
వెబ్‌డెస్క్: కస్టమర్లకు హోండా మోటార్స్ గుడ్‌న్యూస్ చెప్పింది. కరోనా కారణంగా గత రెండు నెలలుగా ఫ్రీ సర్వీసులు పొందలేకపోయిన వారికి ఉపశమనం కలిగించే ఆఫర్ ప్రకటించింది. 2021 ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు గడువులో ఫ్రీ సర్వీసులు పొందలేక పోయిన వారి కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు నెలల కాలంలో ముగిసిపోయే వారంటీ, ఫ్రీ సర్వీసులను జులై 31 వరకు పొడిగిస్తున్నట్టు హోండా సంస్థ పేర్కొంది.
పెరిగిన హోండా షైన్ ధర
ఇండియన అర్బన్ మార్కెట్‌లో పట్టున్న హోండా సంస్థ ధరలు పెంచింది. హోండా టూవీలర్ సెగ్మెంట్‌లో మార్కెట్ లీడర్‌గా ఉన్న షైన్ మోడల్ ధరను పెంచింది. బీఎస్ 6 ప్రమాణాలతో తయారు చేసిన హోండా షైన్ బైక్ రేటు రూ. 1072 పెంచింది. గడిచిన రెండు నెలల్లో వరుసగా రెండోసారి షైన్ బైక్ రేటును హోండా పెంచింది. ప్రస్తుతం ఢిల్లీ షోరూమ్ ధరల ప్రకారం షైన్ బైక్ డ్రమ్‌వేరియంట్ మోడల్ ధర రూ. 71,550 ఉండగా డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర 76,346గా ఉంది. ప్రస్తుత ధరల పెంపుతో వీటిపై అదనంగా రూ. 1072 వ్యయం కానుంది. పెరిగిన ధరపై జీఎస్‌టీ, ఇతర లోకల్ ట్యాక్సులు కలుపుకుని కొనుగోలు దారులపై అదనంగా దాదాపు రెండు వేల రూపాయల వరకు భారం పడే అవకాశం ఉంది.
క్యాష్‌బ్యాక్ ఆఫర్
ఓ వైపు షైన్ బైక్ ధరలు పెంచిన హోండా సంస్థ మరోవైపు క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా ప్రకటించింది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు హోల్డర్లు జూన్ 30లోపు హోండా షైన్ బైకును కొనుగోలు చేస్తే.. రూ. 3500 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చంటూ ప్రత్యేక ఆఫర్‌ను హోండా సంస్థ ప్రకటించింది.