free services
-
ఎవరికీ ఆదాయం రాకుండా ప్రభుత్వ నిబంధనలు
ముంబై: చెల్లింపుల సర్వీసులు అందించే సంస్థలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదాయం ఆర్జించేందుకు వీలు లేకుండా ప్రభుత్వ నిబంధనలు ఉంటున్నాయని యాక్సిస్ బ్యాంక్ సీఈవో అమితాబ్ చౌదరి వ్యాఖ్యానించారు. దీని వల్ల చిన్న సంస్థలు బతికి బట్టకట్టడం కష్టమవుతుందని పేర్కొన్నారు. ‘పేమెంట్స్ విభాగంలో మేము ఆదాయం ఆర్జించేందుకు ప్రభుత్వం ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదు. దీన్ని అడ్డుపెట్టుకుని వేరే దగ్గరెక్కడో డబ్బు సంపాదించుకోవాలే తప్ప పేమెంట్స్ విభాగంలో ఏ సంస్థా సొమ్ము చేసుకోలేని పరిస్థితి ఉంది‘ అని గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చౌదరి చెప్పరు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు యూపీఐ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చినప్పటికీ ఆ సర్వీసులు ఉచితంగానే ఉండాలన్న ప్రభుత్వ ఆదేశాలు సదరు సంస్థలకు సమస్యగా మారాయి. యూపీఐ సేవలకూ మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) విధించే అంశంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో చౌదరి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యాక్సిస్ బ్యాంకు.. ఫ్రీచార్జ్ అనే పేమెంట్స్ కంపెనీని నిర్వహిస్తోంది. ‘ఆదాయం రాని సేవలు అందించడం ద్వారా వచ్చే నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు మాకు ఇతరత్రా అవకాశాలు కల్పించాలన్న సంగతి అర్థం చేసుకున్నా కూడా నియంత్రణ సంస్థలు పైసా రాని పనులెన్నో చేయాలంటూ బ్యాంకులను ఆదేశిస్తుంటాయి‘ అని చౌదరి చెప్పారు. ఈ నేపథ్యంలో బడా టెక్ కంపెనీలతో భాగస్వామ్యాలు కుదుర్చుకోవడం ద్వారా ఆదాయాలు పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్, గూగుల్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చెప్పారు. -
రైలులో ప్రయాణం.. ఒక రూపాయి ఖర్చు లేకుండా ఈ సేవలు ఉచితం!
దేశంలో తక్కువ ఖర్చుతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రయాణించాలంటే అది భారతీయ రైల్వేతోనే సాధ్యం. ఇండియన్ రైల్వే ప్రపంచలోనే నాలుగో అతి పెద్ద సంస్థగా పేరు పొందింది. ప్రతి రోజూ లక్షల మంది ప్రయాణికులను వారి గమ్య స్థానానికి చేర్చడంతో పాటు కోట్ల రూపాయల సరుకులు కూడా రవాణ చేస్తుంది మన చుకు చుకు బండి. అంతేనా మిడిల్ క్లాస్ నేల విమానంగా పేరు కూడా ఉంది. ఇటీవల ప్యాసింజర్లకు కొన్ని ఉచిత సేవలని కూడా ప్రవేశపెట్టింది రైల్వే శాఖ. చాలామంది ప్రయాణికులకు ఇలాంటి సౌకర్యాలు ఉచితంగా భారతీయ రైల్వే అందిస్తున్న విషయం కూడా తెలియదు. అవేంటో ఓ లుక్కేద్దాం.. ప్రయాణికులకు క్లాస్ అప్‌గ్రేడేషన్.. అదనపు చార్జ్ ఉండదు టిక్కెట్ల బుకింగ్ సమయంలో, రైల్వే ప్రయాణికులకు క్లాస్ అప్‌గ్రేడేషన్ సౌకర్యాన్ని ఉచితంగా అందిస్తుంది ఇండియన్ రైల్వే. అంటే, స్లీపర్‌లోని ప్రయాణీకుడు థర్డ్ ఏసీని పొందవచ్చు, అది కూడా స్లీపర్ క్లాస్ టికెట్‌తోనే. దీనికి ఎటువంటి అదనపు ఫీజు చెల్లించాల్సిన పని లేదు. ఈ తరహాలోనే థర్డ్ ఏసీ ప్యాసింజర్ సెకండ్ ఏసీ, సెకండ్ ఏసీ ప్యాసింజర్ వన్ టైర్ ఏసీ సౌకర్యాన్ని పొందవచ్చు. ఈ సౌకర్యాన్ని పొందడానికి, ప్రయాణీకులు టికెట్ బుకింగ్ సమయంలో ఆటో అప్‌గ్రేడ్ ఎంపికపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత, అందుబాటులో ఉన్న సీట్లను బట్టి, ప్రయాణికుల రైల్వే టిక్కెట్‌ను వారు ఎంచుకున్న ఆఫ్షన్ ప్రకారం అప్‌గ్రేడ్ చేస్తారు. అయితే, ప్రతిసారీ టిక్కెట్‌ను అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. వికల్ప్ సర్వీస్ ఎంచుకుంటే బెటర్ తమ టికెట్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్యాసింజర్లు వారి ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాల్సి అవసరం లేకుండా రైల్వే శాఖ ‘వికల్ప్ సర్వీసు’ను ప్రారంభించింది. ఇది మరొక మనం బుక్ చేసుకున్న ట్రెన్‌లో సీటు లేకపోతే మన గమ్య స్థానానికి వెళ్లే మరొక రైలులో సీట్ల లభ్యత ఆధారంగా మనకి సీటుని కేటాయిస్తారు. ఇందుకోసం టికెట్ బుకింగ్ సమయంలోనే వికల్ప్ సర్వీస్ ‘ఆప్షన్’ ఎంచుకోవాలి. ఆ తర్వాత రైల్వే ఈ సౌకర్యాన్ని ఉచితంగానే కల్పిస్తుంది. టిక్కెట్ల ట్రాన్స్ఫర్ రైల్వే టిక్కెట్లను బదిలీ (ట్రాన్స్ఫర్) చేయచ్చు. ఒక వ్యక్తి ఏ కారణం చేతనైనా ప్రయాణం చేయలేకపోతే, అతను తన కుటుంబంలోని ఎవరికైనా తన టిక్కెట్‌ను బదిలీ చేయవచ్చు. అయితే, ప్రయాణ రోజు నుంచి 24 గంటల ముందు టికెట్ బదిలీ చేయాల్సి ఉంటుంది. దీని కోసం, టిక్కెట్ ప్రింట్ తీసుకొని, సమీపంలోని రైల్వే స్టేషన్‌కు వెళ్లాలి. టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికుడు తన ఐడీ (గుర్తింపు కార్డు) స్టేషన్లో చూపించి ఆ టిక్కెట్‌ని బదిలీ చేయవచ్చు. అయితే, టిక్కెట్లను ఒక్కసారి మాత్రమే ట్రాన్స్ఫర్ చేయగలరు. బోర్డింగ్ స్టేషన్ మార్చవచ్చు టికెట్ బదిలీ మాదిరిగానే, బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకునే సౌకర్యం కూడా 24 గంటల ముందుగానే అందుబాటులో ఉంటుంది. అంటే, ఒక ప్రయాణీకుడు హైదరాబాద్ నుంచి టిక్కెట్‌ను బుక్ చేసి, ఆ రైలు మార్గంలో మరేదైనా స్టేషన్ నుంచి ఎక్కాలనుకుంటే, అతను తన స్టేషన్‌ను మార్చవచ్చు. బోర్డింగ్ స్టేషన్లో మార్పు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. ఇందుకు ఐఆర్టీసీ(IRCTC) వెబ్సైట్ లేదా యాప్‌లోకి లాగిన్ అయిన తర్వాత, బుక్ చేసిన టికెట్ హిస్టరీకి వెళ్లడం ద్వారా మీరు బోర్డింగ్ స్టేషన్‌ని మార్చుకోవాలి. అయితే, మార్చుకునే సదుపాయం ఒక్కసారి మాత్రమే అందుబాటులో ఉంటుంది చదవండి: అదానీ దూకుడు: మూడు లక్షల కోట్లు దాటేసిన నాలుగో కంపెనీ -
‘ఉచితాల’పై సుప్రీంకోర్టు విచారణ
న్యూఢిల్లీ: ఉచిత హామీల ద్వారా ఓటర్లను ప్రలోభపెట్ట జూస్తున్నాయంటూ రాజకీయ పార్టీలపై కేసు నమోదు చేసేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై అత్యవసర విచారణ జరిపే అంశాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ మేరకు హిందూసేన ఉపాధ్యక్షుడు సుర్జీత్‌సింగ్ యాదవ్ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించాలన్న విజ్ఞప్తిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ సారథ్యంలోని ధర్మాసనం బుధవారం పరిశీలించింది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగుస్తున్నందున దీన్ని అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని ఆయన తరఫు న్యాయవాది ధర్మానానికి విన్నవించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ, బీఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీలు ఇచ్చిన పలు ఉచిత హామీలతో తాను కలత చెందినట్టు పిటిషన్లో యాదవ్ పేర్కొన్నారు. దీన్ని అవినీతి చర్యగా, సదరు పార్టీల తరఫు అభ్యర్థులను పోటీకి అనర్హులుగా ప్రకటించాలని కోరారు. కేంద్ర, రాష్ట్రాల ఎన్నికల సంఘాలను, కాంగ్రెస్, సమాజ్‌వాదీ, బీఎస్పీ, ఆప్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఉచిత హామీల బడ్జెట్ కొన్నిసార్లు అసలు బడ్జెట్‌నూ మించిపోతోందంటూ లాయర్ అశ్వినీ ఉపాధ్యాయ వేసిన పిల్‌పై కేంద్రానికి, ఈసీకి అంతకుముందు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అడగండి అది మన హక్కు..పెట్రోల్ బంకుల్లో ఈ ఆరు సేవలు ఉచితం
సాక్షి, ఖమ్మం: కొన్ని నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నుల విషయం పై తీవ్రమైన చర్చ నడుస్తోంది. ప్రతీ మీటర్‌పై వ్యాట్ రూపంలో చెల్లిస్తున్న రుసుంతో బంకుల్లో వినియోగదారులకు కల్పించాల్సిన సౌకర్యాల గురించి చాలా మందికి తెలియదు. ఒకరిద్దరు నిబంధనల పేరుతో ప్రశ్నిస్తే నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పటం తెలిసిందే. బంకుల వద్ద వినియోగదారులకు కొన్ని కచ్చితమైన సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. ఈ సదుపాయాలు ఏ పెట్రోల్ పంపులోనైనా అందించకపోతే మీరు ఫిర్యాదు చేయొచ్చు. స్వచ్ఛమైన తాగునీరు.. బంకుల వద్ద స్వచ్ఛమైన తాగునీటి వసతి ఉండాలి. ఇందు కోసం బంకు డీలర్ ఆర్వో యంత్రం, వాటర్ కనెక్షన్ స్వయంగా పొందాల్సి ఉంది. ఏ బంకులో కూడ తాగునీటి వసతి సౌకర్యం లేకపోతే చమురు మార్కెటింగ్ సంస్థ కు ఫిర్యాదు చేయవచ్చు. మూత్రశాలలు, మరుగుదొడ్లు.. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా అన్ని బంకుల్లో వాహనదారులు, ప్రజల సౌకర్యార్థం శుభ్రతతో కూడిన మూత్రశాలలు, మరుగుదొడ్లు ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. పలు చోట్ల వీటిని ఏర్పాటు చేసినా వినియోగించేందుకు నిర్వహకులు అనుమతులివ్వటం లేదు. మరికొన్ని చోట్ల అసలు కనిపించని పరిస్థితి నెలకొంది. బంకుల్లో ఇలాంటి సౌకర్యాలు లేనట్లయితే పెట్రోలియం సంస్థలకు ఫిర్యాదు చేయొచ్చు. లీటర్ పెట్రోల్, లేదా డీజిల్ కొనుగోలు చేస్తే అందులో మనం బంకులకు 4 నుంచి 8 పైసల వరకు మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్వహణకు చెల్లిస్తున్నాం. ఆపదవేళ ఫోన్ సదుపాయం.. అత్యవసర పరిస్థితుల్లో ఫోన్‌ను వినియోగించుకునే సదుపాయం బంకుల్లో ఉండాల్సిందే. మీరు వెళ్లే మార్గంలో ఏదైనా సమస్యలో చిక్కుకుంటే మీ వద్ధ మొబైల్ ఫోన్ అందుబాటులో లేకపోతే భయపడాల్సిన పని లేదు. ఏదైనా పెట్రోల్ బంక్ ను సందర్శించటం ద్వారా మీరు ఏ నంబర్ కు అయినా కాల్ చేసుకోవచ్చు. ఉచితంగా గాలి నింపాల్సిందే.. టైర్లలో గాలి నింపటానికి గాలి శాతం తనీఖీ చేసుకోవటానికి అనువుగా బంకుల్లో కచ్చితంగా యంత్రాన్ని అందుబాటులో ఉంచాలి. గాలి నింపేందుకు కూడ ఓ వ్యక్తి ని అందుబాటులో ఉంచాలి. బంకులో పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయకున్నా, వాహనదారులు కోరితే టైర్లలో గాలి తనీఖీ చేయాలి. ఇటీవల కాలంలో వాహనాల టైర్లకు ప్రత్యామ్నయంగా నైట్రోజన్ నింపుతున్నారు. ట్యూబ్‌లెస్ టైర్లు వస్తున్నాయి. వాటిలో నైట్రోజన్ నింపాలి. ఫిర్యాదుల పెట్టె, ప్రథమ చికిత్స కిట్టు ఉండాలి.. ప్రతి బంకులో ఫిర్యాదు పెట్టే లేదా రిజిష్టర్‌ను అందుబాటులో ఉంచాలి. అందులో వినియోగదారుడు తమ ఫిర్యాదులను నమోదు చేయొచ్చు. ప్రథమ చికిత్స కిట్ సౌకర్యం ప్రతి బంకు వద్ధ ఉండాలి. ప్రజలకు అవసరమైనప్పుడు వాటిని ఉపయోగించుకునే వీలుంటుంది. ఈ ప్రథమ చికిత్స పెట్టెలో ఆరోగ్యాన్ని రక్షించే మందులు ఉండాలి. దీంతో పాటు అన్ని మందులపై గడువు తేదీ కూడ రాసి ఉంచాలి. పాత మందులు ఉండకూడదు. నాణ్యత ప్రమాణాలు తెలుసుకోవచ్చు.. పెట్రోల్, డీజీల్ నాణ్యత ప్రమాణాలను తెలుసుకునే హక్కు వినియోగదారులకు ఉంటుంది. పెట్రోల్, డీజిల్ నాణ్యత పరిమాణాన్ని తెలుసుకునేందుకు పరికరాలను సిద్ధంగా ఉంచాలి. వాటి ద్వారా నాణ్యత ను పరీక్షించేందుకు హక్కు మనకు ఉంటుంది. అదే విధంగా పెట్రోల్, డీజీల్ తక్కువగా వస్తుందనే అనుమానం వచ్చినా పరీక్షించుకోవచ్చు. అధికారుల పర్యవేక్షణ కరువు.. బంకుల వద్ద ఎన్నో సౌకర్యాలు కల్పించాల్సిన హక్కులు ఉండి కూడ ఏ ఒక్కటి కూడ కల్పించటం లేదు. ముఖ్యంగా బంకులపై అధికారుల పర్యవేక్షణ లేకపోవటం వలన వారి ఇష్టారాజ్యంగా అవుతుంది. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారు లేరు. ఇకనైనా అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. - బచ్చలకూరి నాగరాజు, కోరట్లగూడెం అవగాహన కల్పించాలి బంకుల్లో ఉన్న సౌకర్యాలను వినియోగించుకునేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలి. పెట్రోలియం మంత్రిత్వ శాఖ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించాలి. అన్నింటికి కలిపి చమురుకు ధరలు చెల్లిస్తున్నారు. కానీ వాటిని మాత్రం వినియోగించుకునే పరిస్థితి లేదు. ఇది చాలా దారుణం. -మాదాసు శ్రీనివాసరావు, కొత్తకొత్తూరు ఫిర్యాదుల పెట్టెలు కనిపించవు బంకులపై ఫిర్యాదు చేసేందుకు కనీసం ఫిర్యాదుల పెట్టెలు కానీ, రిజిష్టర్లు కానీ బంకుల వద్ధ ఎవరికి కనిపించవు. అధికారులకు ఫోన్ చేస్తే స్పందించరు. ప్రజల హక్కులను కూడ వినియోగించుకోలేకపోతున్నారు. బంకుల పై అధికార యంత్రాంగం ఉందా లేదా అనిపిస్తుంది. -రావెళ్ల కృష్ణారావు, మోటాపురం -
Tarun Kappala: అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగి.. ఇక్కడ అంబులెన్స్ డ్రైవర్‌గా..
సాక్షి, హైదరాబాద్: అవును అతడు రెక్కలు కట్టుకొని వచ్చాడు. తన వాళ్ల కోసమే కాదు. తన తల్లి లాంటి ఎంతో మంది తల్లుల కోసం. మరెందరో తన చెల్లెల్లాంటి తోబుట్టువుల కోసం అమెరికా నుంచి వచ్చేశాడు. డెల్లాయిట్కు చెందిన ఓ ప్రముఖ సంస్థలో సాఫ్ట్వేర్ నిపుణుడిగా, ప్రాజెక్టు మేనేజర్‌గా పని చేస్తున్న తరుణ్ కప్పల ఇప్పుడు ఒక అంబులెన్స్ డ్రైవర్ కూడా. కోవిడ్ మహమ్మారిపైన అలుపెరుగని యుద్ధం చేస్తున్న వందలాది మంది సైనికుల్లో అతడు సైతం ఒక సైనికుడిగా నిలిచాడు. కోవిడ్ బాధితులు ఎక్కడుంటే అక్కడ ఠకీమని వాలిపోతాడు. స్వయంగా అంబులెన్సులో తీసుకెళ్లి ఆస్పత్రుల్లో చేర్పిస్తాడు. కోవిడ్ పేషెంట్లు వార్డుల్లో ఉన్నా. ఐసీయూల్లో ఉన్నా వెళ్లి పలకరిస్తాడు. ‘నేనున్నానంటూ భరోసానిస్తాడు. మీకేం కాదంటూ ’మాటలతో ధైర్యాన్ని నూరిపోస్తాడు. తరుణ్ అంబులెన్స్ రాత్రింబవళ్లు తిరుగుతూనే ఉంటుంది. హైదరాబాద్‌లో ఏ మారుమూల ప్రాంతంలో కోవిడ్ బాధితులు సహాయం కోసం ఎదురు చూస్తున్నారని తెలిసినా వెంటనే వెళ్లిపోతాడు. ‘సకాలంలో ఆస్పత్రికి చేర్చినప్పుడు, పేషెంట్లు కోలుకొని తిరిగి ఇంటికి వెళ్తున్నప్పడు గొప్ప సంతృప్తి కలుగుతుంది. ఈ జీవితానికి అది చాలు అనిపిస్తుంది.’ అంటూ వినయంగా చెబుతాడు తరుణ్. సేవే దైవంగా... శ్రీనగర్ కాలనీకి చెందిన తరుణ్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. టెక్సాస్ వర్సిటీలో చదువుకున్నాడు. డెల్లాయిట్‌లో ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలో చేరాడు. గతేడాది కోవిడ్ మహమ్మారి బారిన పడిన ప్రపంచం చిగురుటాకులా వణుకుతున్న సమయంలో అక్కడే ఉన్నాడు. ఆ సమయంలో ఇండియాకు వచ్చే విద్యార్ధులకు అండగా నిలిచాడు. సొంత ఊళ్లకు వెళ్లేందుకు అన్ని విధాలుగా సహకరించాడు. ‘ఆ సమయంలోనే మా అమ్మ హైదరాబాద్‌లో ఇంట్లో జారిపడింది. వెన్నెముక దెబ్బతిన్నది. సర్జరీ చేయవలసి వచ్చింది. ఇక నేను హైదరాబాద్‌కు వచ్చాను. మధ్యలో అమ్మకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కొద్ది రోజుల్లో అమెరికాకు తిరిగి వెళ్లిపోవచ్చుననుకుంటున్న సమయంలో సెకెండ్ వేవ్ ఉధృతి మొదలైంది. చాలా భయానకమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆ పరిస్థితులే నా బాధ్యతను కూడా గుర్తు చేశాయి’ అంటారు తరుణ్. ‘ఆస్పత్రులన్నీ కోవిడ్ పేషెంట్లతో నిండిపోతున్నాయి. అంబులెన్సులు నిలువుదోపిడీకి పాల్పడుతున్నాయి. అమెరికాలోనే ఉంటున్న తన స్నేహితుడి చెల్లెల్ని గచ్చిబౌలిలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు రూ.15 వేలు ఖర్చు చేయవలసి వచ్చింది. ఇలాంటి సంఘటనలు చాలా బాధ కలిగించాయి. ఆ సమయంలోనే అమెరికాలో ఉన్న నా స్నేహితుల సహాయంతో సేవా కార్యక్రమాలు ప్రారంభించాను. ఎథ్నె అనే ఓ స్వచ్చంద సహకారంతో మారుతీ ఓమ్ని వ్యాన్ కొనుగోలు చేసి ఆక్సిజన్ సదుపాయం ఉన్న అంబులెన్సుగా మార్చాను. ఇప్పటి వరకు 4 వేల కిలోమీటర్లకు పైగా తిరిగాను. వందలాది మందిని ఆస్పత్రుల్లో చేర్చాను. దురదృష్టవశాత్తు చనిపోయిన వారి మృతదేహాలను శ్మశానాలకు తీసుకెళ్లాను’ అని చెప్పారు. చదవండి: ‘డాడీ.. లేడాడీ.. నాతో మాట్లాడు... ఏమైంది అంకుల్ నాన్నకు..’ -
కస్టమర్లకు హోండా శుభవార్త !
వెబ్‌డెస్క్: కస్టమర్లకు హోండా మోటార్స్ గుడ్‌న్యూస్ చెప్పింది. కరోనా కారణంగా గత రెండు నెలలుగా ఫ్రీ సర్వీసులు పొందలేకపోయిన వారికి ఉపశమనం కలిగించే ఆఫర్ ప్రకటించింది. 2021 ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు గడువులో ఫ్రీ సర్వీసులు పొందలేక పోయిన వారి కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు నెలల కాలంలో ముగిసిపోయే వారంటీ, ఫ్రీ సర్వీసులను జులై 31 వరకు పొడిగిస్తున్నట్టు హోండా సంస్థ పేర్కొంది. పెరిగిన హోండా షైన్ ధర ఇండియన అర్బన్ మార్కెట్లో పట్టున్న హోండా సంస్థ ధరలు పెంచింది. హోండా టూవీలర్ సెగ్మెంట్లో మార్కెట్ లీడర్‌గా ఉన్న షైన్ మోడల్ ధరను పెంచింది. బీఎస్ 6 ప్రమాణాలతో తయారు చేసిన హోండా షైన్ బైక్ రేటు రూ. 1072 పెంచింది. గడిచిన రెండు నెలల్లో వరుసగా రెండోసారి షైన్ బైక్ రేటును హోండా పెంచింది. ప్రస్తుతం ఢిల్లీ షోరూమ్ ధరల ప్రకారం షైన్ బైక్ డ్రమ్వేరియంట్ మోడల్ ధర రూ. 71,550 ఉండగా డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర 76,346గా ఉంది. ప్రస్తుత ధరల పెంపుతో వీటిపై అదనంగా రూ. 1072 వ్యయం కానుంది. పెరిగిన ధరపై జీఎస్టీ, ఇతర లోకల్ ట్యాక్సులు కలుపుకుని కొనుగోలు దారులపై అదనంగా దాదాపు రెండు వేల రూపాయల వరకు భారం పడే అవకాశం ఉంది. క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఓ వైపు షైన్ బైక్ ధరలు పెంచిన హోండా సంస్థ మరోవైపు క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా ప్రకటించింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు హోల్డర్లు జూన్ 30లోపు హోండా షైన్ బైకును కొనుగోలు చేస్తే.. రూ. 3500 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చంటూ ప్రత్యేక ఆఫర్‌ను హోండా సంస్థ ప్రకటించింది. -
వాహనదారులకు యాక్సిస్ ఉచిత ఫాస్టాగ్స్
ముంబై: జాతీయ రహదారులపై ప్రయాణించాలంటే డిసెంబర్ ఒకటి నుంచి అన్ని వాహనాలకూ ఫాస్టాగ్ ఉండాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో కొన్ని నెలలపాటు ట్యాగ్స్‌ను ఉచితంగా అందిస్తామని యాక్సిస్ బ్యాంక్ బుధవారం ప్రకటించింది. ట్రాఫిక్ సమస్యలను అధిగమించడంలో భాగంగా టోల్‌ప్లాజాలు, పార్కింగ్ ప్రాంతాల వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం లేకుండా, ఫాస్టాగ్ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తుండగా.. ఈ టెక్నాలజీకి సేవలందించడం ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. దీంతో పాటు ఇందుకోసం ప్రతి ఒక్క ట్యాగ్‌కు రూ. 100 వరకు ఖర్చు పెట్టనున్నట్లు వెల్లడించింది. మరోవైపు కోటక్ మహీంద్రా బ్యాంక్ ట్యాగ్స్‌ను ఉచితంగా అందిస్తుండగా, ప్రాసెసింగ్ ఛార్జీలను ఎత్తివేసినట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈనెల చివరివరకే ఈ సేవలు అందిస్తామని ఇరు బ్యాంకులు ప్రకటించాయి. 70 లక్షల ఫాస్టాగ్‌ల జారీ దేశవ్యాప్తంగా 70 లక్షల ఫాస్టాగ్‌లను (బుధవారం నాటికి) జారీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. నవంబర్ 26 (మంగళవారం) నాడు అత్యధికంగా 1,35,583 ట్యాగ్లు అమ్ముడుకాగా, అంతకుముందు రోజు 1.03 లక్షల విక్రయాలు నమోదైనట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ వెల్లడించింది. -
రిటైర్మెంట్ తర్వాత ఉచిత ప్రయాణం
సాక్షి, హైదరాబాద్: సంస్థ అధికారులకు ఆర్టీసీ దసరా కానుక ప్రకటించింది. రాష్ట్ర విభజనకు పూర్వం అధికారి హోదా పొందిన వారికి పదవీ విరమణ తర్వాత ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ యాజమాన్యాలు సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నాయి. జూన్ 2, 2015న ఆర్టీసీ విడిపోయిన విషయం తెలిసిందే. విభజనకు పూర్వం పదవీ విరమణ చేసిన అధికారులు (డిపో మేనేజర్, ఆపై స్థాయి).. ఆ నాటికి అధికారిక పదోన్నతి పొంది, ఆ తర్వాత పదవీ విమరణ చేసే వారికి ఈ వెసులుబాటు ఉంటుంది. అధికారితో పాటు వారి భార్య/భర్తకూ ఈ ఉచిత ప్రయాణం వర్తిస్తుంది. ప్రీమియం కేటగిరీ బస్సుల్లో మాత్రం రాయితీ ధరలకు టికెట్ పొందాల్సి ఉంటుంది. కాగా, అధికారులకే ఈ వెసులుబాటు కల్పించడంపై కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గౌరవ సూచకంగా అందించే ఇలాంటి వెసులుబాటును కార్మికులకూ కల్పించాలని ఎండీ రమణారావుకు ఎన్ఎంయూ నేతలు నాగేశ్వర్రావు, కమాల్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాయితీలు ఇలా... ఈడీ, హెచ్ఓడీలు తెలంగాణ సిటీ ఏసీ బస్సుల వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఆంధ్రప్రదేశ్ బస్సుల్లో డీలక్స్ వరకు ఉచితం. ఎస్ఎస్వో, జేఎస్వోలు తెలంగాణ సిటీ బస్సుల్లో మెట్రో డీలక్స్ వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఏపీలోనూ డీలక్స్ వరకు ఉచితం. అన్ని స్థాయిల అధికారులకు రెండు రాష్ట్రాల జిల్లా సర్వీసుల్లో డిలక్స్ వరకు ఉచితం. సూపర్ లగ్జరీ, పై కేటగిరీ బస్సుల్లో 50 శాతం రాయితీ. అంతర్రాష్ట్ర సర్వీసులకు సంబంధించి అన్ని స్థాయిల అధికారులకు ఏపీ బస్సుల్లో డిలక్స్/అల్ట్రా డీలక్స్ వరకు ఉచితం. తెలంగాణ బస్సుల్లో డిలక్స్ వరకు రాయితీ లేదు. సూపర్ లగ్జరీ, పై కేటగిరీ బస్సుల్లో ఇరు రాష్ట్రాల బస్సుల్లో 50 శాతం రాయితీ. -
లడ్డూ సైజు తగ్గుతోంది
– ‘డయల్ యువర్ ఈవో’లో భక్తుల ఫిర్యాదు తిరుమల: టీటీడీ అందించే ఉచిత సేవల్లో సిబ్బంది డబ్బులు అడుగుతున్నారని భక్తులు టీటీడీ ఇవోకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం జరిగిన డయల్ యువర్ ఈఓ కార్యక్రమంలో పలువురు భక్తులు పలు రకాల సమస్యలను ఆలయ ఈవో సాంబశివరావు దృష్టికి తీసుకొచ్చారు. కల్యాణకట్ట, వివిధ విభాగాల సిబ్బంది డిమాండ్ చేస్తున్నారని హైదరాబాద్, విశాఖపట్నం భక్తులు గణేష్, మూర్తి ఫిర్యాదు చేశారు. దీనిపై ఈవో సాంబశివరావు స్పందిస్తూ కట్నాన్ని రద్దు చేశామని, ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వారిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. వృద్ధుల దర్శనాన్ని మధ్యాహ్నం 12.30 గంటలకే మూసివేస్తున్నారని చెన్నైకు చెందిన గజేంద్రబాబు చెప్పగా వృద్దులు, వికలాంగులకు ఉదయం 10, మధ్యాహ్నం 3 గంటల దర్శన స్లాట్‌కు 750 మంది చొప్పున అనుమతిస్తున్నామన్నారు. శుక్రవారం మధ్యాహ్నం మాత్రమే ఉంటుందని ఈఓ చెప్పారు. శ్రీవారి లడ్డూ నాణ్యత లేదు. కనీసం నెయ్యి వాసన రావటం లేదని మరో భక్తుడు కోరగా లడ్డూ తయారీకి నాణ్యమైన నెయ్యి, శనగపప్పు వినియోగిస్తున్నామని తెలిపారు.నడకదారిలో తాగునీటి కొళాయిల్లో శుభ్రత లేదు. మార్గంలోని దుకాణాల్లో అధిక ధరలు ఉన్నాయి. వేసవిలో మజ్జిగ పంపిణీ చేయండని అమరావతికి చెందిన శ్రీనివాసరావు సూచించారు. వేసవిలో గాలిగోపురం వద్ద మజ్జిగ పంపిణీ చేయిస్తున్నామని, నడకదారిలో పరిశుభ్రమైన తాగునీటిని సరఫరా చేస్తున్నామని, దుకాణాల్లో ఎక్కువ ధరలకు విక్రయించకుండా తనిఖీలు చేయిస్తామని అన్నారు. -
ఉచిత సేవలు అసాధ్యం
► మెరుగైన సేవలకు రుసుములు చెల్లించాల్సిందే ► లేదంటే ఎవరో ఒకరు సబ్సిడీ భరించాల్సి ఉంటుంది ► ప్రపంచంలో మన దగ్గరే చార్జీలు తక్కువ... ► హెచ్డీఎఫ్సీ బ్యాంకు సీఈవో ఆదిత్యపురి ముంబై: ‘‘స్టార్ హోటల్‌కు వెళ్లి ఇంటి ధరలకే లంచ్ అడిగితే ఎలా...? బ్యాంకులు ఉన్నది వడ్డీ వ్యయాలు వసూలు చేసుకునేందుకు కాదు. అత్యుత్తమ సేవలు, ఉత్పత్తులు కావాలనుకుంటే అందుకు తగ్గ చార్జీలు వసూలు చేయడం పూర్తిగా సహేతుకం. చార్జీలు విధించకూడని వర్గం కూడా ఉంది. దాన్ని మేము అర్థం చేసుకోగలం’’ అని హెచ్డీఎఫ్సీ బ్యాంకు సీఈవో ఆదిత్యపురి చెప్పారు. ఇటీవల ప్రభుత్వ రంగ ఎస్బీఐ ఏటీఎం లావాదేవీలు, బ్యాంకు శాఖల్లో నగదు జమలపై చార్జీలను ఖరారు చేయడంతోపాటు ఖాతాల్లో ఉంచాల్సిన కనీస నగదు నిల్వలు పెంచిన విషయం తెలిసిందే. అదే విధంగా ప్రైవేటు రంగంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకు, యాక్సిక్ తదితర బ్యాంకులు సైతం బ్యాంకు శాఖల్లో నగదు జమలను నెలలో నాలుగుకు మాత్రమే పరిమితం చేశాయి. ఆపై ప్రతీ లావాదేవీకి సుమారుగా రూ.150 వరకు చార్జీలను వసూలు చేయనున్నట్టు ప్రకటించాయి. బ్యాంకుల నిర్ణయాలపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో ఈ నిర్ణయాలను మరోసారి సమీక్షిం చాలని కేంద్రం బ్యాంకులను కోరింది. ఈ నేపథ్యంలో బ్యాంకు సేవలకు చార్జీల విధింపు ఎంత వరకు సబబు అన్న అంశంపై ఆదిత్యపురి ఓ వార్తా సంస్థకు వివరాలు అందించారు. వివరాలు ఆయన మాటల్లోనే... ప్రపంచంలో ఇక్కడే తక్కువ..! దేశంలో బ్యాంకింగ్ సేవల చార్జీలు ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇక్కడే తక్కువ. అయినా, ప్రజలు బ్యాంకులను తప్పుబడుతున్నారు. దాదాపు చాలా వరకు చెల్లింపులు, నగదు బదిలీలకు ఎటువంటి చార్జీలు వసూలు చేయడం లేదన్న విషయాన్ని గమనించాలి. నగదు జమలపై ఎందుకు? అధిక మొత్తంలో నగదు డిపాజిట్ చేస్తే అందుకు మాకు వ్యయం అవుతుంది. టెల్లర్ ఆ మొత్తాన్ని లెక్కించాల్సి ఉంటుంది. తిరిగొచ్చి ఆ మొత్తాన్ని డ్రా చేసుకుని వెళతారు. అందుకు కూడా మాకు ఖర్చవుతుంది. ఆ ఖర్చులను చెల్లించాలి. మాదేమీ ఉచిత సంస్థ కాదు. మా వాటాదారులకు లాభాలను పంచాల్సి ఉంటుంది. డిపాజిట్లపై బ్యాంకులకు ఆదాయం వస్తోందిగా...? ఈ సందర్భంగా ఓ విషయం స్పష్టం చేయాల్సిందే. ఉదాహరణకు రూ.10,000 రూపాయల సేవింగ్స్ ఖాతా డిపాజిట్ ఉందనుకోండి. దానిపై 4 శాతం వడ్డీని ఖాతాదారుడికి చెల్లించాలి. 4 శాతాన్ని నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్) కింద పక్కన పెట్టాలి. ఓ ఏడాదికి మాకొచ్చే ఆదాయం రూ.200. దీనికే, ఖాతాదారులు ఉచితంగా ఏటీఎం ఇవ్వాలని ఆశిస్తారు. చెక్కు బుక్ చార్జీలు ఉండకూడదంటారు. నగదు నిర్వహణ చార్జీలు వద్దంటారు. ఖాతాలో నెలవారీ కనీస నగదు నిల్వ రూ.5,000 ఉంచడం తప్పనిసరి అంటూ ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య ఏం చెప్పారో గుర్తు చేసుకోండి. కార్డు లావాదేవీలపై ఎండీఆర్ సహేతుకమేనా? దుకాణాల్లో కార్డులను స్వైప్ చేసినప్పుడు వర్తకుల నుంచి వసూలు చేసే చార్జీల (ఎండీఆర్) విషయమై ఆదిత్య పురి మాట్లాడుతూ... అయిన ఖర్చునే ఎండీఆర్ రూపంలో వసూలు చేస్తున్నాం. ప్రభుత్వం దీన్ని ఉచితం చేయాలనుకుంటే సంతోషం. అయితే, అప్పుడు ప్రభుత్వమే టెర్మినళ్లు పెట్టాలి. మేము టెర్మినళ్లను (స్వైపింగ్ మెషీన్లు) పెడితే వారు ఉచితంగా వినియోగించుకోవడం సహేతుకం కాదు. మీరు చెబుతున్న దాని ప్రకారం పాంటలూన్స్, తాజ్ హోటళ్లు వంటి చోట కూడా సబ్సిడీని మేము భరించాల్సి ఉంటుంది. ఆయా సంస్థల లాభాలు పెరుగుతుంటే మేము ఉచితంగా ఎందుకు అందించాలి? చిన్న కిరాణా షాపు విషయంలో సబ్సిడీ అందించేందుకు ఓ మార్గాన్ని కనుగొనాలి. యూపీఐని ఇందుకు వినియోగించుకోవచ్చు. లేదంటే ఎండీఆర్‌ను తక్కువగా నిర్ణయించవచ్చు. అంతేకానీ ఎవరో ఒకరు సబ్సిడీ భరించకుండా ఉచితంగా కార్డు లావాదేవీలను అందించడం సాధ్యం కాదు. అవినీతికి డిజిటలే మంత్రం! అవినీతి నియంత్రణ, పారదర్శకతకు డిజిటల్ తప్ప మరో మార్గం లేదు. డిజి టల్‌కు ఊతమిచ్చే డీమోనిటైజేషన్ను మూడేళ్ల క్రితమే తీసుకొచ్చి ఉండాల్సింది. డీమోనిటైజేషన్ వల్ల వడ్డీ రేట్లు దిగొచ్చాయి. వ్యవస్థలోకి వచ్చిన నగదు అంతా నల్లధనం కాదు. దీనివల్ల పన్ను పరిధి విస్తరిస్తుంది. అది ఒక శాతం కావచ్చు లేదా రెండు శాతం కావచ్చు. కానీ కచ్చితంగా పన్ను ఆదాయం పెరుగుతుంది. -
జియో ఎఫెక్ట్ : ఇండస్ట్రీ రెవెన్యూలు ఢమాల్
-
జియో ఎఫెక్ట్ : ఇండస్ట్రీ రెవెన్యూలు ఢమాల్
న్యూఢిల్లీ : ఉచిత డేటా, ఉచిత వాయిస్ కాలింగ్ అంటూ ఉచిత ఆఫర్లు గుప్పిస్తున్న రిలయన్స్ జియో వల్ల టెలికాం ఇండస్ట్రీకి రెవెన్యూలు గండికొడుతున్నాయట. దేశీయ టెలికాం ఇండస్ట్రీ తన రెవెన్యూలో ఐదోవంతును కోల్పోతుందని, దానికి గల కారణం ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ అందించే ఉచిత సర్వీసులేనని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ రిపోర్టు వెల్లడించింది. 2017-18 ఆర్థికసంవత్సరానికి సంబంధించిన అవుట్ లుక్ ను సమీక్షించిన ఈ సంస్థ, టెలికాం సెక్టార్ అవుట్ లుక్ స్టేబుల్ నుంచి నెగిటివ్‌లోకి(స్థిరం నుంచి ప్రతికూలం) వచ్చినట్టు చెప్పింది. ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ఈ రిపోర్టును గురువారం విడుదల చేసింది. ఇటీవల ఇండస్ట్రీ దిగ్గజాలు విడుదల చేసిన ఫలితాల్లోనూ అవి భారీగా కుప్పకూలాయి. ప్రస్తుతం మార్కెట్లో టెల్కోల మార్కెట్ షేరు పడిపోతుండగా.. రిలయన్స్ జియో సబ్ స్క్రైబర్ బేస్ చాలా త్వరగా పైకి ఎగుస్తున్నట్టు రిపోర్టు పేర్కొంది. 2017 జనవరిలో 72 మిలియన్ సబ్ స్క్రైబర్లుంటే, 2017 మార్చికి 100 మిలియన్లను క్రాస్ చేసినట్టు రిపోర్టు తెలిపింది. ధర విషయంలోనూ, అనుభూతి పరంగా మార్కెట్ షేరును ఆకట్టుకోవడంలో జియోకి సామర్థ్యమున్నట్టు పేర్కొంది. కస్టమర్ బేస్ ను నిలబెట్టుకోవడం ప్రస్తుతం టెల్కోల ముందున్న సవాళ్లని, వారి సామర్థ్యం, స్పీడ్, వర్చ్యువల్ నెట్ వర్క్ ప్లాట్ ఫామ్స్ తో కస్టమర్లను కాపాడుకుంటూ ఉండాలని సూచించింది. ఐడియా, వొడాఫోన్ల విలీనంతో టెలికాం ఇండస్ట్రీలో స్పెక్ట్రమ్, ఇన్ఫ్రాక్ట్ర్చర్ల వృథా ఖర్చులు తగ్గుతాయని రిపోర్టు పేర్కొంది. -
ఆరు నెలలు పొడిగింపు
ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్‌మెంట్‌పై నిర్ణయం - నగదు రహిత చికిత్సతోపాటు డబ్బులిచ్చి వైద్యం చేయించుకునే వీలు - నగదు రహిత వైద్యం గాడిలో పడే వరకు దీన్ని కొనసాగించే యోచన సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్మెంట్ గడువును మరో 6 నెలలపాటు పొడిగించాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ నెలా ఖరుతో రీయింబర్స్ గడువు ముగుస్తున్నం దున ఈ నిర్ణయం తీసుకుంది. నగదు రహిత ఆరోగ్య కార్డుల కింద వైద్యం అంది స్తున్నా.. తాజాగా కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ ఉచిత సేవలు అందుబాటులోకి వచ్చినా రీయింబర్స్‌మెంట్‌ను ఎత్తివేయకుండా మరో 6 నెలలపాటు కొనసాగించాలని నిర్ణయించడం గమనార్హం. అన్ని కార్పొరేట్, ప్రైవేటు నెట్వర్క్ ఆస్పత్రుల్లో నగదు రహిత ఉచిత వైద్య సేవలు గాడిలో పడే వరకు.. వెల్నెస్ సెంటర్లు పూర్తి స్థాయిలో నెలకొల్పే వరకు వైద్యపరంగా ఉద్యోగులు ఇబ్బంది పడకుండా దీనిని కొనసాగించాల నేది సర్కారు ఉద్దేశం. అన్నీ సక్రమంగా కొనసాగితే 6 నెలల తర్వాత రీయింబర్స్ విధానాన్ని ఎత్తేసే అవకాశం ఉంది. రీయింబర్స్ కింద ఉద్యోగులు, వారి కుటుంబీకు లు తాము పొందిన వైద్యానికి ముందుగా డబ్బులు చెల్లించి ఆ తర్వాత బిల్లులు పెట్టి ప్రభుత్వం నుంచి సొమ్ము తీసుకుంటారు. నగదు రహిత సేవలకు ముందు ఉద్యోగులు ఈ పద్ధతి లోనే వైద్య సేవలు పొందేవారు. నిమ్స్ ధరలకు 25% అదనంగా.. కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉద్యోగులు, జర్నలి స్టులకు నగదు రహిత వైద్యం కింద అందించే శస్త్రచికిత్సల ప్రస్తుత ప్యాకేజీని 40% వర కు పెంచిన సంగతి తెలిసిందే. అయితే అందులో వివిధ వ్యాధులకు వివిధ రకాలు గా ప్యాకేజీ ఖరారు చేశారు. మెడికల్ ప్యాకేజీలోని షుగర్ తదితర వ్యాధులకు ప్రస్తుతమున్న ప్యాకేజీని నిమ్స్ ధరలపై 25% అదనంగా పెంచారు. హెర్నియా, హైడ్రోసిల్ వంటి సాధారణ శస్త్రచికిత్సలకు కేంద్ర ఆరోగ్య పథకం(సీజీహెచ్) ప్రకారం ప్యాకేజీ నిర్ణయించారు. కిడ్నీలో రాళ్లు, ల్యాప్రోస్కోపిక్ వంటి సంక్లిష్ట శస్త్రచికిత్సల ప్యాకేజీని 35 నుంచి 40% వరకు పెంచారు. ఒకే వ్యక్తికి మూడు నాలుగు కలిపి జబ్బు లుంటే వాటికి ఒకే ప్యాకేజీ కింద చికిత్స ఇప్పటివరకు లేదు. షుగర్, కిడ్నీ, గుండె జబ్బులు కలిసి కొందరికి ఉంటాయి. అలాంటి వారికి శస్త్రచికిత్సలు చేయాల్సి వస్తే నిమ్స్ మిలీనియం ధరల్లో 35% వరకు పెంచి ప్యాకేజీ ఖరారు చేస్తారు. మందుల ధరలను ఎంఆర్పీ ప్రకారం ప్యాకేజీ నిర్ధారించారు. వైద్య పరీక్షల ప్యాకేజీ నిమ్స్ టారిఫ్‌లో 25% అదనంగా ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. తాజాగా ప్రకటించిన 40% వరకు ప్యాకేజీ పెంపుతో రూ.100 కోట్ల వరకు ప్రభుత్వంపై అదనపు భారం పడే అవకాశం ఉందని అంటున్నారు. ఉద్యోగులు, జర్నలిస్టులకు ప్రత్యేక కౌంటర్.. అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉద్యోగులు, జర్నలిస్టులకు నగదు రహిత వైద్య సేవలు 4 రోజుల క్రితం అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కార్పొరేట్ ఆస్పత్రులు నగదు రహిత వైద్య సేవలు అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు ఇంకా చేసుకోలేదని తెలిసింది. ఉద్యోగులు, జర్నలిస్టుల సేవలకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసుకోవాల్సి ఉందని యాజమాన్యాలు చెబుతున్నాయి. ఆరోగ్యశ్రీ కింద ఇప్పటివరకు వివిధ వ్యాధులకు ఉన్న ప్యాకేజీ సొమ్మును 40 శాతం వరకు పెంచినందున ఆ ప్రకారం సాఫ్ట్‌వేర్‌ను మార్చాల్సి ఉందని అంటున్నారు. మొత్తం 1,885 వ్యాధులకు సంబంధించి వివిధ రేట్లను అందులో పొందుపరచాల్సి ఉంది. అంతేగాక ఆయా ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ రోగులకు ఉన్నట్లుగానే ఉద్యోగులు, జర్నలిస్టుల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటుకు మరికొన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు. ఆ లోపు ఎవరైనా ఆస్పత్రికి వస్తే చికిత్స చేస్తామంటున్నారు. వెల్నెస్ సెంటర్‌ను సందర్శించిన టీజీవో నేతలు సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులు, జర్నలిస్టుల కోసం ఖైరతాబాద్‌లో ఇటీవల ప్రారంభించిన వెల్నెస్ సెంటర్‌ను తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నేతలు మంగళవారం సందర్శించారు. టీజీవో రాష్ట్ర జనరల్ సెక్రటరీ సత్యనారాయణ, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎంబీ కృష్ణయాదవ్, వెంకటేశ్వర్లు తదితరులు వెల్నెస్ సెంటర్లో సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ కోసం పాటుపడిన ఉద్యోగులు, జర్నలిస్టుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి చొరవతో ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. -
మార్చి వరకూ ‘జియో’ ఫ్రీ
• ‘నూతన సంవత్సర కానుక’గా పొడిగింపు • ప్రస్తుత కస్టమర్లతోపాటు కొత్తగా చేరేవారికీ వర్తింపు • రోజుకు ఎఫ్‌యూపీ పరిమితి 1జీబీనే • రిలయన్స్ చీఫ్ ముకేశ్ అంబానీ ప్రకటన ముంబై: రిలయన్స్ జియో నూతన సంవత్సర కానుకగా ‘జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్’ ప్రకటించింది. ప్రస్తుత కస్టమర్లకు డిసెంబర్ 3తో ముగిసిపోతున్న ఉచిత సేవలను మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్టు ఆ సంస్థ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు. డేటా, దేశీయంగా వారుుస్, వీడియో కాల్స్, జియో యాప్స్‌ను ప్రస్తుత కస్టమర్లతోపాటు కొత్తగా చేరే వారు సైతం మార్చి వరకు ఉచితంగా పొందవచ్చని తెలిపారు. కానీ, అదే సమయంలో డేటా విషయంలో జియో నియంత్రణలు విధించింది. పారదర్శక వినియోగ విధానం (ఎఫ్‌యూపీ) కింద ప్రతీ కస్టమర్‌కు ఒక రోజులో ఉచిత డేటాను 1జీబీకే పరిమితం చేసింది. ప్రస్తుత కస్టమర్లు మాత్రం డిసెంబర్ 31 వరకు రోజుకు 4జీబీ డేటాను పొందవచ్చు. జనవరి 1 నుంచి క్తొత ఆఫర్‌కు మారిపోతారు. కాగా, డేటా పరిమితిని ముకేశ్ అంబానీ సమర్థించుకున్నారు. 80 శాతం జియో కస్టమర్ల రోజు వారీ డేటా వినియోగం 1జీబీ అంతకంటే తక్కువే ఉందని, మిగిలిన 20 శాతం కస్టమర్లు డేటాను విపరీతంగా వాడేస్తున్నారని, దీంతో నెట్‌వర్క్‌లో రద్దీ పెరిగిపోతున్నట్టు చెప్పారు. సెప్టెంబర్ 4న జియో అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక కోరితే కస్టమర్ ఇంటికే వచ్చి జియో సిమ్‌ను అందించే సదుపాయాన్ని కూడా ముకేశ్ ప్రకటించారు. మొబైల్ ద్వారా చెల్లింపులకు జియో మనీ అప్లికేషన్‌ను విడుదల చేశారు. ‘‘భారత్‌లోనే కాదు ప్రపంచ చరిత్రలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న కంపెనీగా జియో అవతరించింది. తొలి మూడు నెలల వయసులోనే ఫేస్బుక్, వాట్సాప్, స్కైప్‌ల కంటే అధికంగా వృద్ధిని నమోదు చేసింది’’ అని ముకేశ్ అంబానీ ప్రకటించారు. 20 శాతానికి కాల్ బ్లాక్ రేటు: ‘‘ప్రత్యర్థి ఆపరేటర్ల పోటీ వ్యతిరేక విధానాల వల్ల జియో అత్యుత్తమ వారుుస్ టెక్నాలజీ ప్రయోజనాన్ని కస్టమర్లకు అందించలేకపోయాం’’ అని అంబానీ పేర్కొన్నారు. అధికారుల జోక్యం ఫలితంగా కాల్ బ్లాక్ రేటు 90 శాతం నుంచి 20 శాతం సమీపానికి దిగి వచ్చినట్టు చెప్పారు. రానున్న వారాల్లో తగినన్ని ఇంటర్ కనెక్షన్ పారుుంట్లు ఇతర ఆపరేటర్ల నుంచి అందితే జియో కస్టమర్లు అవాంతరాల్లేని వారుుస్ అనుభవాన్ని చవి చూస్తారని అంబానీ పేర్కొన్నారు. డేటా వేగం నిదానించడంపై... జియో నెట్‌వర్క్‌ను సామర్థ్యం, వేగం కోసం నిర్మించామని, 5 కోట్ల మంది కస్టమర్లు ఉచిత ఆహ్వాన ఆఫర్‌ను పూర్తి స్థారుులో వినియోగించుకోవడం వల్లే వేగంలో సమస్యలు ఏర్పడ్డాయని అంబానీ వివరించారు. అసాధారణ డేటా వినియోగం కారణంగా 8 శాతం జియో టవర్లు సమస్యలు ఎదుర్కొన్నట్టు చెప్పారు. ఒక బ్రాడ్ బ్యాండ్ యూజర్ రోజువారీ వినియోగం కంటే జియో కస్టమర్ సగటున 25 శాతం అధికంగా వినియోగిస్తున్నారనీ, అరుునప్పటికీ ఇతర ఆపరేటర్ల కంటే నాలుగు రెట్ల అధిక డేటాను, అధిక వేగంతో అందించినట్టు అంబానీ వివరించారు. గ్రామగ్రామానా జియో మనీ... జియో మనీ యాప్ బ్యాంకు ఖాతాతో అనుసంధానమై పనిచేస్తుందని అంబానీ పేర్కొన్నారు. ‘‘కస్టమర్లు జియో మనీ సాయంతో నేరుగా తమ బ్యాంకు ఖాతాలోని నగదు బ్యాలన్స నుంచి వర్తకులకు చెల్లింపులు చేయవచ్చు. వర్తకులు జియో మనీ యాప్‌తో కస్టమర్ల నుంచి చెల్లింపులను నేరుగా తమ బ్యాంకు ఖాతాలోకి స్వీకరించవచ్చు. దేశవ్యాప్తంగా 17,000 పట్టణాలు, 4 లక్షల గ్రామాల్లో కోటి చిన్న వర్తకులు, రిటైలర్లతో జియో చేతులు కలపనుంది. ఆధార్ ఆధారిత సూక్ష్మ ఏటీఎంలను ఏర్పాటు చేస్తాం’’ అని అంబానీ చెప్పారు. నోట్ల రద్దుపై ప్రధానికి అభినందనలు ప్రధాని నరేంద్రమోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి ముకేశ్ అంబానీ మద్దతు పలికారు. ప్రధాని ప్రకటించిన డీమోనిటైజేషన్ నిరుపయోగంగా పడి ఉన్న ధనాన్ని ఉత్పాదకత వైపు తీసుకొస్తుందన్నారు. ఈ చర్యతో డిజిటల్ ఆధారిత ఆర్థిక వృద్ధికి మోదీ బలమైన చేయూతనిచ్చారని పేర్కొన్నారు. ధృఢమైన, చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ప్రధానికి తన అభినందనలని ప్రకటించారు. ప్రధాని చర్య ప్రజల ఆలోచనల్లో మార్పు తెస్తుందని... డిజిటల్ చెల్లింపులు పారదర్శక, బలమైన భారత్‌కు, దేశీయ ఆర్థిక రంగానికి మేలు చేస్తాయన్నారు. జియో ఆఫర్‌ను సమీక్షిస్తాం: ట్రాయ్ న్యూఢిల్లీ: ఉచిత సేవలను వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తూ జియో ప్రకటించిన ‘జియో హ్యాపీ న్యూ ఇయర్’ ఆఫర్‌ను పరిశీలిస్తామని ట్రాయ్ తెలిపింది. తమ ముందుకు వచ్చిన ప్రతీ టారిఫ్‌ను పరిశీలిస్తామని, దీనిపై తగిన సమయంలో స్పందిస్తామని ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ స్పష్టం చేశారు. -
‘102’ వాహనాల ద్వారా గర్భిణులకు సేవలు
మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్: ‘102’ అమ్మ ఒడి వాహనాల ద్వారా గర్భిణులకు ఉచిత సేవలందిస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. సచివాలయంలో మంగళవారం ఆయన అమ్మ ఒడి వాహనాలను, మార్చురీ వాహనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘102’ వాహనాల ద్వారా గర్భిణులను ఇంటి నుంచి ఆస్పత్రికి, ఆస్పత్రి నుంచి ఇంటికి ఉచితంగా తరలిస్తామన్నారు. ప్రస్తుతం‘102’ వాహనాలు 41 వరకు అందుబాటులో ఉన్నాయన్నారు. అలాగే మార్చురీకి మరో 50 కొత్త అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. వీటిని గాంధీ, ఉస్మానియా, జిల్లా ఆసుపత్రుల దగ్గర ఏర్పాటు చేస్తామని చెప్పారు. వైద్య రంగాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని, పేదల ఆరోగ్య రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, డీఎంఈ రమణి తదితరులు పాల్గొన్నారు. -
సాక్షి ‘లివ్ వెల్ ఎక్స్పో’కు భారీ స్పందన
ముగిసిన రెండు రోజుల ప్రదర్శన ఉత్సాహంగా పాల్గొన్న జంటనగరాల వాసులు సాక్షి, హైదరాబాద్: ప్రజలు ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేసి.. వారిలో ఆరోగ్య స్పృహ పెంచే ఉద్దేశంతో భాగ్యనగరంలో నిర్వహించిన సాక్షి లివ్ వెల్ ఎక్స్పో కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. ‘సాక్షి’ మీడియా, డీఎస్ రీసెర్చ్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన రెండు రోజుల ‘లివ్ వెల్ ఎక్స్పో’ ఆదివారం సాయంత్రం ముగిసింది. జంట నగరాల్లోని వివిధ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులు, దంత, నేత్ర, హెయిర్, ఆయుర్వేద, హోమియో, యునానీ ఆస్పత్రులు ఈ ఎక్స్‌పోలో తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి. ఇక్కడ ప్రదర్శించిన ఉత్పత్తులను, అందిస్తున్న ఉచిత సేవలను వినియోగించుకునేందుకు ప్రజలు బారులు తీరారు. రెండో రోజైన ఆదివారం టెన్‌కె రన్ వ్యవస్థాపకురాలు ఉమా చిగురుపాటి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురోథెరపీ నిపుణులు అజింక్యా పవార్, యోగా నిపుణురాలు జర్నామోహన్, ప్రముఖ వక్త నీలిమాభట్, జుంబా ట్రైనర్ విజయ తదితరులు ఎక్స్‌పోలో పాల్గొన్నారు. ప్రజలు రోగాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటిం చాల్సిన చిట్కాలను వారు వివరించారు. జుంబా డ్యాన్స్ బాగుంది వివిధ పనులతో ఒత్తిడికి లోనవుతున్న వారికి జుంబా డ్యాన్స్ చాలా ఉపయోగకరంగా ఉంది. చిన్న చిట్కాలు, వ్యాయామాలతో ఒత్తిడిని తొలగించుకోవచ్చు. ‘స్ట్రెస్ టు స్వస్థ్’పై నీలిమా భట్ ఇచ్చిన సందేశం చాలా బాగుంది. ప్రతి ఒక్కరికీ అవసరమైన ఆహార పదార్థాలను, వ్యాయామాలను చేసే విధానాలను వివరంగా తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు అందరికీ ఉపయోగకరంగా ఉంటాయి. - మురళి, చందానగర్ స్టీవియా మొక్క ఉపయోగం స్టీవియా మొక్కను కొనుగోలు చేశాను. ఈ మొక్క పెరిగిన తర్వాత వాటి ఆకులను చూర్ణంగా చేసుకుని వాడటం వల్ల రోగాలను నివారించవచ్చు. స్థూలకాయం, అజీర్ణం, నోటి వ్యాధులు, వాతరోగాలు, కీళ్ల నొప్పులు, ఆస్తమా, రక్తపోటు, జుట్టు రాలడం లాంటి సమస్యల నుంచి రక్షించుకోవచ్చు. ఈ మొక్క ఆకులు తియ్యగా ఉంటాయి. దీని విలువ 30 రూపాయలు మాత్రమే. - రజిని, బీహెచ్ఈఎల్ సైంధవ లవణం మంచిది ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన.. అత్యధిక పరిమాణంలో ఉండే సైంధవ లవణం(ఉప్పు) గనులు హిమాలయాల్లో ఉన్నాయి. సైంధవ లవణం ప్రకృతి ప్రసాదితం. దీనిని వాడటం వల్ల పక్షవాతం, థైరాయిడ్, బీపీ, చక్కెర వ్యాధి, కీళ్ల సమస్యలు వంటివి తలెత్తవు. సైంధవ లవణం రాయిని ఇంట్లో, ఆఫీస్‌లో, టేబుల్‌పై పెట్టుకుంటే పాజిటివ్ శక్తిని ఇస్తుంది. వాస్తుదోష నివారిణి. ఇంట్లోని గాలిని శుద్ధి చేస్తుంది. - ప్రవీణ్ కుమార్ ఆరోగ్య చిట్కాలు బాగున్నాయి ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాల్స్ నిర్వాహకులు చెపుతున్న ఆరోగ్య సూత్రాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. పెరటి మొక్కల ఉపయోగం చాలా ఉంది. అమ్మమ్మలు, నానమ్మలు చేసే సున్నుండలు, బెల్లంపట్టీలు లాంటి సంప్రదాయ వంటకాల్లో ఎన్నో పోషకాలుండేవి. అవి వదిలేసి పోషకాల కోసం ఖరీదైన పదార్థాల కోసం వెతుకుతున్నారు. మట్టికుండల్లో వంటలు, పెరట్లో పెరిగే పంటలు ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. - లలిత, హబ్సిగూడ