్డ్‌ల సంస్థ ఎస్‌బీఐ కార్డ్ తమ కస్టమర్ల కోసం ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించింది.
కన్జూమర్ డ్యూరబుల్స్, మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు, ఫ్యాషన్, ఫర్నిచర్‌లాంటి ఉత్పత్తుల కొనుగోలుకు సంబంధించి ఈఎంఐ, క్యాష్‌బ్యాక్ మొదలైనవి అందిస్తున్నట్లు తెలిపింది.
2,700 పైచిలుకు నగరాల్లోని కస్టమర్లు 27.5 శాతం వరకు క్యాష్‌బ్యాక్, ఇన్‌స్టంట్ డిస్కౌంట్ వంటివి పొందవచ్చని సంస్థ ఎండీ అభిజిత్ చక్రవర్తి తెలిపారు. ఇందుకోసం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మింత్రా, రిలయన్స్ రిటైల్ గ్రూప్ మొదలైన ఆన్‌లైన్ సంస్థలతో కూడా జట్టు కట్టినట్లు తెలిపారు. అలాగే ఎల్‌జీ, సోనీ, ఒప్పో, వివో వంటి ప్రముఖ బ్రాండ్స్‌పై ఈఎంఐ ఆధారిత ఆఫర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇవి నవంబర్ 15 వరకు ఉంటాయి.