
భారతీయ స్టేట్ బ్యాంక్(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) తన కార్డు వినియోగదారుల కోసం దమ్‌దార్ దస్ పేరుతో పండుగ ఆఫర్ ప్రకటించింది. క్రెడిట్ కార్డ్స్ వినియోగదారులు ఆన్‌లైన్‌లో కొనుగోళ్లపై 10 శాతం క్యాష్ బ్యాక్ అందుకోవచ్చని తెలిపింది. అంతేకాదు ఈఎంఐ కొనుగోళ్లకూ ఇది వర్తిస్తుందని పేర్కొంది.
దసరా, దీపావళి పండుగ సీజన్ వచ్చేసింది. ఈ మూడ్‌కి తగ్గట్లే ఆన్‌లైన్‌లో షాపింగ్ జోరందుకుంటుంది. కార్డుల వినియోగం ఎక్కువగా ఉంటుంది. పండుగ సీజన్ కాబట్టే ఈ ఆఫర్‌ను ప్రకటించినట్లు తెలిపింది ఎస్బీఐ. అయితే ఈ ఆఫర్ అక్టోబర్ 3 నుంచి కేవలం మూడు రోజులపాటు వర్తించనుంది.
ఆన్‌లైన్‌లో మొబైల్స్, అప్లియెన్సెస్, హోం డెకర్.. తదితర కొనుగోళ్లకు దమ్‌దార్ దస్ ఆఫర్ వర్తిస్తుంది. అయితే బీమా, యాత్రలు, వాలెట్, ఆభరణాలు, విద్య, ఆరోగ్యం, పౌర సేవలకు ఇది వర్తించదు అని కంపెనీ తెలిపింది. పూర్తి వివరాల కోసం దమ్‌దార్ దస్ లింక్‌ను క్లిక్ చేయండి.
Comments
Please login to add a commentAdd a comment