
కరోనా తరువాత దాదాపు అన్ని కంపెనీలు.. వర్క్ ఫ్రమ్ విధానానికి మంగళం పాడాలని నిర్ణయించుకున్నాయి. దశల వారీగా ఈ విధానం తొలగించడానికి సిద్దమయ్యాయి. ఇందులో భాగంగానే ప్రముఖ టెక్ కంపెనీ ఇన్ఫోసిస్.. టెక్నాలజీ టీమ్, నెలలో కనీసం 10 రోజులు ఆఫీసు నుంచి పని చేయాలనే ఆదేశాలను జారీ చేసింది.
ఎక్కువ మంది ఆఫీస్ నుంచే పనిచేయాలనే.. ఉద్దేశ్యంతో ఇన్ఫోసిస్ ఈ నిర్ణయం తీసుకుంది. మార్చి 10 నుంచి ఈ రూల్ అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రతి నెల.. ఆదరినీ ఆఫీసుకు రప్పించాలని, ఉద్యోగులకు అనుకూలంగా ఉండేలా.. కనీసం 10 రోజులు ఆఫీస్ నుంచి, మిగిలిన రోజులు ఇంటి నుంచి పనిచేసుకునే వెసులుబాటు కల్పించింది.
ఈ విషయంపై ఇన్ఫోసిస్ అధికారికంగా స్పందించలేదు. అయితే సంస్థలో పనిచేస్తున్న 3.23 లక్షల కంటే ఎక్కువ మంది ఉద్యోగుల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి.. ఈ తరహా హైబ్రిడ్ సిస్టం ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: తగ్గిన బెంచ్ టైమ్.. ఐటీ ఉద్యోగులకు ఊరట!
ఈ కొత్త రూల్ లెవల్ 5, అంతకేనట తక్కువ స్థాయి ఉద్యోగులకు వరిస్తుందని తెలుస్తోంది. ఇందులో టీమ్ లీడర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, సీనియర్ ఇంజనీర్లు, సిస్టమ్ ఇంజనీర్లు, కన్సల్టెంట్లు ఉన్నారు. ఎవరైనా 10 రోజులు ఆఫీసుకు రానట్లయితే.. లేదా ఒకటి, రెండు రోజులు తగ్గితే.. వాటిని ఉద్యోగి సెలవుల బ్యాలెన్స్ నుంచి తీసివేసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment