
Infosys 80% average variable payout: దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు తీపి కబురు అందించింది. జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో సగటున 80శాతం వేరియబుల్ పేను విడుదల చేయనుంది ఆగస్టు జీతంతో కలిపి ఈ వేరియబుల్‌పేను అందించనుంది. ఈ మేరకు కంపెనీ హెచ్ టీం ఉద్యోగులకు ఈమెయిల్ సమాచారాన్ని అందిచింది.
2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 'మంచి పనితీరు' నేపథ్యంలో తన ఉద్యోగులు సగటున 80శాతం వేరియబుల్ వేతనం లభించనుంది. తాము క్యూ1లో మంచి పనితీరును కనబర్చామనీ, భవిష్యత్ విస్తరణకు బలమైన పునాదిని ఏర్పాటు చేసామని ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు ఇచ్చిన సమాచారంలో తెలిపింది. అయితే ఉద్యోగుల పనితీరు త్రైమాసికంలో సహకారం ఆధారంగా ఈ పే ఉంటుందని పేర్కొంది. అలాగే పెరఫామెన్స్ బోనస్ నిర్ణారణ నిమిత్తం తమ బడ్జెట్ సంబంధిత DUలకు, యూనిట్ డెలివరీ మేనేజర్లకు అందించినట్టు వెల్లడించింది. గత ఏడాది ఇన్ఫోసిస్ సగటు వేరియబుల్ పే 60 శాతంగా నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఇన్ఫోసిస్ నికర లాభం సంవత్సరానికి (YoY) 11 శాతం పెరిగి రూ. 5,945 కోట్లకు చేరుకుంది. డాలర్ ఆదాయం 4,617 మిలియన్ డాలర్లు వచ్చింది. త్రైమాసికంలో ఆపరేటింగ్ మార్జిన్ 20.8 శాతంగా ఉంది, క్రితం సంవత్సరం త్రైమాసికంలో 20 శాతం కంటే 80 బేసిస్ పాయింట్లు పెరిగాయి, అయితే మార్చి త్రైమాసికంలో 21 శాతం నుండి 20 బేసిస్ పాయింట్లు QoQ తగ్గింది. అంతేకాకుండా, పెద్ద డీల్ విజయాలు 2.3 బిలియన్ల డాలర్లకు పరిమితం. అలాగే అంతకుముందు అంచనా 4-7 శాతంతో పోలిస్తే. రెవెన్యూ గైడెన్స్ 1-3.5 శాతానికి తగ్గించింది.
Comments
Please login to add a commentAdd a comment