సాక్షి, ముంబై: భారతీయ రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ఉద్యోగులకు చేదువార్త. 2022-23 ఆర్థిక సంవత్సరం క్యూ4లో తన ఉద్యోగులకు సగటున 60 శాతం వేరియబుల్ వేతనాన్ని అంద జేయనుంది.
(ఇదీ చదవండి: Massive layoffs: 55వేలమందిని తొలగించనున్న అతిపెద్ద టెలికాం సంస్థ)
ఆర్థిక మాంద్యం, ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఐటీ మేజర్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. బిజినెస్ టుడే రిపోర్ట్ ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి- మార్చి)లో ఉద్యోగులకు 60 శాతం వేరియబుల్ పే మాత్రమే అందించనుంది. మాంద్యం ఆందోళనలు, ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు, బ్యాంకింగ్ సంక్షోభం ప్రభావంతోనే కంపెనీ ఈ మేరకు నిర్ణయించింది.
ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన బ్యాంకింగ్ సంక్షోభం నేపథ్యంలో ఐటీ పరిశ్రమపై పెరుగుతున్న ఒత్తిడికి ఇది సూచిక అని నిపుణుల అంచనా. ఇన్ఫోసిస్ గతంలో (2022-23 ఆర్థిక సంవత్సరం) మొదటి త్రైమాసికంలో 70 శాతం వేరియబుల్ పే ప్రకటించింది. రెండో త్రైమాసికంలో దీన్ని 65 శాతం శాతానికి తగ్గించింది. కాగా ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌ల ప్రకారం, డిసెంబర్‌లో 24.3 శాతంగా ఉన్న అట్రిషన్ రేటు మార్చి త్రైమాసికంలో 20.9 శాతానికి దిగి వచ్చింది. (ఈ పిక్స్ చూశారా? గుండెలు బాదుకుంటున్న కృతి సనన్ ఫ్యాన్స్)
మరిన్ని బిజినెస్‌వార్తలు, అప్‌డేట్స్ కోసం చదవండి: సాక్షి బిజినెస్
Comments
Please login to add a commentAdd a comment