ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు వ్యవస్థాగతంగా చాలా కీలకమైన బ్యాంకులని రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) పేర్కొంది.
ఈ బ్యాంకులు దేశీయంగా వ్యవస్థాగతంగా ముఖ్యమైన బ్యాంకులుగా (డీ–ఎస్‌ఐబీలు) లేదా సంస్థలుగా తమ గుర్తింపును కొనసాగిస్తున్నట్లు తెలిపింది. బ్యాంకింగ్ రంగంలో ఈ బ్యాంకులు వైఫల్యం చెందడానికి అవకాశాలు అతి స్వల్పమని ఈ గుర్తింపు ఉద్ఘాటిస్తోంది.
ఎన్‌పీఏలు 0.8 శాతానికి డౌన్: ఎఫ్‌ఎస్‌ఆర్
ఇదిలావుండగా, సెప్టెంబరు 2023 చివరి నాటికి బ్యాంకుల నికర నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏ) నిష్పత్తి బహుళ సంవత్సరాల కనిష్ట స్థాయి 0.8%కి తగ్గిందని, దేశ దేశీయ ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉందని రిజర్వ్ బ్యాంక్ 28వ ఫైనాన్షియల్ స్థిరత్వ నివేదిక (ఎఫ్‌ఎస్‌ఆర్) పేర్కొంది. స్థూలంగా చూస్తే కూడా ఇది రికార్డు కనిష్ట స్థాయిలో 3.2 శాతంగా పేర్కొంది.
అంతర్జాతీయంగా ఆర్థిక ప్రతికూలతలు ఉన్నప్పటికీ, భారత్ ఎకానమీ పటిష్టంగా కొనసాగుతున్నట్లు నివేదిక వివరించింది. భారత్ వేగవంతమైన వృద్ధి సామర్థ్యానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నివారించడానికి ఆర్‌బీఐ తగిన చర్యలు తీసుకుంటోందని గవర్నర్ శక్తికాంతదాస్ నివేదిక ముందుమాటగా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment