moonlighting
-
‘మూన్‌లైటింగ్’తో కోట్లు సంపాదిస్తున్న ఐటీ ఉద్యోగి.. మీరూ చేస్తారా?
కొంత కాలం క్రితం ఐటీ రంగంలో మూన్‌లైటింగ్ తీవ్ర చర్చంనీయంశమైంది. ఒకే సమయంలో లేదా విధులు ముగిసిన తరువాత వేరే ఉద్యోగం చేయడం దీని ఉద్దేశం. ఐటీ సంస్థలు ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఉద్యోగులు మాత్రం అదనపు నైపుణ్యాల కోసమో లేదా ఖర్చులు భరించలేక రెండో కొలువు చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, ఈ తరుణంలో తాను ఒకే సారి రెండు ఉద్యోగాలు చేసి ఏడాదికి రూ.1.4 కోట్లు సంపాదించినట్లు ఓ ఐటీ ఉద్యోగి తెలిపాడు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అనుభవాల్ని షేర్ చేసుకున్నాడు. ఐటీ ఉద్యోగి ఆడమ్ ఎడ్యుకేషన్ లోన్ కింద రూ.98లక్షలు చెల్లించాల్సి ఉంది. ఇందుకోసం అతను ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు డెలివరీ బాయ్ అవతారం ఎత్తాడు. కానీ ఫలితం శూన్యం.పేరుకే రెండు ఉద్యోగాలు చేస్తున్నాడనే మాటగాని కొండలా పేరుకుపోయినా అప్పుల్ని తీర్చేందుకు ఇది సరిపోదని ఓ నిర్ణయానికి వచ్చాడు. ఏడాదికి కోటి సంపాదన అంతే 2022లో రిమోట్ జాబ్ కోసం అన్వేషించాడు. చివరికి తాను కోరుకున్నట్లుగా భారీ వేతనంతో రెండు ఉద్యోగాలు చేయడం ప్రారంభించాడు. అలా 2023 జనవరి నుంచి రెండు ఉద్యోగాలు చేయగా వచ్చిన మొత్తం ఏడాదికి రూ.70లక్షలుగా కాగా..అదే ఏడాది చివరి నాటికి ఆడమ్ సంపాదించిన మొత్తం రూ.కోటికి పెరిగింది. సంపాదన పెరగడంతో ఎడ్యుకేషన్ లోన్ చెల్లించాడు. డబ్బులు బాగా సంపాదించాలనే ఈ సందర్భంగా రెండు ఉద్యోగాలు చేరేందుకు తాను నిర్ధేశించుకున్న లక్ష్యాలేంటో చెప్పాడు. అందులో ఒకటి సంపాదన రెట్టింపు చేసుకోవడం, రెండోది రెండేళ్లలో తాను ఎడ్యుకేషన్ లోన్ క్లియర్ చేయడం. ఇందుకోసం తన లింక్డిన్ ప్రొఫైల్‌లో ఉద్యోగాల కోసం అన్వేషించగా.. రెండు వారాల్లో రెండు ఉద్యోగాలు పొందాడు. స్వల్ప కాలంలో తన ఎడ్యుకేషన్‌లోన్ మెల్లమెల్లగా తిరిగి చెల్లించడంతో పాటు నాలుగు నెలల అత్యవసర సేవింగ్స్‌ను కూడబెట్టుకున్నాడు. అదే సమయంలో కొంతమంది స్నేహితులకు ఆర్థిక సహాయం చేసినట్లు చెప్పిన టెక్కీ వారానికి 30 నుంచి 60 గంటల మధ్య పని చేయడం వల్లే ఇది సాధ్యమైందని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఈ టిప్స్ మీకోసమే అదే సమయంలో మూన్‌లైటింగ్ చేయాలని ఉద్యోగులకు పలు టిప్స్ చెప్పాడు. వాటిల్లో ప్రధానంగా .. ఒకే సమయంలో రెండు ఆఫీసుల్లో మీటింగ్స్ లేకుండా చూసుకోవడం, రెండవది.. ఆఫీస్ వర్క్ మొత్తం ఒకేసారి మీదేసుకుని చేసుకోకుండా భాగాలు, భాగాలుగా విభజించి పని సులభం అవుతుందని అన్నాడు. దీంతో పాటు ఆఫీస్‌లో ఇచ్చే పబ్లిక్ హాలిడేస్, వీకాఫ్స్ని సద్వినియోగం చేసుకోవాలంటూ ఓ అంతర్జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ఐటీ కారిడార్‌లో మారుతున్న ట్రెండ్..
వర్క్ ఫ్రం హోం, ఆఫీసులకు తిరిగి వెళ్లడంపై ఉద్యోగుల్లో పెద్ద చర్చే సాగుతోంది. హైదరాబాద్‌తోపాటు ఇతర నగరాల్లోని ఐటీ కారిడార్లు పూర్వ వైభవం సంతరించుకుంటున్నాయి. కరోనా భయం తగ్గిన నేపథ్యంలో ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోంకు క్రమంగా స్వస్తి పలుకుతున్నాయి. హైబ్రిడ్ మోడల్‌ను అనుసరిస్తుండటంతో ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వర్తిస్తున్నారు. కొన్ని నెలలుగా ఐటీ కారిడార్‌లో క్రమంగా కార్యకలాపాలు గాడిన పడ్డాయి. హాస్టళ్లలో గదులు నిండుతున్నాయి. మాల్స్ సందర్శకులతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. చిరువ్యాపారులు, హోటళ్లు, ట్రావెల్స్, డ్రైవర్ల జీవన ప్రయాణం గాడిలో పడింది. ఏమిటీ హైబ్రిడ్ మోడల్? ఐటీ కంపెనీల్లో అన్ని విభాగాల ఉద్యోగులు వారంలో కొన్ని రోజులు ఇంటి నుంచి మిగతా రోజులు కార్యాలయానికి వచ్చి పనిచేసేలా ఆదేశాలు ఇస్తున్నాయి. ఈ విధానానికి హైబ్రిడ్ మోడల్ అనే పేరు వాడుకలోకి వచ్చింది. చిన్న కంపెనీల్లో ఉద్యోగులు వంద శాతం కార్యాలయానికి వచ్చి పనిచేస్తున్నారు. ఇప్పుడు ఐటీ కంపెనీ భవనాలు 65 శాతం ఆక్యుపెన్సీతో పని చేస్తున్నాయని ఆ వర్గాలు చెబుతున్నాయి. బహుళజాతి కంపెనీలు మాత్రం పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ఎత్తేసే ఆలోచన చేయడం లేదు. అలాగని ఉద్యోగులు కార్యాలయానికి రావాలంటూ ఒత్తిడి చేయడం లేదు. కొన్ని బడా కంపెనీలు మాత్రం వంద శాతం వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌ను అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ మేరకు ఇప్పటికే వారికి సందేశాలు పంపించాయి. అత్యధిక ఉద్యోగులు హైబ్రిడ్ మోడల్లో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దాంతో కొన్ని కంపెనీలు హైబ్రిడ్ మోడల్‌ను పాటించేందుకు సిద్ధపడుతున్నాయి. ప్రముఖ కంపెనీల్లో ఇలా.. ఇప్పటికే టీసీఎస్, మెటా, గోల్డ్‌మ్యాన్ సాక్స్, జేపీ మోర్గాన్ తదితర కంపెనీలపై కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నా తమ ఉద్యోగులను ఆఫీసుల నుంచి పనిచేసేలా ప్రోత్సహిస్తున్నాయి. గతంలో వర్క్ ఫ్రం హోంను పూర్తిస్థాయిలో ప్రోత్సహించిన ‘జూమ్’ సంస్థ కూడా తమ ఆఫీసులకు 50 మైళ్ల పరిధిలో ఉన్న వారు వారానికి రెండురోజులు ఆఫీసుకు రావాలని చెబుతోంది. తాజాగా ఇన్ఫోసిస్ సంస్థ నెలలో 11 రోజుల పాటు ఇంటి నుంచి పని చేసేందుకు దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించింది. మరో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ భారత్‌లోని తమ ఉద్యోగులను వారానికి కనీసం మూడురోజులు ఆఫీసుకి వచ్చి పని చేయాలని కోరినట్లు ఒక నివేదిక తెలిపింది. ప్రయోజనాలివే.. ఉద్యోగులకు కొంతకాలంపాటు హైబ్రిడ్ వర్క్‌కు అనుమతించడం ద్వారా కంపెనీలు మౌలిక సదుపాయాల ఖర్చులను గణనీయంగా ఆదా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. హైబ్రిడ్ పని వాతావరణం కారణంగా ఐటీ కంపెనీలు తమ మౌలిక సదుపాయాల ఖర్చుల్లో కనీసం 50% ఆదా చేసుకోవచ్చని అంచనాలు సూచిస్తున్నాయి. ఉద్యోగులు ఆసక్తిమేరకు పనిచేస్తే ఆఫీస్‌లో ఉన్నా ఇంటి దగ్గర ఉన్నా సమర్థంగా పనిచేస్తారు. అయితే కావాల్సిందల్లా వారిలో ఆసక్తిని రేకిత్తించడమే. అందుకు కంపెనీ యాజమాన్యాలు, టీమ్ నాయకులు ప్రత్యేక చొరవ చూపాలని నిపుణులు సూచిస్తున్నారు. హైబ్రిడ్ వర్క్‌లో తక్కువ ముందే ఆఫీస్‌కు వస్తారు కాబట్టి ఫోకస్‌గా పనిచేసే అవకాశం ఉంది. దాంతో ఉద్యోగులు సృజనాత్మకతతో విధులు నిర్వర్తిస్తారని చెబుతున్నారు. టీమ్‌లోని సభ్యులు వివిధ ప్రాంతాల నుంచి ఆఫీస్‌కు రావాల్సి ఉంటుంది. దాంతో క్రాస్-కల్చరల్ వాతావరణం పెంపొందుతుందని నిపుణులు తెలుపుతున్నారు. ఇదీ చదవండి: ఇక నెలకు 11 రోజులు హాయి.. ఐటీ దిగ్గజం గుడ్‌న్యూస్! మూన్‌లైటింగ్‌కు చెక్.. హైబ్రిడ్ మోడల్లో భాగంగా ప్రధానంగా పనిచేస్తున్న కంపెనీలోనే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇతర కంపెనీలకు చెందిన రహస్య పని ఒప్పందాలు(మూన్‌లైటింగ్ ) ఇకపై సాగవు. దాంతో కంపెనీల సమాచారం దుర్వినియోగం కాకుండా ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా కొందరు ఉద్యోగులు రహస్యంగా రెండో ఉద్యోగం (మూన్ లైటింగ్) కూడా చేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. ఇది ఉద్యోగుల నైతికత మీద ఆధారపడి ఉంది. -
‘మూన్ లైటింగ్’ జాక్‌పాట్.. ఏడాదికి రూ.2 కోట్లు సంపాదించిన ఐటీ ఉద్యోగి!
మూన్ లైటింగ్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఒకే సమయంలో ఒకటికి మూడు ఉద్యోగాలు చేసి కోట్లు సంపాదించిన ఉద్యోగి భాగోతం వెలుగులోకి వచ్చింది. 2021 నుంచి మూన్‌లైటింగ్‌కు పాల్పడ్డ ఉద్యోగి ఏడాదికి రూ.2.5 కోట్లు సంపాదించాడు. పైగా మూడో ఉద్యోగం సైతం చేసినట్లు ఒప్పుకున్నాడు. ఇంతకీ ఆ ఉద్యోగి ఎవరు? మూడు ఉద్యోగాలు ఎలా చేశాడు? మూన్‌లైటింగ్! టెక్నాలజీ రంగానికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. కోవిడ్-19 విజృంభిస్తున్న సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీలు ఉద్యోగులకు ఇంటి వద్ద నుంచి పనిచేసుకునే అవకాశాన్ని కల్పించాయి. దీన్ని ఆసరగా చేసుకున్న ఉద్యోగులు పగలు ఒక సంస్థలో రాత్రి మరో సంస్థలో పనిచేస్తూ రెండు చేతులా సంపాదించారు. దీంతో ప్రొడక్టివిటీ తగ్గడం, ఉద్యోగుల పీఎఫ్ అకౌంట్లు లావాదేవీలు భారీ స్థాయిలో జరగడంతో కంపెనీలు ఉద్యోగులపై చర్యలకు ఉపక్రమించాయి. భారీ ఎత్తున లేఆఫ్స్ ప్రకటించాయి. నాటి నుంచి నియమాకాల విషయంలో హెచ్ ఆర్ విభాగం నిపుణులు కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలో అమెరికాలో కాలిఫోర్నియాకు చెందిన ఐటీ ఉద్యోగి నికోలస్ ఫ్లెమ్మింగ్ తాను మూన్‌లైటింగ్‌కు పాల్పడ్డట్లు బిజినెస్ ఇన్సైడర్తో తన అనుభవాల్ని పంచుకున్నాడు. 2021 నుండి వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న నికోలస్.. ఏకకాలంలో రెండు ఉద్యోగాలు చేసేవాడు. అది సరిపోదన్నట్లు మూడు ఉద్యోగంలో చేరాడు. కానీ మూడింటిని చేయడం కష్టమని భావించి అందులో ఒక జాబ్‌ను వదిలేశాడు. వారానికి 40 గంటలు పనిచేసిన నికోలస్ ఒక కంపెనీలో ఆఫీస్ వర్క్ చేస్తుంటే.. మరో వర్క్‌లో కేవలం జూమ్ మీటింగ్స్‌లో ఎక్కువగా పాల్గొనడం వల్ల రెండు ఉద్యోగాల్ని మేనేజ్ చేయడం పెద్దగా కష్టంగా అనిపించలేదు. అయితే తాను మూన్ లైటింగ్ చేసేందుకు చేసేందుకు తన మాజీ బాస్ ప్రోత్సహించడాని, అతని ద్వారానే మరో సంస్థలో ఉద్యోగం సంపాదించుకున్న విషయాన్ని గుర్తు చేశాడు. అదే సమయంతో తాను మూన్‌లైటింగ్‌కు పాల్పడ్డుతునట్లు తన రెండో బాస్ గుర్తించాడు. కానీ నేను సంస్థకు కావాల్సినట్లుగా పనిచేసినంత కాలం ఆ విషయం (మూన్‌లైటింగ్) గురించి పెద్దగా మాట్లాడడు. డెడ్‌లైన్‌లోపే పని పూర్తి చేస్తున్నా. నా వల్ల సంస్థకు లాభం.. నాకూ లాభం. అందులో తప్పేం లేదు కదా. పైగా మూన్ లైటింగ్ వల్ల వృత్తి నైపుణ్యాలలో కొత్త కొత్త మెళుకువలు నేర్చుకోవచ్చు. దాన్ని నేను తప్పపట్టను. ఇక్కడ గమించాల్సిన మరో విషయం ఏంటంటే? రెండు మూడేసి ఉద్యోగాలు చేస్తున్నా మనజీవితాల్లో ఎలాంటి మార్పు ఉండదు. పని చేస్తాం. ఖర్చు చేస్తాం. డబ్బులు పెరిగే కొద్ది ఖర్చులు సైతం అదే స్థాయిలో పెడుతుంటాం. అలాంటప్పుడు దాని వల్ల లాభం ఉంటుందని నేను అనుకోవడం లేదు’ అని నికోలస్ తెలిపాడు. -
మరోసారి తెరపైకి ‘మూన్‌లైటింగ్’.. దిగ్గజ టెక్ కంపెనీల్లో ఒకటే చర్చ!
ఐటీ రంగలో అలజడిని సృష్టించిన మూన్‌లైటింగ్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. కోవిడ్-19 సమయంలో వర్క్ ఫ్రం హోమ్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆఫీస్ అయ్యాక మిగిలిన సమయంలో వేరే సంస్థలో ఉద్యోగం చేస్తూ అదనపు ఆదాయాన్ని సంపాదించే వారు. దీనిని విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి టెక్ టెక్ కంపెనీలు వ్యతిరేకించాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న సిబ్బందిని తొలగించాయి. తాజాగా ఈ మూన్‌లైటింగ్‌పై మైక్రోసాఫ్ట్ మాజీ హెచ్ఆర్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్ విలియమ్స్ మరోలా స్పందించారు. రెండో ఉద్యోగం చేసుకోకుండా కంపెనీలు ఉద్యోగుల్ని ఆపకూడదన్నారు. ఉద్యోగుల జీవితాల్ని తమకే అంకితం చేయాలని సంస్థలు కోరుకోకూడదని చెప్పారు. ఇప్పుడు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి దిగ్గజ టెక్ కంపెనీల్లో చర్చకు దారితీశాయి. మూన్‌లైటింగ్‌పై ఆయన ఇంకేం అన్నారంటే.. మూన్‌లైటింగ్‌పై క్రిస్ విలియమ్స్ కామెంట్ ‘మూన్‌లైటింగ్ అనేది శ్రామిక రంగంలో ఒక భాగం. ఈ పని విధానంతో జీవితంలో అనేక విజయాలు సాధించిన గొప్ప గొప్ప వారున్నారు. మా అమ్మ మమ్మల్ని కాలేజీలో చేర్చడానికి రెండు ఉద్యోగాలు చేసింది’ అని బిజినెస్ ఇన్‌సైడర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అలా ఆలోచించడం తప్పు ‘సంస్థ కోసం ఉద్యోగులు ప్రత్యేక సమాయాన్ని కేటాయించాలని మేనేజర్లు ఆశించడం తప్పే అవుతుందని వెల్లడించారు. ఉద్యోగులు వారి సమయాన్ని సంస్థలకు మాత్రమే అంకితం చేయలేరు. ఓ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు సదరు ఉద్యోగి మిగిలిన సమయంలో ఏం చేయాలో అతని ఇష్టంపైన ఆధారపడి ఉంటుంది. సంస్థల్ని ఉద్దేశిస్తూ .. మీ నిర్ణయాన్ని వారి ఇష్టాల మీద రుద్దకూడదని’ చెప్పారు. ఉద్యోగులపై చర్యలు తీసుకోవచ్చు అయితే తమ ప్రత్యర్ధి సంస్థల్లో పనిచేస్తుంటే పరిమితులు విధించొచ్చు. అదనపు ఆదాయం కోసం వేరే పనులు చేసుకుంటూ సంస్థల్లో ప్రొడక్టవిటీ తగ్గితే తగు చర్యలు తీసుకునే అధికారం మేనేజర్లకు ఉంటుంది. కొన్ని అంశాల్లో మేనేజర్లు అతిగా స్పందిస్తారు. దాన్ని ఉద్యోగులు ఒక ద్రోహంగా భావిస్తారు. మీతిమీరిన స్పందనతో సిబ్బంది ఉన్న ఫళంగా రాజీనామాలు చేసి బయటకు వెళ్లడానికి అదే కారణమవుతుందని సూచించారు. ఇలా చేస్తే మూన్‌లైటింగ్ చేయరు బదులుగా, మేనేజర్లు తమ కింది స్థాయి సిబ్బంది సాధించిన విజయాల్ని గుర్తించాలి. రెండో ఉద్యోగం చేసుకునే అవకాశమూ కల్పించాలి. ఇలాంటి సందర్భాలలో ఉద్యోగులు మూన్‌లైటింగ్‌కు దూరంగా ఉంటారు. సంస్థలు తగిన ప్రాధాన్యం ఇస్తాయి. ఇక వారు వేరే చోట పనిచేసేందుకు మక్కువ చూపరని మైక్రోసాఫ్ట్ మాజీ హెచ్ఆర్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్ విలియమ్స్ టెక్ కంపెనీలను హితబోధ చేశారు. -
జీతం.. గీతం.. అదనపు ఆదాయం ఉందా? ఐటీ నోటీసులు సిద్ధంగా ఉన్నాయి!
ఈ వారం ట్యాక్స్ కాలంలో పొరుగింటి మీనాక్షమ్మ మొగుడు పుల్లయ్యను చూడక తప్పదు. తగిన జాగ్రత్త తీసుకోక తప్పదు. వగలే కాని నగలెప్పుడైనా కొన్నారా అని నిలదీసి అడిగిన ఆండాళమ్మకు మొగుడు .. పక్కింటి పుల్లయ్య చేసే వ్యవహారం బైటపెడతాడు. వాడికి జీతం కన్నా గీతం ఎక్కువ.. తెలుసుకోవే.. అని. చంద్రయానం గురించి తర్వాత తెలుసుకుందాం. ‘‘చల్లని రాజా ఓ చందమా నీ కథలన్నీ తెలిసాయి’’ ఇది నాటి పాట. ప్రస్తుతం మన కథలన్నీ ఆదాయపు పన్ను వారికి తెలిసిపోతున్నాయి. మూన్‌లైటింగ్ కాదు.. మూన్ చేజింగ్. కరోనా కాలంలో ఇంటివద్దే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఎంతో ఆదాయం సంపాదించారు. ఒక యజమాని దగ్గర పని చేస్తూ సంపాదిస్తూ, అదే సమయంలో మరో యజమాని దగ్గర చేస్తూ ఎడాపెడా రెండు చేతులా సంపాదించారు. ఇలా సంపాదించడంలో తప్పు లేదు ‘‘కష్టే ఫలి’’ అన్నారు. అలాంటి రాబడిని ఆదాయపు పన్ను వారికి చూపెట్టక పోవడమే తప్పు. 2019, 2020, 2021 ఆర్థిక సంవత్సరాల్లో ఇలా సంపాదించి వారు రిటర్నుల్లో ఆదాయాన్ని డిక్లేర్ చేయని వారికి తాఖీదులు వెళ్లాయి. ఈ విషయం ఎలా తెలిసింది? ఆదాయం ఆన్లైన్లో వచ్చింది. బ్యాంకులో జమయ్యింది. డిజిటల్ ద్వారా చెల్లింపులు జరిగాయి. కొంత మంది ఆస్తులు కొన్నారు. కొంత మంది బ్యాంకు ఎఫ్డీలు, షేర్లు.. డిబెంచర్లలో ఇన్వెస్ట్మెంట్లు చేశారు. కొంత మంది విలాసవంతమైన వస్తువులు కొన్నారు. టూర్లు.. బార్లు.. కార్లూ.. కొంత మంది రుణాలను బుద్ధిగా తీర్చేశారు. విదేశాలకు పంపారు కొంతమంది. గూగుల్ పేమెంట్లు, పేటీఎంలు.. ఇలా ఎన్నో. మీకు పేమెంట్లు చేసిన యజమానులు ఎప్పటికప్పుడు వివరాలను డిపార్టుమెంటు వారికి తెలియజేస్తున్నారు. మీకు రాబడి .. వారికి ఖర్చు. ఆ ఖర్చులు క్లెయిమ్ చేయడం వల్ల ఆ కంపెనీలకు ఆదాయం తగ్గి, ఖర్చులు పెరిగి ఆదాయపు పన్ను భారం తగ్గుతుంది. కాబట్టి వాళ్లు అన్ని వివరాలు, ఖర్చులు, జమలు, లాభనష్టాలు, సమర్పిస్తారు. టీడీఎస్ పరిధిలోకి రాకపోయినా వివరాలు మాత్రం ఇచ్చి ఉంటారు. ఇది కాకుండా పుల్లయగారికి ‘‘గీతం’’.. అంటే లంచంగా భావించారు ‘‘సంబరాల రాంబాబు’’లో పాట రచయిత. లంచం తప్పు. చట్టరీత్యా నేరం. దాన్నీ ఆదాయంగా పరిగణిస్తారు. ఇదీ చదవండి: జీఎస్టీ రివార్డ్ స్కీమ్: బిల్లు ఉంటే చాలు.. రూ.కోటి వరకూ నగదు బహుమతులు ఎలా బైటపడాలి? లెక్కలన్నీ సక్రమంగా చూపించి, బుద్ధిగా పన్ను కట్టండి. మీ ఇంట్లో ఇతర కుటుంబ సభ్యుల పేరు మీద ఆ పని చేసి, వ్యవహారాలన్నీ కుటుంబ సభ్యుల అకౌంటులో వేస్తే పన్ను భారం తగ్గుతుందేమో చెక్ చేయాలి. అలాంటప్పుడు పన్ను పరిధిలో లేని వారిని ఎంచుకోవాలి. జాగ్రత్తగా ఆలోచించి అడుగేయండి. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్‌కు పంపించగలరు. -
ఊహించని షాక్.. నోటీసులు జారీ చేసిన ఐటీ శాఖ, వణుకుతున్న ఐటీ ఉద్యోగులు!
మూన్ లైటింగ్.. ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు. కరోనా లాక్డౌన్ టైంలో కొందరు ఉద్యోగులు ఒకేసారి రెండు జాబ్‌లు చేస్తూ అధిక అదాయాన్ని సంపాదించుకున్నారు. అయితే ఇటీవల ఈ బండారం బయటపడడంతో ఐటీ రంగాన్ని ఈ అంశం కుదిపేసిన సంగతి తెలిసిందే. తాజాగా మూన్‌లైటింగ్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ సారి ఐటీ శాఖ దీనిపై ఫోకస్ పెట్టింది. అసలు ఏం జరుగుతోందంటే.. ఎకనామిక్ టైమ్స్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న ఉద్యోగుల్లో కొందరు మూన్‌లైటింగ్ ద్వారా అధికంగా సంపాదించిన.. తమ ఆదాయాన్ని ఐటీ రిటర్నుల్లో చూపించలేదు. దీంతో ఆయా ఉద్యోగులకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ప్రస్తుతానికి 2019-2020, 2020-2021 ఆర్థిక సంవత్సరాల ఆదాయాలకు సంబంధించి ఐటీ శాఖ ఈ నోటీసులు జారీ చేసింది. మూన్‌లైటింగ్ ద్వారా సంపాదిస్తున్న వారిలో ఎక్కువ మంది ఐటీ సెక్టార్, అకౌంటింగ్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్ వున్నారని పేర్కొంది. వీరిలో విదేశాల నుంచి నగదు బదిలీ అయిన వారు చాలా మంది ఉన్నారు, అయితే ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసేటప్పుడు, వారు తమ సాధారణ జీతంపై మాత్రమే పన్ను చెల్లించారు. ఈ క్రమంలో మూన్ లైటింగ్ సంపాదనపై పన్ను చెల్లించని దాదాపు మందికి పైగా ఉద్యోగులకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. విశేషమేమిటంటే.. మూన్ లైటింగ్ ద్వారా సంపాదిస్తున్న చాలా మంది ఉద్యోగుల సమాచారాన్ని వారు పనిచేస్తున్న కంపెనీలే ఆదాయపు పన్ను శాఖకు అందజేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో విదేశీ లావాదేవీలను ట్రాక్ చేయడం ద్వారా ఐటీ శాఖ అలాంటి వారిని తేలిగ్గా గుర్తించింది. కరోనా కాలంలో మూన్‌లైటింగ్ చేసే వారి సంఖ్య పెరిగిన సంగతి తెలిసింది. మరో వైపు ఈ వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు దీన్ని సమర్థించగా.. మరికొందరు మాత్రమే తీవ్రంగా వ్యతిరేకించారు. చదవండి: Business Idea: ఒక్కసారి ఈ పంట పండించారంటే ప్రతి ఏటా రూ.60 లక్షల ఆదాయం! బ్లూబెర్రీ సాగుతో లాభాలే.. లాభాలు! -
బుర్ర వేడెక్కి, కాలిపోతుంది.. బర్న్ ఔట్ సిండ్రోమ్, మూన్‌లైటింగ్ అంటే?
విపరీతంగా ఆలోచించినప్పుడు బుర్ర వేడెక్కిపోయింది అంటుండటం సాధారణం. మరి అంతకంటే ఎక్కువ తీవ్రతతో కూడిన ఒత్తిడితో పని చేస్తుంటే దాన్ని కాలిపోవడంతో పోల్చవచ్చా అంటే అవునంటున్నారు వైద్యనిపుణులు. నియంత్రణ ఏమాత్రం లేకుండా, తీవ్ర ఒత్తిడితో పనిచేస్తే కలిగే దుష్ప్రభావాలను ‘‘బర్న్ ఔట్ సిండ్రోమ్’’గా చెబుతున్నారు. దీనికి ఒకింత తీవ్రత ఎక్కువగా ఉన్న మరో స్థితి కూడా ఉంది. దాని పేరే ‘మూన్‌లైటింగ్’ ఎఫెక్ట్. ఈ మాటలిప్పుడు మరింత ప్రాచుర్యంలోకి రావడానికి కారణం ఉంది. కోవిడ్ సమయంలో లాక్డౌన్ విధించడంతో కొన్ని వృత్తులవారు... ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఆమాటకొస్తే డాక్టర్లు, నర్సుల వంటి వారూ ఈ ‘బర్న్ ఔట్ సిండ్రోమ్’, ‘మూన్ లైట్ ఎఫెక్ట్’ బారిన పడ్డట్లుగా అధ్యయనాల్లో తేలడంతో వాటి ప్రభావమిప్పుడు చర్చనీయాంశమైంది. ‘బర్న్ ఔట్ సిండ్రోమ్’, ‘మూన్ లైట్ ఎఫెక్ట్’పై అవగాహన కల్పించే కథనమిది. లాక్డౌన్ లేని సమయంలో సాఫ్ట్వేర్ వృత్తుల వారు ఎవరి ఆఫీసుల్లో వారు.. వారి సంస్థకు చెందిన పనులు చేసుకునేవారు. లాక్డౌన్ విధించాక ఇంట్లోనే ఉండి పనిచేసుకోవచ్చనే వెసులుబాటు రావడంతో.. కొంతమంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఒకటి కంటే ఎక్కువ సంస్థల నుంచి పనులు స్వీకరించి పనిచేయడం మొదలుపెట్టారు. మామూలుగానే ఒత్తిడితో కూడిన వృత్తి.. దానికి తోడు మరిన్ని సంస్థలకు పనిచేయాల్సి రావడంతో ఏర్పడ్డ అదనపు ఒత్తిడి కారణంగా ‘బర్న్ ఔట్ సిండ్రోమ్’కు గురికావడం ఎక్కువయ్యింది. ఒక సంస్థకు తెలియకుండా మరొక సంస్థలో పనిచేస్తూ.. ఒకటి కంటే ఎక్కువ సంస్థలకు చెందిన కార్యకలాపాలు నిర్వహించడంతో.. అనూహ్యంగా పెరిగిపోయిన తీవ్రమైన ఒత్తిడిని ‘మూన్లైట్ ఎఫెక్ట్’గా వైద్యులు పేర్కొంటున్నారు. వీటివల్ల మెదడులో అనూహ్యపరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు వెల్లడిస్తున్నారు. దీని ఫలితంగా చాలామంది ఉద్యోగాలనూ, ఉపాధిని కోల్పోవడమూ జరిగిందంటే దీని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. చదవండి: ఇలా చేస్తే పురుగులు పడిపోతాయి! అప్పుడు ఎంచక్కా... లక్షణాలు ►తీవ్రమైన నిస్సత్తువ, పని పైన ఆసక్తి లేకపోవడం ►పని మీద దృష్టి కేంద్రీకరించలేకపోవడం ►వృత్తికి సంబంధించిన ప్రతి అంశంలోనూ ప్రతికూల ధోరణి (నెగెటివిజమ్) ►భవిష్యత్తు గురించి నిరాశాజనకంగా ఆలోచించడం ►తనను తాను ప్రోత్సహించుకుని, పని చేయడానికి పురిగొల్పుకునే ధోరణి (మోటివేటెడ్‌గా) లేకపోవడం. ‘బర్న్ఔట్’ తాలూకు తీవ్రతలూ – దశలు... ఈ దుష్ప్రభావల తీవ్రత... ఒకేసారి కాకుండా దశలవారీగా కనిపిస్తుంది. అవే... 1. హనీమూన్ ఫేజ్ : పని పెరిగినప్పటికీ అదనపు ఆదాయం సమకూరుతుండటం, డబ్బు కళ్లబడుతుండటంతో మొదట్లో చాలా ప్రోత్సాహకరంగా, హాయిగా, ఆనందంగా ఉంటుంది. అందుకే దీన్ని ‘హనీమూన్ ఫేజ్’గా చెబుతారు. 2. అర్లీ స్ట్రెస్ ఫేజ్ : ఒత్తిడి తాలూకు మొదటి దశ ఇది. 3. క్రానిక్ స్ట్రెస్ ఫేజ్ : ఒత్తిడి మొదటి దశ దాటిపోయి... ఎల్లప్పుడూ అదే ఒత్తిడితో ఉండటం జరుగుతుంది. అందుకే దీన్ని ‘క్రానిక్ స్ట్రెస్ ఫేజ్’గా చెబుతారు. 4. ఎస్టాబ్లిష్డ్ బర్న్ ఔట్ : నిత్యం ఒత్తిడి కారణంగా కనిపించే దుష్ప్రభావాలు స్పష్టంగా వెల్లడవుతూ ఉండటం (ఎస్టాబ్లిష్ అవుతుండటం) వల్ల దీన్ని ఈ పేరుతో పిలుస్తారు. ఇదీ చదవండి: పిల్లల్ని పెంచేపుడు ఏం తప్పులు చేస్తున్నాం? అసలు ఎలా పెంచాలి? 5. హ్యాబిచ్యువల్ బర్న్ ఔట్ : నిత్యం కనిపించే ఒత్తిడికి పూర్తిగా అలవాటు పడిపోయి, దాన్లోంచి తప్పించుకోలేక, ఒప్పుకున్న పనినుంచి తప్పుకోలేక ఒకరకమైన నిస్పృహకూ, నిరాసక్తతకూ లోనుకావడాన్ని ‘హ్యాబిచ్యువల్ బర్న్ ఔట్’ దశగా చెప్పవచ్చు. పైగా ఈ దశలన్నీ వ్యక్తుల్లో మంచి అభివృద్ధికి తోడ్పడే కీలకమైన వయసులో అంటే 30 నుంచి 35 ఏళ్ల మధ్యన కలగడంతో తీవ్రమైన నిరాశ, నిస్పృహలకు లోను కావడంతో ఆ కుటుంబం అతలాకుతలం కావడం, ఛిన్నాభిన్నమైపోవడం లాంటి పరిణామాలు సంభవిస్తుంటాయి. ఎవరిలో ఎక్కువంటే... సాఫ్ట్వేర్ ఉద్యోగులే కాకుండా, కోవిడ్ సమయంలో కీలకమైన బాధ్యతలు నిర్వహించిన వైద్యవర్గాలూ ‘బర్న్ ఔట్ సిండ్రోమ్’కు గురికావడం ఆసక్తికరమైన అంశం. గణాంకాల్ని చూసినప్పుడు ఈ వైద్యవర్గాల్లోనూ ఎమర్జెన్సీ వైద్య విభాగాల్లో పనిచేసేవారు 65%, కార్డియాలజీ విభాగానికి చెందిన వారు 43%, న్యూరోసర్జరీ విభాగాల్లో పనిచేసే వైద్యుల్లో 21% మంది దీని బారిన పడ్డారని తేలింది. వీళ్లే కాదు... ఫాస్ట్‌ఫుడ్ డెలివరీ వర్కర్లు, ట్రాఫిక్ పోలీసులు, ఫైర్ ఫైటర్లూ దీనికి గురవుతుంటారు. మహిళలు దీని బారిన ఎక్కువగా పడుతుంటారు. దీనికి తోడు వ్యాయామం చేయనివాళ్లూ, ఊబకాయం ఉన్నవారూ, ఒంటరివాళ్లూ, బాగా ఎక్కువగా ఆల్కహాల్ తాగేవారిలోనూ బర్న్ఔట్ సిండ్రోమ్ బారిన పడే అవకాశాలు మరీ ఎక్కువ. మూన్‌లైటింగ్ ఎఫెక్ట్ అంటే... తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పెంచుకోవాలనే కోరికతో, ఎలాగూ తమపై ఆఫీసు నిఘా ఉండదు కాబట్టి పలుచోట్ల పనులను ఒప్పుకున్నవారు మరింత ఎక్కువ ఒత్తిడికి గురికావడాన్ని ‘మూన్‌లైటింగ్ ఎఫెక్ట్’ అంటారు. మామూలుగా మనం పగలు పనిచేస్తుంటాం. అదనపు పనిని ఒప్పుకున్నందున నిద్రమానేసి విశ్రాంతి లేకుండా రాత్రుళ్లూ పని చేస్తూ పోవడాన్ని ‘మూన్‌లైటింగ్’గా చెబుతున్నారు. మొదట్లో దీన్ని ఓ వైవిధ్యమైన పరిస్థితిగా అనుకున్నప్పటికీ విస్తృత అధ్యయనం తర్వాత ‘మూన్‌లైటింగ్’ కూడా ‘బర్న్ఔట్’ తాలూకు మరో రూపమనీ, దానికంటే ఒకింత తీవ్రత ఎక్కువని తేలింది. దీనివల్ల ఆఫీసులో జరిగే తప్పులే కాకుండా... భవిష్యత్తులో హైబీపీ, గుండెజబ్బులకూ, డిప్రెషన్‌కూ దారితీయవచ్చని పరిశోధనల్లో తేలింది. విముక్తి ఎలా... ఈ సమస్యల నుంచి బయటపడటం కూడా తేలికే. అవసరమైనంత విశ్రాంతి తీసుకోవడం, వీలైనంతవరకు మధ్యాహ్నాలు ఓ అరగంట నిద్ర (పవర్‌న్యాప్), రాత్రుళ్లు కంటి నిండా కనీసం ఎనిమిది గంటల పాటు నిద్రపోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తినడం, వీలైనంతవరకు చక్కెర పదార్థాలు చాలా తక్కువగా తీసుకోవడం ద్వారా ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఆల్కహాల్‌కూ, నిద్రపట్టనప్పుడు స్లీపింగ్ పిల్స్ వాడేవారు వాటికి దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం, ధ్యానం చేయాలి. తమ పట్ల తాము జాగ్రత్తలు తీసుకోవడం మాత్రమే కాకుండా... ఇతరులకు సహాయం చేయడంలోని ఆనందమూ వారిని బర్న్ ఔట్ నుంచి రక్షిస్తుందని అధ్యయనాలు తేల్చాయి. అప్పటికీ నిరాశ, నిస్పృహ, నిస్సత్తువ, అనాసక్తి వంటి లక్షణాలు చాలాకాలం పాటు కనిపిస్తుంటే ఒకసారి డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. మెదడుపైనా దుష్ప్రభావాలు ప్రీ–ఫ్రంటల్ కార్టెక్స్ ప్రాంతంలో : బర్న్ ఔట్ కారణంగా మెదడులోని ప్రీ–ఫ్రంటల్ కార్టెక్స్ ప్రాంతంలోని ‘గ్రే మ్యాటర్’ బాగా పలచబారినట్లు ఇటీవలి తాజా పరిశోధనలు చెబుతున్నాయి. దీని కారణంగా జ్ఞాపకశక్తి బాగా తగ్గడం, ఏ విషయాన్నైనా సమగ్రంగా ఆకళింపు చేసుకోవడంలో లోపాలు, చేసిన తప్పిదాలే మళ్లీ మళ్లీ చేయడం, కొత్త విషయాలు నేర్చుకోవడంలో నైపుణ్యాలు తగ్గడం వంటి లోపాలు కనిపించాయి. టెంపోరల్ లోబ్ ప్రాంతంలో : మెదడులోని మధ్య (మీడియల్) టెంపోరల్ లోబ్ అనే చోట బాదం కాయ ఆకృతిలో ‘ఎమిగ్దలా’ అనే ఓ ప్రదేశం ఉంటుంది. (నిజానికి గ్రీకు భాషలో ఎమిగ్దలే అంటే బాదం కాయ అనే అర్థం. అందుకే దానికా పేరు). భయాలూ, ఆందోళనల్లాంటి అనేక ఉద్వేగాలకు కారణమయే, ఆవిర్భవించే ప్రదేశమది. బర్న్ ఔట్‌కు లోనైన వారిని పరిశీలించినప్పుడు వాళ్లలో ‘అమిగ్దలా’ బలంగా మారినట్లు తేలింది. ఫలితంగా తమ చుట్టూ ఉన్న ప్రపంచమంతా భయంకరంగా అనిపించడం లాంటి అనుభవాలకు గురిచేస్తుందన్న మాట. ఒకవైపు గ్రేమ్యాటర్ పలచబారడం, మరోవైపు ఎమిగ్దలా బలపడటం... ఈ రెండింటి మధ్య సమన్వయం లేకపోవడంతో బర్న్ఔట్ తీవ్రత మరింతగా పెరుగుతోంది. -
ఏక ఉద్యోగ వ్రతమే మంచిది
-
Ch Nageshu Patro: ఈయనో మూన్‌లైటింగ్ కూలీ
బరంపూర్: మూన్‌లైటింగ్. ఐటీ రంగంలో ఈ మధ్య బాగా పాపులరైన పదం. రెండు కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ రెండు చేతులా సంపాదించడాన్ని మూన్‌లైటింగ్ అంటారు. ఒడిశాకి చెందిన ఒక లెక్చరర్ కూడా మూన్‌లైటింగ్ చేస్తున్నారు. కానీ ఈయనది మనసుని కదిలించే కథ. పొద్దున్న పూట కాలేజీలో విద్యార్థులకు పాఠాలు. రాత్రయ్యే సరికి ఎర్రచొక్కా వేసుకొని రైల్వే స్టేషన్లలో కూలీ అవతారం. డబ్బు సంపాదించడం కోసం కాకుండా, తాను ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్లో పని చేసే వారికి జీతాలు ఇవ్వడం కోసం కూలీ పని చేస్తున్నారు. ఒడిశాలో గంజామ్ జిల్లాకు చెందిన 31 ఏళ్ల సీహెచ్.నగేశు పాత్రో బరంపూర్ రైల్వే స్టేషన్లో కూలీగా పనిచేసేవారు. కరోనా సమయంలో రైళ్లు నిలిచిపోవడంతో ఆయనకు పని లేకుండా పోయింది. ఎంఏ వరకు చదువుకున్న పాత్రో ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేక నిరుపేద విద్యార్థుల కోసం ఒక కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. పదో క్లాసు పిల్లలకి పాఠాలు చెప్పసాగారు. కోచింగ్ సెంటర్‌కి ఆదరణ పెరగడంతో 10 నుంచి 12 వేల జీతానికి కొందరు టీచర్లను నియమించారు. వారికి జీత భత్యాలు ఇవ్వడానికి రాత్రయ్యే సరికి మళ్లీ కూలీ పని చేస్తున్నారు. విద్యార్థిగా ఉన్నప్పుడు పాత్రో సూరత్‌లోని ఒక మిల్లులో, హైదరాబాద్‌లోని ఒక మాల్లో పని చేసి తాను సంపాదించిన డబ్బులతోనే చదువుకున్నారు. -
మానవ సంబంధాలపై ‘గ్యాస్ లైటింగ్’.. అసలు ఏంటి ఇది?
దొడ్డ శ్రీనివాసరెడ్డి: ఒకరంటే మరొకరికి పడదు.. లేదా ఒకరి నుంచి మరొకరు ఏదో కూడని దాన్ని ఆశిస్తున్నాంటారు. దగ్గరివారిగా నటిస్తారు, ఎక్కడా లేని ప్రేమ ఒలకబోస్తారు. కానీ అదే సమయంలో మీ నిర్ణయాలు తప్పని మీకే అనిపించేలా వ్యవహరిస్తారు. మెల్లగా మీలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తారు. అవతలివారు ఏం చెప్పినా.. అది తప్పు అని మీకు అనిపిస్తున్నా కూడా తు.చ. తప్పకుండా చేసే పరిస్థితి కల్పిస్తారు. ఒకరకంగా చెప్పాలంటే.. పూర్తిగా లొంగదీసుకుంటారు. ఇదే ‘గ్యాస్ లైటింగ్’. పేరులోని పదాలకు సంబంధం లేకున్నా.. నమ్మకమే పెట్టుబడిగా ప్రస్తుతం సమాజంలో అంతటా, అన్ని రంగాల్లో గ్యాస్ లైటింగ్‌కు పాల్పడటం కనిపిస్తోంది. విప్రో సంస్థ ఇటీవల అకస్మాత్తుగా 300 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. మూన్‌లైటింగ్‌కు పాల్పడుతున్న కారణంగా వారిని తొలగించినట్టు సంస్థ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ ప్రకటించారు. దీనితో మూన్ లైటింగ్ అనే పదం విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇప్పుడు ఇంకో పదం ప్రపంచ ప్రజానీకాన్ని విపరీతంగా ఆకర్షిస్తోంది. అదే గ్యాస్ లైటింగ్. మెరియం వెబ్‌స్టర్ డిక్షనరీ 2022లో అత్యధికంగా అన్వేషించిన పదంగా గ్యాస్ లైటింగ్‌ను ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే ఆ పదం కోసం వెదికినవారి సంఖ్య 1,740 శాతం పెరిగినట్టు మెరియం వెబ్‌స్టర్ ఎడిటర్ పీటర్ సాకోలోవిస్కీ తెలిపారు. ఈ పదం పట్ల ప్రజల ఆసక్తికి ఏ సంఘటనో, పరిణామమో కారణం కాకపోయినా.. ఏడాది పొడవునా ఔత్సాహికులు డిక్షనరీలో దీనికోసం వెదకడం ఆశ్చర్యం కలిగించిందని చెప్పారు. మెరియం వెబ్‌స్టర్ నిఘంటువును ఆన్లైన్లో ప్రతినెలా పదికోట్ల మంది వీక్షిస్తారు. 2020లో పాండమిక్, గత ఏడాది వాక్సిన్ పదాలను అత్యధికంగా శోధించారు. మరి ఏమిటీ గ్యాస్ లైటింగ్? వెబ్‌స్టర్ డిక్షనరీ ప్రకారం.. ఎవరైనా సుదీర్ఘకాలంపాటు వారి వాదనలు, వక్రీకరణలతో మనల్ని గందరగోళపర్చడం, మనపై మనకే నమ్మకం కోల్పోయేలా చేయడం, వాస్తవికతపట్ల సందేహం కల్పించడం, మానసికంగా మనల్ని ఆత్మన్యూనతలోకి నెట్టడమే ‘గ్యాస్ లైటింగ్’. సులువుగా చెప్పుకోవాలంటే అవతలివారు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మనల్ని తప్పుదోవ పట్టించడం అన్నమాట. ఫేక్‌న్యూస్, వాట్సాప్‌లో అవాస్తవాల ప్రచారం, ప్రజలను ప్రభుత్వాధినేతలు మభ్యపెట్టడం, కుట్ర సిద్ధాంతాల వంటివాటి నేపథ్యంలో ఇటీవలి కాలంలో ‘గ్యాస్ లైటింగ్’ పదం విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. గ్యాస్ లైటింగ్‌కు మూలం ఇదీ! తొలుత ఎక్కువగా మానసిక నిపుణులు గ్యాస్ లైటింగ్ పదాన్ని వాడేవారు. తర్వాత సాహిత్యంలో, పత్రికా రచనల్లో అప్పుడప్పుడూ కనిపించేది. ఇప్పుడు దీన్ని అన్ని రంగాల్లో ప్రస్తావిస్తున్నారు. అయితే గ్యాస్ లైటింగ్ పదానికి మూలం 84 ఏళ్ల క్రితం లండన్‌లో అదే పేరుతో ప్రదర్శితమైన నాటకం. 1938లో పాట్రిక్ హమిల్టన్ రాసిన నాటకం ‘గ్యాస్ లైట్’ అప్పట్లో విపరీతమైన ప్రజాదరణ పొందింది. ఆ నాటకం ఆధారంగా 1944లో గ్యాస్ లైట్ పేరుతో ప్రముఖ నటీనటులు ఇంగ్రిడ్ బెర్గ్మన్, చార్లెస్ బోయెర్ నటించిన సినిమా విడుదలయింది. కథానాయిక బెల్లా పాత్రను బెర్గ్మన్, ఆమె భర్త జాన్ పాత్రను బోయర్ పోషించారు. భార్య బెల్లాకు మానసిక స్థిమితం లేదనే భావనను ఆమెలో కలిగించడానికి భర్త జాక్ చేసే ప్రయత్నాలే దీనిలో ప్రధానాంశం. భార్య ఆత్మన్యూనతకు లోనయ్యేలా భర్త ప్రయత్నించేటప్పుడు ఇంట్లో గ్యాస్‌తో వెలిగేలైట్లు మసకబారుతూ ఉంటాయి. మన చుట్టూ గ్యాస్ లైటింగ్.. తరచిచూస్తే మన చుట్టూ ఈ గ్యాస్ లైటింగ్ ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. అబద్ధాలు, వక్రీకరణలు, తిమ్మిని బమ్మిని చేయడం వంటివాటిని మానవ సంబంధాల్లో, వ్యాపారం, రాజకీయం వంటి అన్నిరంగాల్లో చూస్తూనే ఉంటాం. నమ్మకం ఉన్నచోటే గ్యాస్ లైటింగ్ పనిచేస్తుంది. భార్యాభర్తలు, ప్రేమికులు, స్నేహితుల మధ్య, యజమాని–ఉద్యోగి మధ్య, రాజకీయ నేతలు–ఓటర్ల మధ్య నిరంతరాయంగా ఇదిసాగుతూ ఉండటం గమనిస్తున్నాం ►లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాను ఓడిపోలేదని, కుట్ర జరిగిందని అనుయాయులను నమ్మించి పార్లమెంట్ భవనం కాపిటల్హిల్పై దాడికి కారణమయ్యారు. ప్రత్యర్థి బరాక్ ఒబామా అమెరికాలో పుట్టలేదని దేశప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు ట్రంప్. ఒబామా తన బర్త్ సర్టిఫికెట్ చూపించి ట్రంప్ చెప్పింది అబద్ధమని నిరూపించుకోవాల్సి వచ్చింది. ►కరోనా ముట్టడిస్తున్నప్పుడు అన్నిదేశాల ప్రభుత్వాలు తేలిగ్గా తీసుకుని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేశాయి. వైద్య సంస్థలు మొదట్లో అదే పనిచేశాయి. మహమ్మారి పంజా విసిరి లక్షల మందిని పొట్టనపెట్టుకున్నాక చర్యలు తీసుకోవడం మొదలుపెట్టా యి. కరోనా సమయంలో ప్రభుత్వాలు, వైద్య సంస్థలు వాస్తవాలను దాచిపెట్టడానికి చేసిన ప్రయత్నాలకు ‘మెడికల్ గ్యాస్ లైటింగ్’ అని పేరుపెట్టారు. ►నల్లధనాన్ని అరికట్టడానికి నోట్ల రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించినప్పుడు అందరూ నమ్మారు. గంటలు, రోజుల తరబడి క్యూలలో నిలబడి నగదు మార్చుకున్నారు భారతీయ బడుగుజీవులు. తీరా చూస్తే రద్దు ముందు చెలామణిలో ఉన్న నగదు కన్నా ఎక్కువ శాతం నగదు చెలామణిలోకి వచ్చింది. తర్వాత ప్రధానిగానీ, ప్రభుత్వంగానీ నోట్లరద్దు ప్రస్తావన చేయలేదు. ఇలా ప్రభుత్వాధినేతలు, రాజకీయ నేతలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడాన్ని ‘పొలిటికల్ గ్యాస్ లైటింగ్’గా పిలుస్తున్నారు. శ్రద్ధావాకర్ హత్య కేసులోనూ ఇదే తీరు! సంచలనం సృష్టించిన ఢిల్లీ శ్రద్ధావాకర్ హత్యకేసులో కూడా గ్యాస్ లైటింగ్ జరిగిందన్న అనుమానాలు ఉన్నాయి. అఫ్తాబ్ పూనావాలా తనతో సహజీవనం చేస్తున్న శ్రద్ధను హత్యచేసి, దేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి పడేసిన ఉదంతం గురించి విస్తృతమైన చర్చ జరిగింది. మరి అంతకుముందు శ్రద్ధావాకర్ చేసిన పోలీస్ ఫిర్యాదు, స్నేహితులతో పంచుకున్న తన అనుమానాలు, ఆందోళనలను పరిశీలిస్తే.. అఫ్తాబ్ ప్రవర్తన గురించి, అతడి దుశ్చర్యల గురించి తెలిసినా శ్రద్ధావాకర్ అఫ్తాబ్‌ను ఎందుకు వదిలి వెళ్లలేదన్నది సమాధానం లేని ప్రశ్న. శ్రద్ధపై అఫ్తాబ్ ‘గ్యాస్ లైటింగ్’ ప్రయోగించడమే దీనికి కారణమనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రముఖ క్లినికల్ సైకాలజిస్టు డాక్టర్ ప్రాచీ వైష్ను ఇదే సందేహం అడిగితే.. ‘‘ఇలాంటి కేసుల్లో నిందితులు సుదీర్ఘకాలం పాటు బాధితులను మానసికంగా గందరగోళపర్చి, ఆత్మన్యూనతకు లోనుచేసి, మానసిక స్థితిపై పూర్తి నియంత్రణ సాధిస్తారు. దీనితో బాధితులు సొంతంగా నిర్ణయాలు తీసుకోలేని స్థితికి చేరుకుంటారు. తప్పించుకుని వెళ్లే సాహసం చేయరు..’’ అని చెప్పారు. బయటపడేదెలా? గ్యాస్ లైటింగ్ నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి కావాల్సింది ప్రధానంగా ఆత్మ నిబ్బరాన్ని కోల్పోకపోవడమేనని మానసిక నిపుణులు చెప్తున్నారు. మనపై గ్యాస్ లైటింగ్ జరుగుతుందని ఏమాత్రం అనుమానం వచ్చినా.. తక్షణమే ఎలాంటి నిర్ణయాలు, అభిప్రాయాలకు రాకుండా మౌనంగా పరిస్థితిని పరిశీలించుకోవాలని.. వాస్తవాలను ఒకటికి రెండుసార్లు పరిక్షించుకోవాలని సూచిస్తున్నారు. అవసరమైన ఆధారాలను సేకరించాలని.. ఇతరులతో అనుమానాలను పంచుకోవాలని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ధైర్యాన్ని కోల్పోకుండా పరిస్థితిని ఎదుర్కొని, ప్రత్యామ్నాయాలను యోచించాలని.. అవసరమైతే నిపుణులను సంప్రదించాలని స్పష్టం చేస్తున్నారు. -
మూన్‌లైటింగ్‌పై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు
ఒకచోట ఉద్యోగం చేస్తూనే రహస్యంగా మరొక ఉద్యోగం కూడా చేస్తుండటాన్ని ‘మూన్‌లైటింగ్’ అంటారు. అయితే టెక్ కంపెనీల చట్టం ప్రకారం ఒకేసారి రెండేసి ఉద్యోగాలు చేయకూడదన్న నిబంధన ఉంది. ఆ నిబంధనను ఉల్లంఘించారన్న కారణంతోనే విప్రో 300 మంది ఉద్యోగుల్ని ఫైర్ చేసింది. ఆ తొలగింపులే ఐటీ రంగంలో ప్రకంపనలు పుట్టించి, ఆ ఐటీ దిగ్గజం చేసిన పని సమంజసమేనా అనే చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో భారత నూతన ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ మూన్‌లైటింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వారం సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన సీజేఐ చంద్రచూడ్ మూన్‌లైటింగ్‌పై స్పందించారు. తాను ఆల్ ఇండియా రేడియో(ఏఐఆర్)లో రేడియో జాకీగా పనిచేసే సమయంలో మూన్‌లైటింగ్‌కు పాల్పడినట్లు తెలిపారు. ఓవైపు లాయర్‌గా పనిచేస్తూనే ఏఐఆర్‌లో ‘ప్లే ఇట్ కూల్, ఏ డేట్ విత్ యూ, సండే రిక్వెస్ట్’ అనే షోస్‌గా వ్యవహరించినట్లు ఓ సమావేశంలో చెప్పారు. ఆ వీడియోని బార్ అండ్ బెంచ్ ట్విటర్ పేజీలో పోస్ట్ చేసింది. అదనపు ఆదాయం కోసం సంస్థలో పనిచేస్తూ..మరో సంస్థలో మరో జాబ్ చేయడానికి మూన్‌లైటింగ్ అంటారు?. అయితే కాన్ఫరెన్స్‌లో సీజేఐ మాట్లాడుతూ..అప్పట్లో దీని గురించి (మూన్‌లైటింగ్) చాలా మందికి తెలియదు. నా 20 ఏళ్ల వయసులో నేను మూన్‌లైటింగ్ చేశా. రేడియో జాకీగా పైన పేర్కొన్న ప్రోగ్రామ్స్ చేసినట్లు తెలిపారు.‘ఈ సందర్భంగా తన అభిరుచిల్ని బయటపెట్టారు.నేటికీ సంగీతంపై నాకున్న అభిమానం కొనసాగుతోంది. అందుకే ప్రతిరోజూ న్యాయ విధులు నిర్వహిస్తూనే..ఇంటికి వెళ్లి మ్యూజిక్ వింటున్నట్లు వెల్లడించారు. మూన్‌లైటింగ్ అంటే మోసం చేయడమే ఇటీవల మనదేశంలో పలు కంపెనీలు మూన్‌లైటింగ్‌ను వ్యతిరేకిస్తున్నాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో ఐటీ కంపెనీ హ్యాపిహెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ రెండో ఉద్యోగం చేస్తున్న ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించింది. విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ ట్విటర్లో మూన్‌లైటింగ్ అంటే సంస్థల్ని మోసం చేయడంతో సమానమేనని అన్నారు. అప్పటి నుంచి దేశీయ ఐటీ పరిశ్రమలో మూన్‌లైటింగ్ చర్చంశనీయంగా మారింది. Did you know CJI DY Chandrachud moonlighted as a RADIO JOCKEY in his early 20's - Do listen to him#SupremeCourt #SupremeCourtofIndia #cjichandrachud Video Credit - BCI pic.twitter.com/EdvRqntXST — Bar & Bench (@barandbench) December 4, 2022 చదవండి👉 ‘మీ ఉద్యోగం పోయింది కదా..మీకెలా అనిపిస్తుంది?’ -
మూన్‌లైటింగ్: 81 శాతం ఉద్యోగులు ఏమంటున్నారంటే..
ముంబై: మూన్‌లైటింగ్ (రెండో చోట్ల ఉద్యోగాలు చేయడం)పై వివాదం నేపథ్యంలో చాలా మంది ఉద్యోగులు ఇది అనైతిక వ్యవహారంగానే భావిస్తున్నారు. వాల్యువోక్స్ నిర్వహించిన సర్వే ఆధారంగా ఇన్‌డీడ్ రూపొందించిన నివేదికలో దాదాపు 81 శాతం మంది ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ నివేదిక ప్రకారం మూన్‌లైటింగ్‌కు ఎక్కువగా ఎవరూ ఇష్టపడటం లేదు. సర్వేలో పాల్గొన్న ప్రతి అయిదుగురు ఉద్యోగుల్లో ఒకరు మాత్రమే (19 శాతం) మూన్‌లైటింగ్ వైపు మొగ్గు చూపగా మిగతా వారు ఒక ఉద్యోగం చేస్తూ మరో ఉద్యోగం చేయడం అనైతికమేనని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ మధ్య కాలంలో నిర్వహించిన ఈ సర్వేలో 1,281 సంస్థలు, 1,533 మంది ఉద్యోగార్థులు .. ఉద్యోగులు పాల్గొన్నారు. సర్వే ప్రకారం మూన్‌లైటింగ్ చేస్తున్న వారిలో ఎక్కువ మంది (37 శాతం) .. అకస్మాత్తుగా ప్రధాన ఉద్యోగం పోయినా ఆదాయం దెబ్బతినకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో ఉంటున్నారు. మరికొందరు (27 శాతం) కొంత అదనపు ఆదాయం కోసం రెండో ఉద్యోగం చేస్తున్నారు. అయితే, కంపెనీల అభిప్రాయం మాత్రం మరో రకంగా ఉంది. చేతిలో తగినంత పని లేకపోవడం వల్ల ఉద్యోగులు మూన్‌లైటింగ్‌కు మళ్లుతున్నారని 31 శాతం సంస్థలు భావిస్తుండగా, రెండో ఉద్యోగం చేసుకునేంతగా వారి చేతిలో సమయం ఉంటోందని 23 శాతం కంపెనీలు అభిప్రాయపడినట్లుగా నివేదిక పేర్కొంది. క్వైట్ క్విటింగ్ సమస్య.. ఉద్యోగుల్లో పని ఒత్తిడి, అలసట పెరిగిపోతుండటం వల్ల క్వైట్ క్విటింగ్ (క్రమంగా నిష్క్రమించడం) సమస్య పెరుగుతోందని నివేదిక పేర్కొంది. ఇలాంటి ఉద్యోగులు తాము ఉద్యోగాన్ని అట్టే పెట్టుకునేందుకు అవసరమైన కనీస విధులను మాత్రమే నిర్వర్తిస్తూ క్రమంగా పని నుండి తప్పుకుంటున్నారని తెలిపింది. ఉద్యోగంపై సంతృప్తి తక్కువగా ఉండటం, సవాళ్లు లేక బోరింగ్‌గా ఉండటం వంటి కారణాలు ఎక్కువగా ఉంటున్నట్లు 33 శాతం కంపెనీలు తెలిపాయి. 21 శాతం కంపెనీలు.. ఉద్యోగం పట్ల నిబద్ధత లేకపోవడమే ఈ తరహా నిష్క్రమణలకు కారణమని అభిప్రాయపడ్డాయి. ఉద్యోగుల కోణంలో చూస్తే 29 శాతం మంది.. తీవ్రమైన పని భారం, అలసటే క్వైట్ క్విటింగ్కు కారణమని తెలిపారు. మేనేజర్లు, బాస్‌ల నుండి సహకారం లేకపోవడం వల్లే ఈ ధోరణి పెరుగుతోందని 23 శాతం మంది ఉద్యోగులు పేర్కొన్నారు. చదవండి: ఊహించని షాక్.. ఒకప్పుడు ఈ కారుకి ఫుల్ డిమాండ్, ఇప్పుడేమో ఒక్కరూ కొనట్లేదు! -
‘మూన్‌లైటింగ్’ దుమారం : ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్
ఒకే సారి రెండేసి ఉద్యోగాలు చేస్తున్న సిబ్బందిపై ఆయా టెక్ దిగ్గజాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగులకు పనిచేస్తున్నారంటూ టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్‌లు ఉద్యోగుల్ని ఫైర్ చేశాయి. కానీ టెక్ మహీంద్రా మాత్రం అందుకు విభిన్నంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఉద్యోగులకు మూన్‌లైటింగ్ పాల్పడటాన్ని ప్రోత్సహిస్తోంది. తాజాగా మూన్‌లైటింగ్‌పై మరో కీలక ప్రకటన చేసింది. నవంబర్ నెలలో ఉద్యోగుల కోసం తన మూన్‌లైటింగ్ పాలసీని అమలు చేసేందుకు సిద్ధంగా ఉందని కంపెనీ గ్లోబల్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ హర్షవేంద్ర సోయిన్ తెలిపారు. పలు నివేదికల ప్రకారం.. వర్క్‌కు ఆటంకం కలగనంత వరకు గిగ్ వర్క్స్‌కు అనుమతించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వారాంతంలో లేదా వారంలో రెండు గంటలు వంటి స్వల్ప కాలానికి మాత్రమే పనిచేసేందుకు అంగీకరించనున్నట్లు సమాచారం. చదవండి👉 ‘విప్రో ఉద్యోగులకు బంపరాఫర్’ టెక్ మహీంద్రా మూన్ లైటింగ్ పాలసీలో ఆఫీస్‌కు వర్క్‌తో ఎలాంటి పోటీ ఉండకూడదు. మాస్టర్ సర్వీస్ అగ్రిమెంట్ లేదా కస్టమర్ కాంట్రాక్ట్ కు కట్టుబడి ఉండాలి. కంపెనీ నుంచి రాతపూర్వక అనుమతి అవసరం’ వంటి సంస్థ నిర్ధిష్ట సూత్రాలను కలిగి ఉంటుందని ఈ సందర్భంగా సోయిన్ పేర్కొన్నారు. అట్రిషన్ రేటు తగ్గుతుంది ఈ ఏడాది ఆగస్టులో స్విగ్గీ తన ఉద్యోగులను పని గంటల తర్వాత గిగ్ వర్క్స్ చేసుకోవచ్చంటూ మూన్‌లైటింగ్ పాలసీని అందుబాటులోకి తెచ్చింది. ఇన్ఫోసిస్ సైతం అంతకు ముందు మూన్‌లైటింగ్ చేసే ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చింది. కానీ అది కాస్త వివాదం కావడంతో గిగ్ ఉద్యోగాలు చేసేందుకు అనుమతించింది. అయితే టెక్ సంస్థలు తీసుకునే ఈ నిర్ణయం వల్ల అట్రిషన్ రేటు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మూన్‌లైటింగ్‌కు పాల్పడితే శాలరీల కోసం వేరే సంస్థలోకి వెళ్లే ఆలోచనల్ని విరమిస్తారని భావిస్తున్నారు. చదవండి👉 కంపెనీలను మోసం చేస్తున్న ఐటీ ఉద్యోగులు, ఏరివేసే పనిలో సంస్థలు! -
‘విప్రో ఉద్యోగులకు బంపరాఫర్’
ఉద్యోగులకు ప్రముఖ టెక్ దిగ్గజం విప్రో శుభవార్త చెప్పింది. మూన్‌లైటింగ్ పాల్పడిన ఉద్యోగుల పట్ల ఎంత కఠినంగా వ్యవహరించిందో విధులు నిర్వహించే సిబ్బందికి చెల్లించే ప్రోత్సాహకాల విషయంలో అంతే ఉదారంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. విప్రోలో పనిచేస్తున్న బ్యాండ్స్ A TO B3 కేటగిరిలోని 85 శాతం మంది ఉద్యోగులకు 100 శాతం ప్రోత్సాహకాల్ని ఉద్యోగులకు ఇంటర్నల్ మెయిల్స్ పంపింది. ఏప్రిల్ -జూన్ (క్యూ2)వరకు ఉద్యోగులకు అందించే ఈ బెన్ఫిట్స్ నవంబర్ పేరోల్ లో జత చేస్తామని పేర్కొంది. ఫ్రెషర్స్ నుంచి టీమ్ లీడర్ స్థాయి ఉద్యోగులకు వేరియబుల్ పేకు అర్హులని తెలిపింది. మిగిలిన ఉద్యోగులకు మాత్రం సంస్థ నిర్ధేశించిన టార్గెట్స్ కంప్లీట్ పూర్తి చేసిన విధంగా చెల్లింపులు ఉంటాయని విప్రో తన ఉద్యోగులకు పంపిన అంతర్గత మెయిల్స్‌లో వెల్లడించింది. కంపెనీ పాలసీ ప్రకారం..ఉద్యోగి పనితీరుపై వేరియబుల్ పే 93.5% వస్తుంది. అయినప్పటికీ, మన కార్యకలాపాల్ని మెరుగుపరచడానికి, మనం సాధించిన పురోగతిని ప్రతిబింబించేందుకు ఇదొక మంచి సమయం . అందుకే..ఉద్యోగులకు 1.07శాతం అదనంగా వేరియబుల్ పే ఇవ్వాలని నిర్ణయించుకున్నాం’ అని విప్రో ఆ మెయిల్స్‌లో హైలెట్ చేసింది. వేరియబుల్ పే చెల్లింపు ఎప్పుడంటే విప్రో తన ఉద్యోగులు నవంబర్ పేరోల్‌లో వేరియబుల్ పేను జతచేస్తామని తెలిపింది. వేరియబుల్ పే ప్రకటించడంతో పాటు అట్రిషన్ రేటును తగ్గించే ప్రయత్నం చేసింది. విప్రో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 16వేల మంది ఉద్యోగుల్ని ఇంటర్నల్‌గా ప్రమోట్ చేసింది. వేరియబుల్ పే అంటే ఓ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు చెల్లించే నెలవారీ జీతాలతో సంబంధం లేకుండా ఈ వేరియబుల్ పేని అందిస్తుంటాయి. లాభాల్ని గడించేలా ఉద్యోగుల్ని ప్రోత్సహించేందుకు వారికి సంస్థలు అందించే తాయిలాల్ని వేరియబుల్ పే అని అంటారు. ఉదాహరణకు సంస్థ విధించిన పని గంటల కంటే ఉద్యోగి ఎక్కువ సేపు పనిచేయడం, ప్రొడక్ట్ సేల్స్‌ను బట్టి కమిషన్, పర్ఫార్మెన్స్ ఆధారంగా బోనస్‌లు అందిస్తుంటాయి ఆయా కంపెనీలు. చదవండి👉 పాక్ అభిమాని గూబ గుయ్‌మనేలా..సుందర్ పిచాయ్ రిప్లయ్ అదిరింది -
మూన్‌లైటింగ్ ఆదాయాన్ని దాచిపెడితే: లేటెస్ట్ వార్నింగ్
న్యూఢిల్లీ: ఐటీ కంపెనీల్లో ప్రకంపనలు రేపిన మూన్‌లైటింగ్‌పై తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఐటీ ఉద్యోగులకు అదనపు ఆదాయాన్ని తీసుకొచ్చే అసైన్మెంట్లు లేదా ఉద్యోగాలపై ఆదాయపు పన్ను అధికారులు దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. ఈ ఆదాయంపై కూడా నిబంధనల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుందని మూన్లైట్ ఉద్యోగులను హెచ్చరించినట్లు ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. రూ. 30 వేలు దాటితే టీడీఎస్ తాజాగా, ఈ ‘మూన్ లైటింగ్’ వ్యవహారంపై ఆదాయపన్ను శాఖ కూడా దృష్టిసారించింది. రెండో ఉద్యోగంలో సంపాదించే దానికి కూడా పన్ను చెల్లించాల్సిందేనంటూ హెచ్చరికలు జారీ చేసింది. పన్ను నిబంధనలు రెండో ఉద్యోగానికి కూడా వర్తిస్తాయని తెలిపింది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు గానీ, ప్రొఫెషనల్ ఉద్యోగులకు కానీ ఏ కంపెనీ అయినా ఇచ్చే వ్యక్తిగత చెల్లింపులుసహా రూ. 30 వేలు దాటితే ట్యాక్స్ డిడక్షన్ సోర్స్ (టీడీఎస్) వర్తిస్తుందని తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ ప్రిన్సిపల్ చీఫ్ ఐటీ కమిషనర్ ఆర్.రవిచంద్రన్ స్పష్టం చేశారు. (Apple సత్తా: ఆ మూడు దిగ్గజాలకు దిమ్మతిరిగింది అంతే!) మూన్‌లైటింగ్ ఉద్యోగులు తమ ఆదాయ పన్ను రిటర్న్‌లలో ఏదైనా అదనపు ఆదాయాన్ని ప్రకటించి, వర్తించే పన్ను చెల్లించాలని ఉద్యోగులను కోరారు. అలా చేయకపోతే జరిమానా లాంటి చట్టప్రకారం చర్యలు తీసుకోనుంది. విచారణ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐటీ శాఖ హెచ్చరించిందిఏదైనా కంపెనీ లేదా వ్యక్తి కాంట్రాక్ట్ ఉద్యోగం ద్వారా సంపాదించే రూ 30వేల రూపాయల లోపు ఆదాయానికి మాత్రమే పన్ను మినహాయింపు ఉంటుందని పరిమితి దాటితే టీడీఎస్ చెల్లించాలని రవిచంద్రన్ స్పష్టం చేశారు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194C ప్రకారం కాంట్రాక్ట్ పని కోసం చేసే చెల్లింపుల నుంచి టీడీఎస్‌ను మినహాయించాలి. ఏదైనా సంస్థ, ట్రస్ట్ కానీ, కంపెనీ, స్థానిక యంత్రాంగం వంటివి దీని కిందికి వస్తాయి. నగదు చెల్లింపులు, చెక్, డ్రాఫ్ట్ ఎలా చెల్లించినా సరే టీడీఎస్ మినహాయింపు తప్పనిసరి. ఐటీ చట్టంలోని సెక్షన్ 194జె ప్రకారం రూ. 30 వేలు దాటిన తర్వాత 10 శాతాన్ని టీడీఎస్ కింద మినహాయించాలి. అంతేకాదు, ఒక ఆర్థిక సంవత్సరంలో చేసిన చెల్లింపు లక్ష రూపాయలు దాటినప్పుడు కూడా టీడీఎస్‌ను మినహాయించాల్సి ఉంటుంది. -
మూన్‌లైటింగ్‌పై టెక్ఎం సీఎండీ కీలక వ్యాఖ్యలు, ఒక్క మాటతో..!
సాక్షి, ముంబై: ఐటీ కంపెనీల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన మూన్‌లైటింగ్‌పై దేశీయ 5వ అతిపెద్ద టెక్ దిగ్గజం టెక్ మహీంద్ర కీలక వ్యాఖ్యలు చేసింది. మూన్‌లైటింగ్‌కు ఆదిగా మద్దతిచ్చిన కంపెనీల్లో ఒకటైన టెక్ మహీంద్రా సీఎండీ సీపీ గుర్నానీ స్పందిస్తూ తమది డిజిటల్ కంపెనీ తప్ప, వారసత్వ సంస్థ కాదని వ్యాఖ్యానించారు. తమ కంపెనీ సైడ్ గిగ్లకు మద్దతునిస్తుందని, అసలు అదే ఫ్యూచర్ అంటూ మంగళవారం కంపెనీ ఫలితాల సందర్భంగా ప్రకటించడం విశేషం. అయితే మహీంద్రా గ్రూప్ కంపెనీ ఈ అంశంపై ఇంకా ఒక విధానాన్ని తీసుకురాలేదన్నారు. ఎందుకంటే 90కి పైగా దేశాల్లో స్థానిక చట్టాలకు అనుగుణంగా ఉండాలని గుర్నాని మీడియాతో అన్నారు. తన ఉద్యోగులకు మూన్లైట్ను అనుమతించే విధానంపై పనిచేస్తున్నామన్నారు. లెగసీ, డిజిటల్ కంపెనీల మధ్య చాలా వ్యత్యాసం ఉందని, తమది లెగసీ సంస్థ కాదు కాబట్టి మూన్‌లైటింగ్‌కు మద్దతు ఇవ్వడంలో విశ్వాసం వస్తుందన్నారు. అయితే సిబ్బంది ముందుకు వచ్చి వేరే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న విషయాన్ని వెల్లడించాలని కంపెనీ భావిస్తోందని, విలువలు, నైతికత, పారదర్శకత వంటి కీలక అంశాల్లో రాజీ పడకూడదని పేర్కొన్నారు. ఎవరైనా మంచి పనితనం కలిగి ఉంటే సీఈవోగా చాలా సంతోషిస్తాను.. కానీ ఉద్యోగులు అనుమతి తీసుకుని, ఏ పని చేస్తున్నారో తమకు క్లియర్‌గా చెబితే బావుంటుందనే మాట మాత్రం కచ్చితంగా చెబుతానన్నారు. ఇది కంపెనీతోపాటు, ఆ ఉద్యోగికి కూడా శ్రేయస్కరమన్నారు. అయితే ప్రస్తుతం తమ వద్ద ఉన్న 1.63 లక్షల ఉద్యోగుల్లో ఎవరికైనా అనుమతి లేకుండా రెండు ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతించే విధానం ఏదీ లేదని స్పష్టం చేసిన ఆయన, ఏదైనా ఉల్లంఘన జరిగితే మాత్రం చర్యలు తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. మరోవైపు సెప్టెంబరు 2021తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ లాభాలు శాతం క్షీణించాయి.సెప్టెంబర్‌తో ముగిసిన రెండవ త్రైమాసికంలో పన్ను తర్వాత కన్సాలిడేటెడ్ లాభం (గత ఏడాది నాటి 1,338.7 కోట్లతో పోలిస్తే) 1,285.4 కోట్లకు పడిపోయింది. (Elon Musk క్లారిటీ: బ్లూటిక్ వెరిఫికేషన్ ఫీజు ఎంతో తెలుసా?) కాగా కోవిడ్ పరిస్థితులు, ఆంక్షలు, వర్క్ ఫ్రంహోం సమయంలో ఐటీ సంస్థల్లో మూన్‌లైటింగ్ అంశం వివాదాన్ని రేపింది. విప్రో, టీసీఎస్, ఐబీఎం లాంటి దిగ్గజ సంస్థల్లో చర్చకు దారి తీసింది. మూన్ లైటింగ్‌ను ఇన్ఫోసిస్ కూడా వ్యతిరేకించింది. మూన్‌లైటింగ్‌కు పాల్పడితే చర్యలు తప్పవంటూ ఈమెయిల్ ద్వారా హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా విప్రో ఇదే ఆరోపణలతో 300మంది ఉద్యోగులను తొలగించడంతో ఇది మరింత ముదిరింది. ఫలితంగా 220 బిలియన్ డాలర్ల భారతీయ ఐటీ పరిశ్రమలో మూన్‌లైటింగ్ నైతికత, చట్టబద్ధతపై భిన్నాభిప్రాయాలు నెలకొన్న సంగతి తెలిసిందే. -
గీత దాటితే అంతే, ఉద్యోగులకు భారీ షాక్..మూన్‌లైటింగ్‌పై ఐబీఎం హెచ్చరికలు
మూన్‌లైటింగ్ అంశంపై ప్రముఖ టెక్ దిగ్గజం ఐబీఎం ఉద్యోగులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రెండేసి ఉద్యోగాలు చేస్తే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. మూన్‌లైటింగ్ అంశంపై ఐబీఎం ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పాటిల్ ఉద్యోగులకు ఇంటర్నల్‌గా ఓ మెయిల్ పంపారు. ఆ మెయిల్లో..సంస్థ విధానాల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉల్లంఘించ కూడదు. సరళంగా చెప్పాలంటే మూన్‌లైటింగ్ అంటే రెండో ఉద్యోగంగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. చదవండి👉 ఐటీలో అలజడి : మరో ఊహించని షాక్..తలలు పట్టుకుంటున్న ఫ్రెషర్లు! తమ ఉద్యోగులు కాంపిటీటర్ లేదా ఉపాధి లేదా వ్యాపారాల్లో పాల్గొన్నకూడదు. 7.1,7.2 సంస్థ మార్గదర్శకాలు అవే చెబుతున్నాయి. సంస్థ పనివేళల తర్వాత ఉద్యోగులకు వ్యక్తిగత జీవితం అయినప్పటికీ.. ఐబీఎంకు అవాంతరం కలిగించేలా కార్యక్రమాల్లో పాలు పంచుకోకూడదు. ‘ఐబీఎంలో మా వైఖరి స్పష్టంగా ఉంటుంది. మేం ప్రతి ఉద్యోగి ప్రొడక్టివితో పనిచేసేలా ప్రోత్సహిస్తాం. కళలు, నృత్యం, సంగీతం వంటి కల్చరల్ యాక్టివిటీస్‌లో వారిని ప్రోత్సహిస్తాం. కానీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా, ఐబీఎం ప్రయోజనాల్ని పణంగా పెట్టి మూన్‌లైటింగ్‌కు పాల్పడితే సంస్థ నిబంధనల్ని ఉల్లంఘించినట్లే' అని మెయిల్లో పేర్కొన్నారు. ఐబీఎంలో పనిచేస్తున్న ఉద్యోగి ఖాళీ సమయాల్లో వ్యాపారం చేసేందుకునేందుకు అనమతిస్తే..ఆఫీస్‌లో వర్క్ ప్రొడక్టివిటీ దెబ్బ తిని విధులకు ఆటంకం కలుగుతుంది. ప్రాజెక్టులు ఇచ్చే క్లయింట్లు వారి డేటా, ఇతర ముఖ్య సమాచారం భద్రతగా ఉంచడం సంస్థ విధి. అందుకే మూన్ లైటింగ్ వంటి అంశాల్లో ఐబీఎం కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని ఐబీఎం ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పాటిల్ తన నోట్లో పునరుద్ఘాటించారు. చదవండి👉 టెక్ కంపెనీల్లో.. మూన్‌లైటింగ్ పరాకాష్ఠకు ఈ సంఘటనే ఉదాహరణ.. -
ముదురుతున్న మూన్‌లైటింగ్.. తెరపైకి మరో కంపెనీ, అసలేం జరుగుతోంది!
న్యూఢిల్లీ: మూన్‌లైటింగ్ (ఒకే సారి రెండు చోట్ల ఉద్యోగాలు చేయడం) అనేది ఉద్యోగ కాంట్రాక్టును ఉల్లంఘించడమేనని, ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని ఐటీ సంస్థ హ్యాపీయెస్ట్ మైండ్స్ స్పష్టం చేసింది. మూన్‌లైటింగ్ చేస్తున్నారని తేలిన ‘కొందరు’ ఉద్యోగులను గత 6–12 నెలల్లో ఉద్యోగాల నుంచి తొలగించినట్లు పేర్కొంది. అయితే, ఎంత మందిపై చర్యలు తీసుకుందో వెల్లడించలేదు. కంపెనీలో దాదాపు 4,581 మంది ఉద్యోగులున్నారు. ఈ విషయంలో మిగతా వారికి మరింత స్పష్టం ఇచ్చేందుకే.. మూన్‌లైటింగ్ చేస్తూ దొరికిన వారిని వెంటనే తొలగించినట్లు కంపెనీ ఎగ్జి క్యూటివ్ వైస్ చైర్మన్ జోసెఫ్ స్పష్టం చేశారు. కాగా గత మూన్‌లైటింగ్ వివాదం ఐటీ రంగాన్ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. మొదటగా మూన్లైటింగ్కి పాల్పడుతున్నారని విప్రో 300 మందిని ఉద్యోగులను తొలగించడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది. ఇక అప్పటి నుంచి దీనిపై భిన్నస్వరాలు వినపడుతోంది. కొన్ని కంపెనీలు దీనికి మద్దతు తెలుపుతుండగా , మరొకొన్ని సంస్థలు మాత్రం అంగీకరించే సమస్య తేదని తేల్చేస్తున్నాయి. చివరికి మూన్‌లైటింగ్ (ఒకటికి మించి కంపెనీలకు సేవలు అందించడం) చట్టబద్ధత, నైతికతపై ఇప్పుడు ఏకంగా పెద్ద చర్చే నడుస్తోంది. ప్రముఖ దిగ్జజ కంపెనీ విప్రో చైర్మన్ రిశద్ ప్రేమ్‌జీ మాట్లాడుతూ.. మూన్‌లైటింగ్ మోసం అంటూ దీనిపై ఘాటుగానే స్పందించారు. ‘చేరిన సమయంలో కంపెనీ కోసం మాత్రమే పని చేస్తామని ఒప్పందంపై సంతకం పెడతారు. అయినప్పటికీ అభ్యర్థులు తమ మిగిలిన సమయంలో ఏమి చేయాలో ఎంచుకోవచ్చు. అలా చేయడం నైతికంగా సరైనది కాదు’ అని ఐబీఎం ఇండియా ఎండీ సందీప్ పటేల్ అన్నారు. ప్రస్తుతం చాలా కంపెనీలు మూన్‌లైటింగ్‌కు పాల్పడిన ఉద్యోగులను ఏరివేసే పనిలో ఉన్నాయి. అయితే ఇవేవీ బయటకు పొక్కడం లేదు. చదవండి: ‘ఐటీపై మూన్లైట్’ -
టెక్ కంపెనీల్లో.. మూన్‌లైటింగ్ పరాకాష్ఠకు ఈ సంఘటనే ఉదాహరణ..
ఒక బడా ఐటీ కంపెనీకి చెందిన ఉద్యోగి ఇతర కంపెనీలకూ పని చేస్తున్నట్టు తేలింది. ఇంకేముంది? యాజమాన్యం అతన్ని తొలగించింది. కంపెనీ ఇచ్చిన ల్యాప్‌టాప్‌ను వెనక్కు తీసుకునేందుకు అతని ఇంటికి వెళ్లిన సిబ్బంది నోరెళ్లబెట్టారట.అతని గదిలో ఏకంగా ఐదు ల్యాప్‌ట్యాప్‌లు ఉండడమే కాదు, ఏ ల్యాప్‌ట్యాప్‌ను ఏ కంపెనీ ఇచ్చిందో తెలియని స్థితిలో ఆ ఉద్యోగి ఉన్నాడట. మూన్‌లైటింగ్ పరాకాష్ఠకు ఈ సంఘటనే ఉదాహరణ. మూన్‌లైటింగ్ ఐటీ రంగాన్ని కుదిపేస్తోంది. పేరోల్‌లో ఉన్న 300 మందిని విప్రో తొలగించడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది. మూన్‌లైటింగ్ (ఒకటికి మించి కంపెనీలకు సేవలు అందించడం) చట్టబద్ధత, నైతికతపై ఇప్పుడు చర్చ ఊపందుకుంది. మూన్‌లైటింగ్ మోసం అంటూ విప్రో చైర్మన్ రిశద్ ప్రేమ్‌జీ ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘చేరిన సమయంలో కంపెనీ కోసం మాత్రమే పని చేస్తామని ఒప్పందంపై సంతకం పెడతారు. అయినప్పటికీ అభ్యర్థులు తమ మిగిలిన సమయంలో ఏమి చేయాలో ఎంచుకోవచ్చు. అలా చేయడం నైతికంగా సరైనది కాదు’ అని ఐబీఎం ఇండియా ఎండీ సందీప్ పటేల్ అన్నారు. ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు ద్వంద్వ ఉద్యోగాలను అనుమతించేది లేదని నొక్కిచెప్పింది. కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఉద్యోగం నుంచి తీసివేస్తామని హెచ్చరించింది. వేలాది కంపెనీలు మూన్‌లైటింగ్‌కు పాల్పడిన ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. అయితే ఇవేవీ బయటకు పొక్కడం లేదు. దేశంలో 2008 నుంచి 2020 వరకు ఐటీ రంగంలో ఉన్న ప్రతి ఉద్యోగి కొంత అభద్రతా భావంతో పనిచేశారు. ఆటోమేషన్, కృత్రిమ మేధ వంటి టెక్నాలజీలు ఏ క్షణంలో తమ ఉద్యోగాలకు ఎసరు పెడతాయో తెలియని పరిస్థితి. ఆ సమయంలో ఐటీ కంపెనీలు తమకు అనుకూలంగా మార్చుకున్నాయి. ఎక్కువ పని గంటలు, అతి తక్కువ వార్షిక ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లకు సుదీర్ఘ కాలం తీసుకోవడం లాంటి పరిస్థితి దాచాలన్నా దాగని వాస్తవం. కానీ 2020లో కోవిడ్ రాకతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. లాక్‌డౌన్‌తో అన్ని కంపెనీలు డిజిటల్ వైపు మారాయి. దీంతో ఐటీ కంపెనీలకు ప్రాజెక్టులు వెల్లువెత్తాయి. ఎవరూ ఊహించని ఈ పరిస్థితితో ఐటీలో మానవ వనరుల కొరత తీవ్రమైంది. అప్పటి వరకు బిక్కుబిక్కుమంటూ పని చేస్తున్న ఉద్యోగులకు రెండు, మూడు రెట్ల జీతం ఇచ్చి కంపెనీలు తీసుకున్నాయి. ఫ్రెషర్లకు, అరకొరగా స్కిల్స్, నాలెడ్జి ఉన్న అభ్యర్థులను సైతం నియమించుకున్నాయి. ప్రాజెక్టులు, వర్క్ ఆర్డర్లు క్యూ కట్టడంతో ఉద్యోగుల సమస్యపై కంపెనీలు వ్యూహాత్మక మౌనం పాటించాయి. మూడవ లాక్డౌన్ తరువాత ప్రాజెక్టులు కూడా క్రమబద్ధం కావడంతో ఉద్యోగుల సమస్య వైపు కంపెనీలు దృష్టి సారించాయి. అందులో మొదటి అడుగు హైబ్రిడ్ పని విధానం. ఈ విధానంలో ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వారంలో కొన్ని రోజులు ఆఫీసుకు వచ్చి పనిచేయాలని ప్రకటించాయి. కొన్ని కంపెనీలు పూర్తిగా ఆఫీస్ నుంచే విధులు నిర్వర్తించాలని తేల్చిచెప్పాయి. ఇక్కడే సమస్య మొదలైంది. కొత్తగా జాయిన్ అయిన ఉద్యోగులలో చాలామందికి సరైన నైపుణ్యాలు, అనుభవం లేవని, వాళ్ళు కంపెనీకి సమర్పించిన ఎక్స్‌పీరియెన్స్ సర్టిఫికెట్లు కూడా తప్పుడువేనని తేలింది. ఈ సమస్యను మరింత లోతుగా పరిశీలించడంతో నమ్మశక్యం కానీ విషయాలు ఐటీ కంపెనీలకు బోధపడ్డాయి. ఇంటి నుంచి పని నేపథ్యంలో అనుభవజ్ఞులైన ఉద్యోగులు ఒకేసారి రెండు, మూడు కంపెనీలకు పనిచేస్తున్నట్లు (మూన్‌లైటింగ్) గుర్తించాయి. కొందరైతే వాళ్ళ పనిని అనుభవజ్ఞులకు ఇచ్చి చేయించుకున్నట్లు తేలింది. మరోవైపు కొత్తగా చేరినవారిని, బెంచ్‌పైన ఉన్న అభ్యర్థులను క్లయింట్లు స్వయంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. నిర్ణీత గడువులోగా ఇంటర్వ్యూలో గట్టెక్కితేనే కంపెనీ జీతం చెల్లిస్తుంది. లేదంటే ఇంటిబాట పట్టాల్సిందే! గడిచిన రెండేళ్లలో రెండు చేతులా సంపాదనకు అలవాటు పడ్డ సిబ్బంది కొంతమంది ఉన్న ఉద్యోగాలలో మంచిది ఒకటి ఎంచుకొని హైబ్రిడ్ విధానానికి మారారు. ఇంకొంతమంది మూన్‌లైటింగ్ విధానాన్ని చట్టబద్ధం చేయాలని బహిరంగంగా ప్రకటించారు. సోషల్ మీడియాలో కూడా ఈ అంశంపైన చర్చ ఊపందుకొంది. ఈ పరిస్థితుల్లో నాణ్యత దెబ్బతినడం, డేటా ప్రైవసీకి భంగకరం అని క్లయింట్లు భావించి ప్రాజెక్టులను రద్దు చేసుకుంటే పరిస్థితి ఏంటని కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. మనుగడకే ఇబ్బంది కంపెనీలకు వర్క్ ఫ్రమ్ హోమ్ అత్యంత అనుకూలం, లాభదాయకం. కానీ ఉద్యోగులు ఎంచుకుంటున్న విధానాలను క్రమబద్ధం చేయకుంటే ప్రపంచ ఐటీ రంగంలో భారత కంపెనీల పట్ల ఉన్న సానుకూలతను చేజేతులా కోల్పోతాము. విదేశీ క్లయింట్లు డేటా సెక్యూరిటీకి అత్యంత ప్రాధాన్యమిస్తాయి. అందుకు ఉన్న చట్టాలు కూడా రోజు రోజుకి పటిçష్ఠం అవుతున్న సంగతి అనుభవజ్ఞులైన ఉద్యోగులకు తెలుసు. తమ ఉద్యోగులు రెండు మూడు కంపెనీలకు పనిచేస్తున్న విషయం తెలిస్తే మెజారిటీ క్లయింట్లు ప్రాజెక్టులను వెనక్కి తీసుకుంటే ఒక్క ఐటీ మాత్రమే కాకుండా దేశ ఆర్థిక రంగాన్ని కూడా విషమ పరిస్థితుల్లోకి నెట్టడం ఖాయం. కొంతమంది క్లయింట్లు కన్సల్టెంట్ విధానానికి మొగ్గు చూపినా, బిల్లింగ్ విషయంలో విపరీతంగా తగ్గిస్తే కంపెనీల ఆదాయంలో భారీ కోతపడే అవకాశం ఉంటుంది. కన్సల్టెంట్ విధానం స్వల్పకాలంలో కంపెనీలకు, అనుభవజ్ఞులైన ఉద్యోగులకు లాభదాయకంగా కనపడినా, ధీర్ఘకాలంలో ఐటీ రంగం మనుగడకే ఇబ్బంది. అవర్లీ బిల్లింగ్ లేదా మొత్తం పని గంటలు గణనీయంగా తగ్గించమని ఒత్తిడి చేస్తే కంపెనీల ఆదాయం, లాభాలు తగ్గుతాయి. ఐటీ రంగానికి గొడ్డలిపెట్టు మూన్‌లైటింగ్ విధానం ఐటీ రంగానికి ఒక గొడ్డలిపెట్టు. ఈ విధానానికి అనుభజ్ఞులైన ఉద్యోగుల నుండి మద్దతు పెరుగుతూ ఉంటే మరొక వైపు లక్షల సంఖ్యలో నిరుద్యోగులుగా ఉన్న ఇంజినీరింగ్ విద్యార్థులు.. తమ అవకాశాలను గణనీయంగా దెబ్బ తీస్తుందని ఆందోళన చెందుతున్నారు. మూన్‌లైటింగ్ చట్టబద్ధం అయితే కంపెనీలు ఫ్రెషర్ల నియామకాలకు, క్యాంపస్ రిక్రూట్మెంట్లకు స్వస్తి పలుకుతాయని భావిస్తున్నారు. ‘వైద్య రంగంలో డాక్టర్ల కొరత ఉంటుంది కాబట్టి వాళ్లకు కన్సల్టెంట్ విధానం పనికి వస్తుంది. కానీ లక్షల సంఖ్యలో మానవ వనరులు ఉన్న సాఫ్ట్వేర్ రంగంలో ఈ విధానం అవసరం లేదు’ అని కాంటార్ జీడీసీ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ కందుకూరి సురేశ్ బాబు తెలిపారు. మూన్‌లైటింగ్‌కు ఓకే మూన్‌లైటింగ్‌ను సమర్థించే కంపెనీలూ లేకపోలేదు. టెక్ మహీంద్రా సీఈవో సి.పి.గుర్నానీ అయితే కాలానికి అనుగుణంగా మారుతూ ఉండవలసిన అవసరాన్ని ఎత్తి చూపారు. పని విధానంలో మార్పులను స్వాగతిస్తున్నట్టు ఆయన చెప్పారు. ‘ఎవరైనా సమర్థత, ఉత్పాదకత నిబంధనలకు అనుగుణంగా, ఆ వ్యక్తి మోసం చేయనంత వరకు కొంత అదనపు డబ్బు సంపాదించాలని కోరుకుంటే తన కంపెనీ విలువలు, నైతికతకు విరుద్ధంగా ఏమీ చేయరు. ఈ విషయంలో నాకు ఏమీ ఇబ్బంది లేదు. రెండు చోట్లా పని చేయడాన్ని ఒక విధానంగా చేయాలనుకుంటున్నాను. మీరు దీన్ని చేయాలనుకుంటే సంతోషం. కానీ దాని గురించి బహిరంగంగా ఉండండి’ అని గుర్నానీ అన్నారు. ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీ మూన్‌లైటింగ్ పాలసీని ప్రకటించింది. సంస్థ విధులకు ఆటంకం కలగకుండా గిగ్ ప్రాజెక్టులు చేపట్టేందుకు తన ఉద్యోగులకు అనుమతినిచ్చింది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే, పని విషయంలో స్విగ్గీ, విప్రో.. పూర్తిగా భిన్నమైన స్వభావం కలవి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు మూన్‌లైటింగ్‌కు మద్దతు ఇవ్వడానికి స్విగ్గీని ఉదాహరణగా పేర్కొంటున్నారు. అయితే రెండు కంపెనీల మధ్య ప్రాథమిక వ్యత్యాసం ఉందని ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్షా గోయెంకా గుర్తు చేశారు. ‘విప్రో వర్సెస్ స్విగ్గీ – ఈ రెండు కంపెనీలనూ ఒకేగాటన కట్టలేము. ఫార్చూన్–500 కంపెనీలకు విప్రో సేవలు అందిస్తోంది. ఈ సంస్థలకు డేటా గోప్యత ప్రాణప్రదమైనది. డేటా బయటకు పొక్కే అవకాశం ఉందని భావిస్తే అవి సహించవు’ అని అన్నారు. ‘ఒక సంస్థలో పనిచేస్తూ మరో కంపెనీకి మూన్లైటింగ్కి పాల్పడడం అనైతికం. ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టే. దీనికి అనుమతించేది లేదు. కానీ భవిష్యత్ వర్క్‌ఫోర్స్ మోడల్ అనేది కన్సల్టెంట్లుగా పనిచేసే వ్యక్తుల సమూహం. సహకార సమూహాలుగా కంపెనీల కోసం ఉత్పత్తులను రూపొందిస్తారు. వారు ఒకే సమయంలో ఐదు వేర్వేరు కంపెనీల కోసం దీన్ని చేయవచ్చు. అయితే చాలామంది వ్యక్తులు భవిష్యత్తులో వ్యవస్థాపకులుగా మారబోతున్నారని, వారు సొంతంగా కంపెనీలను ప్రారంభించాలని చూస్తున్నారని కంపెనీలు గుర్తించాలి’ అని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ‘ఉద్యోగుల నుంచి పారదర్శకత లేకపోవడం వల్ల మూన్‌లైటింగ్‌పై భిన్నాభిప్రాయాలు ఉత్పన్నమవుతాయి. పూర్తి సమయం ఉద్యోగిగా ఉన్నప్పుడు ప్రస్తుత యజమానికి తెలియజేయకుండా ఇతర అవకాశాలను కొనసాగించాలని నిర్ణయించుకున్నప్పుడే సమస్య తలెత్తుతుంది. ఇక్కడే యజమాని, ఉద్యోగుల మధ్య నమ్మకం విచ్ఛిన్నమవుతుంది. దీనిని ఎలా పరిష్కరించాలన్నదే ముందున్న సవాలు. మహమ్మారి తదనంతరం పని విషయంలో ఉద్యోగుల్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా కంపెనీలు అప్‌గ్రేడ్ అవ్వాలి. కంపెనీలు రెండు మోడళ్లను స్వీకరించాలి. ఒకటి కంపెనీలో పూర్తి సమయం కేటాయించే ఉద్యోగులను కలిగి ఉండడం. మరొకటి గిగ్ వర్కర్లతో సైతం పనులు చేయించుకోవడం. బహుళ ఉద్యోగాలు చేయడం సమస్య కాదు. కానీ దీన్ని ఎలా చేస్తారన్నదే ప్రశ్న’ అని నాస్కామ్ ప్రెసిడెంట్ దేబజానీ ఘోష్ వెల్లడించారు. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్, సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్) భారత్‌లో సాంకేతిక పరిశ్రమకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఒప్పందానికి కట్టుబడాల్సిందే! ఉద్యోగి ఒక కంపెనీలో చేరే ముందు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్టుగా ఆ ఎంప్లాయీ ఒప్పందానికి కట్టుబడాల్సిందే! ఇక్కడ పనిచేస్తూ మరో సంస్థకు సేవలు అందించడం, మేధాసంపత్తి హక్కులను, వ్యాపార రహస్యాలను, సమాచారాన్ని ఇతరులకు చేరవేయడం, ల్యాప్‌టాప్ వంటి సంస్థ అందించిన ఆస్తులను ఇతరులతో, ఇతర కంపెనీలతో పంచుకుంటే ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టే. ఇలా ఒప్పందాన్ని కాలరాసిన ఉద్యోగిని తీసివేసే హక్కు సంస్థలకు ఉంటుంది. ‘ఉద్యోగులు తమ ఆఫర్ లెటర్లోని నిబంధనలకు కట్టుబడి ఉండాలి. వారు ఒకటి కంటే ఎక్కువ కంపెనీలతో పని చేయాలనుకుంటే గిగ్ వర్కర్‌గా కెరీర్ ఎంచుకోవచ్చు’ అని హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైసెస్ అసోసియేషన్ (హైసియా) ప్రెసిడెంట్ మనీషా సబూ తెలిపారు. ద్రవ్యోల్బణానికి తగ్గట్టుగా ‘ఎంట్రీ లెవెల్ ఉద్యోగికి ఐటీ కంపెనీలు 2003–04లో రూ.2.5–3 లక్షలు ఆఫర్ చేశాయి. ఇప్పుడు ఇదే రోల్‌కు రూ.3–3.5 లక్షలు చెల్లిస్తున్నాయి. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఎంట్రీ లెవెల్ ఉద్యోగికి ఇప్పుడు వేతనం రూ.6.5–7 లక్షలు ఉండాలి. జీతాలు మెరుగ్గా ఉంటే జాబ్ వదిలేయరు. మూన్‌లైటింగ్‌కు పాల్పడరు’ అని ఓ ఉద్యోగి వ్యాఖ్యానించారు. గిగ్ కార్మికులు స్వతంత్రంగా, తాత్కాలికంగా పనిచేసేవారే గిగ్ కార్మికులు. అంటే ప్లంబర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, టెక్నీషియన్స్ వంటి వారు అన్నమాట. ఫ్రీలాన్స్ ఐటీ నిపుణులూ గిగ్ జాబితాలో వచ్చి చేరారు. పని, కాంట్రాక్ట్ పూర్తి అయ్యేవరకు లేదా కొన్ని గంటల కాలానికి వీరు సేవలు అందిస్తారు. వీరి కోసం ఆన్లైన్ వేదికలూ వచ్చాయి. గిగ్‌వర్కర్, గిగ్ఇండియా, వర్క్ఫ్లెక్సి, ఫ్లెక్సిపుల్, ఫ్లెక్స్‌జాబ్స్, జంగిల్వర్క్స్, గిగ్మోస్ వంటివి వీటిలో ఉన్నాయి. ఈ వేదికల్లో కార్మికులు, నిపుణులు తమ పేర్లను నమోదు చేసుకుంటే చాలు. కస్టమర్ల కాల్స్ ఆధారంగా పని ఒప్పదం కుదురుతుంది. ఫలానా సాంకేతిక నైపుణ్యం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చంటూ పోర్టల్స్‌లో తాటికాయంత అక్షరాలతో ఇవి ఊదరగొడుతున్నాయి. అంతేకాదు ఎన్ని డబ్బులు అందుకుంటారో వెల్లడిస్తున్నాయి. ఏ కంపెనీకి ఎంతమంది నిపుణుల సేవలు అవసరమో కూడా స్పష్టం చేస్తున్నాయి. ఎన్ని గంటలు, రోజులు పనిచేయాల్సి ఉంటుందీ తెలియజేస్తున్నాయి. ఎందుకు ప్రోత్సహిస్తున్నాయంటే? నిపుణుల కొరత, సేవల ఖర్చు పెరగడం, సరైన నిపుణుల దొరక్కపోవడం, సమయానికి పనులు పూర్తి చేయడం కోసం, పోటీ కంపెనీని దెబ్బతీయడానికి, వ్యయాలు తగ్గించుకోవడానికి, త్వరితగతిన ప్రాజెక్టును డెలివరీ చేయడం కోసం కొన్ని కంపెనీలు మూన్‌లైటింగ్‌ను ప్రోత్సహిస్తున్నాయి. ప్రధానంగా స్టార్టప్స్ ఇందుకు సై అంటున్నాయి. అదనపు సంపాదన కోసం... జీవన వ్యయం అనూహ్యంగా పెరిగింది. బీమా, అద్దెలూ అధికం అయ్యాయి. ‘కోవిడ్’ మహమ్మారి కారణంగా భవిష్యత్తు పట్ల భయం పట్టుకుంది. అనుకోని ఖర్చులు మీద పడితే ఎలా అన్న ఆందోళన మొదలైంది. జీవనం అస్తవ్యస్తం అయింది. ఉద్యోగం ఉంటుందా లేదా అన్న సందేహం. చివరకు డబ్బే జీవితం అన్న అభిప్రాయానికి వచ్చారు. ప్రతిభకు పదునుపెట్టారు. కొత్త కోర్సులు చేశారు. మరో కంట పడటం లేదు కదా అన్న భావనతో ఇతర కంపెనీలకూ పని చేస్తున్నారు. తద్వారా అదనంగా ఆదాయం ఆర్జిస్తున్నారు. ఇంటి నుంచి పని విధానం ఇందుకు కలిసి వచ్చింది. ఎలా బయటపడిందంటే? మూన్‌లైటింగ్‌కు పాల్పడిన ఉద్యోగులను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పోర్టల్ ద్వారా యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) సాయంతో కంపెనీలు గుర్తిస్తున్నాయి. యూఏఎన్ ఆధారంగా అభ్యర్థి ఎక్కడెక్కడ ఉద్యోగం చేస్తున్నదీ, ఎప్పుడు చేరిందీ వంటి వివరాలను కంపెనీలు తెలుసుకుంటున్నాయి. అలాగే సంస్థ అందించిన ల్యాప్‌టాప్స్‌ను కంపెనీ సర్వర్ ద్వారా ట్రాక్ చేస్తున్నాయి. అంతా క్యాష్ మూన్‌లైటింగ్ మరో కంట కనపడకుండా అభ్యర్థులు కన్సల్టెంట్ల అవతారం ఎత్తుతున్నారు. అత్యధికంగా యూఎస్, యూకే కంపెనీల నుంచి కాంట్రాక్ట్ తీసుకుని అవసరం అయితే ఓ నలుగురిని పెట్టుకుని పని పూర్తి చేస్తున్నారు. నగదు రూపంలో మాత్రమే అందుకునే ఈ ప్రతిఫలాన్ని కుటుంబ సభ్యుల ఖాతాలకు మళ్లిస్తున్నారు. బ్యాంక్ క్యాష్ కార్డులు, గిఫ్ట్ వోచర్లనూ స్వీకరిస్తున్నారు. - నూగూరి మహేందర్ చట్టం ఏం చెబుతోంది కార్మిక చట్టాలు కార్మికుల సామాజిక భద్రత కోసం ఉద్దేశించబడ్డాయి. చేస్తున్న పని అలసటకు దారి తీయకూడదు. సాధారణంగా వారానికి 48 గంటలు– అంటే రోజుకు 8 గంటల పని. వారానికి ఒక రోజు విశ్రాంతి ఉంటుంది. రెండు కంపెనీల కోసం ఒక వ్యక్తి పనిచేస్తున్నట్లయితే ఈ భావనను ఉల్లంఘించినట్టే! సాధారణంగా ఒక వ్యక్తిని తొలగించినప్పుడు చేతిలో ఉద్యోగం ఉందా? మూన్‌లైటింగ్‌కు పాల్పడుతున్నారా అన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఎందుకంటే ఆ వ్యక్తికి ఇప్పటికే వేరే ఉద్యోగం ఉంది. కాబట్టి తొలగింపును తీవ్రంగా పరిగణించలేము. కంపెనీలు సాధారణంగా అపాయింట్మెంట్ ఉత్తర్వుల్లో తమ వ్యాపార గోప్యత గురించి కూడా పేర్కొంటాయి. ఉద్యోగి ఒకే రకమైన యూనిట్లో మరోచోట పనిచేస్తుంటే, ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లే! కాబట్టి కంపెనీలు చర్య తీసుకోవచ్చు. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్– సెక్షన్ 69 రెండు చోట్లా ఉపాధిని నిరోధించడానికి నిర్దేశించినది. ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం ఉద్యోగికి సెలవు ఇచ్చిన లేదా సెలవులో ఉన్న ఒక రోజు లేదా రోజులో కొంత సమయం ఏ సంస్థలో కూడా పని చేయకూడదు. ఏ యజమాని అయినా ఉద్యోగిని ఉద్దేశపూర్వకంగా అనుమతించకూడదు. –శ్యామ్‌సుందర్ జాజు, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్, హైదరాబాద్–2 ఒకే ప్రవర్తనా నియమావళి కోవిడ్ తర్వాత పని విధానం మారింది. కార్పొరేట్లు తమ ఉద్యోగ ఒప్పందాలను పునర్నిర్వచించుకోవాలి. ఉద్యోగులతో సంబంధాలను మెరుగుపరచాలి. ఉద్యోగులు, యజమానుల మధ్య భారీ సంక్లిష్టతను, విభజనను మూన్‌లైటింగ్ సృష్టిస్తోంది. జాతీయ స్థాయిలో ఐటీ ఉద్యోగుల కోసం మోడల్ ప్రవర్తనా నియమావళి అవసరం. పనిగంటలు, సెలవులు, విధి విధానాల విషయంలో ప్రామాణికత రావాలి. ఉద్యోగులకు తమ సంస్థలోనే అదనపు పని గంటలు చేసేందుకు అనుమతి ఇవ్వాలి. అందుకు తగ్గట్టుగా నగదుతో ప్రోత్సహించాలి. నిపుణులను సొంతంగా తీర్చిదిద్దాలి. ఇందుకు నియామకాల్లో 30 శాతం మంది ఫ్రెషర్స్ ఉండేలా చూసుకోవాలి. అభ్యర్థి ఉద్యోగంలో చేరుతున్న సమయంలోనే ఒప్పందంలోని అంశాలను సవివరంగా తెలియజేయాలి. – వెంకా రెడ్డి, హెచ్ఆర్ రంగ నిపుణుడు నియామకాల్లో స్తబ్ధత తప్పుడు ఇంటర్వ్యూలు, తప్పుడు అనుభవ పత్రాలతో ఉద్యోగాలు సంపాదించిన ఉద్యోగులను తొలగించడాన్ని కంపెనీలు వేగవంతం చేశాయి. గత రెండు, మూడు నెలలుగా నూతన నియామకాలు చేపట్టకుండా తప్పుడు అభ్యర్థులను తొలగించడంపైన దృష్టి పెట్టడంతో ఒక్కసారిగా నియామకాల్లో స్తబ్ధత నెలకొంది. ఈ సమస్యను సకాలంలో పరిష్కరించకపొతే క్లయింట్ల నమ్మకం కోల్పోయి తమ సంస్థలే కాకుండా ఐటీ రంగం మొత్తం కుదేలయ్యే పరిస్థితి వస్తుందని ఇండస్ట్రీ గుర్తించి దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. – నానాబాల లావణ్య కుమార్, కో–ఫౌండర్, స్మార్ట్‌స్టెప్స్ -
ఐటీలో అలజడి : మరో ఊహించని షాక్..తలలు పట్టుకుంటున్న ఫ్రెషర్లు!
ఐటీ సంస్థల్లో మూన్‌లైటింగ్ వివాదం ఇప్పట్లో సమిసిపోయేలా లేదు. ఇప్పటికే కొన్ని ఐటీ కంపెనీలు ఫ్రెషర్లకు భారీ షాకిచ్చాయి. ఇంటర్వ్యూల్లో సెలక్ట్ అయిన ఫ్రెషర్లకు అపాయిట్మెంట్ లెటర్లు ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ తిరిగి వెనక్కి తీసుకున్నాయి. తాజాగా డెలాయిట్ సంస్థ ఆఫర్లను లెటర్లను ఇప్పట్లో ఇవ్వకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తలెత్తుతున్న ఆర్ధిక సంక్షోభం కలవరానికి గురి చేస్తున్న వేళ.. ఐటీ సంస్థలు ఆఫర్ లెటర్లను వెనక్కి తీసుకోవడం చర్చాంశనీయమైంది. అయితే ఆర్ధిక సంక్షోభం కాదని, మూన్‌లైటింగ్ కారణమంటూ ఐటీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే? ఇటీవల రెండేసి జాబులు చేస్తున్న 300మంది ఉద్యోగుల్ని విప్రో తొలగించింది. ఆ తర్వాత దిగ్గజ ఐటీ కంపెనీలు ఉద్యోగులపై ఓ కన్నేశాయి. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టిన ఉద్యోగుల్ని గుర్తించడం, బ్యాంక్ స్టేట్మెంట్లు పరిశీలించి ఇటీవల ఉద్యోగం పొందిన వారికి తిరిగి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇవన్నీ కొలిక్కి వచ్చేంత వరకు ఫ్రెషర్ల నియామకాలు చేపట్టవద్దని కంపెనీలు నిర్ణయించుకున్నాయి. ఆఫర్ లెటర్లను రద్దు చేస్తే ఇండస్ట్రీ నుంచి తప్పుడు సంకేతాలు వెళతాయనే ఉద్దేశంతో..వాటిని తిరిగి తీసుకుంటున్నాయి. చదవండి👉 ‘అలా చేస్తే మీకే కాదు..నా ఉద్యోగానికే దిక్కుండదు’, రషీద్ ప్రేమ్‌జీ సంచలన వ్యాఖ్యలు తాజాగా డెలాయిట్.. గతేడాది క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఎంపిక చేసిన ఫ్రెషర్లకు ఇవ్వాల్సిన ఆఫర్ లెటర్లను ఇచ్చేందుకు మరింత సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో డెలాయిట్ నిర్ణయంపై ఫ్రెషర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘క్యాంపస్ ఇంటర్వ్యూల్లో డెలాయిట్‌కు సెలక్ట్ అయ్యాయి. నేను సెలక్ట్ అయ్యానంటూ 2021అక్టోబర్‌లో డెలాయిట్ కన్ఫామ్ చేసింది. అప్పటి నుంచి ఆఫర్ లెటర్ కోసం, జాయిన్ డేట్ కోసం ఎదురు చూస్తున్నాన్నా’ ఓ ఫ్రెషర్ ఆవేదన ‘క్యాంపస్ ప్లేస్మెంట్లో డెలాయిట్ అసోసియేట్ ఎనలిస్ట్, కన్సల్టింగ్ డిపార్ట్ మెంట్ పొజిషన్లో జాబ్ వచ్చింది. ఇప్పటి వరకు ఆఫల్ లెటర్ రాలేదు. సంస్థ ఈ ప్రక్రియను ఎందుకు అంత ఆలస్యం చేస్తోంది?’ - ప్రశ్నిస్తున్న ఓ అభ్యర్ధి ‘డెలాయిట్ ఆఫ్లెటర్లు ఇవ్వడం ఆలస్యం కావడంతో ఫ్రెషర్లు అవమానంగా ఫీలవుతున్నారు. ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్ ఆలస్యం చేసిన తరువాత, నా కుటుంబ సభ్యులు,బంధువులు ఉద్యోగం ఉందా? లేదా? అని ప్రశ్నిస్తున్నారు. నేను వారిని మోసం చేశానని అందరూ అనుకుంటున్నారు’ - ఇటీవల గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన ఓ అభ్యర్ధి ఆఫర్ లెటర్ల ఆలస్యం సుమారు 500మందిపై ప్రభావం చూపింది. మాకు టెలిగ్రామ్ గ్రూపు ఉంది. సుమారు 500 మంది ఇందులో భాగం. ఈ ఆలస్యంపై డెలాయిట్ నుండి రిప్లయి కోసం ఎదురు చూస్తున్నాను. - టెలిగ్రామ్ గ్రూప్ సభ్యుడు, డెలాయిట్ ఇచ్చే ఆఫర్ లెటర్ కోసం ఎదురు చూస్తున్న ఓ అభ్యర్ధి ఆఫర్ లెటర్లు ఆలస్యం చేయడంపై అంతర్జాతీయ మీడియా సంస్థలు డెలాయిట్ ప్రతినిధుల్ని సంప్రదించారు. ఆఫర్లెటర్ల గురించి అడగ్గా..‘మేం నియామకాలు,కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఆఫర్లెటర్లను ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నాం. అందుకు కొంత సమయం పడుతుంది’ అని రిప్లయి ఇచ్చారు. కాగా ఇన్ఫోసిస్, విప్రో, క్యాప్‌జెమిని, యాక్సెంచర్, మైండ్ ట్రీతోఎ పాటు అనేక ఐటీ కంపెనీలు ఆఫర్ లెటర్లు ఇవ్వకపోవడం, వెనక్కి తీసుకున్న ఘటనలు జరిగిన విషయం తెలిసిందే. చదవండి👉 దిగ్గజ కంపెనీల్లో సాఫ్ట్వేర్ జాబ్ చేయడమే మీ లక్ష్యమా! గూగుల్ అదిరిపోయే ఆఫర్! -
‘అలా చేస్తే మీకే కాదు..నా ఉద్యోగానికే దిక్కుండదు’, రషీద్ ప్రేమ్‌జీ సంచలన వ్యాఖ్యలు
మూన్‌లైటింగ్‌కు పాల్పడుతున్నారనే కారణంగా ప్రముఖ టెక్ దిగ్గజం విప్రో 300 మంది ఉద్యోగులపై వేటు వేసింది. దీంతో ఆ సంస్థ యాజమాన్యంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో వందలాది మంది ఉద్యోగుల్ని తొలగించిన సమయంలో తమ సంస్థకు చెందిన ఓ టాప్ ఎగ్జిక్యూటీవ్‌ను ఫైర్ చేసినట్లు విప్రో ఛైర్మన్ రషీద్ ప్రేమ్‌జీ బహిర్ఘతం చేశారు. బెంగళూరు కేంద్రంగా జరిగిన నాస్కామ్ ప్రొడక్ట్ కన్క్లేవ్ కార్యక్రమంలో రషీద్ ప్రేమ్‌జీ మాట్లాడారు. విప్రోలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న టాప్ - 20 ఎగ్జిక్యూటీవ్‌లలో ఓ ఉద్యోగి సంస్థ మోరల్స్‌ను ఉల్లంఘించారు. సంస్థకు అతని అవసరం ఎంటో బాగా తెలుసు. కానీ కొన్నిసమయాల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మేం (రషీద్ ప్రేమ్‌జీ) అదే చేశాం. కేవలం పదే పది నిమిషాల్లో అతన్ని విధుల నుంచి ఫైర్ చేసినట్లు చెప్పారు. సదరు సీనియర్ ఉద్యోగి మూన్‌లైటింగ్‌కు పాల్పడ్డారా? లేదంటే ఇంకేదైనా కారణంతో సంస్థ నుంచి బయటకు పంపారనే విషయంపై విప్రో ఛైర్మన్ వెల్లడించలేదు. అయితే విప్రోకు మోరల్స్ ఉన్నాయి. ఎవరైనా నిబంధనల్ని ఉల్లంఘించినా, లేదంటే వేధింపులకు పాల్పడితే ఎవరి ఉద్యోగం ఉండదు. అంతెందుకు నేను ఆ రెండింటిలో ఏ ఒక్కదాన్ని ఉల్లంఘించినా విప్రోలో నా ఉద్యోగం కూడా ఉండదని తెలిపారు. ఉద్యోగుల తొలగింపు సెప్టెంబర్ 21 న, ప్రేమ్‌జీ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. విప్రోలో మూన్‌లైటింగ్‌కు పాల్పడిన వర్క్ ఫ్రమ్ హోమ్‌తో పాటు ఆఫీస్ నుంచి విధులు నిర్వహిస్తున్న మొత్తం 300 మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించినట్లు స్పష్టం చేశారు. "వాస్తవం ఏంటంటే ఈ రోజు విప్రో కోసం పనిచేసేందుకు చాలా మంది ఉద్యోగులే ఉన్నారు. ఆ ఉద్యోగులే కాంపిటీటర్ సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు. గత కొన్ని నెలల్లో 300మందిని గుర్తించి ఇంటికి పంపించినట్లు చెప్పిన విషయం తెలిసిందే. చదవండి👉 మూన్‌లైటింగ్ దుమారం, ఉద్యోగులపై ‘కాస్త సానుభూతి చూపించండయ్యా’ -
ప్రత్యర్థులకు భిన్నంగా ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం, ఉద్యోగులకు పండగ!
సాక్షి, ముంబై: మూన్‌లైటింగ్ వివాదం ప్రకంపనలు పుట్టిస్తున్నతరుణంలో ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ సంచలన నిర్ణయం తీసుకుంది. తన ఉద్యోగులు గిగ్ ఉద్యోగాలు చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే దీనికి సంబంధించిన కొన్ని నిబంధనలు విధించింది.ప్రత్యర్థి కంపెనీలకు భిన్నంగా ఇన్ఫోసిస్ తీసుకున్న ఈ కీలక నిర్ణయం ఉద్యోగులకు చక్కటి వెసులుబాటుతోపాటు, కంపెనీలకు తలనొప్పిగా మారిన అట్రిషన్ రేటు కూడా తగ్గుతుందని శ్లేషకులు భావిస్తున్నారు. గురువారం ఉద్యోగులకు పంపిన ఇమెయిల్‌లో ఇన్ఫోసిస్ వివరాలను అందించింది. మూన్లైటింగ్ని ప్రస్తావించకపోయినప్పటికీ, గిగ్ వర్క్‌ని చేపట్టాలనుకునే వారు, మేనేజర్, హెచ్ఆర్ ముందస్తు అనుమతి తీసుకోవాలని తెలిపింది. అయితే రెండో ఉద్యోగం ఎట్టి పరిస్థితుల్లోనూ, తమకు పోటీగా ఉండకూడదని స్పష్టం చేసింది. తమ కంపెనీ క్లయింట్ల ప్రయోజనాలకు భంగం కలిగించకుండా ఉండాలని తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా ‘గిగ్ వర్క్’లను ఏ విధంగా చేసుకోవచ్చో ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు అంతర్గతంగా వివరించింది. కంపెనీతో సమర్థవంతంగా పని చేసే వారి సామర్థ్యాన్ని ఇది ప్రభావితం చేయకుండా చూసేందుకు తమ ఉద్యోగులను పరిగణనలోకి తీసుకుంటామని ఇన్ఫోసిస్ తెలిపింది. -
మూన్‌లైటింగ్‌కు పాల్పడుతున్న ఉద్యోగులకు భారీ షాక్!
మూన్‌లైటింగ్ అంశంపై ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు మూటగట్టుకుంటున్న టెక్ కంపెనీలకు ఐటీ శాఖ మంత్రి మద్దతు పలికారు. మూన్‌లైటింగ్ విషయంలో ఉద్యోగుల తీరు సరైంది కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాదు రెండేసి ఉద్యోగాలు చేయాలనుకుంటే తమ రాష్ట్రం నుంచి వెళ్లిపోవాలని అన్నారు. ఒకటి మించి ఎక్కువ ఉద్యోగాలు (మూన్‌లైటింగ్) చేస్తున్న ఉద్యోగుల తీరుపై ప్రముఖ టెక్ దిగ్గజాలు విమర్శిస్తున్నాయి. మూన్‌లైటింగ్‌కు పాల్పడటం అనైతికమని, ఉద్యోగులు సంస్థ నిబంధనలకు లోబడి పనిచేయాలని స్పష్టం చేస్తున్నాయి. ఇన్ఫోసిస్, విప్రో లాంటి సంస్థలు ఉద్యోగులపై చర్యలకు ఉపక్రమించాయి. ఈ తరుణంలో టెక్ సంస్థలకు కర్ణాకట ఐటీ శాఖ మంత్రి సీఎన్ అశ్వత్ నారాయణ్ అండగా నిలిచారు. ఆఫీస్‌లో ఉద్యోగంతో పాటు ఫ్రీల్సాన్ వర్క్ చేయడం మోసం. ప్రొఫెషనల్స్ అలా చేయాలనుకుంటే వేరే రాష్ట్రానికి వెళ్లండి’ అని సూచించారు. “ఒక విధాన పరంగా, నైతికంగా మూన్‌లైటింగ్‌ను ఎలా అనుమతించవచ్చు? మూన్‌లైటింగ్‌కు పాల్పడడం న్యాయం కాదు. ఇది అక్షరాలా మోసం” అంటూ ఉద్యోగానికి మించి ఎక్కువ గంటలు పనిచేస్తున్న వారి గురించి ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. "మీరు ఎలా పర్ఫార్మెన్స్ చేయగలుగుతారు? మీరు సూపర్మెన్నా ఏమిటీ? మీకు కుటుంబాలు లేవా? అని అన్నారు. కాగా దేశంలో అగ్రశ్రేణి ఐటీ కంపెనీలైన ఇన్ఫోసిస్, విప్రోల ప్రధాన కార్యాలయాలు బెంగళూరు కేంద్రంగా కార్యకాలాపాలు నిర్వహిస్తుండగా.. కర్ణాటక ఐటీ శాఖ మంత్రి అశ్వత్ నారాయణ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. వేరే చోటికెళ్లి పనిచేసుకోండి బెంగళూరు టెక్ సమ్మిట్‌ను ప్రమోట్ చేయడానికి ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన .. టెక్ పరిశ్రమ మూన్‌లైటింగ్ వంటి పద్ధతుల్ని అనుమతించకూడదని, ఆఫీసు వేళలకు మించి చేసే వర్క్‌లకు రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు ఇవ్వదని అన్నారు. “ఇక్కడ (మూన్‌లైటింగ్ కోసం) ఖాళీ లేదు. మీకు అంత డిమాండ్ ఉంటే, వేరే చోట పని చేయండి’ అని పేర్కొన్నారు. చదవండి👉 ‘చేస్తే చేయండి..లేదంటే పోండి’ -
'వర్క్ ఫ్రమ్ హోం' చేస్తున్నారా? బాస్‌లు అలెర్ట్.. ఉద్యోగులకు ఎప్పుడైనా షాకే!
వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? ఆర్ధిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు ఫ్రీలాన్స్, మూన్‌లైటింగ్‌కు పాల్పడుతున్నారా? అయితే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే బాస్‌లు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగుల్ని, వారి పనితీరును గుర్తించే పనిలో పడినట్లు ఓ నివేదిక చెబుతోంది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకోనున్నట్లు హైలెట్ చేసింది ప్రపంచ దేశాల్లో మూన్‌లైటింగ్ అంశం సరికొత్త చర్చకు దారితీస్తోంది. మూన్‌లైటింగ్‌తో ఉద్యోగుల ప్రొడక్టివిటీ దెబ్బతింటుందని సంస్థలు..ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు అదనపు ఆదాయ మార్గాల్ని అన్వేషిస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్న ఉద్యోగులతో ఈ పని విధానం అనేక మార్పులకు కారణం అవుతుందని నిపుణులు భావిస్తున్నారు.అందుకు ఊతం ఇచ్చేలా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగుల్ని వారి బాస్‌లు చూసీ చూడనట్లు వ్యవహరించేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. గతంలో కంటే ఇప్పుడే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగులపై ఓ కన్నేసి ఉంచాలనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. యూకేకి చెందిన చార్టర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ అండ్ డెవలప్మెంట్ (సీఐపీడీ)..హెచ్ఆర్ ఉద్యోగులు, మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ విభాగాల్లో జరిపిన సర్వేల్లో 55శాతం మంది బాస్‌లు.. ఉద్యోగుల ప్రొడక్టివిటీని మరింత పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని చెప్పినట్లు తెలిపింది. 2 వేలు అంతకంటే ఎక్కువ మంది పై స్థాయి అధికారులతో సీఐపీడీ ప్రతినిధులు మాట్లాడగా.. ఉద్యోగులు ప్రతిరోజూ ల్యాప్‌టాప్‌లపై గడిపిన సమయం, ఇమెయిల్ పంపే విధానంతో పాటు రిమోట్ వర్క్ చేస్తున్న ఉద్యోగుల డేటాను సేకరించాలని అంటున్నారు. అయితే, పది మందిలో ముగ్గురు (28శాతం మంది) మాత్రమే ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్న ఉద్యోగుల ప్రొడక్టివిటీని గుర్తించేందుకు సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. మరికొంత మంది..వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉద్యోగులు ఏం చేస్తున్నారో తెలుసుకునే ముందు..ఇలా చేయడం వల్ల సంస్థకు ఎలాంటి ప్రయోజనాలున్నాయో ఉద్యోగులకు తెలియజేయాలని కోరుతున్నట్లు చార్టర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ అండ్ డెవలప్మెంట్ సర్వే తన నివేదికలో హైలెట్ చేసింది. -
మూన్‌లైటింగ్ దుమారం, ఉద్యోగులపై ‘కాస్త సానుభూతి చూపించండయ్యా’
టెక్నాలజీ రంగంలో మూన్‌లైటింగ్ దుమారం కొనసాగుతుంది. ఒకే సారి రెండేసి ఉద్యోగాలు చేస్తున్నారనే కారణంతో దేశీయ టెక్ కంపెనీలు వందలాది మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నాయి. ఈ తరుణంలో టెక్ సంస్థ టీసీఎస్ స్పందించింది. మూన్‌లైటింగ్ అంశంలో ఆయా సంస్థలు ఉద్యోగుల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని ఆ సంస్థ ఉన్నత స్థాయి అధికారులు కోరుతున్నారు. ఇటీవల బెంగళూరు కేంద్రంగా ఓ ఐటీ ఉద్యోగికి 7 పీఎఫ్ అకౌంట్లు ఉన్నట్లు తేలడంతో ఈ మూన్ లైటింగ్ అంశం వెలుగులోకి వచ్చింది. దీంతో టెక్ కంపెనీలు ఒకటికి మించి ఎక్కువ ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగులపై వేటు (విప్రో 300మంది ఉద్యోగుల్ని తొలగించింది) వేస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి శుభం కార్డు పలుకుతున్నాయి. ఉద్యోగుల్ని కార్యాలయాలకు రావాలని పిలుపునిస్తున్నాయి. అయితే ఉద్యోగులు మాత్రం ఆఫీస్‌కు వచ్చేది లేదని అంటున్నారు. కాదు కూడదు అంటే చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పించే సంస్థల్లో చేరుతామని తెగేసి చెబుతున్నారు. చదవండి👉 కంపెనీలను మోసం చేస్తున్న ఐటీ ఉద్యోగులు, ఏరివేసే పనిలో సంస్థలు! ఈ తరుణంలో మూన్‌లైటింగ్‌కు పాల్పడ్డ ఉద్యోగులపై సంస్థలు తీసుకుంటున్న చర్యల్ని టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) ఎన్. గణపతి సుబ్రహ్మణ్యం ఖండించారు. మూన్‌లైటింగ్‌కు వ్యతిరేకంగా తీసుకునే చర్యలు ఉద్యోగి కెరియర్ను నాశనం చేస్తుంది. సమస్యను పరిష్కరించేటప్పుడు సంస్థలు ఉద్యోగుల పట్ల సానుభూతి చూపడం చాలా అవసరమని తెలిపారు. మూన్‌లైటింగ్‌కు పాల్పడినట్లు ఆధారాలతో బయటపడితే సంస్థలు ఉద్యోగులపై కంపెనీలు చర్యలు తీసుకోకుండా ఉండలేవు. ఎందుకంటే ఇది అగ్రిమెంట్లో ఓ భాగం. కాబట్టే రెండేసి ఉద్యోగాలు చేయడాన్ని మానుకోవాలని అన్నారు. ‘‘ఉద్యోగులపై చర్యలు తీసుకుంటే దాని పర్యవసానంగా వారి కెరీర్ నాశనం అవుతుంది. మరో సంస్థలో ఉద్యోగం సంపాదిస్తే.. బ్యాంగ్రౌండ్ వెరిఫికేషన్‌లో ఉద్యోగి గతంలో మూన్‌లైటింగ్ పాల్పడినట్లు తేలుతుంది. అందుకే ఉద్యోగుల పట్ల మనం కొంత సానుభూతి చూపాలి’’ అని చెప్పారు. సంస్థలు ఒక ఉద్యోగిని కుటుంబ సభ్యుడిగా భావిస్తాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే ఆ కుటుంబ సభ్యులు తప్పు దారి పట్టకుండా నిరోధించడంపై దృష్టి సారిస్తాయని ఎన్. గణపతి సుబ్రహ్మణ్యం అన్నారు. చదవండి👉 మూన్ లైటింగ్ దుమారం: విప్రో మరో కీలక నిర్ణయం, ఉద్యోగుల్లో ఆందోళన!