జియో ఎఫెక్ట్ : ఇండస్ట్రీ రెవెన్యూలు ఢమాల్ | Reliance Jio free services resulted in 20% revenue loss to telecom industry: Report | Sakshi
Sakshi News home page

Published Sat, Feb 18 2017 7:32 AM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM

ఉచిత డేటా, ఉచిత వాయిస్ కాలింగ్ అంటూ ఉచిత ఆఫర్లు గుప్పిస్తున్న రిలయన్స్ జియో వల్ల టెలికాం ఇండస్ట్రీకి రెవెన్యూలు గండికొడుతున్నాయట. దేశీయ టెలికాం ఇండస్ట్రీ తన రెవెన్యూలో ఐదోవంతును కోల్పోతుందని, దానికి గల కారణం ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ అందించే ఉచిత సర్వీసులేనని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ రిపోర్టు వెల్లడించింది. 2017-18 ఆర్థికసంవత్సరానికి సంబంధించిన అవుట్‍ లుక్ ను సమీక్షించిన ఈ సంస్థ, టెలికాం సెక్టార్‍ అవుట్‍ లుక్ స్టేబుల్ నుంచి నెగిటివ్‍లోకి(స్థిరం నుంచి ప్రతికూలం) వచ్చినట్టు చెప్పింది. ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ఈ రిపోర్టును గురువారం విడుదల చేసింది. ఇటీవల ఇండస్ట్రీ దిగ్గజాలు విడుదల చేసిన ఫలితాల్లోనూ అవి భారీగా కుప్పకూలాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement