Top-up Home Loan
-
ఎస్బీఐ బంపరాఫర్..సిబిల్ స్కోర్ తక్కువుగా ఉన్నా ‘పండగ చేస్కోండి’
ఖాతాదారులకు ఎస్బీఐ శుభవార్త చెప్పింది. ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ప్రత్యేకంగా నిర్వహించే క్యాంపెయిన్‌లో భాగంగా హొమ్లోన్ల వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. తద్వారా, వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండడం వల్ల ఎస్బీఐ బ్యాంకులో ఇంటి రుణం తీసుకోలేకపోయిన వారికి, లేదంటే కొత్తగా లోన్ తీసుకోవాలనుకునేవారికి తాజా నిర్ణయం భారీగా లబ్ధి చేకూరనుంది. క్రిడెట్ కార్డు ఉండి సిబిల్ స్కోర్ (151- 200) తక్కువగా ఉన్న వారికి, లేదంటే అసలు క్రెడిట్ స్కోర్ లేని కస్టమర్లకు ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ హోం లోన్లు,టాప్-అప్ లోన్లపై గరిష్ఠంగా 65 బేసిస్ పాయింట్ల వరకు ప్రత్యేక రాయితీలు అందిస్తుంది. సిబిల్ స్కోర్ 750కి పైగా ఉంటే సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఎస్బీఐ బ్యాంకు నిర్వహించే ఈ క్యాంపెయిన్‌లో సిబిల్ స్కోర్ 750పైగా ఉన్న వారికి 55 బేసిస్ పాయింట్ల వరకు రాయితీ ఇస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. అంటే వడ్డీ రేట్లు 8.60 శాతానికి పొందవచ్చు. సిబిల్ స్కోర్ 700- 749 ఉంటే ఇప్పటికే అమ్మేందుకు సిద్ధంగా ఉన్న ఇళ్లను కొనుగోలు చేయాలనుకున్న, లేదంటే ఉన్న ప్రాపర్టీని అమ్మాలనుకునే వారి సిబిల్ స్కోర్ 700 పైగా ఉంటే పైన పేర్కొన్న రాయితీల కంటే అదనంగా 20 బేసిస్ పాయింట్ల మేర రాయితీలు పొందవచ్చు. అంటే క్రెడిట్ స్కోర్ 750 కంటే ఎక్కువగా ఉంటే 8.40 శాతానికి, 700 - 749 మధ్య ఉంటే 8.50 శాతానికి హోం లోన్లను సొంతం చేసుకోవచ్చు. సిబిల్ స్కోర్ 700-749, 151-200 (టాప్-అప్ లోన్స్)ఉంటే టాప్-అప్ లోన్స్ పొందాలనుకునే కస్టమర్ల సిబిల్ స్కోర్ 750 కంటే ఎక్కువగా ఉంటే 45 బేసిస్ పాయింట్ల వరకు రాయితీ పొందవచ్చు. 9.10 శాతంతో టాప్-అప్ లోన్లు తీసుకోవచ్చు. క్రెడిట్ స్కోర్ 700-749, 151-200 ఉన్న ఖాతాదారులు 45 బేసిస్ పాయింట్ల వరకు కన్సెషన్ అందిస్తుంది. అంటే 9.30 శాతానికి ఈ టాప్-అప్‌లోన్ ఇస్తున్నట్లు ఎస్బీఐ పేర్కొంది. ఎస్బీఐ బ్యాంకు వెబ్సైట్ ప్రకారం.. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం, టేకోవర్ లోన్లతో అనుబంధించబడిన టాప్-అప్ లోన్లకు (క్రెడిట్ స్కోరు 700 అంతకంటే ఎక్కువ ఉంటే) పైన ప్రతిపాదించబడిన రేట్ల కంటే బ్యాంకు 20 బేసిస్ పాయింట్ల వరకు రాయితీని ఇస్తుంది. టాప్-అప్ లోన్లు అంటే ఇప్పటికే తీసుకున్న హోమ్ లోన్పైఅతి తక్కువ డాక్యుమెంటేషన్‌తో ఆర్థిక సంస్థలు అందించే అదనపు లోన్‌ను టాప్-అప్ లోన్ అంటారు. బ్యాంకులు లేదా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ఇతర ఆర్థిక సంస్థలు వీటిని అందిస్తాయి. అత్యవసర సమయాల్లో వీటిని కస్టమర్లు ఎంచుకోవచ్చు. ఖాతాదారులు తమ గృహ రుణం కంటే ఎక్కువ మొత్తాన్ని అప్పుగా తీసుకునే వీలు ఉంటుంది. హోమ్లోన్లపై వడ్డీ రేట్లు టాప్-అప్లోన్లపై వడ్డీ రేట్లు -
గృహ రుణం ఉందా? టాప్ అప్ తీసుకోండి..!
వ్యక్తిగత రుణానికిదే చక్కని ప్రత్యామ్నాయం మీకు ఇప్పటికే ఒక గృహ రుణం ఉంది. నెలవారీ వాయిదాలు సకాలంలో చక్కగా చెల్లించేస్తున్నారు. అనుకోకుండా కొంత డబ్బు కావాల్సి వచ్చింది. మరేం చేస్తారు? నిజానికి ఇలాంటి సందర్భాల్లో చాలామంది పర్సనల్ లోన్‌పై ఆధారపడతారు. కానీ దానికన్నా గృహ రుణంపై ‘టాప్ అప్’ తీసుకోవటమే ఉత్తమం. దీన్ని నేరుగా మీకు గృహ రుణం ఇచ్చిన బ్యాంకు నుంచే తీసుకోవచ్చు. మీరు నెలవారీ రుణ బకాయిలు చక్కగా చెల్లిస్తుంటే... అదే ఖాతాకు అనుబంధంగా మీరు మీ రుణ అర్హత మేరకు మరికొంత డబ్బును రుణంగా పొందే వీలుంటుంది. మీరు గృహం రుణం తీసుకున్నప్పటి సమయానికి, ఇప్పటికీ మీ వేతనం మరికొంత పెరిగితే... తాజా ‘టాప్ అప్ రుణానికి’ ఈ అర్హతను సైతం జోడించి మరింత ఎక్కువ రుణాన్ని మంజూరు చేస్తారు కూడా. అర్హత... మొదటి రుణం తీసుకున్న తరువాత 6 నుంచి 12 నెలల వ్యవధి ఉండాలి. దాదాపు అన్ని బ్యాంకులూ ఇదే నిబంధన పాటిస్తున్నాయి. ఇక ‘టాప్ అప్ రుణం’ విషయంలో డాక్యుమెంటేషన్, ప్రాసెసింగ్ ప్రక్రియ అంతా ‘మిగిలిన రుణ మంజూరు’ ప్రక్రియతో పోలిస్తే వేగంగా జరుగుతాయి. అప్పటికే బ్యాంకుతో కస్టమర్‌కు సంబంధాలుండటమే దీనికి ప్రధాన కారణం. రుణం ఎందుకు..? బ్యాంకింగ్ నిబంధనలకు లోబడి ‘టాప్ అప్ రుణం’ ఎందుకన్న విషయాన్ని సంబంధిత బ్యాంక్ పరిశీలిస్తుంది. మీరు నివసిస్తున్న గృహాన్ని ఆధునీకీకరించుకోవడం, ప్లాట్ లేదా ల్యాండ్ వంటి మరో ఆస్తి కొనుగోలు. వినియోగ వస్తువుల కొనుగోళ్లు, పిల్లల పెళ్లిళ్లు, విద్యా అవసరాలు, వ్యాపార అవసరాలు, వైద్య ఖర్చులు ఇలా దేనికైనా ‘టాప్ అప్ రుణం’ తీసుకునే వీలుంది. ఐదు ముఖ్యాంశాలు... పన్ను ప్రయోజనాలు: గృహ కొనుగోలుకు వినియోగిస్తే, ప్రిన్సిపల్, వడ్డీ రెండూ పన్ను ప్రయోజనం పరిధిలోకి వస్తాయి. అలాకాక ఇంటి సదుపాయాల మెరుగుదలకు వినియోగిస్తే మాత్రం వడ్డీపై మాత్రమే మినహాయింపు లభిస్తుంది. ఇతర అవసరాలకు వాడితే ఎలాంటి పన్ను మినహాయింపులూ ఉండవు. టాప్ అప్ లోన్ వడ్డీరేటు: గృహ రుణ వడ్డీరేటుకన్నా 1.5% నుంచి 2% అధికంగా ఉంటుంది. అంటే ఈ మొత్తమ్మీద 11.5% నుంచి 14% వరకూ ఉండే అవకాశం ఉంది. వ్యక్తిగత రుణ వడ్డీరేటు 18-24% వరకూ ఉన్న ప్రస్తుత తరుణంలో టాప్ అప్ రుణ రేటు తక్కువగా ఉండడం కలిసొచ్చే అంశం.తనఖా అవసరం లేదు: ఎటువంటి ప్రత్యేక తనఖా అవసరం లేదు. మరో అంశం... మీ తొలి గృహ రుణం తీర్చేసినంతమాత్రాన బ్యాంకు వద్ద ఉన్న ఒరిజినల్ గృహ పత్రాలు మీకు లభించవు. ‘టాప్ అప్ రుణం’ బకాయి కూడా పూర్తిగా చెల్లిస్తేనే పత్రాలు వెనక్కిస్తారు. రుణ పరిమాణం: తొలి గృహ రుణ పరిమాణం కన్నా మించి టాప్ అప్ రుణం రాదు. ఉదాహరణకు మీ తొలి గృహ రుణం రూ. 30 లక్షలు అయితే ‘టాప్ అప్ రుణం’ అంతకన్నా ఎక్కువ ఉండే అవకాశం లేదు. అర్హతను బట్టి రూ.15 నుంచి రూ.40 లక్షల వరకూ ఈ ‘టాప్ అప్ రుణ’ పరిమాణం ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు: దాదాపు అన్ని బ్యాంకులూ ప్రాసెసింగ్ ఫీజును అమలు చేస్తున్నాయి. వాటి హోమ్ లోన్ ప్రాసెసింగ్ ఫీజు స్థాయిలోనే టాప్ అప్ రుణం ప్రాసెసింగ్ ఫీజూ ఉంటుంది.