దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు ఈఎంఐల భారం పెరగనుంది. ఎస్‌బీఐ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను పెంచింది. దీంతో ఎంసీఎల్ఆర్ ఫ్రేమ్‌వర్క్‌తో ముడిపడి ఉన్న రుణాలకు సంబంధించిన ఈఎంఐలు పెరగనున్నాయి.
ఎస్‌బీఐ వెబ్‌సైట్ ప్రకారం.. జూన్ 15 నుంచి అన్ని కాలపరిమితులలో ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్లు (0.1%) పెరిగింది. ఏడాది ఎంసీఎల్ఆర్ 8.65 శాతం నుంచి 8.75 శాతానికి, ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 8.00 శాతం నుంచి 8.10 శాతానికి, నెల, మూడు నెలల ఎంసీఎల్ఆర్ 8.20 శాతం నుంచి 8.30 శాతానికి పెరుగుతాయి. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 8.55 శాతం నుంచి 8.65 శాతానికి పెరిగింది. రెండేళ్ల ఎంసీఎల్ఆర్ 8.75 శాతం నుంచి 8.85 శాతానికి, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ 8.85 శాతం నుంచి 8.95 శాతానికి పెరిగింది.
గృహ, వాహన రుణాలతో సహా చాలా రిటైల్ రుణాలు ఏడాది ఎంసీఎల్ఆర్ రేటుతో ముడిపడి ఉంటాయి. ఆర్బీఐ రెపో రేటు లేదా ట్రెజరీ బిల్ ఈల్డ్ వంటి ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్‌లతో ముడిపడి ఉన్న రుణాలపై ఎంసీఎల్ఆర్ పెంపు ఎలాంటి ప్రభావం చూపదు.
Comments
Please login to add a commentAdd a comment