revenue loss
-
‘జీఎస్టీ వల్ల ప్రభుత్వ ఆదాయం పోతోంది’.. ఎవరన్నారీ మాట?
జీఎస్టీతో అన్ని రకాల వస్తువుల రేట్లు పెరిగిపోయాయని ఓవైపు దేశ ప్రజలు గగ్గోలు పెడుతుంటే మరోవైపు ప్రధాన మంత్రి ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ బిబేక్ దేబ్రాయ్ మాత్రం జీఎస్టీ వల్ల ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోతోందని వ్యాఖ్యానించారు. ఒకే రేటుతో ఆదాయం తటస్థంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. తాజాగా కలకత్తా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జీఎస్టీలో చాలా సరళీకరణ జరిగిందన్నారు. "ఆదర్శ జీఎస్టీ అనేది ఒకే రేటును కలిగి ఉండాలి. దీని ప్రభావం ప్రభుత్వ ఆదాయం మీద పడకూడదు. జీఎస్టీని మొదటిసారి ప్రవేశపెట్టినప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ లెక్కల ప్రకారం, సగటు పన్ను రేటు కనీసం 17 శాతం ఉండాలి. కానీ, ప్రస్తుత జీఎస్టీ 11.4 శాతం. జీఎస్టీ కారణంగా ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోతోంది’’ అని బిబేక్ దేబ్రాయ్ పేర్కొన్నారు. అత్యధికంగా ఉన్న 28 శాతం జీఎస్టీ రేటు తగ్గాలని ప్రజలతోపాటు జీఎస్టీ కౌన్సిల్ సభ్యులు కోరుకుంటున్నారని, అయితే అత్యల్పంగా ఉన్న సున్నా, 3 శాతం జీఎస్టీ రేట్లు పెరగాలని మాత్రం ఎవరూ కోరుకోవడం లేదని బిబేక్ అన్నారు. అందుకే మనకు సరళీకృత జీఎస్టీ అసాధ్యమని చెప్పారు. అలాగే జీఎస్టీ నిబంధనల్లోనూ చాలా దుర్వినియోగం జరుగుతోందన్నారు. ఇదీ చదవండి: Renters Insurance: ఇల్లు లేకపోయినా హోమ్ ఇన్సూరెన్స్! ఎందుకు.. ఏంటి ప్రయోజనం? -
రూ.75కే మీడియా సంస్థ అమ్మకం!
వెల్లింగ్టన్: కరోనా మహమ్మారి దెబ్బకు రెవెన్యూ పడిపోయి మీడియా సంస్థలు కుదేలవుతున్నాయి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ ‘స్టఫ్’. ఎన్నో జాతీయ దినపత్రికలను ప్రచురిస్తూ, స్టఫ్ పేరుతోనే ఎంతో ప్రజాదరణ కలిగిన వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్న ఈ సంస్థను.. కేవలం డాలర్‌కే (మన రూపాయిల్లో రూ.75) కంపెనీ సీఈవో సినేడ్ బౌచర్‌కు విక్రయిస్తున్నట్టు మాతృ సంస్థ నైన్ ఎంటర్టైన్మెంట్ ప్రకటించింది. ఈ డీల్ ఈ నెలాఖరుకు పూర్తవుతుందని ఆస్ట్రేలియన్ స్టాక్ మార్కెట్‌కు తెలియజేసింది. స్టఫ్‌లో 400 జర్నలిస్టులు సహా 900 మంది పనిచేస్తున్నారు. ప్రకటనల ఆదాయం పడిపోవడంతో స్టఫ్ ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొంటున్న క్రమంలో ఈ డీల్ చోటు చేసుకుంది. -
బోసిపోయిన తిరుపతి రైల్వే స్టేషన్
తిరుపతి అర్బన్: సంక్రాంతి పండుగ సెలవులకు నగర జనం పూర్తిగా పల్లెలకు వెళ్లడంతో తిరుపతి రైల్వే స్టేషన్ ఆదివారం బోసిపోయి కనిపించింది. సాధారణంగా శని, ఆదివారాల్లో ఏ సమయంలోనైనా ఈ రైల్వే స్టేషన్ సాధారణ ప్రయాణికులు, యాత్రికులతో కిటకిటలాడుతుంటుంది. కానీ ఇతర ప్రాంతాల నుంచి తిరుమలకు రావాల్సిన వారి సంఖ్య, తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తిరుపతికి రైల్వే స్టేషన్ ద్వారా తమ ప్రాంతాలకు తిరిగి వెళ్లేవారి సంఖ్య రెండు రోజులుగా బాగా తగ్గింది. దీంతో స్టేషన్‌లోని జనరల్ బుకింగ్, రిజర్వేషన్ కార్యాలయం, ప్లాట్‌ఫారాలు, వెయిటింగ్ హాళ్లు ప్రయాణికులు లేక వెలవెలపోయాయి. ఫ్లాట్‌ఫాంలపై, స్టేషన్ సమీపంలో వ్యాపారాలు అంతంతమాత్రంగా ఉండడంతో ఎప్పుడూ బిజీగా ఉండే వ్యాపారులు కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ గడిపారు. రైల్వే పోర్టర్లు రోజూ యాత్రికుల రాకతో క్షణం తీరిక లేకుండా ఉండేవారు. సంక్రాంతి నేపథ్యంలో వరుసగా వారం రోజులు సెలవులు రావడంతో పిల్లాపాపలతో కలిసి అన్నివర్గాల ప్రజలు గ్రామాలకు వెళ్లడంతో తిరుపతి-తిరుమలకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. బుకింగ్ కౌంటర్లలో సిబ్బంది కూడా గంటలతరబడి ఖాళీగా కనబడుతున్నారు. కాగా, తిరుమలకు వెళ్లే ప్రయాణికులు రాని కారణంగా ఆదాయం కూడా బాగా తగ్గిందని రైల్వే వర్గాల సమాచారం. -
జియో ఎఫెక్ట్ : ఇండస్ట్రీ రెవెన్యూలు ఢమాల్
-
జియో ఎఫెక్ట్ : ఇండస్ట్రీ రెవెన్యూలు ఢమాల్
న్యూఢిల్లీ : ఉచిత డేటా, ఉచిత వాయిస్ కాలింగ్ అంటూ ఉచిత ఆఫర్లు గుప్పిస్తున్న రిలయన్స్ జియో వల్ల టెలికాం ఇండస్ట్రీకి రెవెన్యూలు గండికొడుతున్నాయట. దేశీయ టెలికాం ఇండస్ట్రీ తన రెవెన్యూలో ఐదోవంతును కోల్పోతుందని, దానికి గల కారణం ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ అందించే ఉచిత సర్వీసులేనని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ రిపోర్టు వెల్లడించింది. 2017-18 ఆర్థికసంవత్సరానికి సంబంధించిన అవుట్ లుక్ ను సమీక్షించిన ఈ సంస్థ, టెలికాం సెక్టార్ అవుట్ లుక్ స్టేబుల్ నుంచి నెగిటివ్‌లోకి(స్థిరం నుంచి ప్రతికూలం) వచ్చినట్టు చెప్పింది. ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ఈ రిపోర్టును గురువారం విడుదల చేసింది. ఇటీవల ఇండస్ట్రీ దిగ్గజాలు విడుదల చేసిన ఫలితాల్లోనూ అవి భారీగా కుప్పకూలాయి. ప్రస్తుతం మార్కెట్లో టెల్కోల మార్కెట్ షేరు పడిపోతుండగా.. రిలయన్స్ జియో సబ్ స్క్రైబర్ బేస్ చాలా త్వరగా పైకి ఎగుస్తున్నట్టు రిపోర్టు పేర్కొంది. 2017 జనవరిలో 72 మిలియన్ సబ్ స్క్రైబర్లుంటే, 2017 మార్చికి 100 మిలియన్లను క్రాస్ చేసినట్టు రిపోర్టు తెలిపింది. ధర విషయంలోనూ, అనుభూతి పరంగా మార్కెట్ షేరును ఆకట్టుకోవడంలో జియోకి సామర్థ్యమున్నట్టు పేర్కొంది. కస్టమర్ బేస్ ను నిలబెట్టుకోవడం ప్రస్తుతం టెల్కోల ముందున్న సవాళ్లని, వారి సామర్థ్యం, స్పీడ్, వర్చ్యువల్ నెట్ వర్క్ ప్లాట్ ఫామ్స్ తో కస్టమర్లను కాపాడుకుంటూ ఉండాలని సూచించింది. ఐడియా, వొడాఫోన్ల విలీనంతో టెలికాం ఇండస్ట్రీలో స్పెక్ట్రమ్, ఇన్ఫ్రాక్ట్ర్చర్ల వృథా ఖర్చులు తగ్గుతాయని రిపోర్టు పేర్కొంది. -
పెద్ద నోట్ల రద్దు: రూ.1500 కోట్లు మటాష్!
హైదరాబాద్ : పెద్ద నోట్లను రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న హఠాత్తు నిర్ణయానికి తెలంగాణ రెవెన్యూలు భారీగానే తుడిచిపెట్టుకుపోనున్నాయట. నెలకు రూ.1000 నుంచి రూ.1500 కోట్ల రెవెన్యూలను ప్రభుత్వం కోల్పోవాల్సి వస్తుందని అంచనావేస్తున్నట్టు రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. అయితే ఎన్ని నెలలు ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియదని వ్యాఖ్యానించారు. తక్కువ విలువైన కరెన్సీనోట్లు వచ్చినప్పటికీ, సమస్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ సంక్షోభం మూడు లేదా ఆరు నెలల వరకు ఉండొచ్చనని.. ఇదంతా కేంద్రప్రభుత్వం చేతులోనే ఉందని రాజేందర్ అసహనం వ్యక్తంచేశారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్, మోటార్ వెహికిల్, కమర్షియల్ ట్యాక్స్ వసూలల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, ప్రధాని నరేంద్రమోదీని కలిసి చర్చించారని, తమ సమస్యలకు పరిష్కారం కూడా కోరినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆదాయం తగ్గిపోతున్న నేపథ్యంలో కేంద్రానికి చెల్లించాల్సిన రుణాలను కొంతకాలం వాయిదా వేయాలని ప్రధానికి సీఎం విజ్ఞప్తి చేసినట్టు చెప్పాయి. అదేవిధంగా పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ప్రతిపక్షపార్టీలు సోమవారం చేస్తున్న ఆక్రోష దివస్‌లో టీఆర్ఎస్ పాల్గొనడం లేదని పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత వెల్లడించారు. పెద్దనోట్ల రద్దు వెనుకాల ఉన్న ప్రధాని ఉద్దేశ్యాన్ని తాము అభినందిస్తున్నామని, కానీ అమలులోనే సంస్కరణలు చేయాల్సినవసరం ఉందన్నారు. -
హోదా కావాలని బాబు అడగనేలేదు
⇒ వెనకబడిన ప్రాంతాలకు రాయితీలు కోరలేదు: జేపీ ⇒ ఆయన ఆర్భాటం అంతా రాజధాని కోసమే ⇒ స్పష్టంగా అడగకపోతే.. ఇచ్చేవాళ్లు ఎలా ఇస్తారు? ⇒ రెవెన్యూ లోటుపై ఇప్పటివరకూ ప్రకటించలేదు ⇒ హోదా సంజీవని కాకపోతే.. ఏది సంజీవనో వెంకయ్య, చంద్రబాబు చెప్పాలి ⇒ ప్యాకేజీతో ఆర్భాటమే తప్ప ప్రయోజనం ఉండదు ప్రత్యేక హోదా కల్పించమని కానీ, కనీసం వెనకబడిన ప్రాంతాలకు పన్ను రాయితీలు ప్రకటించమని గానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఇప్పటివరకు కేంద్రాన్ని అడగనే లేదని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. హోదా సంజీవని కాకపోతే.. ఇంకేది సంజీవనో చెప్పాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ప్యాకేజీ పేరిట ఇచ్చే డబ్బు పాలకుల ఆర్భాటాలకే తప్ప ప్రజలకు ఉపయోగపడదన్నారు. పరిశ్రమలకు పన్ను రాయితీల వల్ల కేంద్రం మీద ఒక్క పైసా భారం కూడా పడదని, పైగా అదనపు ఆదాయం వస్తుందని విశ్లేషించారు. ప్రత్యేక హోదా పేరు లేకపోయినా, హోదా వల్ల ఒనగూడే ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు.. - సాక్షి, హైదరాబాద్ రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగింది. దాన్ని కాస్తయినా సరిదిద్దడానికి పార్లమెంట్లో అప్పటి ప్రధాని ‘ప్రత్యేకహోదా’ హామీ ప్రాధాన్యం ఏమిటి? గతాన్ని తవ్వి విభజన గురించి మాట్లాడుకోవడం అనవసరం. రాష్ట్రాన్ని కోరుకున్న తెలంగాణ ప్రజల సాకారమయింది. తెలంగాణలో మిగులు బడ్జెట్ ఉంది. కానీ ఏపీకి ఆ పరిస్థితి లేదు. ఏపీకి ప్రధానంగా రెండు సమస్యలున్నాయి. మొదటిది రెవెన్యూ లోటు. 2012-13 ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం రూ. 7 వేల కోట్ల లోటు ఉంది. ఇది ఏటా పెరగడమే తప్ప తగ్గే అవకాశం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంతకంటే ఎక్కువే ఉంటుంది. ఎంత లోటు అనే విషయాన్ని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించడం లేదు. ఇక రెండోది వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగానే పరిశ్రమలు వచ్చాయి. ఏపీలోని 13 జిల్లాల్లో సుదీర్ఘకాలంగా పారిశ్రామికీకరణ జరగలేదు. ఫలితంగా ఉపాధి అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. రాయితీలిస్తే పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వస్తే యువతకు ఉపాధి లభిస్తుంది. అందుకే ప్రత్యేక హోదాను నేనే తొలుత ప్రతిపాదించాను. ప్రత్యేక హోదా సంజీవని కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు... హోదా కల్పించడానికి కావాల్సిన అర్హతలు ఏపీకి లేవని కేంద్ర మంత్రులు... ఇతర రాష్ట్రాలూ అడుగుతున్నాయని నేతలు సాకులు చెబుతున్నారు కదా? మరి సంజీవని ఏదో వారినే చెప్పమనండి. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, యువతకు ఉపాధి లభించాలంటే ఏం చేస్తారో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాలి. ఒరిస్సా కూడా ప్రత్యేకహోదా అడిగితే ఇవ్వమనండి, మనకు ఎలాంటి అభ్యంతరం లేదు. మనకు ఇవ్వమని మనం అడుగుతున్నాం. సాంకేతికంగా ప్రత్యేక హోదా ప్రకటన సాధ్యం కాకపోతే.... హోదా వల్ల ఒనగూడే ప్రయోజనాలు అందించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. ఏపీకి ఐదేళ్లలో రూ.23,500 కోట్లు రెవెన్యూలోటు ఉంటుందని 14వ ఆర్థిక సంఘం చెప్పింది. అది కరెక్టా? కాదా? సరిపోతుందా? లేదా?అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రెవెన్యూ లోటు ఎంత ఉందనే విషయంలో స్పష్టమైన ప్రకటన చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వ రాబడి, ఖర్చు ఎంత? లోటు ఎంత? శ్వేతపత్రం ప్రకటించాలని నేను చాలాసార్లు డిమాండ్ చేశాను. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రీయంగా లోటును లెక్కగట్టి నిర్దిష్టమైన ప్రకటన చేయలేకపోయింది. అలా ఎందుకు చేయలేదో పాలకులకే తెలియాలి. ప్యాకేజీ వస్తే సరిపోతుంది. రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని చంద్రబాబు, వెంకయ్య అంటున్నారు. ప్యాకేజీ న్యాయం చేయగలదా? ఐఐటీ, ఐఐఎం, రాజధానికి సహాయం.. ఇవన్నీ విభజన చట్టంలో చెప్పినవే. అవన్నీ ఎలాగూ ఇవ్వాల్సిందే. బిహార్‌కు రూ. లక్ష కోట్లు ప్యాకేజీ ప్రకటించారు. అవన్నీ ఆ రాష్ట్రానికి ఇస్తున్నవే. ఇవ్వాల్సిన దానికి ఐదో పదో కలిపి ప్యాకేజీ అంటున్నారు. ఇవ్వాల్సిన దానికి అదనంగా ఎంత ఇచ్చినా సంతోషమే. కానీ రూ. లక్ష కోట్లు ఇస్తామంటే.. మనం బోల్తా పడకూడదు. ప్యాకేజీ పేరుతో నిధులిస్తే పాలకులు ఆర్భాటాలకు ఖర్చు పెట్టడం తప్ప ప్రజలకు అందేదేమీ ఉండదు. ప్రజలకు ఉపాధి కల్పించాలంటే పెట్టుబడులు, పరిశ్రమలు రావడం తప్ప మరో మార్గం లేదు. పన్ను రాయితీలు ఇస్తేనే పరిశ్రమలు వస్తాయి. ప్యాకేజీనే హోదాకు ప్రత్యామ్నాయంగా చూడొచ్చా? చేపల కూర వండిపెట్టడం కాదు.. చేపలు పట్టడం నేర్పాలి అని చైనా సామెత. ప్యాకేజీ అంటే చేపల కూర. పన్ను రాయితీలు.. చేపలు పట్టడానికి ఉపయోగపడే గాలం లాంటిది. గాలం ఇవ్వాలని అడగాలి తప్ప.. చేపలకూర వండిపెట్టమని అడగకూడదు. పన్ను రాయితీల సాధనకు ఏం చేయాలి? బాబు ఢిల్లీ వెళ్లి.. రాజధాని ప్రాంతానికి రాయితీలు ఇవ్వమని అడిగారే తప్ప.. రాష్ట్రానికి మొత్తం ఇవ్వమని కానీ, కనీసం వెనకబడిన ప్రాంతాలకు ఇవ్వమని గాని అడగనే లేదు. ఇది అన్యాయం. ఆర్భాటమంతా రాజ ధాని కోసమేనా! అడిగేవారు స్పష్టంగా అడగపోతే.. ఇచ్చేవాళ్లు ఎలా ఇస్తారు? ఉపాధి కల్పన కోసం నిర్దిష్టంగా పన్ను రాయితీలు ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వం అడిగిన సందర్భమే లేదు. ఉపాధి కల్పించడానికి ఉపయోగపడే ప్రత్యేక హోదా(పన్ను రాయితీలు) ఇవ్వడం వల్ల కేంద్రం మీద ఎంత భారం ఉంటుంది? ప్రత్యేక హోదా కానీ.. పేరు ఇంకేదైనా కానివ్వండి. పన్ను రాయితీలు కల్పించమని అడుగుతున్నాం. పన్ను రాయితీలు ఇవ్వడం వల్ల కేంద్ర ప్రభుత్వం మీద ఒక్క పైసా భారం కూడా పడదు. కొత్త పరిశ్రమల ఏర్పాటు వల్ల అదనంగా వచ్చే పన్నులు పదేళ్ల పాటు రావు. అంతే తప్ప వస్తున్న ఆదాయానికి నష్టం లేదు. ఉపాధి పెరిగితే, ప్రజల కొనుగోలు శక్తి పెరిగితే.. ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభుత్వాలకు ఆదాయం సమకూరుతుంది. కేంద్రం సాంకేతిక కారణాలు చూపిస్తూ హోదా ప్రకటన వాయిదా వస్తే నష్టం తీవ్రంగా ఉంటుంది కదా? రాష్ట్ర శాసనసభ అనుమతి లేకున్నా, ఒక ప్రాం త ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా పట్టించుకోకుండా కేంద్రం రాష్ట్రాన్ని విభజిం చింది. పరిశ్రమలన్నీ హైదరాబాద్ పరిసరాల్లోనే ఉన్నాయని అంగీకరించింది. ఏపీలో పరి శ్రమల ఏర్పాటుకు అనుకూలంగా రాయితీలు ఇస్తామనీ ప్రకటించింది. కానీ ఇప్పుడు వెనక్కి పోతోంది. వెనకబాటుతనాన్ని ఆధారంగా చేసుకొని దేశంలో చాలా రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక రాయితీలు ఇచ్చింది. రాష్ట్రమంతా కలిపి చూస్తే వెనకబాటుతనం పెద్దగా కనిపిం చకపోవచ్చు. కానీ రాయలసీమలోని 4, ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో వెనకబాటుతనం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ జిల్లాలకు ప్రత్యేక రాయితీలు వెంటనే ప్రకటించాలి. ఆ జిల్లాలో పెట్టుబడులు వస్తే.. రాష్ట్రమే అభివృద్ధి చెందుతుంది. పన్ను రాయితీల గడువు ముగిసినా అభివృద్ధి కొనసాగుతుందా? ఏదో పెట్టుబడి రాయితీ కింద రూ. 20 లక్షల మినహాయింపు, రవాణా రాయితీ కల్పిస్తామంటే సరిపోదు. కార్పొరేట్ ఆదాయపు పన్ను, సెంట్రల్ ఎక్సైజ్ నూటికి నూరు శాతం మినహాయింపు ఇవ్వాలి. అలా ఇస్తే.. ఇక్కడ తయారయ్యే వస్తువు ఖరీదు కనీసం 30 శాతం తగ్గుతుంది. అంటే దేశంలో ఎక్కడైనా ఒక వస్తువును తయారు చేయడానికి 100 ఖర్చయితే, రాయితీలున్న రాష్ట్రంలో రూ.70కే తయారు చేయవచ్చు. తక్కువ ధరలో ఉత్పత్తి చేసే అవకాశం ఉంటే పరిశ్రమలు ఆటోమేటిక్‌గా వస్తాయి. పదేళ్లు రాయితీలు ఉండి పారిశ్రామికీకరణ జరిగితే.. తర్వాత అభివృద్ధి కొనసాగుతుంది.