SBI Credit Card Users Have to Pay Extra RS 99 For Credit Card EMI - Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు షాక్!

Published Sat, Nov 13 2021 4:59 PM | Last Updated on Sat, Nov 13 2021 8:16 PM

SBI Credit Card Users Have to Pay Extra RS 99 For Credit Card EMI - Sakshi

SBI Credit Card Users to Pay Rs 99 Plus Tax on All EMI Transactions: క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఎస్‌బీఐ షాక్ ఇచ్చింది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుల ద్వారా చేసే అన్ని ఈఎంఐ లావాదేవీలు ప్రాసెసింగ్ ఫీజుతో పాటు పన్నుకు లోబడి ఉంటాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ప్రకటించింది. ఎస్‌బీఐ కార్డులు & పేమెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్(ఎస్‌బీఐసీపీఎస్ఎల్) ఇటీవల రూ.99 ప్రాసెసింగ్ ఫీజువసూలు చేసి దానిపై పన్నులు వసూలు చేస్తామని ప్రకటించింది. ఈ కొత్త నిబంధన డిసెంబర్ 1, 2021 నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది. రిటైల్ లొకేషన్లు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా వంటి ఈ-కామర్స్ సైట్స్ నిర్వహించే అన్ని ఈక్వేటెడ్ మంత్లీ ఇన్ స్టాల్ మెంట్(ఈఎమ్ఐ) కొనుగోళ్లకు ఈ ప్రాసెసింగ్ ఫీజు వర్తిస్తుంది.

ఈ విషయం గురించి తన క్రెడిట్ కార్డు ఖాతాదారులకు  తెలియజేస్తూ ఒక ఈ-మెయిల్ పంపింది. "01 డిసెంబర్ 2021 నుంచి మర్చంట్ అవుట్ లెట్/వెబ్ సైట్/యాప్ వద్ద చేసిన అన్ని మర్చంట్ ఈఎమ్ఐ లావాదేవీలపై రూ.99 (+ పన్నులు) ప్రాసెసింగ్‌ ఫీజు విధించనున్నట్లు మేము మీకు తెలియజేస్తున్నాము" అని ఎస్‌బీఐసీపీఎస్ఎల్ తెలిపింది. ఈ నోటీసును ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఖాతాదారులందరికీ పంపారు. అంటే.. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుతో వస్తువులను కొని ఈఎంఐగా మార్చుకుంటే ఈ ఫీజు వసూలు చేస్తారు. ఈ నిర్ణయంతో ఈఎంఐ ఆప్షన్‌ వినియోగించుకోవాలనుకునే కస్టమర్లకు మరింత భారం పడనుంది. అలాగే, ఈఎమ్ఐ లావాదేవీ విఫలమైనా లేదా క్యాన్సిల్ చేసిన ప్రాసెసింగ్ ఖర్చు తిరిగి చెల్లిస్తారు. 

(చదవండి: 'సింగిల్స్​ డే' అమ్మకాల్లో రికార్డ్​.. రూ.10 లక్షల కోట్ల వ్యాపారం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement