SBI Credit Card
-
ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌లపై బ్యాడ్ న్యూస్
ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ఇది చేదు వార్త. క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లు, మర్చెంట్ లావాదేవీలు చేస్తే వాటిపై రివార్డు పాయింట్లు ఇవ్వడాన్ని ఎస్బీఐ నిలిపివేసింది. ఇది డిసెంబర్ 1 నుండి అమల్లోకి వచ్చింది. అయితే, ఈ కొత్త నియమం అన్ని ఎస్బీఐ కార్డ్‌లకు కాదు. రివార్డ్ పాయింట్లు వర్తించని కార్డుల జాబితాను ఎస్బీఐ విడుదల చేసింది.జాబితాలోని కొన్ని కార్డ్‌లు⇒ ఎస్బీఐ ఆరమ్ కార్డ్⇒ ఎస్బీఐ ఎలైట్ కార్డ్⇒ ఎస్బీఐ కార్డ్ ఎలైట్ అడ్వాంటేజ్⇒ ఎస్బీఐ కార్డ్ పల్స్⇒ సింప్లీ క్లిక్ ఎస్బీఐ కార్డ్⇒ సింప్లీ క్లిక్ అడ్వాంటేజ్ ఎస్బీఐ కార్డ్⇒ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్⇒ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్ అడ్వాంటేజ్⇒ ఎస్బీఐ కార్డ్ ప్లాటినం⇒ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్ ప్రో⇒ ఎస్బీఐ కార్డ్ ప్లాటినం అడ్వాంటేజ్⇒ గోల్డ్ ఎస్బీఐ కార్డ్⇒ గోల్డ్ క్లాసిక్ ఎస్బీఐ కార్డ్⇒ గోల్డ్ డిఫెన్స్ ఎస్బీఐ కార్డ్యుటిలిటీ చెల్లింపులపై 1% రుసుమురివార్డ్ పాయింట్ల తొలగింపుతో పాటు ఎస్బీఐ యుటిలిటీ చెల్లింపులపై నిబంధనలను కూడా మార్చింది. ఒక బిల్లింగ్ సైకిల్లో మీ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ నుండి మొత్తం యుటిలిటీ చెల్లింపు రూ. 50,000 దాటితే, 1 శాతం రుసుము వర్తిస్తుంది. ఈ నిబంధన కూడా డిసెంబర్ 1 నుండి అమలులోకి వచ్చింది.దేశంలో డెబిట్‌కార్డుల మార్కెట్ వాటాలో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అగ్రస్థానంలో ఉండగా, క్రెడిట్‌కార్డుల్లో ప్రైవేట్‌రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అగ్రగామిగా ఉంది. హామీ లేని రుణాల మంజూరులో అప్రమత్తంగా ఉండాలన్న ఆర్బీఐ హెచ్చరికల నేపథ్యంలో ఏడాది క్రితంతో పోలిస్తే ఈ ఏడాది అక్టోబరులో కొత్త క్రెడిట్‌కార్డుల జారీ 45 శాతం తగ్గిందని పరిశోధనా నివేదికలు పేర్కొంటున్నాయి. -
ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యూజర్లకు షాక్.. త్వరలో కొత్త మార్పులు
ఎస్బీఐ కార్డ్ తమ వినియోగదారులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ నియమాలలో రెండు పెద్ద మార్పులను చేసింది. నేటి కాలంలో క్రెడిట్ కార్డ్ వినియోగం ఎక్కువైంది. చాలా మంది ఇప్పుడు విద్యుత్, నీరు, గ్యాస్ వంటి యుటిలిటీ బిల్లులను కూడా క్రెడిట్ కార్డు ద్వారానే చెల్లిస్తున్నారు. అయితే మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తున్నయితే ఇది త్వరలో కొంచెం ఖరీదైనది కావచ్చు.యుటిలిటీ బిల్లు చెల్లింపుపై ఛార్జీఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా యుటిలిటీ బిల్లు చెల్లించడం కొంతమంది కస్టమర్లకు ఖరీదైనదిగా మారనుంది. డిసెంబర్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ ద్వారా రూ. 50 వేల కంటే ఎక్కువ యుటిలిటీ బిల్లును చెల్లిస్తే దానిపై 1 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుందని ఎస్బీఐ కార్డ్ తెలిపింది. యుటిలిటీ బిల్లు రూ. 50,000 కంటే తక్కువగా ఉంటే దానిపై ఎటువంటి అదనపు ఛార్జీని చెల్లించాల్సిన అవసరం లేదు.ఫైనాన్స్ ఛార్జీలోనూ మార్పుశౌర్య/డిఫెన్స్ క్రెడిట్ కార్డ్ మినహా అన్ని అన్సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్‌ల ఫైనాన్స్ ఛార్జీలో కూడా ఎస్బీఐ కార్డ్ కొన్ని మార్పులు చేసింది. ఆయా కార్డులపై 3.75 శాతం ఫైనాన్స్ ఛార్జీ విధించనుంది. ఈ మార్పు నవంబర్ 1 నుండి అమలులోకి రానుంది. ఇక్కడ అన్సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్‌లు అంటే ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ లేదా పూచీకత్తు ఇవ్వాల్సిన అవసరం లేనివి. -
ఎస్బీఐ కార్డ్ క్యూ2 ఫర్వాలేదు
న్యూఢిల్లీ: క్రెడిట్ కార్డు వ్యాపారంలోని ఎస్బీఐ కార్డ్ సెప్టెంబర్ త్రైమాసికానికి రూ.603 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.526 కోట్లతో పోలిస్తే 15 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం సైతం క్రితం ఏడాది ఇదే కాలంలో పోల్చి చూసినప్పుడు 22 శాతం పెరిగి రూ.4,221 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ ఆదాయం 28 శాతం వృద్ధి చెంది రూ.1,902 కోట్లకు చేరింది. ఇతర వనరుల రూపేణా ఆదాయం 21 శాతం అధికంగా రూ. 2,186 కోట్లు సమకూరింది. కంపెనీ రుణ ఆస్తుల నాణ్యత స్వల్పంగా క్షీణించింది. స్థూల రుణాల్లో వసూలు కాని నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు) 2.43 శాతానికి పెరిగాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి 2.14 శాతంగానే ఉన్నాయి. నికర ఎన్పీఏలు సైతం 0.78 శాతం నుంచి రూ.0.89 శాతానికి పెరిగాయి. క్యాపిటల్ అడెక్వెసీ రేషియో 23.3 శాతంగా ఉంది. సెపె్టంబర్ చివరికి నికర విలువ 11,130 కోట్లకు పెరిగింది. సెప్టెంబర్ చివరికి వినియోగంలో ఉన్న కార్డులు 1.79 కోట్లుగా ఉన్నాయి. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఎస్బీఐ కార్డ్ షేరు 2 శాతానికి పైగా లాభపడి రూ.791 వద్ద ముగిసింది. -
ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యూజర్లకు బంపరాఫర్!
న్యూఢిల్లీ: పండుగ సీజన్ సందర్భంగా క్రెడిట్ కార్డ్‌ల సంస్థ ఎస్బీఐ కార్డ్ తమ కస్టమర్ల కోసం ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించింది. కన్జూమర్ డ్యూరబుల్స్, మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు, ఫ్యాషన్, ఫర్నిచర్లాంటి ఉత్పత్తుల కొనుగోలుకు సంబంధించి ఈఎంఐ, క్యాష్‌బ్యాక్ మొదలైనవి అందిస్తున్నట్లు తెలిపింది. 2,700 పైచిలుకు నగరాల్లోని కస్టమర్లు 27.5 శాతం వరకు క్యాష్‌బ్యాక్, ఇన్స్టంట్ డిస్కౌంట్ వంటివి పొందవచ్చని సంస్థ ఎండీ అభిజిత్ చక్రవర్తి తెలిపారు. ఇందుకోసం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మింత్రా, రిలయన్స్ రిటైల్ గ్రూప్ మొదలైన ఆన్లైన్ సంస్థలతో కూడా జట్టు కట్టినట్లు తెలిపారు. అలాగే ఎల్జీ, సోనీ, ఒప్పో, వివో వంటి ప్రముఖ బ్రాండ్స్‌పై ఈఎంఐ ఆధారిత ఆఫర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇవి నవంబర్ 15 వరకు ఉంటాయి. -
ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు భారీ షాక్!
వినియోగదారులకు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ విభాగం భారీ షాకిచ్చింది. ఈ నెల 17 నుంచి సర్వీస్ ఛార్జీలను పెంచినట్లు ప్రకటించింది. దీంతో గతంలో రూ.99 ఉన్న ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్ సర్వీసెస్ ఛార్జీలు ఇప్పుడు రూ.199లకు పెరిగాయి. వీటితోపాటు జీఎస్టీ, ఇతర పన్నులు కూడా అదనంగా కలిశాయి.ఈ మేరకు క్రెడిట్ కార్డ్ విభాగం వినియోగదారులకు సమాచారం అందించింది. ఇక వీటితో పాటు సింప్లీ క్లిక్ కార్డు హోల్డర్లకు గిఫ్ట్ కార్డుల రీడింప్షన్, రివార్డు పాయింట్ల రీడిమ్ నిబంధనలు మారాయని, ఈ నిబంధనల్లో మార్పులు ఈ ఏడాది జనవరి నుంచి అమల్లోకి వచ్చినట్లు ఎస్బీఐ కార్డ్ మరోసారి గుర్తు చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డ్స్ & పేమెంట్ సర్వీసెస్ సింప్లీక్లిక్ కార్డ్ హోల్డర్లకు క్లియర్‌ట్రిప్ వోచర్‌ను అందించింది. ఆ వోచర్‌ను జనవరి 6, 2023 నుండి ఒకే సారి ఉపయోగించాలి. అంతే తప్పా ఇతర ఆఫర్లు లేదా వోచర్లతో కలపకూడదని స్పష్టం చేసింది. సింప్లీక్లిక్/సింప్లీక్లిక్ అడ్వాంటేజ్ ఎస్బీఐ కార్డ్‌తో అమెజాన్ షాపింగ్పైలో ఆన్లైన్ ఖర్చులపై 10X రివార్డ్ పాయింట్ల అందించేది. కానీ జనవరి 1 నుండి ఆ రివార్డ్ పాయింట్లు 5Xకి తగ్గించింది. అపొలో24X7, బుక్‌మై షో, క్లియర్ ట్రిప్, ఈజీ డైనర్, లెన్స్‌కార్ట్, నెట్‌మెడ్స్ వేదికల్లో ఆన్లైన్ కొనుగోళ్ల మీద మాత్రం 10x రివార్డు పాయింట్లు కొనసాగుతాయి’ అని ఎస్బీఐ క్రెడిట్ కార్డు వెల్లడించింది. -
డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే!
New Rules From 1st December 2021: అమ్మో ఒకటో తారీఖు..! ఒకటో తారీఖు వచ్చిదంటే చాలు సామాన్యుడి జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. ఇంటి అద్దె బిల్లులు, చిన్న చితకా బిల్లులను ఇతర లావాదేవీలను ఒకటో తారీఖున చెల్లిస్తారు. ప్రతి నెల ఒకటవ తేదీన దేశంలో కూడా అనేక కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. ఈ నిబంధనలు వల్ల సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుంది. దేశవ్యాప్తంగా వచ్చే నెల డిసెంబర్ 1 నుంచి పలు కీలక నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర, ఈపీఎఫ్ అకౌంట్ ఆధార్ నెంబర్ లింకింగ్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వంటి అనేక అంశాలకు సంబంధించి డిసెంబర్లో మార్పులు చోటు చేసుకొనున్నాయి. అలాంటి కొత్త రూల్స్ గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం.. డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త రూల్స్: ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు డిసెంబర్ 1 నుంచి ఈఎంఐ ద్వారా జరిపే కొనుగోళ్లకు అదనపు ఛార్జీ చెల్లించాలి. ఈఎంఐ కొనుగోళ్లపై రూ.99 + ట్యాక్సులు చెల్లించాలని ఎస్బీఐ ప్రకటించింది. అంటే ఆన్లైన్ షాపింగ్‌తో పాటు మర్చంట్స్ దగ్గర ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ చేస్తే ఈ ఛార్జీలు వర్తిస్తాయి. ఈ ఛార్జీలు 2021 డిసెంబర్ 1 నుంచే అమలులోకి రానున్నాయి. 14 ఏళ్ల తర్వాత అగ్గిపెట్ట రేటు పెరగడం ఇదే మొదటిసారి. ముడిపదార్థాల ధరలు పెరగడంతో అగ్గిపెట్ట ధరలను పెంచనున్నట్లు ఉత్పత్తిదారులు పేర్కొన్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి అగ్గిపెట్టె రూ.2కు విక్రయించనున్నట్లు ఉత్పత్తిదారుల సంఘం ప్రకటించింది. అయితే ఒక్క రూపాయి అగ్గిపెట్టెలో 36 స్టిక్స్ ఉంటే, రెండు రూపాయల అగ్గిపెట్టెలో 50 స్టిక్స్ ఉండనున్నాయి. డిసెంబర్ 1 నుంచే కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేట్లను తగ్గించింది. ప్రస్తుతం ఇస్తున్న 2.90 వార్షిక వడ్డీని 2021 డిసెంబర్ 1 నుంచి 2.80 శాతానికి తగ్గిస్తూన్నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ తెలిపింది. సేవింగ్స్ అకౌంట్లో రూ.10,00,000 లోపు ఉన్నవారికి 2.80 శాతం వడ్డీ, రూ.10,00,000 కన్నా ఎక్కువ ఉంటే 2.85 శాతం వడ్డీ లభించనుంది. 2021-22 అసెస్మెంట్ ఇయర్‌కు సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్స్ ఫైల్ చేయాల్సిన వారికి 2021 డిసెంబర్ 31 వరకే గడువు ఉంది. ఒకవేళ అప్పట్లోగా రిటర్న్స్ ఫైల్ చేయకపోతే ఆ తర్వాత జరిమానా ఫీజు చెల్లించి బిలేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేయల్సి ఉంటుంది. నవంబర్ 30లోగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించని పెన్షనర్లకు డిసెంబర్ నుంచి పెన్షన్ రాదు. రిటైర్ అయిన ఉద్యోగులు అంతరాయం లేకుండా పెన్షన్ పొందాలంటే ఏటా నవంబర్ 1 నుంచి నవంబర్ 30 మధ్య బ్యాంకులకు లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేసుకోవచ్చు. పెన్షనర్ ఇంకా బతికే ఉన్నాడని సర్టిఫికేట్ రుజువుగా పనిచేస్తుంది. రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ ధరలు పెరిగాయి. అన్ని ప్లాన్స్‌పై 20 శాతం వరకు ధరలు పెరిగినట్టు జియో ప్రకటించింది. ఈ కొత్త ప్లాన్స్ 2021 డిసెంబర్ 1న అమలులోకి రానున్నాయి. ఈపీఎఫ్ ఖాతాదారులు నవంబర్ 30లోపు తప్పనిసరిగా యూనివర్సల్ అకౌంట్ నెంబర్‌ను ఆధార్ నెంబర్‌తో లింక్ చేయాలి. గతంలో 2021 సెప్టెంబర్ 1లోగా ఉన్న గడువును 2021 నవంబర్ 30 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. అప్పట్లోగా యూఏఎన్‌ను ఆధార్ నెంబర్‌తో లింక్ చేయాల్సిందే. లేకపోతే డిసెంబర్ నెలకు సంబంధించిన యజమాని వాటా ఈపీఎఫ్ అకౌంట్లో జమ కాదు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల 1, 15వ తేదీ నాడు గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరిస్తాయి. అలాగే, డిసెంబర్ 1న కూడా గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరించనున్నాయి. నవంబర్‌లో కమర్షియల్ సిలిండర్ ధరను ఆయిల్ కంపెనీలు రూ.266 పెంచాయి. డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. మరి డిసెంబర్ 1న డొమెస్టిక్ సిలిండర్ ధరలు పెరుగుతాయో, తగ్గుతాయో చూడాలి. (చదవండి: మైక్రోసాఫ్ట్ సరికొత్త వ్యూహం.. ఇక ఖాతాలకు పాస్వర్డ్ అవసరం లేదు!) -
ఎస్బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు షాక్!
SBI Credit Card Users to Pay Rs 99 Plus Tax on All EMI Transactions: క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఎస్బీఐ షాక్ ఇచ్చింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డుల ద్వారా చేసే అన్ని ఈఎంఐ లావాదేవీలు ప్రాసెసింగ్ ఫీజుతో పాటు పన్నుకు లోబడి ఉంటాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ప్రకటించింది. ఎస్బీఐ కార్డులు & పేమెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్(ఎస్బీఐసీపీఎస్ఎల్) ఇటీవల రూ.99 ప్రాసెసింగ్ ఫీజువసూలు చేసి దానిపై పన్నులు వసూలు చేస్తామని ప్రకటించింది. ఈ కొత్త నిబంధన డిసెంబర్ 1, 2021 నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది. రిటైల్ లొకేషన్లు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా వంటి ఈ-కామర్స్ సైట్స్ నిర్వహించే అన్ని ఈక్వేటెడ్ మంత్లీ ఇన్ స్టాల్ మెంట్(ఈఎమ్ఐ) కొనుగోళ్లకు ఈ ప్రాసెసింగ్ ఫీజు వర్తిస్తుంది. ఈ విషయం గురించి తన క్రెడిట్ కార్డు ఖాతాదారులకు తెలియజేస్తూ ఒక ఈ-మెయిల్ పంపింది. "01 డిసెంబర్ 2021 నుంచి మర్చంట్ అవుట్ లెట్/వెబ్ సైట్/యాప్ వద్ద చేసిన అన్ని మర్చంట్ ఈఎమ్ఐ లావాదేవీలపై రూ.99 (+ పన్నులు) ప్రాసెసింగ్ ఫీజు విధించనున్నట్లు మేము మీకు తెలియజేస్తున్నాము" అని ఎస్బీఐసీపీఎస్ఎల్ తెలిపింది. ఈ నోటీసును ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఖాతాదారులందరికీ పంపారు. అంటే.. ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో వస్తువులను కొని ఈఎంఐగా మార్చుకుంటే ఈ ఫీజు వసూలు చేస్తారు. ఈ నిర్ణయంతో ఈఎంఐ ఆప్షన్ వినియోగించుకోవాలనుకునే కస్టమర్లకు మరింత భారం పడనుంది. అలాగే, ఈఎమ్ఐ లావాదేవీ విఫలమైనా లేదా క్యాన్సిల్ చేసిన ప్రాసెసింగ్ ఖర్చు తిరిగి చెల్లిస్తారు. (చదవండి: 'సింగిల్స్ డే' అమ్మకాల్లో రికార్డ్.. రూ.10 లక్షల కోట్ల వ్యాపారం) -
SBI: క్రెడిట్‌కార్డు వినియోగదారులకు క్యాష్‌బ్యాక్ ఆఫర్
భారతీయ స్టేట్ బ్యాంక్(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) తన కార్డు వినియోగదారుల కోసం దమ్దార్ దస్ పేరుతో పండుగ ఆఫర్ ప్రకటించింది. క్రెడిట్ కార్డ్స్ వినియోగదారులు ఆన్లైన్లో కొనుగోళ్లపై 10 శాతం క్యాష్ బ్యాక్ అందుకోవచ్చని తెలిపింది. అంతేకాదు ఈఎంఐ కొనుగోళ్లకూ ఇది వర్తిస్తుందని పేర్కొంది. దసరా, దీపావళి పండుగ సీజన్ వచ్చేసింది. ఈ మూడ్‌కి తగ్గట్లే ఆన్లైన్లో షాపింగ్ జోరందుకుంటుంది. కార్డుల వినియోగం ఎక్కువగా ఉంటుంది. పండుగ సీజన్ కాబట్టే ఈ ఆఫర్‌ను ప్రకటించినట్లు తెలిపింది ఎస్బీఐ. అయితే ఈ ఆఫర్ అక్టోబర్ 3 నుంచి కేవలం మూడు రోజులపాటు వర్తించనుంది. ఆన్లైన్లో మొబైల్స్, అప్లియెన్సెస్, హోం డెకర్.. తదితర కొనుగోళ్లకు దమ్దార్ దస్ ఆఫర్ వర్తిస్తుంది. అయితే బీమా, యాత్రలు, వాలెట్, ఆభరణాలు, విద్య, ఆరోగ్యం, పౌర సేవలకు ఇది వర్తించదు అని కంపెనీ తెలిపింది. పూర్తి వివరాల కోసం దమ్దార్ దస్ లింక్‌ను క్లిక్ చేయండి. -
కస్టమర్లకు హోండా శుభవార్త !
వెబ్‌డెస్క్: కస్టమర్లకు హోండా మోటార్స్ గుడ్‌న్యూస్ చెప్పింది. కరోనా కారణంగా గత రెండు నెలలుగా ఫ్రీ సర్వీసులు పొందలేకపోయిన వారికి ఉపశమనం కలిగించే ఆఫర్ ప్రకటించింది. 2021 ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు గడువులో ఫ్రీ సర్వీసులు పొందలేక పోయిన వారి కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు నెలల కాలంలో ముగిసిపోయే వారంటీ, ఫ్రీ సర్వీసులను జులై 31 వరకు పొడిగిస్తున్నట్టు హోండా సంస్థ పేర్కొంది. పెరిగిన హోండా షైన్ ధర ఇండియన అర్బన్ మార్కెట్లో పట్టున్న హోండా సంస్థ ధరలు పెంచింది. హోండా టూవీలర్ సెగ్మెంట్లో మార్కెట్ లీడర్‌గా ఉన్న షైన్ మోడల్ ధరను పెంచింది. బీఎస్ 6 ప్రమాణాలతో తయారు చేసిన హోండా షైన్ బైక్ రేటు రూ. 1072 పెంచింది. గడిచిన రెండు నెలల్లో వరుసగా రెండోసారి షైన్ బైక్ రేటును హోండా పెంచింది. ప్రస్తుతం ఢిల్లీ షోరూమ్ ధరల ప్రకారం షైన్ బైక్ డ్రమ్వేరియంట్ మోడల్ ధర రూ. 71,550 ఉండగా డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర 76,346గా ఉంది. ప్రస్తుత ధరల పెంపుతో వీటిపై అదనంగా రూ. 1072 వ్యయం కానుంది. పెరిగిన ధరపై జీఎస్టీ, ఇతర లోకల్ ట్యాక్సులు కలుపుకుని కొనుగోలు దారులపై అదనంగా దాదాపు రెండు వేల రూపాయల వరకు భారం పడే అవకాశం ఉంది. క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఓ వైపు షైన్ బైక్ ధరలు పెంచిన హోండా సంస్థ మరోవైపు క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా ప్రకటించింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు హోల్డర్లు జూన్ 30లోపు హోండా షైన్ బైకును కొనుగోలు చేస్తే.. రూ. 3500 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చంటూ ప్రత్యేక ఆఫర్‌ను హోండా సంస్థ ప్రకటించింది. -
Q1 ఎఫెక్ట్- ఎస్బీఐ కార్డ్స్ జూమ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో తొలుత ఎన్ఎస్ఈలో ఈ షేరు 6 శాతం దూసుకెళ్లి రూ. 797కు చేరింది. వెరసి ఈ ఏడాది మార్చి 16న లిస్టయ్యాక రికార్డ్ గరిష్టాన్ని అందుకుంది. ప్రస్తుతం 5.2 శాతం లాభపడి రూ. 790 వద్ద ట్రేడవుతోంది. రూ. 393 కోట్లు ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో ఎస్బీఐ కార్డ్స్ నికర లాభం 14 శాతం వృద్ధితో రూ. 393 కోట్లను తాకింది. నికర వడ్డీ ఆదాయం మరింత అధికంగా 52 శాతం ఎగసి రూ. 1138 కోట్లకు చేరింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.68 శాతం నుంచి 1.35 శాతానికి భారీగా తగ్గాయి. త్రైమాసిక ప్రాతిపదికన సైతం 2 శాతం నుంచి దిగివచ్చాయి. కాగా.. నికర ఎన్పీఏలు 1.3 శాతం వెనకడుగుతో 1.35 శాతంగా నమోదయ్యాయి. ఇందుకు మారటోరియం కారణమైనట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. పూర్తిఏడాదికి(2021) నికర ఎన్పీఏలు 4.5 శాతంగా నమోదుకావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. క్రెడిట్ వ్యయాలు 6.3 శాతానికి చేరవచ్చని భావిస్తున్నారు. -
హెక్సావేర్ డీలిస్టింగ్- ఎస్బీఐ అప్
ఆరు రోజుల ర్యాలీకి ముందురోజు బ్రేక్ పడినప్పటికీ తిరిగి దేశీ స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. మిడ్‌సెషన్‌కల్లా సెన్సెక్స్ 279 పాయింట్లు ఎగసి 34,259కు చేరగా.. నిఫ్టీ 107 పాయింట్లు జంప్‌చేసి 10,136 వద్ద ట్రేడవుతోంది. కాగా.. విభిన్న సానుకూల వార్తల నేపథ్యంలో ఓవైపు ఐటీ సేవల మధ్యస్థాయి కంపెనీ హెక్సావేర్ టెక్నాలజీస్, మరోపక్క ప్రభుత్వం రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. హెక్సావేర్ టెక్నాలజీస్ స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి కంపెనీను డీలిస్ట్ చేసే యోచనలో ఉన్నట్లు వెలువడిన వార్తలు సాఫ్ట్వేర్ సేవల సంస్థ హెక్సావేర్ టెక్నాలజీస్‌కు జోష్‌నిచ్చాయి. దీంతో ఈ కౌంటర్లో అమ్మకందారులు కరువుకాగా.. కొనుగోలుదారులు అధికమై 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం రూ. 52 పెరిగి రూ. 311.4 వద్ద ఫ్రీజయ్యింది. హెక్సావేర్‌లో మాతృ సంస్థ హెచ్‌టీ గ్లోబల్ ఐటీ సొల్యూషన్స్ 62.4 శాతం వాటాను కలిగి ఉంది. తద్వారా 18.63 కోట్ల షేర్లను కలిగి ఉంది. మిగిలిన 37.6 శాతం వాటాకు సమానమైన 11.2 కోట్ల షేర్లను పబ్లిక్ నుంచి కొనుగోలు చేసేందుకు ప్రమోటర్లు సన్నాహాలు చేస్తున్నట్లు హెక్సావేర్ తాజాగా బీఎస్ఈకి వెల్లడించింది. గత 15 రోజుల్లో ఈ షేరు 32 శాతం ర్యాలీ చేయడం గమనార్హం. ఎస్బీఐ గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్న నేపథ్యంలో పీఎస్‌యూ దిగ్గజం ఎస్బీఐ కౌంటర్ జోరందుకుంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 4 శాతం జంప్‌చేసి రూ. 181 వద్ద ట్రేడవుతోంది. అనుబంధ సంస్థ ఎస్బీఐ కార్డ్స్ పబ్లిక్ ఇష్యూ ద్వారా వాటాను విక్రయించిన కారణంగా గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ఎస్బీఐ ఆకర్షణీయ పనితీరు చూపవచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటికితోడు కొన్ని ఖాతాల నుంచి రికవరీ, తగ్గనున్న పన్ను వ్యయాలు వంటివి మెరుగైన ఫలితాలకు సహకరించవచ్చని భావిస్తున్నారు. క్యూ4లో నికర లాభం రూ. 600-1000 కోట్లుగా నమోదుకావచ్చని బ్యాంకింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత 15 రోజుల్లో ఎస్బీఐ షేరు 17 శాతం పుంజుకోవడం గమనార్హం! -
మార్చి 2 నుంచి ఎస్బీఐ కార్డ్స్ ఐపీఓ
న్యూఢిల్లీ: ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌ల విభాగం, ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) వచ్చే నెల 2 నుంచి ఆరంభం అవుతుంది. అదే నెల 5న ముగిసే ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.9,000 కోట్లు సమీకరిస్తుందని అంచనా. ఈ ఐపీఓలో భాగంగా రూ.500 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. అంతే కాకుండా ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విధానంలో 13 కోట్లకు పైగా షేర్లను విక్రయిస్తారు. దీంట్లో ఎస్బీఐ 3.7 కోట్లు, కార్లైల్ గ్రూప్ 9.3 కోట్ల షేర్లను విక్రయిస్తాయి. మార్కెట్ లాట్‌గా 19 షేర్లను నిర్ణయించారు. ఈ ఐపీఓకు ప్రైస్ బాండ్ రూ.750–755గా ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎస్బీఐ ఉద్యోగులకు 15 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. జీఎమ్‌పీ రూ.320–330 వచ్చే నెల 16న ఈ కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్టయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం జీఎమ్‌పీ (గ్రే మార్కెట్ ప్రీమియమ్) రూ.320–330 రేంజ్లో ఉందని సమాచారం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇదే అతి పెద్ద ఐపీఓ కానున్నది. ఈ ఐపీఓకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా కోటక్ మహీంద్రా క్యాపిటల్, యాక్సిస్ క్యాపిటల్, డీఎస్పీ మెరిల్ లించ్, నొముర ఫైనాన్షియల్ అడ్వైజరీ, హెచ్ఎస్బీసీ సెక్యూరిటీస్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ వ్యవహరిస్తున్నాయి. ఎస్బీఐ కార్డ్స్ కంపెనీలో ఎస్బీఐకు 76 శాతం, కార్లైల్ గ్రూప్‌నకు 24 శాతం చొప్పున వాటాలున్నాయి. ఐపీఓలో భాగంగా 10 శాతం వాటాకు సమానమైన షేర్లను కార్లైల్ గ్రూప్, 4 శాతం వాటాకు సమానమైన షేర్లను ఎస్బీఐ విక్రయిస్తున్నాయి. దేశంలో అత్యధికంగా క్రెడిట్ కార్డులు జారీ చేసిన రెండో అతి పెద్ద కంపెనీగా ఎస్బీఐ కార్డ్స్ నిలిచింది. మన దేశ క్రెడిట్ కార్డ్‌ల మార్కెట్లో ఈ కంపెనీ వాటా 18 శాతం. ఈ కంపెనీ వినియోగదారులు 90 లక్షలకు పైగా ఉన్నారు. ఈ కంపెనీ ఐపీఓ వివరాలు వెల్లడైన నేపథ్యంలో ఈ కంపెనీ అత్యధిక వాటా ఉన్న ఎస్బీఐ షేర్ లాభపడింది. బీఎస్ఈలో 2.3 శాతం లాభంతో రూ.328 వద్ద ముగిసింది. -
జనవరి 1 నుంచి పాత ఎస్బీఐ కార్డులు పనిచేయవు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జనవరి 1, 2020 నుంచి మీ పాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) డెబిట్, క్రెడిట్ కార్డులు పని చేయవు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్గదర్శకాల ప్రకారం.. పాత డెబిట్, క్రెడిట్ కార్డుల స్థానంలో చిప్ ఆధారిత ఈఎంవీ కార్డులను మాత్రమే వినియోగించాలి. ఈ నెల 31 లోపు ఎస్బీఐ ఖాతాదారులు తమ హోమ్ బ్రాంచీల్లో మ్యాజిస్టిక్ స్ట్రిప్ డెబిట్ కార్డ్, పాత కార్డ్‌ల స్థానంలో ఈఎంవీ చిప్, పిన్ ఆధారిత డెబిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. నెట్ బ్యాంకింగ్ ఉన్న ఖాతాదారులు ఆన్లైన్లో కొత్త కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని బ్యాంకు తెలియజేసింది. ఇప్పటికే పాన్ లేదా ఫామ్ 60లను అప్డేట్ చేయని ఎస్బీఐ ఖాతాదారుల కార్డ్‌లను ఎస్బీఐ డీయాక్టివేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
3 వేరియంట్లలో రెడ్మి 5 వచ్చేసింది
రెడ్మి 5 స్మార్ట్‌ఫోన్‌ను షావోమి లాంచ్ చేసింది. గతేడాది డిసెంబర్లో చైనాలో లాంచ్ చేసిన ఈ ఫోన్, నేడు భారత్ మార్కెట్లో కూడా ప్రవేశపెట్టింది. ఎక్స్‌క్లూజివ్‌గా అమెజాన్ ఇండియా ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తెస్తున్నట్టు ప్రకటించింది. మూడు వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్చేసింది. ఒకటి 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్ వేరియంట్. దీని ధర 7,999 రూపాయలుగా షావోమి ప్రకటించింది. రెండో వేరియంట్ 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్. దీని ధర 8,999 రూపాయలుగా పేర్కొంది. మరొకటి 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్. దీని ధర 10,999 రూపాయలుగా షావోమి తెలిపింది. ఎక్స్‌క్లూజివ్‌గా అమెజాన్ ఇండియాలో, ఎంఐ.కామ్, ఎంఐ హోమ్ స్టోర్లలో మార్చి 20 నుంచి ఈ ఫోన్ లభ్యమవుతుంది. లాంచ్ ఆఫర్లు.. 100జీబీ అదనపు డేటాతో రిలయన్స్ జియో నుంచి 2,200 రూపాయల ఇన్స్టాంట్ క్యాష్‌బ్యాక్‌ను ఈ ఫోన్‌పై పొందొచ్చు. అమెజాన్ ఇండియా, ఎంఐ.కామ్‌లలో 5 శాతం డిస్కౌంట్‌ను ఎస్బీఐ క్రెడిట్ కార్డుదారులకు అందించనుంది. తొలిసారి కిండ్లీ ఈబుక్స్ కొనే వారికి 90 శాతం తగ్గింపు లభించనుంది. రెడ్మి 5 స్పెషిఫికేషన్లు.. 5.7 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 450 ఎస్ఓసీ 2జీబీ, 3జీబీ, 4జీబీ ర్యామ్ వేరియంట్లు 16జీబీ, 32జీబీ, 64జీబీ స్టోరేజ్ ఆప్షన్లు మైక్రోఎస్డీ కార్డు ద్వారా విస్తరణకు అవకాశం 12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా విత్ ఎల్ఈడీ సెల్ఫీ లైట్ ఫేస్ రికగ్నైజేషన్, స్మార్ట్ బ్యూటీ 3.0 యాప్ బ్లాక్, గోల్డ్, లేక్ బ్లూ, రోజ్ గోల్డ్ రంగుల్లో అందుబాటు -
రైతులకు ఎస్బీఐ క్రెడిట్ కార్డులు
కోల్‌కతా: దేశీ దిగ్గజ ప్రభుత్వ రంగ ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (ఎస్బీఐ) రైతులకు క్రెడిట్ కార్డులను అందించనున్నట్లు ప్రకటించింది. తమ అనుబంధ సంస్థ ‘ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్ సర్వీసెస్’ ద్వారా రైతులకు క్రెడిట్ కార్డులను అందిస్తామని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ చెప్పారు. మంగళవారమిక్కడ జరిగిన ‘ఫామ్కార్ట్’, ‘డీలర్ బంధు’ యాప్స్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడారు. ‘గుజరాత్, రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో పైలట్ ప్రాతిపదికన ఈ ప్రాజెక్ట్ చేపట్టాం. దీని విజయం ఆధారంగా తర్వాత దేశవ్యాప్త విస్తరణ ఉంటుంది’ అని వివరించారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ) మాదిరి కాకుండా ఎస్బీఐ కార్డులో 40 రోజుల క్రెడిట్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని రజనీష్ తెలిపారు. ఇతర ఎస్బీఐ కార్డులలాగే వీటిల్లోనూ వడ్డీ రేట్లు సాధారణంగా ఉంటాయని పేర్కొన్నారు. అయితే రైతులు నిర్ణీత కాలంలో చెల్లించాల్సిన మొత్తాన్ని కట్టలేకపోతే సంస్థ వసూలు చేసే పెనాల్టీలు ఇతర ఎస్బీఐ కార్డుల కన్నా చాలా తక్కువగా ఉంటాయన్నారు. ఇక రైతులు వారి కార్డులోని క్రెడిట్ లిమిట్లో 20 శాతాన్ని కన్సూమర్ ప్రొడక్టుల కొనుగోలుకు వెచ్చించవచ్చని పేర్కొన్నారు. మిగిలిన బ్యాలెన్స్‌తో అగ్రికల్చర్ ఇన్‌పుట్స్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. మరొకవైపు వ్యవసాయ రంగంలో ఈ– కామర్స్ వినియోగం పెరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. -
ఎస్బీఐ క్రెడిట్ కార్డు వ్యాపారం ఏకతాటిపైకి
ముంబై: ఎస్బీఐ క్రెడిట్ కార్డుల వ్యాపారానికి సంబంధించి రెండు జాయింట్ వెంచర్లను కలిపేసే అవకాశం ఉంది. జీఈ క్యాపిటల్, ఎస్బీఐ ఈ రెండింటి భాగస్వామ్య సంస్థే ఎస్బీఐ కార్డు. ఇందులో ఎస్బీఐకి 60 శాతం, మిగిలిన వాటా జీఈ క్యాపిటల్‌కు ఉన్నాయి. ఈ వ్యాపారం నుంచి తప్పుకుంటున్నట్టు జీఈ క్యాపిటల్ ఇప్పటికే ప్రకటించింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు వ్యాపారం రెండు జాయింట్ వెంచర్లు(జేవీ)గా కొనసాగుతోంది. ఎస్బీఐ కార్డు అండ్ పేమెంట్ సర్వీసెస్ ఇందులో ఒకటి. ఇది క్రెడిట్ కార్డుల మార్కెటింగ్, పంపిణీ కార్యకలాపాలు చూస్తోంది. జీఈ క్యాపిటల్ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అన్న మరో జాయింట్ వెంచర్ ఎస్బీఐ కార్డుకు సంబంధించి తెర వెనుక టెక్నాలజీ, ప్రాసెసింగ్ ప్రక్రియలను చూస్తోంది. రెండింటిలోనూ ఎస్బీఐకి గణనీయమైన వాటా ఉన్నందున ఒకే వ్యాపారానికి సంబంధించి రెండు విభాగాలను కొనసాగించడంలో అర్థం లేదని ఎస్బీఐ కార్డు ఎండీ, సీఈవో విజయ్ జసూజా సోమవారం ముంబైలో మీడీయా సమక్షంలో పేర్కొన్నారు. బోర్డులోకి కొత్త ఇన్వెస్టర్ వచ్చిన తర్వాత ఈ రెండు జాయింట్ వెంచర్ల విలీనం సాధ్యమవుతుందన్నారు. వార్బర్గ్ పింకస్, కార్లిలే, క్రెడిట్ సైసన్ ఎబీఐలో జీఈకి వాటాను సొంతం చేసుకునేందుకు తుది బిడ్డర్లుగా ఉన్నాయి. ఎవరికి వాటా విక్రయించాలన్న విషయంపై జీఈ క్యాపిటల్ తుది నిర్ణయం తీసుకుంటుందని జసూజా చెప్పారు. ఈ జాయింట్ వెంచర్లలో ఎస్బీఐకి 60 శాతం వాటా ఉండగా, జీఈ నుంచి కొంత కొనుగోలు చేయడం ద్వారా 74 శాతానికి పెంచుకోనున్నట్టు ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య ఇటీవలే వెల్లడించారు.